– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలు స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆదాయం కాస్త పుంజుకుంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. క్రీడాకారులు, పరిశోధకులు, రచయితలకు శుభవార్తలు అందుతాయి. 1,2 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు కాస్త ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగు లకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలు, రచయితలకు కీలక సమాచారం అందుతుంది. 2,3 తేదీల్లో శారీరక రుగ్మతలు. సోదరులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు విస్తరణ పనులు చేపడతారు. రచయితలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల పరిస్థితులు. 5,6 తేదీల్లో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. లక్ష్యాల సాధనలో ముందడుగు. కుటుంబంలో చికాకులు తొలగి ఊరటచెందుతారు. నిరుద్యోగుల శ్రమఫలించే సమయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. రచయితల యత్నాలు సఫలం. 6,7 తేదీల్లో బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. ఆదిత్య హృదయం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి కాగలవు. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. 3,4 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. శారీరక రుగ్మతలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగ మిస్తారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం పెడతారు. ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత పురోగతి ఉంటుంది. వ్యాపారులు సంస్థలను లాభాల దిశగా నడిపిస్తారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ప్రోత్సాహం. రచయితలు, కళాకారులకు కాస్త అనుకూలత. 2,3తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

సమస్యలు క్రమేపీ తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. దేవాలయాలు సందర్శిస్తారు. రాజకీయ, పారిశ్రామివర్గాలు, పరిశోధకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 3,4 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఒక సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ,వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడవచ్చు. వ్యాపారులకు సామాన్య లాభాలు దక్కుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలు, రచయితలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. 1,2తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. విష్ణుధ్యానం చేయండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

సన్నిహితులు మీకు మరింత చేదోడుగా నిలుస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు కాస్త ఊరట లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు గతంకంటే మెరుగ్గా ఉంటుంది. పారిశ్రామికవర్గాలు, రచయితలు, కళాకారులకు శ్రమ ఫలిస్తుంది. 4,5తేదీల్లో ఖర్చులు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

వీరికి పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారులకు మరింత లాభ సాటిగా. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. 1,2తేదీల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. లక్ష్మీస్తుతి మంచిది.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అదనపు ఆదాయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. వ్యాపారులు లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులు, పరిశోధకుల యత్నాలు. 6,7తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధు వులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. ధార్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు నిరుత్సాహం. 5,6తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
Instagram