శతాబ్ది ఉత్సవాల ముగింపు వేళ..
భారతదేశం నిరంతరమైన ఒక పవిత్ర ప్రవాహం. లోకకల్యాణం కోసం ప్రవహిస్తూనే ఉండాలనే దైవిక ఆదేశం లేదా వరం దీనికి లభించింది. ఈ మహోన్నత లక్ష్య సాధనకు ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని అధిగమించ డానికి, భరతమాత సంతానం తరతరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంది. ఈ గొప్ప సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సంఘానికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఇదేమీ కొత్తగా జరుగుతున్నది కాదు. సహస్రాబ్దాలుగా ఈ గడ్డపై సాగుతూ వస్తున్న అదే పనిని ఆర్ఎస్ఎస్ కొనసాగించింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేయడం ద్వారా, అడ్డంకులను అధిగమించి, సావ•హిక స్మృతిని పునరుజ్జీవింపజేస్తూ ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డాక్టర్జీ సామాజిక జీవితంలోని అన్ని రంగాలలోనూ చురుకుగా ఉండేవారు. వివిధ రకాల అనుభవాలను గడించిన తర్వాత, అటువంటి మహత్తరకార్యానికి భారతదేశం పట్ల స్పష్టమైన దృక్పథం, హిందుత్వం పట్ల గాఢమైన గౌరవం కలిగి ఉండి, తమ జీవితాలను ఆ లక్ష్యానికి అనుగుణంగా మలుచుకోవడానికి సిద్ధపడి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడుపుతూనే దేశసేవకు తమను తాము పూర్తిగా అంకితం చేసుకోగల వ్యక్తులు అవసరమని ఆయన గ్రహించారు. అటువంటి వ్యక్తులను తీర్చిదిద్దే పనిని దైనందిన రాజకీయాల పరిధిలో చేపట్టడం సాధ్యమయ్యేది కాదు. అందుకే, ఒక ప్రత్యేకమైన సంస్థ, విధానం అవసరమని ఆయన గుర్తించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటుకు పునాది వేశారు. ఈ నేపథ్యంలోనే సంఘం స్థాపితమైంది. డాక్టర్ హెడ్గెవార్ సంఘ సిద్ధాంతాన్ని ప్రారంభం నుండే స్పష్టంగా వివరించారు. వేల ఏళ్ల నాటి సంప్రదాయం నుండి స్ఫూర్తిని పొందుతూ, భారతీయ జీవన విధానం, హిందుత్వ పునాదులపై సంఘం రూపుదిద్దుకుంది. ఈ వారసత్వాన్ని సమాజానికి గుర్తుచేస్తూ, వారిని సంఘటితం చేయడం, సావ•హిక శక్తితో దేశాన్ని ముందుకు నడిపించడం అనే లక్ష్యంతో, అంకిత భావం కలిగిన కార్యకర్తల బృందాన్ని తయారుచేసే మహత్తర బాధ్యతను ఆయన చేపట్టారు. శతాబ్ద కాలంగా సాగుతున్న సంఘప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలో, శాఖ కార్యకలాపాలను ప్రజలు నిర్లక్ష్యం చేశారు. అది విస్తరిస్తున్న కొద్దీ, దానిని ఒక ప్రత్యర్థిగా పాలకులు చూశారు. తత్ఫలితంగా, స్వాతంత్య్రం తర్వాత దానిపై నిషేధం విధించారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా అది నిషేధాన్ని ఎదుర్కొంది. ఈ పరిస్థితుల మధ్య కూడా, సంఘం వ్యక్తి నిర్మాణానికి అంకితభావంతో నిలిచింది. స్వయంసేవకులు సామాజిక జీవితంలోని వివిధ రంగాలలో చురుకుగా మారారు. ఫలితంగా శ్రామికులు, రైతులు, విద్యార్థులు, సమాజంలోని ఇతర వర్గాల కోసం సంస్థలు ఏర్పడ్డాయి. సేవ, విద్య, ఆర్థికం,సామాజిక సంక్షేమం వంటి రంగాలలో విశ్వహిందూపరిషత్ సహా అనేక సంస్థలు ప్రారంభ మయ్యాయి. వీటి ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడం, సమస్యలను పరిష్కరించడం, జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన వ్యవస్థలను నెలకొల్పడం వంటి పనులు ముందుకు సాగాయి. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సంఘం ఎల్లప్పుడూ స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. డాక్టర్ హెడ్గెవార్, గురూజీ గోల్వాల్కర్ , బాలాసాహెబ్ దేవరస్ వంటి నాయకులు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా, వాటి పరిష్కారానికి కృషి చేసేలా స్వయంసేవకులను ప్రేరేపించారు. ఆ సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు స్వయంసేవకులు నిరంతరం శ్రమించారు. అనేక ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, సంఘ కార్యకలాపాలు విస్తరిస్తూనే వచ్చారు. సమాజం నుండి దానికి లభించే మద్దతు కూడా పెరుగుతూ వచ్చింది.
సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, దేశవ్యాప్తంగా విస్తృత ప్రజాకార్యక్రమాలు జరిగాయి. ఇంటింటికీ వెళ్లే ప్రచార కార్యక్రమాలూ జరిగాయి. నగరాలలోని బస్తీలు, గ్రామాలు, మండలాలలో ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళనాలలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సామాజిక ఐక్యతను చాటారు. సామాజిక సద్భావన సమావేశాలలో వివిధ కులాలు, వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులతో గోష్ఠులు, యువజన సమ్మేళనాలు, బహిరంగ సభలు కూడా జరిగాయి. ఇవ్వన్నీ ప్రజలలో విస్తృత సామాజిక భాగస్వామ్యాన్ని, ఐక్యతను పెంపొందించాయి.
2025 విజయదశమి నాడు శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలను కలుసుకోవడం ద్వారా సంఘం భావజాలం, కార్యకలాపాలు, సంకల్పం సమాజానికి చేరింది. ప్రపంచ స్థాయిలో సంభాషణను పెంపొందించేందుకు కూడా కార్యక్రమాలు చేపట్టారు. గత వ•డేళ్లలో, అనేక దేశాలలో మీడియా, విద్యా రంగం, రాజకీయాలు, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో సంఘానికి సంబంధాలు ఏర్పడ్డాయి.
ఏప్రిల్, 2026లో అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ దేశాలలో సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పర్యటించారు. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ దేశాలలో సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పర్యటించారు. ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భారతదేశ సందేశాన్ని ఆయన చాటిచెప్పారు. భిన్నత్వం ఉన్నప్పటికీ మనం ఎలా ఐక్యంగా ఉండగలమో వివరిస్తూ, ప్రజలందరి సహజీవనానికి హిందుత్వం ఒక హామీ అని ఆయన పేర్కొన్నారు.దేశాన్ని బలోపేతం చేయడానికి, దానిలోని లోపాలను సరిదిద్దడానికి గత శతాబ్ద కాలంగా ‘సంఘ’ చేస్తున్న కృషిని, అలాగే వేల సంవత్సరాల నాటి భారతదేశ అనుభవాన్ని ప్రపంచానికి వివరించారు. తాము నివసిస్తున్న దేశాల పట్ల విధేయతతో ఉంటూ వాటి అభివృద్ధికి తోడ్పడాలని, తమ సొంత జీవితాల్లో భారతీయ సంస్కృతిని ,విలువలను ఆచరించాలని, అలాగే ప్రపంచానికి మేలు చేసే విలువలను తమ ఆచరణ ద్వారా ప్రదర్శించాలని విదేశాల్లోని భారతీయులకు పిలుపునిచ్చారు.
సమాజం నుంచి నిరంతరం లభిస్తున్న మద్దతు, సహకారం వల్లే సంఘ కార్యకలాపాల విస్తరణ సాధ్యమైంది. ప్రారంభదశలో సంస్థ పట్ల ప్రజలలో ఉదాసీనత కనిపిం చింది, అలాగే మొదటిసారి నిషేధం విధించిన సమయంలో దీనిపై తప్పుడు ప్రచారం జరిగింది. అయినప్పటికీ స్వయంసేవకులు తమ కఠోర శ్రమ, ప్రవర్తన, వ్యక్తిత్వంతో సంఘ కార్యకలాపాలను విస్తరించారు. ప్రత్యక్ష అనుభవంతో సమాజం క్రమంగా తన మద్దతును సంఘానికి అందించడం ప్రారంభించింది. రాజకీయ లేదా సిద్ధాంతపరమైన ప్రత్యర్థులుగా కనిపించిన వారు కూడా వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, అవసరమైనప్పుడు సహకారాన్ని అందించారు. మొదటిసారి సంఘం నిషేధానికి గురైన తర్వాత ‘‘గతాన్ని వదిలేసి పనిలో నిమగ్నం కావాలి’’ అనే భావన వ్యక్తమైంది. అలాగే, రెండవసారి నిషేధానికి గురైన తర్వాత ‘‘మన్నించాలి.. మర్చిపోవాలి’’ అని బాలాసాహెబ్ దేవరస్ జీ పేర్కొన్నారు. ఈ భావన కారణంగా, సమాజం నుండి ఆర్ఎస్ఎస్కు లభించే మద్దతు క్రమంగా పెరిగింది. ఎన్నికల రాజకీయాల కోసం సంఘ్ ఏ అంశాలనూ లేవనెత్తదని లేదా మధ్యలో వదిలిపెట్టదని, పైగా పూర్తి చిత్తశుద్ధితో వాటికి కట్టుబడి ఉంటుందని సమాజం గ్రహించింది. విస్తృతస్థాయి భాగస్వామ్యం, సహకారం, మద్దతుతో, సంఘంచేపట్టిన కార్యకలాపాలు సమాజంలో గౌరవాన్ని పొందసాగాయి. దేశాన్ని సుసంపన్నం చేసి, సమస్యలు, సామాజిక దురాచారాల నుండి విముక్తి కల్పించి, సమాజంలోని ప్రతి వర్గాన్ని కలుపుకొని దానిని సద్గుణవంతంగా, నీతివంతంగా, బలంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష సమాజంలో జాగృతమైంది. నిజమైన హిందుత్వ భావనను స్థాపించడం ద్వారానే హిందూ సమాజం ఐక్యమౌతుంది.సంఘం చేపట్టిన పనులు సమాజంలో మార్పు పట్ల ఆకాంక్షను ప్రజలలో పెంపొందించింది. ఇప్పుడు సమాజం ఆ పరివర్తన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సంఘం తన శతవార్షికోత్సవం తదుపరి దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో, అది సమాజం నుంచి నిర్లక్ష్యానికి గురైన స్థితి నుండి మద్దతు లభించే స్థాయికి చేరుకుంది. దాని పట్ల సమాజంలో అంచనాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో, శతవార్షికోత్సవం తర్వాత సంఘం విస్తరణ అనేది భౌగోళిక పరిధికి మాత్రమే పరిమితం కాదు. సామాజిక భాగస్వామ్యం, వివిధ సంస్థల సహకారంతో చేపట్టే కార్యక్రమాలతో సామాజిక పరివర్తనకు ఒక సాధనంగా అది పనిచేస్తుంది. తదనుగుణంగా శిక్షణ, నిర్వహణ విధానాలు, కార్యకర్తల బృందాన్ని తీర్చిదిద్దడానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందుతాయి.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలను సేవాభారతి చేపట్టింది. మఠ, మందిరాలు, సేవాసంస్థలు, వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థలు సహా సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించి, వారితో సమన్వయం చేసుకుంటూ, తన కార్యకలాపాలను ఈ సంస్థ నిర్వహించింది. దీనికి విస్తృతమైన మద్దతు లభించింది. ప్రజలు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూనే, వ్యక్తిగత బాధ్యతను చేపట్టడంలో ఐక్యమయ్యారు. దానివలన సమష్టి కృషి సాధ్యమైంది. ఇటువంటి కార్యక్రమాలను పరస్పర సమన్వయంతో సమాజంలోని అన్ని సంస్థలు రానున్న కాలంలో చేపట్టాలి. పరస్పర సమన్వయాన్ని పాటిస్తూనే సామాజిక కార్యకలాపాలు, పరివర్తన సేవా కార్యక్రమాలలో చొరవ చూపాలి. దీనివల్ల సంఘ కార్యకలాపాల వేగం గణనీయంగా పెరుగుతుంది. సంఘకార్యకలాపాలు కేవలం ఒక సంస్థకు సంబం ధించినవి మాత్రమే కావు. సమాజం స్వావ లంబన సాధించేలా చేయడం, తద్వారా వివిధ విభాగాలను, సంస్థలను ఏర్పాటు చేసుకుని, పరస్పర సమన్వ యంతో సామాజిక సమస్యలు, అవసరాలు, భవిష్యత్తు ఆకాంక్షలను పరిష్కరించుకునేలా చూడటమే ఆరంభం నుంచీ దీని లక్ష్యంగా ఉంది. శతాబ్ది ఉత్సవాల తదుపరి దశలో, ఈ స్వప్నాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసే వాతావరణం, వ్యవస్థల రూపకల్పన సంఘకార్యకలాపాలకు దిశానిర్దేశం చేస్తుంది.
సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘పంచ పరివర్తన’ అనే భావన ముందుకు వచ్చింది. ఈ ఐదు లక్ష్యాలను కేవలం సంఘ స్వయంసేవకులు మాత్రమే కాకుండా, సమాజంలోని వివిధ ప్రజా సంస్థలు కూడా సాధించాలనే లక్ష్యంతో విస్తృతమైన ప్రజా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పరివర్తనను సాధించే దిశగా సావ•హిక కృషిని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు మొదలయ్యాయి. రానున్న కాలంలో, సామాజిక కార్యక్రమాలకు స్వయంసేవకులు ప్రాధాన్యతను ఇస్తారు. వాటిని చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వహిస్తారు. సంస్థాగత కార్యకలాపాలతో పాటు, వివిధ సామాజిక కార్యక్రమాలను స్వీకరిస్తారు. వాటిని తమ సొంత లక్ష్యంగా భావిస్తారు. భారతదేశం పట్ల విశ్వాసం, జాతీయ ఆత్మాభిమానం, దేశానికి తమవంతు కృషి చేయాలనే తపన నేటి యువతకు ఉన్నాయి. వారికి ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ కేవలం నినాదాలు మాత్రమే కాదు, అవి జాతీయ భావనకు ప్రతీకలు. ప్రతికూల ధోరణులను అర్థం చేసుకున్న యువత, రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా నిర్మాణాత్మక పనులలో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు. వారు ధర్మం, సంస్కృతి పట్ల కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. యువతతో, వారి సంస్థలతో మమేకమై, వారితో సంబంధాలు ఏర్పరచుకోవడానికి, అలాగే వారి నాయకత్వంలో పనిచేయడానికి అవసరమైన మార్గాలను సంఘ అభివృద్ధి చేస్తోంది. ఈ మార్గాల ద్వారానే భవిష్యత్తులో సామాజిక పరివర్తనకు స్వయంసేవకులు దోహదపడతారు. సమృద్ధి, సంస్కృతి కరుణలతో కూడిన అత్యున్నత కీర్తి శిఖరాని(పరమవైభవస్థితి)కి దేశాన్ని చేర్చడం అనేది భవిష్యత్తుకు సంబంధించిన ఒక గొప్ప కార్యం. సంఘ స్థాపకులైన డాక్టర్ హెడ్గెవార్ దాదాపు ఒక శతాబ్దం క్రితమే దీనిని సాధించాలని సంకల్పించారు. వంద సంవత్సరాలుగా స్వయంసేవకులు ఈ పనిని ముందుకు తీసుకు వెళ్లారు. ఇకపై, ఈ లక్ష్యాన్ని ముందుకు తీసు కెళ్లడంలో సమాజం మొత్తం భాగస్వామ్యం కానుంది. భవిష్యత్తులో ఇది కచ్చితంగా సాధ్యమవు తుందని భావించవచ్చు.

సునీల్ అంబేకర్
అఖిల భారత ప్రచార ప్రముఖ్, ఆర్ఎస్ఎస్