– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులు సైతం స్నేహితులుగా మారతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలు సోదరుల సహకారంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు.శారీరక రుగ్మతలు. అనుకోని ప్రయాణాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. రాబడి గతం కంటే మరింత పెరిగి ఉత్సాహాన్నిస్తుంది. సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. నిరుద్యోగుల యత్నాలు  ఫలిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు ఒక సంతోషకర సమాచారం రాగలదు. కళాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం. 20,21 తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిడులు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తుల విషయంలో చికాకులు తొలగి లబ్ధి చేకూరుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కాంట్రాక్టులు కొన్ని ఎట్టకేలకు  దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా  ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు. కళాకారులు, రచయితలు సత్తా చాటుకుంటారు. 22,23తేదీల్లో అనారోగ్యం. శ్రమాధిక్యం. దుర్గాస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ముఖ్యులతో పరిచయాలు ఉత్సాహ్నానిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల విషయంలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి•విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. మీ ఆశయాలు నెరవేరి ఊరట చెందుతారు. వ్యాపారులకు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రచయితలు, పరిశోధకులకు విజయవంతంగా గడుస్తుంది. 24,25 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువులతో తగాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆదాయం కొంత నిరాశ పరుస్తుంది. అయినా అవసరాలకు సొమ్ము సమకూరి ఊరట చెందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో  అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు.. బంధువులతో స్వల్ప విభేదాలు ఏర్పడవచ్చు. కొత్త నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. విద్యార్థులకు కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. వ్యాపారులకు చికాకులు ఎదురుకావచ్చు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు. కళాకారులు, రచయితలకు అంచనాలు తప్పుతాయి .25,26 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కాలభైరవాష్టకం పఠించండి..


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని కార్యక్రమాలు నిరాశపరుస్తాయి. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో తగాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పరిస్థితులు అనుకూలించి కొన్ని వ్యవహారాలలో ముందగుడు వేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. పెట్టుబడులకు లోటు రాదు. ఉద్యోగులు ఒడిదుడుకులు, సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళాకారులకు అవకాశాలు. 23,24 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని ఇబ్బందులు, సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న కార్యక్రమాలు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు  ఏర్పడతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. రాజకీయవేత్తల యత్నాలు కలసివస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు శ్రమ ఫలిస్తుంది20,21 తేదీల్లో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. దూరప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

పట్టుదలతో ముందడుగు వేసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి కొంత బయటపడతారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు ఉత్సాహంగా ఉండడంతో పాటు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థనీయంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం అందుతుంది. కళాకారులు, రచయితల యత్నాలు సఫలం. 22,23 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదిగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. స్నేహితులు, బంధువుల నుంచి శుభవర్తమానాలు వింటారు.  ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, భూములు  కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కాస్త ఊరట కలుగుతుంది. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. పరిశోధకులు, క్రీడాకారులకు విశేష గుర్తింపు. 22,23 తేదీల్లో  వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆదాయం ఆశించినంతగా పెరిగి అవసరాలు తీరతాయి. శ్రేయోభిలాషుల సహాయం తీసుకుంటారు. మీ ఖ్యాతి, ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. కొన్ని ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలలో మరింత అనుకూలత. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవేత్తలకు కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులు, క్రీడాకారులకు అంచనాలు నిజమవుతాయి. 20,21తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయంలో చికాకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.  ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి.  వ్యాపారులకు పెట్టుబడులు అంది సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలకు ముఖ్య  సమాచారం అందుతుంది. కళాకారులు, రచయితలకు నూతనోత్సాహం. 23,24తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులతో విరోధాలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. పట్టుదల, ధైర్యంతో ముందుకు సాగి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. ఆదాయం మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం కాస్త తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలకు అనుకున్న  లక్ష్యాలు నెరవేరతాయి. కళాకారులు, రచయితలకు మరింత అనుకూల పరిస్థితులు 24,25 తేదీలలో దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. గణేశాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE