– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

మొదట్లో ఇబ్బందులు ఎదురైనా్య ధిగమిస్తారు. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మీ నిర్ణయాలు బంధువులను ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలు ఆహ్వానాలు అందుకుంటారు. 6,7 తేదీలలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. చిరకాల ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కుటుంబంలో ఎంతగానో ఉపయోగపడతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు క్లిష్ట సమస్యలు తీరతాయి. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బ్యధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 8,9 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఏ కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది. వివాహాది వేడుకలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులు, బ్యధువులతో ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప శారీరక రుగ్మతలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. 7,8 తేదీల్లో ఆస్తి వివాదాలు. బంధువులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు్య ధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు సమస్యలు కొన్ని తీరతాయి. 6,7 తేదీల్లో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. గణేశాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో వేడుకలకు తగిన ఏర్పాట్లు చేస్తారు. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 8,9 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఎటువంటి సమస్య ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు దక్కే ఛాన్స్. ‌పారిశ్రామికవేత్తలు, రచయితలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. 11,12 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. దేవీస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. 6,7 తేదీల్లో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆంజనేయ దండకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరీలు, సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. భూవివాదాలు కొంత పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు లక్ష్యాలు నెరవేరతాయి. 8,9 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. ప్రయాణాలు వాయిదా. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

వ్యతిరేకులు కూడా మీపట్ల విధేయులుగా మారతారు. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆదరణ పెరుగుతుంది. 7,8 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు చేసుకుంటారు. దూరపు బంధువుల రాక కొంత సంతోషం కలిగిస్తుంది. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి. 9,10 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి..


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ముఖ్యమైన కార్యక్రమాలు సమయానుసారం పూర్తి కాగలవు. ఆదాయం మరింత మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలివిగా వ్యవహరించి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఒడిదుడుకులు తొలగుతాయి. 11,12తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram