– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కష్టపడినా ఫలితం కనిపించని స్థితి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్నేహితులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు.  ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం రావచ్చు. స్థిరాస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కాంట్రాక్టులు చేజారతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులు, రచయితలకు కొద్దిపాటి  గందరగోళం. 16,17 తేదీల్లో శుభవార్తలు. భూలాభాలు. గణేశాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీకు చేదోడుగా నిలుస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.  పాతబాకీలు వసూలవుతాయి. రుణబాధల నుంచి విముక్తి. కాంట్రాక్టులు అనుకోని విధంగా దక్కుతాయి.  వ్యాపారస్తులకు మరింతగా లాభాలు. ఉద్యోగులు పనిఒత్తిడులు అధిగమిస్తారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అంచనాలు నిజమయ్యే సమయం. క్రీడాకారులు, రచయితలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 18,19 తేదీల్లో అనారోగ్యం.  రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో అకారణంగా విభేదాలు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి.  చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా కొనసాగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.రాజకీయవేత్తలు, కళాకారులకు నిరాశ తప్పదు.  15,16 తేదీల్లో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. శివాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. ఊహించని విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి.  నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు.  వ్యాపారులకు ఆశించిన విధంగా్య లాభాలు. ఉద్యోగస్తులు ఇబ్బందుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు  అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 17,18 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. సూర్యారాధన మంచిది.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో సోదరుల నుంచి ఒత్తిడులు. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ప్రయాణాలు ముందుకు సాగవు. వ్యాపారులు ఆశించిన లాభాలు రాక నిరాశ చెందుతారు. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు నిర్ణయాలలో తొందరపడరాదు. కళాకారులు, క్రీడాకారులు అవకాశాలు చేజార్చుకుంటారు. 20,21 తేదీల్లో వాహనయోగం. దూరపు బంధువుల కలయిక. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.  కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారస్తుల విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కళాకారులు, క్రీడాకారులకు కొన్ని సమస్యలు తీరతాయి. 17,18 తేదీల్లో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై అప్పులు చేస్తారు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు లేనిపోని చికాకులు. 15,16 తేదీల్లో ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి ప్రస్తావిస్తారు.  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారస్తులకు మరింత లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు ఊరట లభిస్తుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు. సంగీతకళాకారులు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 16,17 తేదీల్లో దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. గాయత్రీ ధ్యానం మంచిది.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొన్ని కార్యక్రమాలను మధ్యలో నిలిపివేస్తారు. కుటుంబసభ్యుల సహకారం కూడా అందక కొంత నిరాశ చెందుతారు. రాబడికి మించిన ఖర్చులు ఎదురై సవాలుగా మారతాయి. స్నేహితులతో విభేదాలు నెలకొంటాయి. కాంట్రాక్టులు కాస్త అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారస్తులకు చికాకులు. ఉద్యోగులు బాధ్యతలతో సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు లేనిపోని సమస్యలు.19,21 తేదీల్లో కీలక నిర్ణయాలు. ఆప్లుల నుంచి శుభవార్తలు. నవగ్రహగ్రస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

 ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆశయాల సాధనకు మరింత కష్టపడాల్సిన సమయం. విద్యార్థులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు.  వివాహాది వేడుకలు వాయిదా వేస్తారు. ఎంతటి సమస్య ఎదురైనా మనస్సులోనే దాచుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు మరిన్ని బ్యాధ్యతలు చేపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు వివాదాలు. క్రీడాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది. 20,21 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. స్థిరాస్తి వృద్ధి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.  విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారులకు విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆదరణ పెరుగుతుంది. రచయితలు, క్రీడాకారులకు అన్నింటా విజయమే. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సమాజంలో మీరంటే అంతా ఇష్టపడతారు.. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీతతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారస్తులకు కాస్త ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.  క్రీడాకారులు, పరిశోధకులకు యత్నాలు సఫలం.  18,19తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram