‌ప్రేమే తన సిద్ధాంతమని  ప్రబోధించిన  సత్యసాయి దానిని జీవితంలో ఆచరించి చూపారు. తన బోధనలతో దేశ, విదేశాలలో సైతం భక్తులను సంపాదించిన బాబా ఇతర సేవలతో పాటు ఆసుపత్రినే చూడని కుగ్రామానికి సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను అందించారు.

అక్టోబర్‌ 4, 1956‌న పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి జనరల్‌ ‌హాస్పిటల్‌ను ప్రారంభించిన తరువాత ఆయన ఇక వెనుతిరిగి చూడలేదు. ఆగస్టు 28,1976 న బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో సత్యసాయి సూపర్‌ ‌హాస్పిటల్‌ను స్థాపించారు.  నవంబర్‌ 22, 1991‌న పుట్టపర్తిలోనే సత్యసాయి సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను కూడా ప్రారంభించారు. అక్కడ కార్డియా లజీ, ఆఫ్తమాలజీ, ఆర్థో, యూరాలజీ రోగాలకు ఉచి తంగా వైద్యం చేస్తారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి రోగులు వచ్చి.. వైద్యం పొందుతుంటారు.

వైద్యునికీ, రోగికీ మధ్య ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించడమే వైద్యం ప్రధాన ఉద్దేశమని, వైద్యా లయం.. ప్రేమాలయంగా మారాలని బాబా సూచించేవారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సాధారణ చికిత్సల నుంచి ప్రసూతి సేవల వరకు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే సంచార వైద్య యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రధానంగా భగవాన్‌ శ్రీ ‌సత్యసాయిబాబా  స్థాపించిన సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రులు  ఆంధప్రదేశ్‌, ‌కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నాయి.  ఇవి పూర్తిగా ఉచితంగా (Free of Cost)  వైద్య సేవలను అందిస్తున్నాయి.

  1. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హైయర్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ (SSSIHMS) (ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆంధప్రదేశ్‌) ఈ ఆసుపత్రి ప్రత్యేకత కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌ ‌సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఆప్తాల్మాలజీ సేవలు అందుబాటులో ఉంచింది.
  1. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హైయర్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ (SSSIHMS) (వైట్‌ఫీల్డ్, ‌బెంగు ళూరు-బెంగళూరు, కర్ణాటక).

ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, ‌గ్యాస్ట్రో ఎంటరాలజీ, మొదలైన సమస్య లకు వైద్య సేవలు అందుతున్నాయి..

  1. శ్రీ సత్యసాయి రాజేశ్వరి మెమోరియల్‌ ఆసుపత్రి (SSSIHMS) (తమిళనాడు). ఇది సూపర్‌ ‌స్పెషాలిటీ కాదు, కానీ ముఖ్యమైన ఆసుపత్రి.

శ్రీ సత్యసాయి జనరల్‌ ఆసుపత్రి (ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, ఆంధప్రదేశ్‌.)  ఇది సాధారణ చికిత్స కోసం ఉద్దేశించినది.

వీటితో పాటు, వివిధ రాష్ట్రాలలో గ్రావి•ణ ప్రాంత ప్రజల కోసం అనేక శ్రీ సత్యసాయి జనరల్‌ ఆసుపత్రులు, వైద్య శిబిరాలు (SSSIHMS)   చిన్నవి ఏర్పాటయ్యాయి.

అంతర్జాతీయంగా

సత్యసాయి సంస్థ (SSIO) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో (ఉదాహరణకు, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా) చిన్న క్లినిక్‌లు, దంతవైద్యశాలలు నిర్వహిస్తోంది. మొబైల్‌ ‌మెడికల్‌ ‌వ్యాన్ల (Mobile Medical Vans)  ద్వారా కూడా వైద్య సేవలను అందిస్తోంది.

సత్యసాయి హాస్పిటల్‌ ‌ప్రవేశ పక్రియ (అడ్మిషన్‌)

శ్రీ ‌సత్యసాయి హాస్పిటల్స్‌లో  ప్రవేశ పక్రియను సాధారణంగా రెండు దశలుగా విభజించారు: ఔట్‌ ‌పేషెంట్‌ ‌కన్సల్టేషన్‌ (OPD), ఆ తరువాత అవసరమైతే ఇన్‌ ‌పేషెంట్‌ అడ్మిషన్‌. ఈ ‌సంస్థలలోని అన్ని వైద్యసేవలు పూర్తిగా ఉచితం.  కన్సల్టేషన్‌ ‌కోసం  అపాయింట్‌మెంట్‌ ‌తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం.  మీరు సందర్శించాలను కుంటున్న నిర్దిష్ట ప్రాంతం లోని ఆసుపత్రి సహాయ డెస్క్ ‌లేదా హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌కు కాల్‌ ‌చేయవచ్చు. ఉదాహరణకు, వైట్‌ఫీల్డ్ (‌బెంగళూరు) ఆసుపత్రి కోసం హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌ 080-47104600‌ను సంప్రదించవచ్చు.  ప్రశాంతి గ్రామం వంటివి, రోగి వివరాలు (పేరు, వయస్సు, అనారోగ్యం, సంప్రదింపు సమాచారం) మునుపటి వైద్య రికార్డుల ఫోటో కాపీలతో కూడిన కవరింగ్‌ ‌లెటర్‌ను ఈమెయిల్‌ ‌లేదా పోస్ట్ ‌ద్వారా పంపాలని సూచిస్తున్నాయి.

  • SMS ధ్రువీకరణ: ఫోన్‌ ‌ద్వారా బుకింగ్‌ ‌చేస్తే, మీకు సాధారణంగా అపాయింట్‌మెంట్‌ ‌తేదీ, సమయంతో కూడిన సందేశం అందుతుంది. మొదటి సందర్శన & స్క్రీనింగ్‌ (OPD)కు అవసరమైన మునుపటి వైద్య రికార్డులన్నింటినీ (ఏ సంస్థ నుండి అయినా) చెల్లుబాటు అయ్యే ఫోటో, చిరునామా రుజువును తీసుకురావాలి. ఆధార్‌ ‌కార్డు (ప్రాధాన్యత) రేషన్‌ ‌కార్డు ఓటరు ID, డ్రైవింగ్‌ ‌లైసెన్స్, ‌పాస్‌పోర్ట్ (‌విదేశీ పౌరులకు తప్పనిసరి). ఒక అటెండెంట్‌ ‌తప్పనిసరి. వారికి అటెండెంట్‌ ‌పాస్‌ ఇస్తారు. అపాయింట్‌మెంట్‌ sms ‌లెటర్‌ను రోగి గేట్‌ ‌వద్ద (ఉదాహరణకు, వైట్‌ఫీల్డ్ ‌వద్ద గేట్‌ ‌నెం. 2) భద్రతా సిబ్బందికి చూపితే మిమ్మల్ని తగిన విభాగానికి (ఉదాహరణకు, కార్డియాక్‌ ‌లేదా న్యూరో) లేదా స్క్రీనింగ్‌, ‌రిజిస్ట్రేషన్‌ ‌బ్లాక్‌ (Srb)కి పంపుతారు. Srbలోని వైద్యులు మీ పరిస్థితిని మూల్యాంకనం చేస్తారు. రిజిస్ట్రేషన్‌ ‌చేసి సంబంధిత కార్డు ఇస్తారు.

ప్రత్యేక వైద్యులతో సంప్రదింపుల కోసం తగిన ఔట్‌ ‌పేషెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌ (OPD)కి పంపుతారు.

ఆసుపత్రిలో అడ్మిషన్‌ అనేది ఆయా శాఖలలోని ప్రత్యేక వైద్యులు శస్త్రచికిత్స లేదా తదుపరి చికిత్స కోసం అడ్మిట్‌ అవ్వాలని సూచించిన రోగులకు మాత్రమే.

ఫిట్‌నెస్‌ ‌స్క్రీనింగ్‌: అడ్మిషన్‌ ‌రోజున, మిమ్మల్ని మళ్లీ వైద్యులచే పూర్తిగా స్క్రీనింగ్‌ ‌చేస్తారు. శస్త్రచికిత్స కోసం నిర్ధారించిన తర్వాత మాత్రమే అడ్మిట్‌ ‌చేసుకుంటారు.

వెయిటింగ్‌ ‌లిస్ట్: ‌సంక్లిష్ట పక్రియల కోసం, వెయిటింగ్‌ ‌లిస్ట్ ఉం‌డవచ్చు,  మీవంతు వచ్చిన వెంటనే మీకు కాల్‌ ‌వస్తుంది. వైద్య అవసరాన్ని బట్టి షెడ్యూలింగ్‌కు తరచుగా ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడు వైద్య రికార్డులను  మళ్లీ (SSSIHMS నుండి ఏవైనా రికార్డులతో సహా) తీసుకురావాలి.

ప్రత్యేకతలు: ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హయ్యర్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ ఆసుపత్రులు (వైట్‌ఫీల్డ్ , ‌ప్రశాంతి గ్రామం) ప్రధానంగా గుండె (Cardiac) నరాల (Neoro) రుగ్మతలలో ప్రత్యేకత సేవలు అందించేవిగా ఉన్నాయి. అయినప్పటికీ ఇతర ప్రత్యేకతలు కొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉండవచ్చు.

తిరిగి సందర్శన/ఫాలో-అప్‌: ‌మీరు ఫాలో-అప్‌ ‌రోగి అయితే, మీ డిశ్చార్జ్ ‌సారాంశంలో పేర్కొన్న తేదీన మాత్రమే ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది.

ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ వీటి నుంచి ప్రయోజనాలు పొందిన వారు వేలల్లో ఉండడం గమనార్హం.

కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు

శ్రీ సత్యసాయి సేవా మెడికల్‌ ‌మిషన్‌ అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు ప్రజలకు అవగాహన కల్పించేం దుకు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆరోగ్యకర జీవనం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. భారతదేశం అంతటా ‘సాయి కృపాస్‌’ అనే పేరుతో ఉచిత వైద్య కేంద్రాలు ఉన్నాయి. మే 24,2024న లద్దాక్‌లో శ్రీ సత్యసాయి ఆసుపత్రిని, వృద్ధాశ్రమాన్ని ట్రస్టు సభ్యులు ప్రారంభించారు.

సత్యసాయి  శివైక్యం పొందిన తర్వాత  కూడా సెంట్రల్‌ ‌ట్రస్ట్ ‌మేనేజింగ్‌ ‌ట్రస్టీ రత్నాకర్‌ ఆధ్వర్యంలో ప్రతి నెల వివిధ వైద్య సేవా కార్యక్రమాలు కొనసాగు తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సంస్థలను ప్రభుత్వం సరైన విధంగా ఉపయోగించుకోవడం లేదు. ముఖ్యంగా ఇక్కడ మెడికల్‌ ‌కాలేజీల ఏర్పాటు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది.

About Author

By editor

Twitter
YOUTUBE