– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బ్యధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు. సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి. శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు గతం కంటే కొంత మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవేత్తలకు మనశ్శాంతి చేకూరుతుంది. కొన్ని పదవులు దక్కవచ్చు. కళాకారులు, రచయితలు పట్టుదలతో కొన్ని విజయాలు సాధిస్తారు. 27,28 తేదీలలో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అనూహ్యంగా విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. అత్యంత చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన, గృహయోగాలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు మునుపటి కంటే ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నతస్థితి పోస్టులు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 28,29 తేదీలలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆదిత్య హృదయం పఠించండి


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సమాజంలో విశేష ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారి సహకరిస్తారు. రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారులకు వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. కళాకారులకు సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిశోధకులు, రచయితలకు ముఖ్య సమాచారం అందుతుంది. 30,31 తేదీల్లో శారీరక రుగ్మతలు. సోదరులతో కలహాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం కొంత నిరాశ పర్చినా అవసరాలకు లోటు ఉండదు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగులు విశేష గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. క్రీడాకారులు, వైద్యుల యత్నాలు సఫలం. 1,2 తేదీలలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. నృసింహస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. నేర్పు, ఓర్పుగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. విద్యార్థులకు విజయాలు. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. మీ ఆశయాలు నెరవేరే సమయం. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహం. కళాకారులు, క్రీడాకారులకు కొత్త ఆశలు. 27,28 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో కలహాలు. విష్ణ్యుధ్యానం చేయండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

 పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కార్యక్రమాలు మరింత చురుగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వ్యాపారులకు మొదట్లో నిదానించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులు ఉన్నత పోస్టులు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వైద్యులు, రచయితల యత్నాలలో పురోగతి ఉంటుంది. 29,30 తేదీల్లో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితుల నుంచి మాటసహాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ నిర్ణయాలను అందరూ ఆమోదిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తితో కొన్ని సమస్యలు, వివాదాలు పరిష్కరించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు మరింతగా లాభాలు. ఉద్యోగులు ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు సత్తా చాటుకుని ప్రజాదరణ పొందుతారు. రచయితలు, కళాకారులకు నూతనోత్సాహం. 29, 30తేదీలలో ఆరోగ్య,కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయం తగ్గి ఇబ్బంది పడతారు. చేపట్టిన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. మీ నిర్ణయాలు తరచూ మార్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్య సూచనలు. వ్యాపారులకు కొత్త సమస్యలు నెలకొనే సూచనలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారతాయి. పరిశోధకులు, వైద్యుల కృషి కొంత ఫలిస్తుంది. 31,1 తేదీల్లో శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. వాహనయోగం. దేవీస్తుతి మంచిది.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల అభిమానం పొందుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రత్యర్థులు సైతం మీపట్ల విధేయత చూపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. దైవారాధనలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. భూవివాదాలు తీరతాయి. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకర సమాచారం. విద్యార్థులు, క్రీడాకారులకు అవకాశాలు పెరుగుతాయి. 1,2 తేదీలలో అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆదాయం మరింత మెరుగుపడుతుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఒక వివాదం నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళాకారులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 29,30తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. అయితే అవసరాలకు ఇబ్బందులు ఉండవు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. శుభకార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.్య ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు జతచేరతారు. ఉద్యోగులు మార్పులకు సిద్ధంగా ఉండాలి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం.28,29 తేదీల్లో సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొన్ని సమస్యలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. అదనపు ఆదాయం సమకూరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారులు లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. క్రీడాకారులు, వైద్యులకు నూతనోత్సాహం. 30,31 తేదీల్లో మానసిక ఆందోళన. సోదరుల నుంచి విమర్శలు. విష్ణుధ్యానం చేయండి.

About Author

By editor

Twitter
YOUTUBE