పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే కష్టమే.. ఆ విషయం మమతా బెనర్జీకి స్పష్టంగా తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగుతూ గాలి మేడలు కట్టుకున్న తృణవ•ల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు నేలకు దిగక తప్పడం లేదు. ప్రజా వ్యతిరేకతకు తోడు పార్టీలో తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తృణవ•ల్‌ని చిత్తుగా ఓడించినా ప్రజలకు కోపం తగ్గలేదు. ముఖ్యంగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మీద దాడి ఒకెత్తు అయితే, పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి విపక్ష నేత హోదాను కైవసం చేసుకోవడం ద్వారా మమతకు చెమటలు పట్టించారు. చివరకు తాను స్థాపించిన పార్టీమీదే పట్టుకోల్పోయారు దీదీ.
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నారు పెద్దలు. కర్మ ఫలితం అనుభవించక తప్పదని తృణవ•ల్ అధినేత్రి మమతకు స్పష్టంగా అర్థమవు తోంది. దశాబ్దన్నర కాలం పాటు పశ్చిమ బెంగాల్‌ను శాసించిన ఆమె తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటు న్నారు. 2009లో ‘మా మాటి మనుష్’ అనే నినాదంతో 34 ఏళ్ల కవ్యనిస్ట్ పాలనకు చరమగీతం పలికారు దీదీ, 2016 వచ్చే సరికి ఆ వ•డింటికీ దూరమయ్యారు. కవ్యనిస్టులను మించిన దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, సంతుష్టీకరణ విధానాలు, హిందూ వ్యతిరేక అరాచక పాలనతో విసిగిపోయిన బెంగాలీలు టీఎంసీ పాలనకు ముగింపు పలికారు.
తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజల్లో సానుభూతి పొందేందుకు. అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ మే 31వ తేదీన తమ నివాసంలో సమావేశం నిర్వహించారు. తమపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ సన్నాహక భేటీకి టీఎంసీ నుంచి గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో 20 మంది మాత్రమే హాజరయ్యారు. చేసేదేం లేక మమత సమావేశాన్ని వాయిదా వేశారు. అంతకు మించిన షాక్ జూన్ 2వ తేదీ నాడు తగిలింది. కోల్‌కతాలో మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ధర్ణాలో కేవలం ఆరుగురు ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు.
మమత అహంకార ధోరణి
ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ఓటమి తర్వాత, అందుకు దారితీసిన కారణాలను విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతుంది. కానీ తృణమూల్ విషయంలో అదేమీ జరగలేదు. ఎన్నికల సమయం లోనే ప్రజల నాడి ఏమిటో స్పష్టమైపోయింది. కానీ మమతా బెనర్జీ అంగీకరించే స్థితిలో లేరు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, •కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుట్ర ఫలితమే తమ ఓటమి అని ఆరోపణలు గుప్పించారు. కానీ ప్రజా వ్యతిరేక కారణమని ఒప్పుకోలేదు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటించారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచీ టీఎంసీ కార్యకర్తలు, కొందరు నాయకులు అసలు కారణాలను బాహాటంగా చెప్పడం, అధినాయకత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అహంకారం పార్టీకి చెడ్డ పేరు తెచ్చిందని వారి ఆరోపణ.
ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఒక సమావేశంలో ‘మనం ఓడిపోలేదు.. మనమే గెలిచాము.. అభిషేక్ అద్భుతంగా పని చేశాడు’ అంటూ అలా అంటూ అందరూ నిలబడి చప్పట్లు కొట్టాని హాజరైన ఎమ్మెల్యేలందరినీ కోరారు. అయినా చాలామంది తట్టుకోలేక పోయారు, అలా చేయలేదు. కానీ ఆమె ఏమీ అనలేదు కూడా. పార్టీలో కనిపించిన అసమ్మతి తాలూకు తొలి సంకేతాన్ని మమత గమనించలేకపోయారు. ఎన్నిక వాయిదా పడిన ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు రెండు రోజుల ముందే పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అధిష్ఠానంతో సంప్రదించకుండానే పోటీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. అతడు అభిషేక్‌కు సన్నిహితుడు కావడంతో పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జహంగీర్ ఖాన్ విషయంలో పార్టీ ఏం చేస్తోందని అడిగినప్పుడు, ఆయన కేవలం ‘పార్టీ ట్వీట్ చూడండి’ అని అభిషేక్ బెనర్జీ అహంకారంతో జవాబిచ్చారు. దీంతో ఉలుబేరియా పూర్బా ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ పావులు కదపడం మొదలు పెట్టారు.
చేజారిన తృణవ•ల్
మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవ డంతో తృణవ•ల్ కాంగ్రెస్ మరొకరిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలి. సహజంగా అతడే సభలో విపక్షనేత అవుతారు. ఈ పదవికి శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయను ఎంపిక చేశారు. అలాగే అషిమా పాత్రలను ఉప ప్రతిపక్ష నాయకులుగా, ఫిర్హాద్ హకీమ్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ టీ•ఎంసీ నాయకత్వం స్పీకర్ కార్యాలయానికి లేఖను సమర్పించింది. ఈ లేఖపై 70 మంది ఎమ్మెల్యేల సంతకాలున్నాయి. అయితే తామెవరం లేఖపై సంతకాలు చేయలేదని, వాటిని ఫోర్జరీ చేశారని ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ, సందీపన్ సహా బహిరంగం గానే ఆరోపించారు.దీంతో క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో తృణవ•ల్ కాంగ్రెస్ నాయకత్వం వీరిద్దరినీ పార్టీ నుండి బహిష్కరించింది.
రితబ్రత బెనర్జీ ఇంతటితో ఆగలేదు. పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలందరి మద్దతు కూడగట్టారు. అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది శాసనసభ్యులు ఉండగా,అందులో వ•డింట రెండొంతుల కంటే ఎక్కువ మంది మద్దతు తమకు ఉందని పేర్కొంటూ స్పీకర్ రతీంద్రబోస్‌కు లేఖ సమర్పించారు. ఆ లేఖను ఆయన ఆమోదించటం, రితబ్రతను శాసనసభా పక్ష నేతగా గుర్తించటం, విపక్ష నేతకు గదిని కూడా కేటాయించటం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలను గమనించిన మమతా బెనర్జీకి తాను స్థాపించిన పార్టీ మీద తానే పట్టుకోల్పోయానని అర్థమైంది. రితబ్రత బెనర్జీ టీఎంసీ పార్టీని చీల్చి, గుర్తును కూడా సొంతం చేసుకునే యత్నం కలవరపెట్టింది. ఈ పరిణామాలతో కంగుతిన్న మమత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
టీఎంసీలో ఎమ్మెల్యేలే కాకుండా ఎంపీలు కూడా మమతా బెనర్జీకి వేగంగా దూరమవుతున్నారు. లోక్‌సభలో పార్టీని చీల్చేందుకు తిరుగుబాటు ఎంపీల వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాదాపు 20- 23 మంది ఎంపీలు నిరంతరం రితబ్రతతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలలో వ•డింట రెండే వంతులకు పైగా విడిపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉంటుంది. ‘అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి మా సంఖ్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. వేచి చూడండి. ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది’ అని మీడియాతో అన్నారాయన.
మేనల్లుడి నిర్వాకం
సొంత పార్టీలో పట్టుకోసం ఇప్పుడు మమతా బెనర్జీ అస్థిత్వ పోరాటం చేస్తున్నారు. ఆమె తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని వారసుడిగా తయారు చేశారు. 2014 నుంచి పార్టీలోని కీలక బాధ్యతలను అప్పగించారు.పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ డైమండ్ హార్బర్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడిగా 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. కార్పొరేట్, యువ విభాగా లను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ తీసుకొనేవారు. కాగా, ఆయనే ప్రస్తుత సంక్షోభానికి కేంద్ర బిందువు. ఆయన కారణంగానే మమతకు సీనియర్ నాయకులతో దూరం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా పలు నేతలు పార్టీనీ వీడి వెళ్లడానికి కూడా అభిషేక్ వైఖరే కారణమన్న ఆరోపణలూ ఉన్నాయి. మమత కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తే అభిషేక్, దానిని ఐ-పాక్ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టారన్న విమర్శలు ఉన్నాయి.
మమతా బెనర్జీని తాము గౌరవిస్తున్నామని, అయితే తమపై అభిషేక్ పెత్తనాన్ని మాత్రం అంగీకరించబోమని రితబ్రత బెనర్జీ స్పష్టంచేశారు. పార్టీలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న అభిషేక్ బెనర్జీని వ్యతిరేకిస్తున్నామే కానీ మమతను కాదని మెజారిటీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దీంతో మమత పాతతరం నాయకులను శాంతింప జేస్తూనే, తమ మేనల్లుడిని కాపాడుకోవడానికి ప్రయత్నిన్నారు. ఇందులో భాగంగా తన సన్నిహిత ఎంపీలు డెరెక్ ఓబ్రె యిన్, డోలా సేన్‌లను అదనంగా ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
అభిషేక్‌పై ప్రధానంగా బొగ్గు అక్రమ మైనింగ్, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాం, ఆస్తులు కూడబెట్టు కోవడం, రాజకీయ ప్రత్యర్థులపై బెదిరింపుల• వంటి తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి.వీటిపై ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయనకు కోల్‌కతాలో 43 అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ జాబితా కూడా విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలు జరిగాయని అభిషేక్‌కు సంబంధించిన కొన్ని చిరునామాలకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు పంపింది.
అభిషేక్ మీద దాడి
పార్టీకి చెందిన స్థానిక నాయకులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుండి ‘కట్ మనీ’ పేరుతో అక్రమంగా వసూలు చేసేవారు.ఇప్పుడా పార్టీ అధికారం కోల్పోవడంతో తమ నుంచి తీసుకున్న కట్ మనీ తిరిగి ఇవ్వాలని ప్రజలు నిలదీస్తున్నారు.ఈ క్రమంలో అభిషేక్ కొద్ది రోజుల క్రితం దక్షిణ 24 పరగణాల జిల్లా సొరేన్‌పూర్‌లో కార్యకర్తలను పరామర్శకు వెళ్లినప్పుడు స్థానిక మహిళలు చీపుర్లు, వెదురు కర్రలు చేతబూని ఆందోళనకు దిగి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన వెంటనే మమతా బెనర్జీ ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు.
అమిత్ షాకే బెదిరింపులు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఉద్దేశించి అభిషేక్ బెనర్జీ చాలా పొగరుతో మాట్లాడారు. వారు ‘అవుట్‌సైడర్ జమీందార్లు’ అని పేర్కొంటూ,బెంగాల్ ప్రజలు తలుచుకుంటే వారి అహంకారాన్ని క్షణాల్లో అణచివేస్తారని హెచ్చరించారు. అక్రమ చొరబాటు దారుల అంశంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా..కేంద్రం ఆశ్రయం కల్పించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ‘చొరబాటుదారుగా పరిగణించాలా?వద్దా? అని ప్రశ్నించారు. అమిత్ షాకు దమ్ముంటే తన సొంత నియోజకవర్గం డైమండ్ హార్బర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి రాదని, ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ఆశించినట్లుగా మే 4న ఎటువంటి ‘రవీం సంగీత్’ వినిపించదని, బదులుగా తమ పార్టీ విజయ సంబరాల కోసం భారీగా ‘డిజె’ సౌండ్లు మోగుతాయని సవాలు చేశారు. కేంద్ర హోం మంత్రిని లక్ష్యంగా చేసుకుని పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లపై రెచ్చగొడుతూ, భయభ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు చేసినందుకు గాను అభిషేక్ బెనర్జీపై బిధానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపికకు సంబంధించిన మద్దతు లేఖలో ఫోర్జరీ జరిగిందనే ఆరోపణలపై టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీకి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. అయితే సీఐడీ విచారణ నుంచి తప్పించుకోవడానికే అదే రోజు అభిషేక్ తనపై దాడి జరిగిందనే డ్రామా ఆడారా అనే అనుమానాలు వచ్చాయి.
మొత్తానికి మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అరాచకాలకు ఇప్పుడు వ•ల్యం చెల్లించుకుంటు న్నారని విశ్లేషకులు అంటున్నారు.