దేశం స్వాతంత్య్రమైతే రాజకీయ వ్యవస్థలో ఎలాంటి విలువలు? అభివృద్ధికి కొలమానం ఏది?

ఈ మౌలిక ప్రశ్నలకు భారతీయతతో కూడిన స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన ద్రష్ట దీనదయాళ్‌ ఉపాధ్యాయ. ఆయన ఏకాత్మ మానవ దర్శనం దేశానికి  సమగ్ర పథం చూపింది. వ్యక్తి, సమాజం, ప్రకృతి, సంస్కృతి ఇవన్నీ విడదీయలేనివని, వీటిలో  ఏ ఒక్కటి బలహీనపడినా దేశమూ బలహీన పడుతుందన్న సూత్రం మీద ఆయన తత్త్వం నిర్మితమైంది.ఇదే దృక్పథం నేడు ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఆలంబనగా నిలిచింది.

సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు ఉండాలన్నది మన ధర్మ శాస్త్రాల మర్మం. ఆ శాస్త్రాల భావనకు నేటి రూపమే, అంటే  ప్రతి పౌరుడి జీవితం మెరుగు పరచడమే దీనదయాళ్‌ సిద్ధాంతసారం. అభివృద్ధిని కొంత మందికి మాత్రమే పరిమితం చేయడం, లేదా వాటి ఫలాలు కొందరికే చెందడం సరైనది కాదని అన్నారు.

అభివృద్ధి అంటే పేదవాడి ఇల్లు వెలుగులు చిమ్మడం.

అభివృద్ధి అంటే ప్రతీ వ్యక్తి గౌరవప్రదంగా జీవించడం.

ఈ మాటలే ఇవాళ నరేంద్ర మోదీ పాలనలోని వివిధ విధానాలలో ప్రతిబింబిస్తు న్నాయి.

–         జన్‌ధన్‌ యోజన ద్వారా బ్యాంక్‌ వ్యవస్థలో చేరని కోట్ల మందికి ఖాతాలు

–         ఉజ్జ్వల గ్యాస్‌ పథకం ద్వారా తల్లి, చెల్లెళ్ల ఆరోగ్య రక్షణ

–         ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యసేవల అందుబాటు

–         స్వచ్ఛభారత్‌ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రతలో భారీ మార్పు

–         ఉచిత రేషన్‌ పంపిణీ ద్వారా ఆహారభద్రత

ప్రతి పథకం వ్యక్తి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తోంది.

ఇదే దీనదయాళ్‌ ఆశించినది. ఆయన సిద్ధాంతం ప్రతిపాదించినది.

గ్రామాలు స్వయంసమృద్ధి ద్వారా  దేశం నిలబడుతుందనీ విశ్వసించారు దీనదయాళ్‌, గ్రామాలే భారత్‌కు బలమని అన్నారు. దేశం ముందుకు సాగాలంటే గ్రామం పురోగమించా లని విశ్వసించారు.

నేడు మోదీ ప్రభుత్వం కూడా గ్రామాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తోంది.

–         రైతుల కోసం PM కిసాన్‌

–          గ్రావిూణ మౌలిక వసతుల అభివృద్ధి

–          SHG మహిళలకు రుణ సహాయం

–          వోకల్‌ ఫర్‌ లోకల్‌ ద్వారా గ్రావిూణ ఉత్పత్తులకు మార్కెట్‌

–          డిజిటల్‌ సర్వీసులు గ్రామాలకే చేరడం….

అన్నీ గ్రామం స్వయం సంపూర్ణంగా ఎదగడానికి దోహదం చేస్తున్నాయి.

దీనదయాళ్‌ గారి మాటల్లో: ‘దేశం హృదయం గ్రామాల్లో ఉంది.’

భారతీయ సంస్కృతిని దీనదయాళ్‌ దేశ శక్తిగా చూశారు.

మోదీ పాలనలోనూ అదే భావన స్పష్టంగా కనిపిస్తుంది.

–        యోగా అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తింపు పొందడం

–        భారతీయ సంప్రదాయ వైద్య పద్ధతులకు మద్దతు

–         ప్రపంచ వేదికలపై భారతీయ విలువలను గౌరవించడం

–        జాతీయ భద్రత, సరిహద్దుల రక్షణలో స్పష్టమైన నిర్ణయాలు

ఈ కార్యక్రమాలన్నీ భారతీయతను బలంగా నిలబెడుతున్నాయి.

దేశమంటే ఆర్థికంగా, బలీయంగా ఉండాలన్నదే దీనదయాళ్‌  దృష్టి. అలాంటి స్వదేశీ భావనకు ఆత్మనిర్భర భారత్‌ ప్రతిరూపం. ఆర్థికవ్యవస్థలో స్వతంత్రంగా నిలబడి ముందుకు సాగడం ముఖ్యం అన్నారు దీనదయాళ్‌.

ఆత్మనిర్భర భారత్‌ కూడా అదే ధోరణికి ఆధునిక రూపం.

–       దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం

–       రక్షణ రంగంలో స్వీయ ఉత్పత్తి

–       స్టార్టప్‌లకు మద్దతు

–       దేశీయ తయారీ కంపెనీల అభివృద్ధి

ఇవి భారత ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.

సమాజంలో సమానత్వం ` అంతిమ లక్ష్యం

దీనదయాళ్‌ ఎవరూ వెనుకబడకూడదని చెప్పారు.

నేడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం కూడా అదే.

–        పేదలకు ఇళ్లు

–         మహిళలకు ఆర్థిక స్వావలంబన

–         యువతకు నైపుణ్యాల అభివృద్ధి

–         వ్యాపారం చేయాలని కోరేవారికి ఆర్థిక సహాయం అంటూ ప్రతి వర్గానికి అవకాశాలు అందుతున్నాయి.

దీనదయాళ్‌ ఆలోచనలంటే  ఒక దేశంగా భారత్‌ నిర్మాణానికి స్తంభాలు.

ఆయన చెప్పిన విలువలు, మార్గదర్శకాలు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మరింత బలపడుతున్నాయి.

వ్యక్తి అభివృద్ధి

గ్రామాభివృద్ధి

జాతీయ గౌరవం

స్వీయనిర్భరత ద్వారా నూతన భారతం దిశగా సాగుతోంది జాతి.

ఈ సవిూకరణ దీనదయాళ్‌ కలలకు, ఆశయాలకు నేటి భారతం సవిూపిస్తున్నదని స్పష్టంగా చూపిస్తుంది.

ఏకాత్మ మానవ దర్శనం జాతి ముందుకు వచ్చి సరిగ్గా 60 సంవత్సరాలు. ఈ సందర్భంగా  ఆనాటి స్పూర్తి , మార్గదర్శనం వల్ల సాధిస్తున్న పురోగతి నెమరువేసుకోవలసిన అవసరం ఈ తరానికి ఉంది. తద్వారా జాతి మరింత పురోగ మిస్తుంది. అరమరికలు అధిగమించే ఆస్కారం లభిస్తుంది. కాబట్టి ఆనాటి భావన కళ్లకు కట్టినట్లు నేడు అదేరూపంలో, అదే నేల మీద కార్యక్రమం జరుగు తున్నది. ఈ మహత్తర చారిత్రక ఘట్టంలో అందరూ భాగస్వాములు అవ్వాలన్నదే మా ఆకాంక్ష.

నాగోతు రమేష్‌నాయుడు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఏపీ)

About Author

By editor

Twitter
YOUTUBE