ఏప్రిల్ 18న ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగ పూర్తి పాఠం

ఈరోజు నేను ఒక అత్యంత ముఖ్యమైన విషయంపై మాట్లాడటానికి వచ్చాను, ముఖ్యంగా దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలను ఉద్దేశించి! మహిళా శక్తి పోరాటాన్ని ఎలా అడ్డుకున్నారో(విపక్ష నేతలు) ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు చూస్తున్నాడు. వారి కలలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. మేము ఎంతగానో ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేక పోయాము. నారీ శక్తి వందన్ చట్ట సవరణను ఆమోదింపజేయలేకపోయాము! అందుకు నేను తల్లులు , సోదరీమణులందరినీ క్షమించమని కోరుతున్నాను.

మిత్రులారా,

మనకు జాతీయ ప్రయోజనాలే సర్వోన్నతమైనవి, కానీ కొందరికి పార్టీ ప్రయోజనాలే సర్వస్వం అయినప్పుడు, జాతీయ ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలే గొప్పవైనప్పుడు, దాని పర్యవసానాలను మహిళా శక్తి, జాతీయ ప్రయోజనాలు భరించాల్సి వస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీల స్వార్థ రాజకీయాలు దేశ మహిళా శక్తికి హాని కలిగించాయి.

మిత్రులారా,

నిన్న దేశంలోని కోట్లాది మంది మహిళల కళ్లు పార్లమెంటుపైనే ఉన్నాయి. దేశ మహిళా శక్తి చూస్తోంది. మహిళలకు అనుకూలమైన ఈ ప్రతిపాదన వీగిపోయినప్పుడు, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి కుటుంబ ఆధారిత పార్టీలు ఆనందంతో చప్పట్లు కొట్టడం చూసి నాకు కూడా చాలా బాధ కలిగింది. మహిళల హక్కులను లాక్కొని, వారు బల్లలు చరిచారు. వారు చరిచింది కేవలం బల్లలను మాత్రమే కాదు, మహిళల ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బ తీశారు. మహిళలు అన్నీ మరిచిపోతారు కానీ తమకు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోరు. అందువల్ల, పార్లమెంటులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ప్రవర్తన వల్ల కలిగిన బాధ మహిళల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి పోతుంది. దేశంలోని మహిళలు తమ ప్రాంతాలలో ఈ నాయకులను చూసినప్పుడల్లా, మహిళా రిజర్వేషన్లను ఆపినప్పుడు పార్లమెంటులో సంబరాలు చేసుకున్నది, ఆనందించింది వీరేనని గుర్తు చేసుకుంటారు. నిన్న పార్లమెంటులో నారీ శక్తి వందన్ సవరణను వ్యతిరేకించిన పార్టీలకు నేను స్పష్టంగా చెబుతాను: ఈ వ్యక్తులు మహిళా శక్తిని తేలికగా తీసుకుంటున్నారు. 21వ శతాబ్దపు మహిళలు దేశంలోని ప్రతి సంఘటనను గమనిస్తున్నారని, వారి ఉద్దేశాలను గ్రహిస్తున్నారని, నిజానిజాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని వారు మర్చిపోతున్నారు. అందువల్ల, మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించినందుకు ప్రతిపక్షాలు చేసిన పాపానికి వారికి తప్పకుండా శిక్ష తప్పదు. ఈ పార్టీలు రాజ్యాంగ రూపకర్తల మనోభావాలను కూడా అవమానించాయి. ప్రజల విధించే వచ్చే శిక్ష నుండి అవి తప్పించుకోలేవు.

మిత్రులారా,

నారీ శక్తి వందన్ సవరణ ఎవరి నుంచో ఏదో లాక్కోవడానికి ఉద్దేశించినది కాదు. నారీ శక్తి వందన్ సవరణ ప్రతిఒక్కరికీ ఏదో ఒకటి ఇవ్వడానికి ఉద్దేశిం చినది. అది ఇవ్వడానికి మాత్రమే ప్రతిపాదించిన సవరణ. 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న దానిని 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు హక్కును ఇవ్వడానికే ఇది ఉద్దేశించింది.

21వ శతాబ్దపు భారతదేశంలోని మహిళలకు కొత్త అవకాశాలు, కొత్త రెక్కలు ఇవ్వడానికి, వారి మార్గంలోని అడ్డంకులను తొలగించడానికి చేసిన గొప్ప ప్రయత్నమే నారీ శక్తి వందన్ సవరణ. దేశ జనాభాలో 50 శాతానికి హక్కులు కల్పించాలనే స్పష్టమైన ఉద్దేశంతో, నిజాయితీతో చేసిన పవిత్రమైన ప్రయత్నం ఇది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను సహ ప్రయాణికులుగా చేయడానికి, ప్రతి ఒక్కరినీ కలుపుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. నారీ శక్తి వందన్ సవరణ కాలపు అవసరం. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ అనే తేడా లేకుండా ప్రతి రాష్ట్రం బలాన్ని సమానంగా పెంచడానికి చేసిన ప్రయత్నమే నారీ శక్తి వందన్ సవరణ. పార్లమెంటులో ప్రతి రాష్ట్రం స్వరానికి మరింత బలం చేకూర్చే ప్రయత్నం ఇది. రాష్ట్రం చిన్నదైనా, పెద్దదైనా, జనాభా తక్కువైనా, ఎక్కువైనా, ప్రతి ఒక్కరి శక్తిని సమాన నిష్పత్తిలో పెంచడమే దీని ఉద్దేశం. కానీ ఈ నిజాయితీతో కూడుకున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంటులో భ్రూణహత్యకు గురిచేశాయి. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే… ఈ పార్టీలు ఈ భ్రూణ హత్యకు పాల్పడ్డాయి. అవి దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరం చేశాయి. దేశ మహిళా శక్తికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డాయి.

మిత్రులారా,

కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ద్వేషిస్తుంది, దానిని ఆపడానికి ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంది. ఈ దిశగా ప్రయత్నాలు జరిగిన ప్రతిసారీ, కాంగ్రెస్ వాటిని అడ్డుకుంది. ఈసారి కూడా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్లను ఆపడానికి ఒకదాని తర్వాత ఒకటిగా అబద్ధాలపై ఆధారపడ్డాయి. కొన్నిసార్లు సంఖ్యల విషయంలో, మరికొన్నిసార్లు ఇతర విధాలుగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాయి. అలా చేయడం ద్వారా, ఈ పార్టీలు భారతదేశ మహిళా శక్తి ముందు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. తమ ముసుగును తొలగించాయి.

మిత్రులారా,

వ్యక్తిగతంగా, కాంగ్రెస్ తన దశాబ్దాల నాటి తప్పును సరిదిద్దుకుంటుందని కాంగ్రెస్ తన పాపా లకు పశ్చాత్తాపపడుతుందని నేను ఆశించాను. కానీ చరిత్ర సృష్టించే, మహిళలకు అనుకూలంగా నిలబడే అవకాశాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. దేశంలోని చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ ఇప్పటికే తన ఉనికిని కోల్పోయింది. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల వీపుపై స్వారీ చేస్తూ ఒక పరాన్నజీవిలా మనుగడ సాగిస్తోంది. కానీ ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడం కూడా కాంగ్రెస్‌కు ఇష్టం లేదు, అందుకే ఈ సవరణను వ్యతిరేకించేలా చేసి, అనేక ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి కాంగ్రెస్ రాజకీయంగా కుట్ర పన్నింది.

మిత్రులారా,

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, టీఎంసీ, ఇతర పార్టీలు ఎన్నో ఏళ్లుగా, ప్రతిసారీ అవే సాకులు, అవే తప్పుడు వాదనలు చేస్తూ, ఎప్పుడూ ఏదో ఒక సాంకేతిక అడ్డంకిని సృష్టిస్తూ మహిళల హక్కులను దోచుకున్నాయి. దేశం ఈ వికారమైన రాజకీయ సరళిని అర్థం చేసుకుంది. దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా గ్రహించింది.

సోదర సోదరీమణులారా,

నారీ శక్తి వందన్ చట్టాన్ని వ్యతిరేకించడానికి ఒక పెద్ద కారణం ఈ కుటుంబ ఆధారిత పార్టీల భయమే. మహిళలు సాధికారత పొందితే, ఈ కుటుంబ ఆధారిత పార్టీల నాయకత్వం ప్రమాదంలో పడుతుందని వారు భయపడుతున్నారు. తమ కుటుంబాలకు వెలుపల ఉన్న మహిళలు ముందుకు రావడాన్ని వారు ఎప్పటికీ కోరుకోరు. ఈనాడు, పంచాయతీలలో, స్థానిక సంస్థలలో వేలాది, లక్షలాది మంది మహిళలు తమ సామర్థ్యాన్ని నిరూపించు కున్నారు. వారు లోక్‌సభ, శాసనసభలలోకి అడుగుపెట్టి, దేశానికి సేవ చేయాలనుకున్నప్పుడు, ఈ కుటుంబ ఆధారిత పార్టీలు అభద్రతా భావానికి లోనవుతాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళలకు మరిన్ని సీట్లు లభిస్తాయి, మహిళల స్థాయి పెరుగుతుంది. అందుకే ఈ పార్టీలు నారీ శక్తి వందన్ సవరణను వ్యతిరేకించాయి. ఈ పాపానికి దేశంలోని మహిళా శక్తి కాంగ్రెస్‌ను, దాని మిత్రపక్షాలను ఎన్నటికీ క్షమించదు.

నా ప్రియమైన దేశవాసులారా,

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నియోజకవర్గాల పునర్విభజన గురించి నిరంతరం అబద్ధాలు చెబుతున్నాయి. ఈ సాకుతో వారు విభజన అనే నిప్పును రాజేయాలని చూస్తున్నారు. ఎందుకంటే “విభజించి పాలించు” రాజకీయాలు కాంగ్రెస్‌కు బ్రిటిష్ వారి నుండి వారసత్వంగా సంక్రమించాయి. కాంగ్రెస్ ఈనాటికీ అదే దారిలో పయనిస్తోంది. దేశంలో చీలికలు సృష్టించే భావాలను కాంగ్రెస్ ఎల్లప్పుడూ రెచ్చగొడుతూ వచ్చింది. అందుకే, నియోజకవర్గాల పునర్విభజన కొన్ని రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందనే అబద్ధాన్ని ప్రచారం చేసింది! అయితే, ఏ రాష్ట్ర భాగస్వామ్య నిష్పత్తి మారదని, ఎవరి ప్రాతినిధ్యం తగ్గదని ప్రభుత్వం మొదటి రోజు నుంచే స్పష్టం చేసింది. వాస్తవానికి, అన్ని రాష్ట్రాల సీట్లు సమాన నిష్పత్తిలో పెరుగుతాయి. అయినప్పటికీ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేవు.

మిత్రులారా,

ఈ సవరణ బిల్లు అన్ని పార్టీలకు, అన్ని రాష్ట్రాలకు ఒక మంచి అవకాశంగా ఉండేది. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే, తమిళనాడు, బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కేరళ ఇలా ప్రతి రాష్ట్రం సీట్లు పెరిగి ఉండేవి. కానీ తమ స్వార్థ రాజకీయాల వల్ల, ఈ పార్టీలు తమ సొంత రాష్ట్రాల ప్రజలకు కూడా ద్రోహం చేశాయి. ఉదాహరణకు, తమిళనాడు గొంతుకను బలోపేతం చేయడానికి, ఎక్కువ మంది తమిళ ప్రజలను ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేసే అవకాశం డీఎంకేకు లభించింది! కానీ ఆ అవకాశాన్ని అది కోల్పోయింది. బెంగాల్ ప్రజలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం టీఎంసీకి కూడా లభించింది. కానీ టీఎంసీ కూడా ఆ అవకాశాన్ని కోల్పోయింది. మహిళా వ్యతిరేక పార్టీ అనే మచ్చను తొలగించుకునే అవకాశం సమాజ్‌వాదీ పార్టీకి లభించింది. కానీ ఎస్పీ ఆ అవకాశాన్ని కూడా జారవిడుచుకుంది.ఎస్పీ ఇప్పటికే లోహియాజీని మరిచిపోయింది. నారీ శక్తి వందన్ సవరణను వ్యతిరేకించడం ద్వారా, ఎస్పీ లోహియాజీ కలలన్నిం టినీ కాలరాచింది. ఎస్పీ మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకి, ఈ విషయాన్ని యÖపీ, దేశ మహిళలు ఎన్నటికీ మరచిపోరు.

మిత్రులారా,

మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా తాను సంస్కరణలను వ్యతిరేకించే పార్టీ అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంది. 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన భారతదేశానికి ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి సంస్కరణలు అవసరమైనా, దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, కాంగ్రెస్ వాటిని వ్యతిరేకిస్తుంది, తిరస్కరిస్తుంది, అడ్డుకుంటుంది. ఇదీ కాంగ్రెస్ చరిత్ర. ఇవే కాంగ్రెస్ చేస్తున్న  ప్రతికూల రాజకీయాలు.

మిత్రులారా,

జన్ ధన్-ఆధార్-మొబైల్ త్రయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ డిజిటల్ చెల్లింపులను వ్యతిరేకించింది. కాంగ్రెస్ జీఎస్టీని వ్యతిరేకించింది. సాధారణ కేటగిరీలో పేదలకు రిజర్వేషన్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 తొలగింపును కాంగ్రెస్ వ్యతిరేకించింది. యÖనిఫామ్ సివిల్ కోడ్ (యÖసీసీ) అవసరమని మన రాజ్యాంగం, మన న్యాయస్థానాలు చెప్పాయి, కానీ కాంగ్రెస్ దానిని కూడా వ్యతిరేకిస్తుంది. సంస్కరణల ప్రస్తావన రాగానే, కాంగ్రెస్ నిరసన ప్లకార్డులతో ముందుకు వస్తుంది. దేశాన్ని బలోపేతం చేసే ఏ పనికైనా అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుంది. కాంగ్రెస్ ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ను వ్యతిరేకిస్తుంది. దేశం నుండి చొరబాటుదారులను తరిమివేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఓటర్ల జాబితా ప్రక్షాళనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఎసఐఆర్, వక్ఫ్ బోర్డులో సంస్కరణ లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది.

మిత్రులారా,

శరణార్థులకు భద్రత కల్పించిన సీఏఏ చట్టాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. అబద్ధాలు చెప్పి, పుకార్లు వ్యాప్తి చేసి దేశంలో పెను తుపాను సృష్టించింది. మావోయిస్టు-నక్సలైట్ హింసను అంతం చేయడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ అడ్డుపడుతుంది. కాంగ్రెస్‌కు ఒకే ఒక పద్ధతి ఉంది అదేమిటంటే సంస్కరణ వచ్చినప్పుడల్లా, అబద్ధం చెప్పడం, గందరగోళం సృష్టించడం.దీనికి చరిత్రే సాక్షి. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఈ ప్రతికూల మార్గాన్నే ఎంచుకుంది.

మిత్రులారా,

దేశానికి ఏ నిర్ణయం అవసరమో, దాన్ని కాంగ్రెస్ చాప కిందకు నెట్టేసి  మరుగున పడేస్తుంది. కాంగ్రెస్ ఈ వైఖరి కారణంగా, భారతదేశం తాను చేరుకోవాల్సిన అభివృద్ధి శిఖరాలను చేరుకోలేక పోయింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మనతో పాటు అనేక ఇతర దేశాలు కూడా స్వాతంత్య్రం పొందాయి. ఆ దేశాలలో చాలా వరకు మనకంటే చాలా ముందుకు వెళ్లాయి, దానికి కారణం కాంగ్రెస్ ప్రతి సంస్కరణను అడ్డుకోవడమే. ఆలస్యం చేయడం, దారి మళ్లించడం, ఇదే కాంగ్రెస్ సూత్రం, ఇదే కాంగ్రెస్  సంస్కృతి. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాల పరిష్కారంలో కాంగ్రెస్ ఆలస్యం చేసింది. పాకిస్థాన్‌తో నీటి పంపిణీ వివాదాల పరిష్కారంలో కాంగ్రెస్ ఆలస్యం చేసింది. ఓబీసీ రిజర్వేషన్‌పై నిర్ణయాన్ని కాంగ్రెస్ 40 ఏళ్లపాటు ఆలస్యం చేసింది. సైనికులకు ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన’ పథకాన్ని కాంగ్రెస్ 40 ఏళ్లపాటు జాప్యం చేసింది.

మిత్రులారా,

కాంగ్రెస్ వైఖరి దేశానికి ఎల్లప్పుడూ గొప్ప హాని కలిగించింది. కాంగ్రెస్ ప్రతి వ్యతిరేకత, ప్రతి నిర్ణయరాహిత్యం, ప్రతి మోసం వల్ల దేశం నష్టపోయింది. దేశంలోని తరతరాలు బాధపడ్డాయి. ఈ రోజు, దేశం ముందున్న అన్ని ప్రధాన సవాళ్లు కాంగ్రెస్ వైఖరి నుండే ఉద్భవించాయి. అందువల్ల, ఈ పోరాటం కేవలం ఒక చట్టానికి సంబంధించినది కాదు, ఇది కేవలం ప్రతికూలతతో నిండిన కాంగ్రెస్ సంస్కరణ వ్యతిరేక మనస్తత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మాత్రమే. కాంగ్రెస్ మనస్తత్వానికి దేశంలోని మహిళలు, కుమార్తెలు గట్టి సమాధానం ఇస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు.

మిత్రులారా,

దేశంలోని మహిళల కలలను భగ్నం చేయడాన్ని కొందరు ప్రభుత్వ వైఫల్యం అని అంటున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడూ విజయం లేదా అపజయం గురించి కాదు, ఘనత గురించి కూడా కాదు. నేను పార్లమెంటులో కూడా చెప్పాను: సగం జనాభాకు వారి హక్కులు లభించనివ్వండి, నేను వారి ఫోటోలతో ప్రకటనలు ప్రచురించి ఆ ఘనతను ప్రతిపక్షానికి ఇస్తాను. కానీ మహిళలను పాతకాలపు ఆలోచనలతో చూసేవారు ఇప్పటికీ తమ అబద్ధాలకు కట్టుబడి, దృఢంగా నిలబడ్డారు!

మిత్రులారా,

మహిళలకు అధికారం, భాగస్వామ్యం కల్పించా లనే పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతోంది. సంవత్సరాలుగా దీని కోసం కృషి చేస్తున్న వారిలో నేను కూడా ఉన్నాను. ఎంతో మంది మహిళలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఎంతో మంది సోదరీమణులు ప్రతిదీ వివరిస్తూ నాకు లేఖలు రాశారు. నా దేశపు తల్లులారా, సోదరీ మణులారా, కుమార్తెలారా.. మీరందరూ ఈ రోజు దుఃఖంలో ఉన్నారని నాకు తెలుసు. మీ దుఃఖంలో నేను కూడా పాలుపంచుకుంటున్నాను. ఈ రోజు, బిల్లును ఆమోదించడానికి అవసరమైన 66 శాతం ఓట్లు మాకు రానప్పటికీ, దేశంలోని నూటికి నూరు శాతం మహిళా శక్తి మమ్మల్ని ఆశీర్వదించిందని నాకు తెలుసు. దేశంలోని ప్రతి మహిళకు నేను హామీ ఇస్తున్నాను: మహిళా రిజర్వేషన్ల మార్గంలోని ప్రతి అడ్డంకిని మేము తొలగిస్తాము. మా ధైర్యం అపార మైనది, మా సంకల్పం అచంచలమైనది, మా దృఢ నిశ్చయం చెక్కుచెదరనిది. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీలు, పార్లమెంట్ శాసనసభలలో ఈ దేశ మహిళా శక్తి భాగస్వామ్యాన్ని పెంచుకోవడాన్ని ఎప్పటికీ ఆపలేవు. దీనికి పెద్దగా సమయం పట్టదు. మహిళా శక్తి సాధికారత కోసం బీజేపీ-ఎన్డీఏ సంకల్పం చెక్కుచెదరలేదు. నిన్న మాకు సంఖ్యాబలం లేదు, కానీ దాని అర్థం మేము ఓడిపోయామని కాదు. మా అంతర్గత శక్తి అజేయమైనది. మన ప్రయత్నం ఆగదు, విరమించదు. మనముందు మరిన్ని అవకా శాలు ఉన్నాయి. జనాభాలో సగభాగం మంది కలల కోసం, దేశ భవిష్యత్తు కోసం, మనం ఈ సంకల్పాన్ని నెరవేర్చాలి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE