– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ముఖ్యమైన కార్యక్రమాలు చకచకా పూర్తి కాగలవు. బంధువర్గంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం రావచ్చు. వ్యాపారులకు లాభాలు. రాజకీయవేత్తలు ప్రయత్నాలు సఫలమై ఉత్సాహంగా గడుపుతారు. రచయితలు, క్రీడాకారులకు ఆహ్వానాలు. 12, 13 తేదీల్లో వృథాఖర్చులు. అనారోగ్యం. దత్తస్తోత్రం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తగ్గుతాయి. క్రీడాకారులు, వైద్యులకు ప్రోత్సాహం. 15, 16 తేదీల్లో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆంజనేయ దండకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణ ఒత్తిడులు తప్పవు. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. ఆశయాల సాధనలో వెనుకబాటు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వర్గాలకు బాధ్యతలు పెరుగుతాయి. రచయితలు, పరిశోధకులకు చికాకులు ఎదురుకావచ్చు. 14,15 తేదీల్లో శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఉద్యోగ యత్నాలు సఫలం. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం మరింత పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగ వర్గాలకు విధులు సక్రమంగా సాగిపోతాయి. కళాకారులకు పురస్కారాలు జరుగుతాయి. 17,18 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. అందరిలోనూ విశేష గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, వివాహ యత్నాలలో కదలికలు. రాబడి మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. రాజకీయవేత్తలు సత్తా చాటుతారు. రచయితలు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. 12, 13 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. మానసిక అశాంతి. శివ స్తోత్రం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

హామీలు నిలుపుకుని విశ్వసనీయత చాటుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ. కష్టం ఫలించే సమయం. వ్యాపారులకు ఒడిదుడుకులు, సమస్యలు తొలగుతాయి.  కళాకారులకు అరుదైన అవకాశాలు. 16,17 తేదీలలో వృథా ఖర్చులు. కుటుంబంలో కొన్ని చికాకులు. నవగ్రహ స్తోత్రం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. భూ, గృహ యోగాలు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు విధి నిర్వహణపై శ్రద్ధ వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. క్రీడాకారులు, వైద్యుల ఆశయాలు నెరవేరతాయి. 15, 16 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

రాబడిపై మీ అంచనాలు నిజం కాగలవు. దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. ఆప్తులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు, స్థిరాస్తులు కొంటారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు  ఉండవచ్చు. రాజకీయవేత్తలు కొత్త పదవులు దక్కించుకుంటారు. రచయితలు, కళాకారులకు శుభవార్తలు. 12,13 తేదీల్లో మానసిక అశాంతి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

రాబడిపై సంతృప్తి. కొంత సొమ్ము అనూహ్యంగా అందే అవకాశాలు. ధార్మికవేత్తలను కలుసుకుని వారి సూచనలు గ్రహిస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారానికి యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి. రచయితలు, వైద్యులు శ్రమకు ఫలితం. 13, 14 తేదీల్లో కుటుంబ సమస్యలు. వ్యయ ప్రయాసలు. ఖర్చులు. శ్రీకృష్ణ స్తోత్రం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొన్ని కార్యక్రమాలు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. క్రీడాకారులు, పరిశోధకులకు శుభవార్తలు అందుతాయి. 16, 17 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. హయగ్రీవ స్తోత్రం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆర్థిక పరిస్థితిని చక్కబర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు లాబాలు అందుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు విధులు చక్కబెట్టడంలో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలకు పదవీయోగం. కళాకారులు, రచయితల యత్నాలు సఫలం. 17,18 తేదీలలో మనశ్శాంతి లోపిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శివాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయానికి ఇబ్బందులుండవు. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. విలువైన వస్తువులు కొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. మీ కష్టం ఫలించే సమయం. వాహనాలు, ఇల్లు కొంటారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. 13, 14 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రం పఠించండి.

About Author

By editor

Twitter
Instagram