ఆం‌ధప్రదేశ్‌కు వచ్చే రెండేళ్లలో రూ. లక్ష కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను మంజూరు చేస్తామని కేంద్ర రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ. 27 వేల కోట్ల విలువ గల ఆరు కీలక ప్రాజెక్టులకు ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రూ. 2,800 కోట్ల విలువైన కొత్త రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 2,100 కోట్లతో పూర్తయిన రెండు రహదారులను జాతికి అంకితం చేశారు. ఆగస్టు 2న మంగళగిరిలోని సీ కన్వెన్షన్‌ ‌వేదికగా ఈ కార్యక్రమాలు జరిగాయి.

‘ఆంధప్రదేశ్‌ ‌భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలా చేసి చూపుతాం. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆకాంక్షించిన ప్రగతి, వికాసం సాకారమవుతోంది. అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దూరదృష్టితో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల జాబితా విస్తృతమైనది. ప్రతి ప్రాజెక్టునూ ఆమోదిస్తాం. వాటిని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం’ అని కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ చెప్పారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు పూర్తయితే, అవి అమెరికా రోడ్లతో సమానంగా నిలుస్తాయని అన్నారు. రహదారులు, ఓడరేవులు ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, జలమార్గ రవాణా ఖర్చు బస్సు, రైలు కంటే తక్కువని అన్నారు. ఈ రంగాలను ఆంధప్రదేశ్‌ ‌బలోపేతం చేసుకోవాలని సలహా ఇచ్చారు. భవిష్యత్తు ఇథనాల్‌ ‌మరియు హైడ్రోజన్‌లదేనని, డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌వినియోగం తగ్గించి, కాలుష్య రహిత ఇంధనాల వాడకం పెంచితే దేశం అభివృద్ధిలో పోటీపడగలదని గడ్కరీ అభిప్రాయ పడ్డారు. ఏపీలో గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌మిషన్‌ అమలైతే, రైతులకు లక్షల్లో ఆదాయం వస్తుందని, విశాఖ పట్నంలో ఒక ప్రైవేటు కంపెనీకి హైడ్రోజన్‌ ‌ప్రాజెక్టు అప్పగించినట్లు తెలిపారు.

‘అందరికీ నమస్కారం’ అని తెలుగులో ప్రసంగం ప్రారంభిస్తూ, తాను ఎలక్ట్రికల్‌ ‌కారును ప్రారంభించిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘విద్యుత్‌’ ‌వాహనాన్ని ప్రారంభించిన నాడు ‘అది మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏమిట’ని ఒక విలేకరి సందేహం వెలిబుచ్చారు. కానీ ఇప్పుడు కార్లతోపాటు ఎలక్ట్రిక్‌ ‌బస్సులు కూడా రయ్‌రయ్‌మంటూ తిరుగుతున్నాయి’ అన్నారు. రహదారి ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాయకుడు శంకర్‌ ‌మహదేవన్‌ ‌పాడిన పాటతో రూపొందించిన ఓ సంక్లిప్త వీడియోను సమావేశంలో మంత్రి ప్రదర్శించారు.

గడ్కరీ మాట తప్పరు:చంద్రబాబు

నితిన్‌ ‌గడ్కరీ మాట అంటే మాటే అని, చెప్పా రంటే చేసి చూపిస్తారనిము్య•మంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. ఏపీని కూడా మహారాష్ట్ర లాగా చూడాలని గడ్కరుకి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చే కొత్త రహదారి ప్రాజెక్టులకు ఎలాంటి భూ సేకరణ సమస్య రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘మేం ఏది అడిగినా గడ్కరీ ఎప్పుడూ లేదని చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు ఆక్సిజన్‌ ఇచ్చింది ఆయనే. అమరావతికి 189 కిలోమీటర్ల ఔటర్‌రింగ్‌ ‌రోడ్డు ఇచ్చారు. గతంలో రహదారులు నరక ప్రాయంగా ఉండేవి. ఇప్పుడు వాటిని బాగుచేస్తున్నాం. హబ్‌ అం‌డ్‌ ‌స్పోక్‌ ‌మోడల్‌లో రాష్ట్రంలో మరో 20 పోర్టులు రాబోతున్నాయి. మరో 9 ఎయిర్‌పోర్టులు సిద్ధం కావాల్సిఉంది’’ అని చంద్రబాబు వివరించారు. ఉదయం సంక్షేమం కింద రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బు జమచేసి, సాయంత్రం అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను తెచ్చే రహదారి ప్రాజెక్టుల కార్యక్రమంలో పాల్గొన్న ఈ రోజును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. నితిన్‌ ‌గడ్కరీని ఆయన శాలువాతో సత్కరించారు.

కూల్చివేతల… నిర్మాణాలు

గత ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైతే కూటమి ప్రభుత్వం రహదారులను, వ్యవస్థలను పునరుద్ధరిస్తూ ముందుకు వెళుతోందని ఉపముఖ్య మంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రాభివృద్ధి, ఐక్యతకు కూటమి ప్రభుత్వం పునాదులేస్తోందన్నారు. ‘‘కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు బలంగా పనిచేయాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం బలంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. అవి రాష్ట్ర భవిష్యత్‌ను, ఐదు కోట్ల ప్రజల సంక్షేమాన్ని కాపాడతాయి. కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కూటమిని దెబ్బతీసే కుట్రలను ఐక్యంగా ఎదుర్కొనాలి’’ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో ‘అడవితల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తే ఓట్లు వస్తాయా? అన్న కోణంలో తమకు ఆలోచన లేదని, అడవి ప్రాంతాల్లో డోలిమోతలు ఉండకూడదన్నదే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. తాను కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 50 కోట్లు ఇచ్చారని, వాటికి ఉపాధి హామీ కింద వచ్చిన 500 కోట్లు కలిపి ఈ కార్యక్రమం చేపడు తున్నట్లు పవన్‌ ‌కల్యాణ్‌ ‌వెల్లడించారు.

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, అమరావతి ఓఆర్‌ఆర్‌కు 140 మీటర్ల వెడల్పుతో అనుమతి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుబట్టారని తెలిపారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు మాత్రం దేశంలో 120 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఎక్కడా ఓఆర్‌ఆర్‌కు అనుమతులు ఇవ్వలేదని చెప్పారన్నారు. కానీ, ముఖ్యమంత్రి పట్టుదల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న తపనను చూసి కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ వెంటనే మంజూరు చేశారని తెలిపారు. ‘ఇది కేవలం ఒక అనుమతి మాత్రమే కాదు, ఆంధప్రదేశ్‌ అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి గల ప్రత్యేక శ్రద్ధకు, దార్శనికతకు నిదర్శనం. జాతీయ రహదారుల అభివృద్ధికి, వాటి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రగతికి బంగారు బాటలు వేస్తోంది. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా, ఆంధప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు గారి సంకల్పానికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తోంది. గత ఐదేళ్లలో స్తంభించిన అమరావతి నిర్మాణ పనులకు ఇప్పుడు కేంద్రం అండగా నిలవడంతో రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తాం. ఈ ‘డబుల్‌ ఇం‌జిన్‌’ ‌ప్రభుత్వంతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు’ అని అన్నారు.

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా కూటమి నాయకత్వం అహర్ని శలు కృషిచేస్తుంటే, ఇంకోవైపు ‘మా మనుషులను పంపించి మీ ఎమ్మెల్యేలను హత్య చేయిస్తాం’ అనే వికృత నాయకత్వం ఉందని తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు విధ్వంసం, మరోవైపు అభివృద్ధి. తమకు ఏం కావాలో ప్రజలు ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా నిరూపించారు. ‘కేంద్ర ప్రభుత్వ ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌’ ‌వంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని పేదలకు సైతం కార్పొరేట్‌ ‌వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. మంగళగిరిలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్ర వైద్య రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచితే, ఇప్పుడు కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటూ అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. మేము ప్రజల ఆరోగ్యం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే, ప్రతిపక్షం మాత్రం కుట్రలు, విధ్వంసకర రాజకీయాలకే పరిమితమైంది’ అన్నారు.

6 ప్రాజెక్టులు.. రూ.27 వేల కోట్లు!

ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన వెంటనే 6 కీలక హైవే ప్రాజెక్టులను మంజూరు చేస్తూ కేంద్ర నితిన్‌ ‌గడ్కరీ వేదికపైనే ప్రజల సమక్షంలో ప్రకటన చేశారు. అందులో భాగంగా హైదరాబాద్‌- ‌విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరిస్తారు. అందుకోసం రూ. 6,700 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే విజయవాడ- మచిలీపట్నం రహదారిని రూ. 2600 కోట్లతో 6 వరుసలుగా, వినుకొండ-గుంటూరు రహదారిని రూ.2605 కోట్లతో నాలుగు వరుసలుగా చేస్తారు.. గుంటూరు – నిజాం పట్నం రోడ్డును రూ. 2 వేల కోట్లతో నాలుగు వరుసలుగా, రూ.4,200 కోట్లతో బుగ్గకయిప-గిద్దలూరు రహదారిని నాలుగు వరుసలుగా, ఆకివీడు-దిగమర్రు రోడ్డును రూ.25ఏఏ కోట్లతో నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తారు. పెడన-లక్ష్మీపురం రోడ్డును రూ. 4200 కోట్లతో నాలుగు వరుసలుగా, ముద్దునూరు-కడప రోడ్డును రూ 1182 కోట్లతో నాలుగు వరుసలకు విస్తరిస్తారు. ఇవి కాకుండా హైదరాబాద్‌-‌విజయవాడ మధ్య గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌హైవేను కూడా మంజూరు చేశారు. ఏడాదిలో మరో రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టుల మంజూరుకు గడ్కరీ అంగీకారం తెలిపారు. ఆయన సానుకూల ప్రకటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ‌రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యప్రసాద్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ‌కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతులకు ఆర్థిక సాయం

కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఆర్థిక సహాయ కార్యక్రమం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ ‌కింద ఇచ్చే రూ.6 వేల సాయానికి రాష్టప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఏటా రూ.20 వేల నగదును జమ చేస్తుంది. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్‌ ‌సిక్స్ ‌కింద 6 రకాల పథకాల అర్హులకు ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి పార్టీలు పేర్కొన్నాయి. ఇందులో అన్నదాత సుఖీభవ కూడా ఒకటి. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో తొలివిడతగా 46.86 లక్షల మంది రైతులకు సుమారు రూ.3,174.42 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇందుకు సంబంధించిన మెగా చెక్‌ను మహిళా రైతులు నాగలక్ష్మి, షేక్‌ ‌మున్నాలకు అందజేశారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE