మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల• ప్రాదేశిక జలాలు దాటి ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్‌)‌లోకి వెళ్లి చేపలను వేటాడేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై మత్స్యకారులు డీప్‌ ‌సీ ఫిషింగ్‌ ‌చేసి బోట్ల నిండా చేపలను వేటాడి తెచ్చుకోవచ్చు. అలాగే మత్స్య ఉత్పత్తులపై విధించే జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించింది. ఆక్వాసాగుకు ప్రోత్సాహం కల్పిస్తూ కూడా జీఎస్టీని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మత్స్సకారులకు భారీ ఉపశమనంతో పాటు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

విశాఖపట్నం జిల్లాలో 65 కిలోమీటర్ల తీర ప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్‌ ‌లాండింగ్‌ ‌కేంద్రాలు ఉన్నాయి. సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. దాదాపు 2,500 బోట్లు విశాఖ ఫిషింగ్‌ ‌హార్బరు కేంద్రంగా సముద్రంలో వేటకు వెళుతుంటారు. మత్స్యకార కుటుంబాలకు చెందినవారు ఒక్కో బోటుకు ఆరు నుంచి పది మంది వరకు వేటకు సముద్రంలోకి వెళుతుంటారు. దొరికిన వేటను అయిదు నుంచి పది రోజుల వరకు సముద్రంలో ఉంటారు. మత్స్యకారులు తీరం నుంచి 12 నాటికల్‌ ‌మైళ్ల దూరం వరకే వేటకు వెళ్లాలనేది ఇప్పటివరకూ ఉన్న నిబంధన. ఇవి రాష్ట్ర జలాలు. వీటినే ప్రాదేశిక జలాలు అంటారు. ప్రతి రాష్ట్రానికి ఈ నిబంధన ఉంది. 12 నాటికల్‌ ‌మైళ్లు దాటి తీరం నుంచి 200 నాటికల్‌ ‌మైళ్ల వరకు జాతీయ జలాలు. దీనిని ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ ‌జోన్‌ (ఈఈజెడ్‌)‌గా పేర్కొంటారు. ఈ జలాల్లోకి ప్రవేశించి చేపలను వేటాడాలంటే ప్రత్యేకంగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. టూనా చేపలను వేటాడడానికి ఉపయోగించే లాంగ్‌ ‌లైనర్లకు ఇలాంటి అనుమతులు ఇచ్చేవారు. కొంతమంది అత్యధిక సామర్థ్యం కలిగిన విదేశీ తయారీ బోట్లను తీసుకువచ్చి, వాటికి ఇండియన్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌చేయించి లైసెన్స్‌లు తీసుకునేవారు. వాటితో పోటీ పడలేక భారతీయ బోట్లు వెనుకపడేవి. దీనిపై విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా లైసెన్స్‌లు ఇవ్వడం మానేసింది.

కత్తిమీద సాముగా వేట

తీరం వెంబడి పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావడం, అవి కాలుష్య వ్యర్థాలను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాదేశిక జలాల్లో చేపల లభ్యత తగ్గిపోయింది. దాంతో మత్స్యకారులు అనధికారికంగా జాతీయ జలాల్లోకి వెళ్లి వేటాడుతున్నారు. కొన్నిసార్లు కోస్టుగార్డుకు దొరికి పోతున్నారు. ఒక్కోసారి చేపలను వెదుక్కుంటూ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు కూడా వెళ్లిపోతున్నారు. వెనక్కి తీసుకురావడం కత్తిమీద సాముగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జలాల్లో 200 నాటికల్‌ ‌మైళ్ల వరకు ఎవరైనా వేట చేసుకోవచ్చునంటూ వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డీప్‌ ‌సీ ఫిషింగ్‌కు అవకాశం లభించింది.

జాగ్రత్తలు తప్పనిసరి

కేంద్రం ఉత్తర్వులు మత్స్యకారులకు పెద్ద వరం. అయితే వేటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్ ‌పాండర్‌ను వేట సమయంలో ఆన్‌ ‌చేసి ఉంచాలి. దానివల్ల పరిధి దాటి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా జీపీఎస్‌ ఉం‌చుకోవాలి. లైఫ్‌ ‌జాకెట్లు, ఫైర్‌ ఎక్సటింగ్‌ ‌విషర్లు బోటులో పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి వేటతో క్షేమంగా తీరానికి చేరుకోవచ్చు.

మత్స్య రంగంలో జీఎస్టీ మినహాయింపులు

వస్తు సేవా పన్ను (జీఎస్టీ) తాజా సవరణల ద్వారా మత్స్యరంగానికి ప్రోత్సాహం లభించింది. నిర్వహణ వ్యయం తగ్గించడానికి, దేశీయ, ఎగుమతి మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంచడానికి, మిలియన్ల మంది మత్స్యకార రైతులకు, జీవనాధారం కోసం చేపల వేట, ఆక్వాకల్చర్‌పై ఆధారపడిన వారికి నేరుగా లబ్ధిని అందించడానికి మత్స్యరంగంలో పన్ను రేటు హేతుబద్ధీకరించింది.

సవరించిన విధానం ప్రకారం…

చేప నూనెలు, చేప ఉత్పత్తులు, సిద్ధం చేసిన లేదా నిల్వ చేసిన చేప, రొయ్య ఉత్పత్తులపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గింది. తద్వారా దేశీయ వినియోగదారులకు విలువ జోడించిన సముద్ర ఆహార ఉత్పత్తులు సరస•మైన ధరలకే లభిస్తాయి.అలాగే భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పోటీతత్వం పెరుగుతుంది. ఆక్వాసాగు, హేచరీలకు అవసరమైన డీజిల్‌ ఇం‌జిన్లు, పంపులు, ఎయిరేటర్లు, స్ప్రింక్లర్లపై 12 నుంచి 18 శాతానికి బదులుగా 5 శాతం మాత్రమే జీఎస్టీ వర్తిస్తుంది. ఫలితంగా, మత్స్య రైతులకు నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. చెరువు, నీటి నాణ్యత నిర్వహణకు ఉపయోగించే అమ్మోనియా లాంటి కీలకమైన రసాయనాలు, సూక్ష్మపోషకాలపై సైతం 5 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. గతంలో ఇది 12 నుంచి 18 శాతంగా ఉండేది. దీనివల్ల దాణా, చెరువు, సాగు నిర్వహణల వ్యయం తగ్గుతుంది. నిల్వ చేసిన చేపలు, రొయ్యలు, నత్తలపై తగ్గిన జీఎస్టీ.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సముద్ర ఆహార ఎగుమతులను వృద్ధి చేస్తుంది. అదే సమయంలో దేశీయంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన విధానంలో శుద్ధి చేసిన సముద్ర ఆహార వినియోగాన్ని సైతం పెంచుతుంది.

ఫిషింగ్‌ ‌రాడ్లు, ఉపకరణాలు, ల్యాండింగ్‌ ‌నెట్లు, బటర్‌ ‌ఫ్లై నెట్లు, ఇతర సామగ్రిపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గడం వల్ల రిక్రియేషనల్‌/‌స్పోర్ట్ ‌ఫిషింగ్‌, ‌చిన్న స్థాయిలో ఆక్వా సాగు చేసే, సహజ జలాల్లో చేపలు పట్టే రైతులకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ఈ రంగంలో అవసరమైన పరికరాలు చౌకగా లభిస్తాయి, పెట్టుబడి ఖర్చు తగ్గి, జీవనోపాధికి తోడ్పాటు లభిస్తుంది. ఆహార, వ్యవసాయ శుద్ధి సేవలపై విధించే జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించడంతో ప్రాసెసింగ్‌ ‌యూనిట్లకు సైతం ఈ నిర్ణయం ఉపశమనం అందిస్తుంది. సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేయడానికి, పర్యావరణ హిత పద్ధతిలో చెరువు నిర్వహణకు అవసరమైన కంపోస్టింగ్‌ ‌యంత్రాలపై ఇప్పుడు 5 శాతం పన్ను మాత్రమే విధిస్తారు. ఇది సుస్థిరమైన ఆక్వా సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది.

ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా భారతీయ మత్స్య, ఆక్వా సాగు రంగం ఆవిర్భవించింది. అలాగే జాతీయ ఆహార, పోషక భద్రత, రైతుల ఆదాయానికి, గ్రామీణ జీవనోపాధికి, ఎగుమతులకు గణనీయంగా తోడ్పడుతోంది. ప్రస్తుతం 3 కోట్ల మందికి పైగా ప్రజల జీవనోపాధికి తోడ్పాటు నందిస్తూ 195 లక్షల టన్నుల (2024-25) ఉత్పత్తితో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారత్‌ను ఈ రంగం నిలబెట్టింది. భారత్‌ ‌ప్రపంచంలోనే అతిపెద్ద రొయ్యల ఎగుమతిదారు. 2023-24లో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు రూ. 60,000 కోట్లను దాటాయి. ఫలితంగా.. విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ.. దేశ సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.

ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా మత్స్య రైతులు, ఆక్వా రైతులు, మత్స్యకారులు, మహిళా స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలకు నేరుగా లబ్ధి చేకూర్చడంతో పాటు.. గ్రామీణ జీవనోపాధిని ఈ సంస్కరణలు పెంపొందిస్తాయి. సవరించిన జీఎస్టీ రేట్లు 2025, సెప్టెంబర్‌ 22 ‌నుంచి అమల్లోకి వచ్చాయి. భారతీయ మత్స్య రంగాన్ని మరింత ఉత్పాదకంగా, పోటీతత్వంతో, స్థిరంగా మార్చే దిశగా వేసిన ముఖ్యమైన అడుగును ఈ నిర్ణయాలు సూచిస్తాయి. వికసిత భారత్‌ ‌లక్ష్యాన్ని సాధించే దిశగా సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE