ఏప్రిల్‌ 10 ‌శ్రీరామనవమి

ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం.. ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం.. అదే శ్రీమద్రామాయణ గాథ. దాని నాయకుడు రామచంద్రుడు. ఆయన వేదవేద్యుడు, ఆదర్శమూర్తి. ధర్మగుణం, కృతజ్ఞతా భావం ఆభరణాలుగా కలిగిన ఆయనను వాల్మీకి మౌని ‘ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ’, ‘రామో విగ్రహవాన్‌ ‌ధర్మః’ అని అభివర్ణించారు. ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు రాముడు మానవ మాత్రుడిగానే వ్యవహరించారు. ప్రజలే ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి అర్చించారు, యుగయుగాలుగా అర్చిస్తున్నారు.

ప్రాచీన వాఙ్మయం ప్రసాదించిన రాజ్యాంగం లాంటిది శ్రీమద్రామాయణం. వ్యక్తిగా, సమష్టి జీవనానికి, రాజనీతి, రాజ్యపాలనలో వ్యవహరించ వలసిన తీరు, మానవ సంబంధాల సంపుటి ఈ మహాకావ్యం. ఉన్నత ప్రమాణాలతో జీవించదగిన విధానాన్ని రాముడు సహా వివిధ పాత్రల ద్వారా ఆవిష్కరించింది. ‘రామ+అయనం’ అంటే ‘రాముని మార్గం’ అని అర్థం. అంటే, ఎదురైన సమస్యలను రాముడు ఎలా అధిగమించాడో తెలుసుకుని అనుసరించగలిగేదని పెద్దలు చెబుతారు. అంత విశిష్టమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ కావ్యాన్ని మాతృకగా తీసుకొని ఎందరో కవులు వివిధ కోణాలలో ఆవిష్కరించారు. రామచరితంపై ఇన్ని గ్రంథాలు అవసరమా? అన్న సందేహాలకు ‘మరల నిదేల రామాయణం బన్న ఈ ప్రపంచమెల్ల నెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్న దెపుడును, తనరుచి బ్రతుకులు తనవికాన, చేసిన సంసారమే చేయు చున్నది తనదైన అనూభూతి తనదికాన, తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన’ అని ‘రామాయణ కల్పవృక్షం’ కర్త కవి సమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

శ్రీరాముడు అఖండ భరతావనికి నిత్య ఆరాధ్యనీయుడు, ఆదర్శపురుషుడు. త్యాగ, ధర్మాలను బోధించి, ఆచరించి నిరూపించిన మానవోత్తముడు. హరిహర అద్వైత స్వరూపుడు రాముడు. అష్టాక్షరిలోని ప్రాణప్రదమైన ‘రా’, పంచాక్షరిలోని జీవ ప్రధానమైన ‘మ’తో ‘రామ’ శబ్దం ఏర్పడి యుగయుగాలుగా, తరతరాలుగా అలరిస్తోంది. ‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే/వేదః ప్రాచేతసా దాసీత్‌ ‌సాక్షాద్రామాయణాత్మనా’ (‘వేదాలలో తెలియదగిన పరమాత్మ దశరథ తనయుడిగా అవతరించగా, వేదం వాల్మీకి ద్వారా రామాయణంగా అవతరించింది.’ అని) ఆర్య వాక్కు. రామభక్తి, రామభజన, రామస్మరణ ముక్తిప్రదాలన్నారు తులసీదాసు. రామావతారం మానవత్వానికి అత్యంత సన్నిహిత మైనదని, అందుకే ‘రాముని వలె ప్రవర్తించు… రావణుని వలె ప్రవర్తించకు’ అని చెబుతారు. లోకం రాముడిని దేవుడిగా భావించినప్పటికీ ఆయన మానవతీతశక్తులను, మహిమలను, మాయలను ఎక్కడ ప్రదర్శించలేదు. ఉత్తమ మానవుడిగానే మనుగడ సాగించాడు. అందుకే ‘పురుషోత్తముడి’ గా వినుతికెక్కాడు. ఆయన పేరు స్మరించని ఆస్తికులు కాని, ఆయన గుడిలేని పల్లెగాని ఉండదు.

ఆదర్శ రాజనీత్ఞిత

రామాయణం ఒక కాలానికే సంబంధించినది కాదు. అది సార్వకాలిక సత్యం. పాలకులు, పాలితులు అనుసరించవలసిన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఇక్ష్వాక వంశీయులు,అందునా శ్రీరామచంద్రుడు వాటిని ఆచరించి ఆదర్శంగా నిలిచాడు. తల్లి అత్యాశవల్ల తనకు సంక్రమించిన రాజ్యాధికారాన్ని తిరిగి అప్పగించేందుకు అడవికి వచ్చిన తమ్ముడు భరతుడికి నచ్చజెప్పి పాలక, పాలితుల సంబంధాలను గుర్తు చేశాడు. ‘సద్గతి పొందేందుకు తమ శక్తియుక్తులను ధర్మాచరణకు ఉపయోగించాలి. అలాంటి సద్గతి రాజులకు (ఏలికలకు) సుపరిపాలన వల్లే సాధ్యమవుతుంది. ‘పాలకుడు ధర్మబద్ధుడైతే అనుభవంతో పనిలేదు’ అంటూ పాలకులు పాటించవలసిన జాగ్రత్తలను సూచించాడు. పాలకుల శక్తి సామర్థ్యాలు, వారి నడవడిపైనే ప్రజాసంక్షేమం ఆధారపడి ఉంటుంది. ప్రాచీన వాఙ్మయం ప్రసాదించిన రాజ్యాంగం లాంటిది శ్రీమద్రామాయణం. వ్యక్తిగా, సమష్టి జీవనానికి, రాజనీతి, రాజ్యపాలనలో వ్యవహరించ వలసిన తీరు, మానవ సంబంధాల సంపుటి ఈ మహాకావ్యం. ఉన్నత ప్రమాణాలతో జీవించదగిన విధానాన్ని రాముడు సహా వివిధ పాత్రల ద్వారా ఆవిష్కరించింది. ‘రామ+అయనం’ అంటే ‘రాముని మార్గం’ అని అర్థం. అంటే, ఎదురైన సమస్యలను రాముడు ఎలా అధిగమించాడో తెలుసుకుని అనుసరించగలిగేదని పెద్దలు చెబుతారు. అంత విశిష్టమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ కావ్యాన్ని మాతృకగా తీసుకొని ఎందరో కవులు వివిధ కోణాలలో ఆవిష్కరించారు. రామచరితంపై ఇన్ని గ్రంథాలు అవసరమా? అన్న సందేహాలకు ‘మరల నిదేల రామాయణం బన్న ఈ ప్రపంచమెల్ల నెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్న దెపుడును, తనరుచి బ్రతుకులు తనవికాన, చేసిన సంసారమే చేయు చున్నది తనదైన అనూభూతి తనదికాన, తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన’ అని ‘రామాయణ కల్పవృక్షం’ కర్త కవి సమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

శ్రీరాముడు అఖండ భరతావనికి నిత్య ఆరాధ్యనీయుడు, ఆదర్శపురుషుడు. త్యాగ, ధర్మాలను బోధించి, ఆచరించి నిరూపించిన మానవోత్తముడు. హరిహర అద్వైత స్వరూపుడు రాముడు. అష్టాక్షరిలోని ప్రాణప్రదమైన ‘రా’, పంచాక్షరిలోని జీవ ప్రధానమైన ‘మ’తో ‘రామ’ శబ్దం ఏర్పడి యుగయుగాలుగా, తరతరాలుగా అలరిస్తోంది. ‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే/వేదః ప్రాచేతసా దాసీత్‌ ‌సాక్షాద్రామాయణాత్మనా’ (‘వేదాలలో తెలియదగిన పరమాత్మ దశరథ తనయుడిగా అవతరించగా, వేదం వాల్మీకి ద్వారా రామాయణంగా అవతరించింది.’ అని) ఆర్య వాక్కు. రామభక్తి, రామభజన, రామస్మరణ ముక్తిప్రదాలన్నారు తులసీదాసు. రామావతారం మానవత్వానికి అత్యంత సన్నిహిత మైనదని, అందుకే ‘రాముని వలె ప్రవర్తించు… రావణుని వలె ప్రవర్తించకు’ అని చెబుతారు. లోకం రాముడిని దేవుడిగా భావించినప్పటికీ ఆయన మానవతీతశక్తులను, మహిమలను, మాయలను ఎక్కడ ప్రదర్శించలేదు. ఉత్తమ మానవుడిగానే మనుగడ సాగించాడు. అందుకే ‘పురుషోత్తముడి’ గా వినుతికెక్కాడు. ఆయన పేరు స్మరించని ఆస్తికులు కాని, ఆయన గుడిలేని పల్లెగాని ఉండదు.

ఆదర్శ రాజనీత్ఞిత

రామాయణం ఒక కాలానికే సంబంధించినది కాదు. అది సార్వకాలిక సత్యం. పాలకులు, పాలితులు అనుసరించవలసిన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఇక్ష్వాక వంశీయులు,అందునా శ్రీరామచంద్రుడు వాటిని ఆచరించి ఆదర్శంగా నిలిచాడు. తల్లి అత్యాశవల్ల తనకు సంక్రమించిన రాజ్యాధికారాన్ని తిరిగి అప్పగించేందుకు అడవికి వచ్చిన తమ్ముడు భరతుడికి నచ్చజెప్పి పాలక, పాలితుల సంబంధాలను గుర్తు చేశాడు. ‘సద్గతి పొందేందుకు తమ శక్తియుక్తులను ధర్మాచరణకు ఉపయోగించాలి. అలాంటి సద్గతి రాజులకు (ఏలికలకు) సుపరిపాలన వల్లే సాధ్యమవుతుంది. ‘పాలకుడు ధర్మబద్ధుడైతే అనుభవంతో పనిలేదు’ అంటూ పాలకులు పాటించవలసిన జాగ్రత్తలను సూచించాడు. పాలకుల శక్తి సామర్థ్యాలు, వారి నడవడిపైనే ప్రజాసంక్షేమం ఆధారపడి ఉంటుంది. ఏలిక విజ్ఞానవంతుడైతే చాలదని, ధర్మపరుడు కూడా కావాలని రామాయణం చెబుతోంది.

పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చిన రాముడు, ‘ధర్మ, ప్రజాభిమతానికి విరుద్ధమైన అంశాల జోలికి పోలేదు. పాలనారథం సాగడంలో మంత్రులు, అధికారులకు స్వేచ్ఛనిచ్చాడు. జనాభిప్రాయ, జనవాక్య సమీకరణే కాదు వాటిని గౌరవించే సత్‌ ‌సంప్రదాయాన్ని పాదుకొల్పాడు. కీలక అంశాలలో నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజాబాహుళ్యంతో సంప్రదించేవాడట. తన అభిప్రాయాల పట్ల అభ్యంతరాలు ఉంటే నిర్భయంగా వెల్లడించాలని కోరేవాడని రామాయణం చెబుతోంది. చిన్నపాటి పొరపాటుకైనా విమర్శకు అవకాశం ఉండేది. రాచరికంలోనే ఆ వెసులుబాటు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఎంత పరిఢవిల్లాలో ఆలోచించాలి.

పరపురుషుడి చెరలో ఉన్న సతిని తిరిగి ఏలుకున్నాడన్న పామరుడి మాటలను పెడచెవిన పెట్టలేదు. సతీ పరిత్యాగానికి సిద్ధపడి కానలకు పంపాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కర్తవ్య విముఖుడు కాలేదు. ‘జ్ఞానమార్గంలో ఎదురయ్యే విఘ్నాలను అధిగమించగలగాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. ఎవరికీ భయపడవద్దు. ఎవరితోనూ అనవసర శత్రుత్వం వద్దు. మౌనాన్ని పాటిస్తే కలహాలకు ఆస్కారమే ఉండదు. అలాంటి వారికి అంతటా సుఖమే..’ అని రామహితోక్తులని తులసీదాసు (రామ్‌చరిత్‌ ‌మానస్‌) ‌వర్ణించారు. రాముడు, సర్వధర్మ రక్షితుడు. ప్రజాసంక్షేమం, వారి అభీష్టం కోసం నిరంతరం తపించాడు. వేల సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిన రాముడి ధార్మిక నిష్ఠ విశ్వపాలకులకు ఆదర్శనీయం.


అదిగో భదాద్రి…

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలగిరిని దర్శించిన వెంటనే ‘అదివో అల్లదివో శ్రీహరివాసము’ అని కీర్తించినట్లే, భదాద్రిని సమీపించిన కంచర్ల గోపన్న ‘అదిగో భదాద్రి గౌతమి ఇదిగో చూడండి’ అని భక్త్యావేశంతో ఆ ప్రాంత రమణీయతను, దేవదేవుడిని విశిష్టతను స్తుతించారు. దక్షిణ అయోధ్యగా మన్ననలు అందుకుంటున్న భద్రాచలంలో శ్రీరామనవమి నాటి సీతారాముల పరిణయం జగత్కల్యాణంగా భాసిల్లుతోంది. మేరు పర్వత రాజు దంపతుల పుత్రుడు భద్రుడి తపస్సుకు మెచ్చి కొలువుదీరిన రాముడికి దేవర్షి నారదుడు తొలి ఆరాధన చేసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.

16వ శతాబ్దంలో పోకల దమ్మక్క సీతారాముల విగ్రహాలకు తాటాకు పందిరి వేసి, తాటి పండు నైవేద్యంగా అందించింది. ఆమె ఇచ్చిన సమాచారంపై అప్పటి ఆ ప్రాంత (హసనాబాద్‌- ‌పాల్వంచ) తహసీల్దార్‌ ‌కంచర్ల గోపన్న ఆలయాన్ని నిర్మించి రామదాసుగా కీర్తికెక్కారు. పితృ వాత్సల్యంతో ఆయన చేయించిన మంగళ పతకాన్ని కలిపి అమ్మవారికి ధరింపచేయడం ఈ క్షేత్ర ప్రత్యేకత.

చైత్రశుద్ధ నవమి నాడు కల్యాణోత్సవం, మరునాడు పట్టాభిషేకోత్సం నిర్వహిస్తారు. కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భదాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తుంది. ఏటా జరిగే పట్టాభిషేకోత్సవం కాక పన్నెండేళ్లకు ఒకసారి ‘పుష్కర పట్టాభిషేకం’ నిర్వహిస్తారు. ఈ ప్రకారం వచ్చే ఏడాది (2023) ఈ ఉత్సవం జరగవలసి ఉంది. అలాగే అరవై ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం 2047లో జరగవలసి ఉంది (అంతకుముందు, 1987లో నిర్వహించారు).


‘మర్యాద’రాముడు

కొందరిలో దయాగుణం, మరికొందరిలో వీరత్వం, ఇంకొందరిలో జ్ఞానం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఉండవచ్చు. కానీ సత్యం, ధర్మం, దయ, క్షమ, ఓరిమి, వినయం, ఔదార్యం, అభిమానం ఎన్నో సుగుణాల రాశి రామభద్రుడు. అందుకే ఆయన ‘సుగుణాభిరాముడు’గా వినుతికెక్కాడు.

కృత్ఞతాభి రాముడు

ఇతరుల నుంచి వంద అపకారాలు ఎదురైనా పట్టించుకోని శ్రీరాముడు, ఎవరి వల్ల ఏ చిన్న ఉపకారం పొందినా ఎంతో సంతుష్టి చెంది, కృతజ్ఞత చాటేవాడట. సీతాప•హరణంతో దారీతెన్నూ తెలియక ఆరాటపడుతున్న సోదర లక్ష్మణ సమేత రాముడికి శబరి ఆతిథ్యం ఇచ్చి, హనుమ సుగ్రీవుల గురించి చెబుతుంది. ఆ మాట సాయానికే ఆర్ద్రుడైన ఆయన, ‘దిక్కుతోచక పరితపిస్తున్న మాకు దిశానిర్దేశం చేసిన నీవు చల్లని నదీ మతల్లివై మానవళిని తరింపచేస్తావు’ అని వరమిచ్చాడు. అది ఆయనకు గల కృతజ్ఞతా భావానికి నిదర్శనం. సీతాపహరణ సమయంలో రావణుడిని ఎదిరించి నేలకూలిన జటాయువును చూసి దుఃఖంతో చలించిపోయాడు. ‘సీతాపహరణం కంటే జటాయువు నా కోసం మరణించడమే ఎంతో బాధ కలిగిస్తోంది లక్ష్మణా!’ అని విలపించి, ఆ పక్షి పట్ల కృతజ్ఞతా భావంతో అంతిమ సంస్కారం నిర్వహించాడు.

సీతామాత క్షేమ సమాచారాన్ని తెలిపిన హనుమతో ‘నీవు నాకు గొప్ప మేలు చేశావు. నీవు చేసిన సహాయానికి నేను ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలను? అయినా నా సర్వస్వం అనదగిన గాఢాలింగనాన్ని అందిస్తున్నాను, స్వీకరించు’ (‘ఏష సర్వస్వభూతో మే పరిష్వంగో హనూమతః) అంటూ హనుమను ఆలింగనం చేసుకున్నాడు. తన ప్రాణం కంటే సీతే ముఖ్యం అనుకునే సీతావల్లభుడు, ఈ సందర్బంలో ‘సీత కంటే ఆమె జాడ గురించి ప్రయత్నించిన సుగ్రీవుడే ముఖ్యం’ అంటాడు. స్నేహధర్మానికి, కృతజ్ఞతకు ఆయన ఇచ్చిన విలువ అది.


ఒంటిమిట్ట రామన్న  బ్రహ్మోత్సవాలు

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ రామాలయాలు ఉన్నా ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో భదాద్రి రాముడి కల్యాణమే ప్రామాణికంగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత (2014) ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో కల్యాణోత్సవాలను అధికారికంగా (2015) నిర్వహించింది. ఆ తరువాత ఆ బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వమూ స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తుంది. రాష్ట్రరాష్ట్రేతర ప్రాంతాల భక్తులు గోటితో ఒలిచిన అక్షతలు తెచ్చి సమర్పిస్తారు. తిరుమలేశుని తరహాలో ఒంటిమిట్ట రామయ్యకు బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవం మరునాడు (పౌర్ణమి) రామయ్య తిరువీధులలో తేరుపై దర్శనమిస్తాడు. పుష్పయాగంతో ఈ ఉత్సవాలు పరిసమాప్త మవుతాయి.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు చైత్రశుద్ధ నవమి (10.4.2022) నాడు ప్రారంభమవుతాయి. చతుర్దశి నాడు స్వామి వారికి కల్యాణోత్సం నిర్వహిస్తారు. త్రేతాయుగంలో అమ్మవారి (సీతమ్మ) జన్మనక్షత్రాన్ని (ఉత్తర ఫల్గుని) బట్టి జరిగిన సీతారాముల కల్యాణం సంప్రదాయాన్నే ఇక్కడ పాటిస్తున్నారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులలో ఒకరు విద్యారణ్య మహర్షి ఇలా బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేశారు. జాంబవంతుడు తపస్సు చేసిన తిప్పకు ఎదురుగా ఉన్న ‘మిట్ట’పై నుంచి శ్రీరాముడు దర్శనమిచ్చాడని, అదే నేటి కోదండ రామాలయమని, రామచంద్రుడు వనవాస సమయంలో కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించారని స్థలపురాణం. 14వ శతాబ్దంలో బుక్కరాయల సోదరుడు కంపరాయలు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకొని ఒంటడు, మిట్టడు అనే బోయనాయకులకు ఆ బాధ్యతలు అప్పగించారని చరిత్ర చెబుతోంది. రామ జయంతితో పాటు పోతన జయంతి నిర్వహించడం ఇక్కడ మరో ప్రత్యేకత.

‘యదుపురి’రామన్నకు రాత్రి కల్యాణం

గొల్లపల్లి (కృష్ణా జిల్లా)గా పిలిచే నాటి ‘యదుపురి’ లోని శ్రీరఘునాథ స్వామి కల్యాణం చైత్ర శుద్ధ ద్వాదశి నాడు, అదీ రాత్రి వేళ జరగడం విశేషం. ‘చారిత్రక ఆధారాలను బట్టి నూజివీడు సంస్థానం ఆవిర్భావానికి పూర్వం గొల్లపల్లి ఆ జమీందారులకు పాలనా కేంద్రంగా ఉండేది. నేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బూర్గంపహాడ్‌, ‌పాల్వంచ తదితర పరగణాలు వారి ఏలుబడిలో ఉండేవి. పరగణాల పంపకంలో భద్రాచలం దయాదుల పరంకాగా అక్కడ స్వామివారి కల్యాణం నవమి రోజు జరిపితే.. గొల్లపల్లి స్వామి కల్యాణాన్ని ఆ తర్వాతి మూడవ నాడు (ద్వాదశి) నిర్వహించడం ప్రారంభిం చారు. తానీషా తదితర గోల్కొండ ప్రభువులు భదాద్రికి పంపే ముత్యాల తలంబ్రాలలో కొన్నిటిని తెచ్చి ఇక్కడి కల్యాణోత్సవంలో స్వామికి సమర్పించే వారు’ అని ఆలయ వంశపారంపర్య స్థానాచార్యులు డాక్టర్‌ ఎస్‌.‌టి.పి. శ్రీవేంకటేశ్వర్లు వివరించారు. బ్రహ్మాండ పురాణంలో యదుపుర క్షేత్ర మహాత్మ్యం ప్రస్తావన ఉంది. కలియుగంలో యదువు అనే యాదవ ప్రముఖుడి పేరుతో స్వామి వెలసినందున యదుపురిగా ప్రసిద్ధమైంది. విష్ణ్వాలయాల ధ్వజస్తంభంపై చక్రం ఉండడం సాధారణం కాగా, గొల్లపల్లిలో గరుడపీఠం దర్శనమిస్తుంది. గర్భాలయంలో స్వామి వారూ ‘గరుడపీఠం’పైనే కొలువుదీరారు.


రామరాజ్యం అంటే!

శ్రీరాముని దర్శింపని వాడును, ఆయన దృ్ట••కి• రానివాడును తనను తాను దురదృష్టవంతుడిగా భావించుకుంటూ, నిందించుకుంటాడు. (యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి। నిందితస్స జనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే।।) శ్రీరాము•ని ప్రజాభిమానం, ఆయన పట్ల ప్రజానీకానికి గల ఆదరాభిమానాలకు ఇదొక చక్కటి నిదర్శనంగా చెబుతారు. సత్యవాక్పరిపాలన, ధర్మనిష్ఠ, ప్రేమ, సత్యం, స్వచ్ఛత, సుపరిపాలన, పితృభక్తి, ఏకపత్నీ వ్రతానికి పరాకాష్ఠ. మాట ఇచ్చి మడమ తిప్పక పోవడం ఆయన నైజం. రామరాజ్యం గురించి వాల్మీకి మహర్షి వర్ణించిన ప్రకారం.. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాల భయం లేదు. ప్రతి ఒక్కరికి గౌరవనీయ బ్రతుకుతెరువు ఉన్నందున అక్రమ మార్గంలో ఆర్జనకు తావుండేది కాదు. రాజు ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం వలన నిత్యారోగ్యం వర్థిల్లేది. పెద్దలు సజీవులుగా ఉండగా పిన్నలు కాలం చేసేవారు కాదు. శోక రహితులై, ఆరోగ్య భోగ భాగ్యాలతో జీవించేవారు. సదాచారం వల్లనే ఆయువు, సంపద లభిస్తాయి. సదాచారులు, ఈర్ష్యాక్రోధ రహితులు, నిష్కపటులు, జీవకారుణ్యం కలవారు, గురుబోధనలను అనుసరించేవారికి అకాల మరణం సంభవించదని వ్యాసభగవానుడు భీష్ముడి నోట ధర్మజునికి చెప్పించిన మాటలు ‘రామ రాజ్యం’లో కీలకాంశాలుగా పేర్కొంటారు.

పదకొండు వేల సంవత్సరాల పాలన తరువాత అవతార పరిసమాప్తి సమయాన్ని గ్రహించిన రాముడు.. తనయులు లవకుశులకు పట్టం కట్టే విషయంలో తండ్రి దశరథుడి మార్గాన్నే అవలంబిం చాడు. సభను సమావేశపరచి, ‘నన్ను అనుమతిస్తే లవకుశులకు రాజ్యం అప్పగించి దేహత్యాగం చేస్తాను’ అని పౌరులను అర్థించాడు. వాస్తవానికి ‘వారసత్వ’ సంప్రదాయంలో అలాంటి లాంఛన పక్రియలు అవసరంలేదు. కానీ ధర్మమూర్తి నడవడి అది. నేటి రాజకీయ, పాలనా వ్యవస్థలను చూస్తున్న వారికి అవన్నీ కథలుగానూ, వింతగానూ అనిపించవచ్చు. ఎందరో రాజులు ఎన్నో రాజ్యాలు ఏలినప్పటికీ లోకంలో ‘రామరాజ్యం’ నానుడే యుగయుగాలుగా స్థిరపడిపోయింది. ఏ యుగానికైనా, ఏ జగానికైనా అదే ఆదర్శంగా నిలిచింది. సుపరిపాలనకు ‘రామరాజ్యా’న్ని ప్రతీకగా చెబుతారు.

అంతటా శ్రీరాముడే..

శ్రీరాముడు ఉత్తరాదిన జన్మించాడు కనుక ఔత్తరాహులు శ్రీరామనవమి నాడు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటారు. కల్యాణానంతరం దక్షిణాపథానికి వచ్చాడు కనుక ఈ ప్రాంతీయులు శ్రీరామజనన వేడుకలతో పాటు సీతారామ కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు మిట్ట మధ్యాహ్నం (12 గంటలకు) అవతరించి నట్లు భావించి మహా రాష్ట్రులు ఆయన విగ్రహాన్ని ఊయలలో ఉంచి జోలపాడతారు. శొంఠిపొడి, పంచదార మిశ్రమాన్ని ప్రసాదంగా వితరణ చేస్తారు. ‘శ్రీఖండపూరి’ అనే వంటకాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్తర భారతంలోని వివిధ ప్రాంతాలలో శ్రీరామ నవమి నుంచి వసంత నవరాత్రి వరకు ఉత్సవాలు నిర్వహిస్తూ, ‘రామాయణ కథాగానం’ చేస్తారు.

తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి వేడుకల తీరును ప్రత్యేకించి ప్రస్తావించనవసరం లేదు. తెలుగు ప్రజా సీతారాములను ఎంతగా సొంతం చేసుకుందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వనవాసం సందర్భంగా ఆ దంపతులు ఒక ప్రాంతానికి చేరినప్పుడు ఈ ఊరిపేరు ఏమిటి? అన్న సీతమ్మ ప్రశ్నకు ‘సఖీ నేటిపల్లె’ (అంటే, ఈ రోజు ఇక్కడే బస) అన్నాడట రాముడు. అదే తూర్పుగోదావరి జిల్లాలోని ‘సఖినేటిపల్లి’ అంటూ మురిపెంగా చెప్పుకుంటారు. రావణుడిని ఎదిరించి నేలకూలిన జటాయువును చేరిన రాముడు ‘లే పక్షి!’ అని పిలిచాడట. అదే అనంతపురం జిల్లాలోని ‘లేపాక్షి’ అని గాథ ప్రచారంలో ఉంది. ఇక భద్రాచలంలోని పర్ణశాల ప్రాంతంలో సీతమ్మకు సంబంధించిన ఆనవాళ్ల గురించి చెప్పుకోవడం తెలిసిందే.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ।

దేవ్యైచ తస్మై జనకాత్మజాయైః ।।

About Author

By editor

Twitter
Instagram