– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

తలపెట్టిన కార్యక్రమాలను  కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి.చేజారిన కొన్ని వస్తువులు తిరిగి లభ్యమయ్యే సూచనలు.  4,5 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆదిత్య హృదయం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించ కుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం.రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కళాకారులు, శాస్త్రవేత్తలు అనుకున్నది సాధిస్తారు.30,31 తేదీల్లో  వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణం, కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు.ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి.వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. 4,5 తేదీల్లో మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు. దేవీస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది.  రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. కళాకారులు, క్రీడాకారులు సమస్యల నుండి బయటపడతారు. 2,3 తేదీల్లో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ఈశ్వరారాధన మంచిది. .


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. కోర్టు కేసు ఒకటి పరిష్కారమై ఊర ట లభిస్తుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు.పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులకు ఉత్సాహంగా ఉంటుంది. 31,1 తేదీల్లో  కుటుంబ సమస్యలు. మానసిక అశాంతి. ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఎటువంటి సమస్య ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బంది కలిగించినా క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం.రచయితలు, వ్యవసాయదారుల యత్నాలు ఫలిస్తాయి.30,31 తేదీల్లో  అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు.  కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఇంతకాలం ఎదురైన  కష్టాలు తొలగినట్లే. ఆర్థికంగా మరింత బలపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు.ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమర్థతను అందరూ గుర్తిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కే అవకాశం. శాస్త్రవేత్తలు, వైద్యులకు నిరాశ తొలగుతుంది. 2,3 తేదీల్లో అనారోగ్యం. దూరప్రయాణాలు. హనుమాన్‌ ‌చా•లీసా పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

మొదట్లో కొన్ని వివాదాలతో సతమతమైనా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత  హోదాలు దక్కవచ్చు.రచయితలు, వైద్యులకు ఊహించని అవకాశాలు. 4,5 తేదీల్లో  ఆరోగ్యభంగం.  దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణాల్లో అడుగు ముందుకు వేస్తారు.  రచయితలు, క్రీడాకారులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. 31,1 తేదీల్లో అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. గణేశాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనయోగం.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.కళాకారులు,  పారిశ్రామికవేత్తలు, వైద్యుల సేవలు విస్తృతమవుతాయి. 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. శివాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలను ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు.  చిన్ననాటి స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు.  కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  2,3 తేదీల్లో అనుకోని ఖర్చులు. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న కార్యక్రమాలు అవాంతరాల వల్ల ముందుకు సాగవు. ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రతిష్ఠంభన.ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.రచయితలు, క్రీడాకారులు కొంత ఓపిగ్గా వ్యవహరించాలి.1,2 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. ఆదిత్య హృదయం పఠించండి.

About Author

By editor

Twitter
Instagram