– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఇం‌టిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. విద్యా ర్థులకు అనుకూల సమయం. రావలసిన సొమ్ము కొంత జాప్యమైనా పూర్తిగా అందుతుంది. వ్యాపా రాలు ఉత్సాహంగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు  అనుకూల మార్పులు.8,9 తేదీల్లో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మస్క్థెర్యంతో ముందుకు సాగి సమస్య లను్య ధిగమిస్తారు.  ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.   వ్యాపారులు అనుకున్న విధంగా విస్తరణ పూర్తిచేస్తారు.  రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు లక్ష్యాలు సాధిస్తారు. 11,12తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

పరిస్థితులు అనుకూలిస్తాయి.  చిన్ననాటి స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందు తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కివస్తాయి. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులను అందుకుంటారు.  13,14 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆంజనేయ  దండకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

విలువైన సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆస్తుల వ్యవహారా లలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. ఆదాయ పరంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.  7,8 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువులతో వివాదాలు. శివాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అపరిష్కృత  కార్యక్రమాలను  పూర్తి చేస్తారు.  రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆరోగ్యం మెరుగుపడు తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మా ణాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమాచారం రాగలదు.  వ్యాపారులు లాభాలదిశగా అడుగులేస్తారు. 8,9 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జీవితా శయం నెరవేరుతుంది. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు.  రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేష గుర్తింపు లభిస్తుంది. 12,13 తేదీల్లో వ్యయప్రయాసలు. ఖర్చులు. అనారోగ్యం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో కొద్దిపాటి అవ రోధాలు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. వాహన, కుటుంబసౌఖ్యం. నిరుద్యోగులు నిరాశ చెందుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇక్కట్లు. ఉద్యోగులకు స్థానచలనం.కళా కారులు, పరిశోధకులు, క్రీడాకారులకు పురస్కారాలు అందు తాయి. 12,13 తేదీల్లో ఆకస్మిక ధనలాభం, యత్న కార్యసిద్ధి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీ చెడ్డా విచారిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు విజయాలు సొంతమవుతాయి.రావలసిన సొమ్ము సకాలంలో  అందుతుంది. ఉద్యోగవర్గాలు నూతనోత్సాహంతో విధులు నిర్వర్తిస్తారు. 13,14 తేదీల్లో ఆకస్మిక ప్రయా ణాలు. అనారోగ్యం. బంధువిరోధాలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.  అప్ప గించిన  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపారులకు లాభాలు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు విశేష గుర్తింపు పొందుతారు. 7,8 తేదీల్లో దూర ప్రయాణాలు. సోదరులతో వివాదాలు.  శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు.  విద్యార్థులకు ఆశించిన అవకాశాలు తథ్యం. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు.  వ్యాపారులు స్వశక్తితో లాభాలబాటలో నడుస్తారు. రాజకీయవేత్తలు, రచయితలు, కళాకారులకు పట్టింది బంగారమే. 12,13 తేదీల్లో దూరప్రయాణాలు.  ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.  మీ ఆశయం నెరవేరుతుంది. ••మ్ము అందుతుంది.  భాగస్వామ్య వ్యాపారాలు పుంజు కుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 12,13 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఖర్చులు. కుటుంబంలో చికాకులు. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. ఆర్థికంగా బలం చేకురుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది.  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. దేవాలయదర్శనాలు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. పారిశ్రామివేత్తలు,కళాకారులు, క్రీడాకారులకు విస్తృత అవకాశాలు. 8,9 తేదీల్లో దుబారా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram