సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

కొత్త  కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు  లాభాలు అందుతాయి. ఉద్యోగులకు బ్యాధ్యతలు తగ్గుతాయి. కళాకారులను విజయాలు వరిస్తాయి.  28, మార్చి 1 తేదీల్లో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. రాబడి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు దక్కుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  పారిశ్రామివేత్తలకు ఆశలు ఫలిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  23,24 తేదీల్లో  వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

స్వశక్తితో విజయాల బాటలో నడుస్తారు. సమాజంలో  పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం రాగలదు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. క్రీడాకారులు, రచయితలకు  ప్రోత్సాహకరంగా ఉంటుంది. 27,28 తేదీల్లో  వృథా ఖర్చులు. స్నేహితులతో కలహాలు. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. గృహ నిర్మాణయత్నాలలో పురోగతి ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు.  విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారులకు  ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. రచయితలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 26,27 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు.  దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. అదనపు రాబడితో అవసరాలు తీరతాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు కొన్ని సంఘటనలు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల యత్నాలు సఫలం.  24, 25.తేదీల్లో  వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

అనూహ్యమైనరీతిలో కార్యక్రమాలలో  పూర్తి కాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు సఫలం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఒక సంతోషకర సమాచార అందుతుంది. రాజకీయవేత్తలకు పదవీయోగం. 23,24 తేదీల్లో  వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

సన్నిహితులతో ఉత్సాహంగా  గడుపుతారు. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. విద్యార్థులకు ఊహించని విజయాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.  ఆస్తుల విషయంలో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. నూతన ఉద్యోగప్రాప్తి. సమాజంలో మీకు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు మరింతగా అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు సమస్యలు తీరతాయి.  26,27 తేదీల్లో  వృథా ఖర్చులు. అనారోగ్యం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివిధ సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. రాబడి మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులకు  విస్తరణలో అవాంతరాలు  తొలగుతాయి. ఉద్యోగులకు తగినంత గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, కళాకారులకు ప్రోత్సాహం. 28, మార్చి1 తేదీల్లో  వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు.ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు  ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులకు అనుకూల పరిస్థితులు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.  రాజకీయవేత్తలకు కొత్త ఆశలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 27.28 తేదీలలో ధనవ్యయం. మానసిక అశాంతి. గణేశాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. కళాకారులకు నూతన అవకాశాలు. రచయితలకు సంతోషకరమైన సమాచారం. 24,25 తేదీల్లో ధనవ్యయం. బంధువిరోధాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్న రాబడి కొంత ఆలస్యమైనా అందుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవేత్తలకు మరింత అనుకూలత. కళాకారులు, పరిశోధకుల నిరీక్షణ ఫలిస్తుంది. 26,27 తేదీల్లో  ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఆదాయం  కొంత నిరాశాజనకంగా ఉంటాయి. స్నేహితులతో వివాదాలు ఏర్పడవచ్చు.  దూరప్రయాణాలు. కుటుంబంలో నిరాశాజనకంగా ఉంటుంది.  ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారులకు కొత్త చిక్కులు. ఉద్యోగులకు  బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవేత్తలకు ఒత్తిడులు. కళాకారులు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 25,26 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం.  శివస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE