కొరివి దయ్య

– అన్నాప్రగడ శివరామ ప్రసాద్‌

‘‌రాజు గాడిటికి వెళ్లొస్తా నమ్మా. కాస్త ఆలస్య కావచ్చు..’ వంటిట్లోచి ముదు గదిలోకి వస్తూ తల్లి సీతమ్మతో చెప్పాడు సోమయాజులు. ‘ఇత రాత్రి పూట వెళ్లడం అవసరమా!’ ఆమె గొతులో భయం, సందేహం ధ్వనిచాయి.

‘సైన్సు రికార్డు పూర్తి చేయాలంటే స్కెచ్‌ ‌పెన్నులు కావాలి. అవేమో నా దగ్గర లేవు.. ‘రాత్రికి సైన్సు రికార్డు తీసుకుని మా ఇటికి రా. నా స్కెచ్‌ ‌పెన్నులు వాడుకో. ఇద్దరం ఈ రాత్రికే పని పూర్తి చేసుకుదా’ అన్నాడు రాజు. అదుకే వెళ్తున్నా’ అన్నాడు సోము.

‘సరే. జాగ్రత్త. పురుగూ పుట్రా చూసి నడువు’ అన్నదామె. సైన్సు రికార్డు చేతపుచ్చుకుని సోము బయటికి వచ్చాడు.

సోము, రాజు అనే డేవిడ్‌ ‌రాజు మంచి స్నేహితులు. ఇద్దరూ పాలెలోని జిల్లాపరిషత్‌ ‌హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. ఈ రోజు ఉదయం నుడి సోము మనసంతా ఆదోళనగా ఉది. రాజు ఏ చేస్తాడో అని ఆత్రుతగా ఉది.

రాజు తండ్రి పాస్టరు. రాజు వాళ్ల డాబా ఇల్లు, పెకుడు భవంతిలో చర్చి, పక్క పక్కనే ఒకే కాపౌడులో ఉటాయి. సోము వెళ్లేసరికి చర్చి, రాజు వాళ్ల ఇల్లు అతా నిశ్శబ్దగా ఉన్నాయి. రాజు వాళ్ల అమ్మకు ఆరోగ్య సరిగా లేక ఐదారు నెలలుగా పట్నలోని వాళ్ల డాక్టరు తమ్ముడిట్లో ఉటోది. రాజు వాళ్ల నాన్న చుట్టు ప్రక్కల ఊళ్లలో ప్రార్థనలు చేయిచడానికి వెళ్లి వస్తుటాడు. ఆయన కూడా ఊళ్లో లేనట్లుది. రాజు గదిలో మాత్రమే లైటు వెలుగుతోది. రాజు కూడా భోజనం చేసి తన గదిలో సోము కోసం ఎదురు చూస్తున్నాడు. సోమును చూడగానే ‘రా రా నీ కోసమే చూస్తున్నా. ఇవిగో స్కెచ్‌ ‌పెన్స్. ‌నువ్వు నీ సైన్సు రికార్డు పని చేసుకో’ అన్నాడు రాజు.

‘రికార్డు పని సరే. షావుకారు సత్తెకు బుద్ధి చెపుదా అన్నావు కదా. ఏ చేశావు?’ అన్నాడు సోము.

‘ఔను కదూ! ఏమన్నాడురా నిన్ను!’ తల పంకిస్తూ అన్నాడు రాజు.

‘‘అవధానులుగారి దగ్గర మంత్రాలు నేర్చుకుని పౌరోహిత్య చూసుకోక నీకెదుకురా ఈ దండగమారి చదువులు! మీ అమ్మతో ఎన్నాళ్లు విస్తళ్లు కుట్టిస్తావు?’ అని చాలా చాలా అన్నాడ్రా’ బాధతో అన్నాడు సోము.

‘సరే. వాడి పని పట్టే సంగతి నాకొదిలేయ్‌. ‌నువ్వు నీ రికార్డు పని చూసుకో. నేను ఈలోపు దయ్యాన్ని తయారు చేస్తా’ అన్నాడు రాజు.

‘దయ్యాలు ఉన్నాయా లేవా అని జనం గొడవపడుతుటే నువ్వు దయ్యాన్ని తయారు చేస్తానంటావేట్రా!’ అన్నాడు సోము.

‘దయ్యాలు ఉన్నాయా, లేవా అన్నది కాదు. ఇప్పుడు మనకు దయ్య అవసరం. దయ్య అటే ఏమిటి? భయమే దయ్య. సత్తెకు భయం కలిగిచాలంటే మనకో పరికరం కావాలి. ఆ పరికరమే దయ్య. దాన్ని నేనిప్పుడు తయారు చేస్తా’ అని గోడ బీరువా తెరిచి ఒక్కో వస్తువును తీసి బల్లమీద పెడుతూ వివరిచాడు రాజు. స్కెచ్‌ ‌పెన్నులతో తన సైన్సు రికార్డు పని చేసుకుటూనే రాజు ఏచేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో ఓ కంట కనిపెట్ట సాగాడు సోము.

రాజు ఇట్లోకి వెళ్లి కాసిని నీళ్లు తెచ్చాడు. ప్లాస్టిక్‌ ‌మగ్గుతో కొన్ని నీళ్లు స్టీలు బేసినులో పోశాడు. కొచె గాస్టిక్‌ ‌సోడా తీసుకుని ఖాళీ సెలైన్‌ ‌సీసాలో వేసి దాన్లో కాసిని నీళ్లు పోశాడు. అది నీళ్లలో కరిగిది. కొన్ని అల్యూమినియం ముక్కలు తీసి అదే సీసాలో వేశాడు. బుస బుస అటుటే ఒక్క క్షణం అలా దాన్ని పొగనిచ్చి సైకిలు ట్యూబు ముక్క ఒక కొనను కొచె సాగ దీసి సెలైను సీసా మూతికి తగిలిచాడు. ట్యూబు రెడో కొనను బేసినులోని నీళ్లలో పెట్టాడు. బుడ బుడ శబ్ద చేస్తూ నీళ్లలో గాలి బుడగలు వస్తున్నాయి. సక్సెస్‌. అని గర్వగా సోము కేసి చూశాడు. నిరోధ్‌ ‌మూతిని తెరచి సైకిల్‌ ‌ట్యూబు రెడో కొనకు తగిలిచాడు. చూస్తుడగానే నిరోధ్‌ ఉబ్బి బూరలా తయారు కాసాగిది. అది కావలసినంత సైజుకు వచ్చాక రాజు తృప్తిగా తలాడిస్తూ ‘ఆ దారంతో దీని మూతి కట్టరా’ అన్నాడు. దారపు ఉడ తీసుకుని నిరోధ్‌ ‌బూర మూతి బిగిచాడు సోము. దాన్ని సైకిలు ట్యూబు నుడి వేరు చేయగానే అది మామూలు బూరలా తయారైది. ‘ఇదంతా నీకు ఎలా తెలుసురా’ అడిగాడు సోము.

‘మా మామ కొడుకు ఆనంద్‌ ‌డిగ్రీ ఫస్టియర్‌ ‌చదువుతున్నాడు. వాడు నేర్పాడు.’ మాట్లాడుతూడ గానే రెడో బూర కూడా తయారైది. దాన్ని కూడా దారంతో కట్టి, టేబుల్‌ ‌కాలికి తగిలిచాక సామాన్లన్నీ తీసి చకచకా సర్దేశాడు. గోడ బీరువాలోచి ఓ కొత్త వస్తువు తీశాడు. అది పాడయిపోయిన పాత అలారం టైపీసులోని రేడియం డయల్‌. ‌దాన్లోచి నాలుగు రేడియం ముక్కలను కత్తిరిచి వాటికి గమ్‌ ‌రాసి బూరలకు అటిచాడు. వెలుతురులో అవి మెరుస్తున్నాయి. వాటి చుట్టూ ఎర్రస్కెచ్‌ ‌పెన్నుతో బార్డరు గీస్తే అవి భీకరంగా కనిపిస్తున్నాయి. రాజు కూచునే కుర్చీకి దారంతో ఒకదాన్ని కట్టేశాడు.

‘లైటు ఆర్పుతా. వరండాలో మసక మసక వెలుతుర్లో నిలబడి దీన్ని చూసి ఎలా ఉదో చెప్పు పో!’ అని లైటు తీసేశాడు రాజు.

గదిలోచి బయటికి వచ్చిన సోము వరండాలో నిలబడి రాజు గదిలోకి చూశాడు. మెరుస్తూన్న రేడియం ముక్కలు రెడు కనుగుడ్లను తలపిస్తున్నాయి. మళ్లీ గదిలోకి వచ్చాడు.

‘ఎలా ఉదిరా!’

‘అకస్మాత్తుగా చూస్తే భయమేస్తుది.’

‘ఇదే మన దయ్య. దీతో ఏ చేస్తానో చూస్తుడు. నీ నోట్సు కూడా తీసుకుని పద.’ అన్నాడు రాజు. సరే అని సోము బయటికి వచ్చాడు. ఒక దయ్యాన్ని చేత పుచ్చుకుని రాజు కూడా అతని వెనకే బయటికి వచ్చాడు. ఇటి తలుపులు మూసి ‘ఇహ పద’ అన్నాడు.

‘ఆ రెడోది ఎదుకురా!’

‘రంగంలోకి దిగాక ఒకటి ఫెయిలైతే వెటనే ప్రయోగిచడానికి రెడోది రెడీగా ఉడాలి. పద’ అన్నాడు రాజు.

కాపౌడు దాటి బయటికి వచ్చాక ముదు రాజు, వెనక సోము. ఇద్దరూ మెల్లిగా షావుకారు సత్తె ఇటి పరిసరాల్లోకి చేరుకున్నారు. ఏ చేయాలో, ఎలా చేయాలో దారిలో వివరిచాడు రాజు.

 టైము రాత్రి పది కావొస్తూది. ఊరంతా మాటు మణిగినట్లుది. సత్తె ఇటి ముదు చెక్క గేటు తెరిచే ఉది. ఇట్లో లైటు వెలుగుతోది. రాజు తన చేతిలోని దయ్యాన్ని చెక్క గేటుపై కమ్మీకి కట్టేశాడు. ఆ తరువాత ఇద్దరూ లోపలికి వెళ్లారు.

‘సత్తె గారూ, సత్తె గారూ..’ కటకటాల మీద చేత్తో తడుతూ కేకేశాడు రాజు. ‘ఎవరూ?’ అనుకుటూ లోపలి తలుపు తీసుకుని వసారాలోని దుకాణంలోకి వచ్చిన షావుకారు సత్తె అక్కడే ఆగిపోయాడు. బయట చెక్క గేటు మీద తారట్లాడు తున్న దయ్య అతని కంట పడిది. ఇట్లోచి వస్తూన్న మసక మసక వెలుతురులో దాని రెడు కళ్లూ మెరుస్తున్నాయి. సత్తెకు భయంతో నాలుక పిడచకట్టుకపోతున్నది. ‘సత్తె గారూ’ అని మనిషి పిలిచినట్లే వినపడిది. కటకటాలను తట్టిన చప్పుడు కూడా వినపడిది. సర్వ శక్తులనూ కూడ దీసుకుని ‘ఎవరూ?’ అన్నాడు.

‘నేనండీ రాజును’ అన్నాడు రాజు.

రాజు. పాస్టరు గారి అబ్బాయి. తెలిసిన మనిషే. ఫరవాలేదు అనుకుని భారంగా అడుగులో అడుగేసు కుటా కటకటాల దాకా వచ్చాడు. కటకటాల తలుపు తెరవకుడానే చూశాడు. రాజు, వాడి పక్కన సోమయాజులు.

ఇద్దరూ ఇత రాత్రివేళ ఎదుకొచ్చారు, వీళ్ల వెనక గేటు దగ్గర దయ్య ఉన్నట్లు వీళ్లకు తెలుసా, తెలీదా! వీళ్లు, దయ్య ఇద్దరిలో ముదొచ్చిదెవరు, పిలిచిదెవరు సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు సత్తె. ‘ఏరా వచ్చి ఎత సేపయిది, ఎన్ని సార్లు పిలిచావు?’ ప్రాణాలు ఉగ్గ బట్టుకుని అడిగాడు.

తమ దయ్యాన్ని సత్తె చూశాడని, చూసి భయపడుతున్నాడని రాజు గ్రహిచాడు.

‘నేను ఇప్పుడే వచ్చానండి. దుకాణంలో లైటు లేదే, పడుకున్నారా ఏమిటి అనుకుటూ వస్తున్నా. ఇతలో మీరు తలుపు తీశారు. హమ్మయ్య నేను పిలవకుడానే వచ్చారు గదా అనుకుటున్నా. మీరే ఎవరు అని అడిగారు. నన్ను చూశారేమో అనుకున్నా. ఎన్నిసార్లు పిలిచావని అడుగుతారేమిటి? నేనసలు పిలవనే లేదే అన్నాడు’ రాజు.

అయితే ఇదాక పిలిచిది, కటకటాల మీద తట్టి చప్పుడు చేసిది ఎవరు? సత్తె భయం రెట్టిపు అయిది. ఏరా మీకు దయ్యాలంటే భయమేనా, గంభీరతను తెచ్చి పెట్టుకుని అన్నాడు సత్తె.

‘బైబిల్‌ అన్నా, ఏసు ప్రభువు అన్నా దయ్యాలకు హడల్‌. అ‌దుకే నేనెప్పుడూ చిన్న పాకెట్‌ ‌బైబిల్‌ ‌జేబులో పెట్టుకుటా’ అని తన లాగు జేబులోనుడి చిన్న బైబిల్‌ ‌తీసి చూపాడు రాజు.

‘హమ్మయ్య. దేవుడు పంపినట్లు మీరు నా కోసమే వచ్చార్రా. కదలకుడా అక్కడే నిలబడి వెనక్కి తిరిగి చెక్క గేటు మీద ఏముదో చూడండి’ అన్నాడు సత్తె.

ఇద్దరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మళ్లీ సత్తె కేసి చూశారు.

‘ఏ కనపడిదిరా?’

‘అక్కడ కొరివి దయ్య ఆడుతోదడీ’ అన్నాడు రాజు.

‘నీకు పున్నెముటుది. నీ బైబిల్‌తో దాన్ని తరిమేయరా’ ప్రాధేయ పూర్వకంగా అన్నాడు సత్తె.

‘మామూలు దయ్యాలైతే బైబిల్‌కు భయపడి పోతాయి. కానీ కొరివి దయ్యాలు వాటికి కావల్సిది ఇస్తే గాని పోవండీ.’

‘ఏ కావాలిరా వాటికి?’

‘దొరలు తాగే స్పెన్సరు చుట్టల్లాటి ఖరీదైనవి లేదా గోల్డ్‌ఫ్లేక్‌ ‌కిగ్స్‌లాటి సిగరెట్లు. హైక్లాస్‌ ‌సిగిరెట్లు మీ దగ్గర దొరుకుతాయి కనుకే మీ ఇటికి వచ్చిదది. గోల్డ్‌ఫ్లేక్‌ ‌కిగ్స్ ‌ప్యాకెట్‌ ఒకటి, ఓ అగ్గి పెట్టి ఇచ్చి పంపండి.’

‘బాబ్బాబు సిగరెట్టు పెట్టి, అగ్గి పెట్టి నీకిస్తా పట్టుకెళ్లి దానికిచ్చి సాగనంపు నాయనా నీకు పుణ్య ఉటుది.’ దీనంగా అన్నాడు సత్తె.

‘సరే అలాగే. ఇవ్వడి. తప్పుతుదా’ అని రాజు అనగానే సిగరెట్టు పెట్టి, అగ్గి పెట్టి తెచ్చి రాజు చేతికిచ్చాడు సత్తె.

సిగరెట్టు పెట్టి తెరిచి ఓ సిగరెట్టు తీసి నోట్లో పెట్టుకుని ముట్టిచాడు రాజు. ‘నాకు అసలు సిగరెట్లు అలవాటు లేదు. కొరివి దయ్యాన్ని నమ్మిచాలి గనుక మీ కోసం తాగుతున్నా. మనం తాగుతూ ఇస్తేనే నమ్ముతాయి’ అన్నాడు రాజు. ‘కానివ్వు నాయనా.. దాన్ని సాగనంపు’ అన్నాడు సత్తె.

అలాగే నండి. పదరా సోమూ అటూ రాజు ముదు కదిలితే సోము అతన్ని అనుసరిచాడు. ఇద్దరూ చెక్క గేటుదగ్గరికి వచ్చారు. తన నోట్లో కాలుతున్న సిగరెట్టు తీసి, దయ్యాన్ని గేటుకు కట్టేసిన దారం మొదట్లో అటిచాడు రాజు. దారం కాలి తెగిపోవడంతో బెలూన్‌ ‌గాలిలోకి తేలుతూ వెళ్లిపో యిది. వెళ్లొస్తామండీ అని రాజు చేయి ఊపాడు. గేటు మీద దయ్య ఎగిరి పోవడం చూసి సత్తె తృప్తిగా ఇట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.

‘పద. నిన్ను మీ ఇటి దగ్గర దిపి నేను మన సైన్సు మాస్టారిటికి వెళ్లి ఆయన మేలుకునుటే కాసేపు ఆయనతో మాట్లాడి ఇటికి పోతా’ అని సోము వాళ్లిటి మలుపు రాగానే బై చెప్పి రాజు ముదుకు కదిలాడు. సైన్సు మేష్టారిటికి వెళ్తే ఇట్లో లైటు వెలుగుతోది. హుషారుగా వెళ్లి మాష్టారూ! అని పిలుస్తూ తలుపు తట్టాడు. వసారాలో లైటు వెలిగిది. ఆ వెటనే ఎవరూ అటూ తలుపు తెరుచుకుని సైన్సు మేష్టారు వచ్చారు.

చేతిలో ఉన్న సిగరెట్టు పెట్టి, అగ్గి పెట్టి ఆయనకిచ్చి నమస్కారం చేశాడు రాజు. ఏమిటిది, ఎక్కడివి, ఎదుకు? అన్నారాయన. ముసి ముసి నవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు రాజు.

‘ఫర్లేదు చెప్పరా!’ ధైర్య చెప్పారాయన. చేతులు నలుపుకుటూ, షావుకారు సత్తె సోమును అవమానిచి బాధ పెట్టిన దగ్గర నుడి జరిగిది మొత్త టకటకా చెప్పేశాడు రాజు. అతా విని పకాపకా నవ్వి ‘మంచి పనే చేశావు కానీ నువ్వు చేసిన పని వల్ల మూఢనమ్మకం బలపడి పోవడం లేదూ! ఇలాటి వాటిని కొటె పనులు అటారు. వికటిస్తే విపరీత పరిణామాలకు దారితీస్తాయి. పద. అనునయంగా అటూ ఇటి ముగిట్లోకి నడిపాడు. ఖాళీ స్థలంలోకి వస్తూడగా ఠప్పుమని శబ్ద చేస్తూ, భగ్గున మండిపోతూ వాళ్ల ముదు రాలిది బెలూన్‌. ‘‌నీ దయ్య నీతోనే వచ్చినట్లుదే’ నవ్వుతూ రాజును సాగనంపి ఇట్లోకి వెళ్లారు మేష్టారు. ఇంటికి వచ్చిన సోము తృప్తిగా నిద్రకు ఉపక్రమిచాడు. రోజుటి కన్నా ఆలస్యగా పడుకోవడంతో బాగా తెల్లారినా సోము ఈ రోజు నిద్ర లేవలేదు. బిడ్డ రాత్రి ఆలస్యగా పడుకున్నాడని తెలుసు కనుక రోజూ మాదిరే పెదలాడే సోమును నిద్రలేపే ప్రయత్న తల్లి చేయలేదు. సూర్యోదయానికి కాస్త ముదే నిద్రలేచిన ఆమె ఇటి పని చేసుకుటూ మధ్యమధ్యలో వీధిలోకి వెళ్లి వస్తూన్నది. అలా వెళ్లి వస్తూడగా పిడుగు లాటి వార్త ఆమె చెవిన పడ్డది. వెటనే సోమును నిద్రలేపిది. చెబుతో కాసిని నీళ్లిచ్చి ముఖం కడిగిచిది. తల్లి ముఖంలో ఆదోళన గమనిచిన సోము ‘ఏమైదమ్మా!’ అన్నాడు. ఒక్కసారిగా చెపితే పిల్లాడు భయపడతాడనే సందేహంతో నెమ్మదిగా కథలా మొదలు పెట్టిది.

‘రాజు వాళ్ల నాన్న ప్రార్థనలు చేయిచడానికి, దయ్యాలు వొదిలిచడానికి చుట్టు పక్కల ఊళ్లకు కూడ వెళ్లి వస్తుటాడు తెలుసా!’

 ‘ఆ! తెలుసు’ అన్నాడు సోము.

‘రాత్రి నువ్వొచ్చి పడుకున్న కాసేపటికి బస్సు హారను వినపడ్డది. పాలెపోయే లాస్ట్ ‌బస్సు వచ్చిది అనుకున్నా. సరిగ్గా ఆ సమయానికే రాజు వాళ్ల నాన్న, అతని సహాయకుడు ఆదాము ఇద్దరూ కలిసి సైకిళ్ల మీద వేరే ఊరెళ్లి తిరిగి ఇటికి వచ్చారట. రాజు వాళ్ల నాన్న వరండాలోకి వెళ్లి రాజు గది తలుపు తోసి చూస్తూనే భయంతో ‘వామ్మో ఆదామూ బాబు గదిలోకి దయ్య దూరిది. ప్రభువా!’ అటూ వరండాలో కుప్పకూలి పోయాట్ట. ఆదాము తన సైకిలు అలాగే వొదిలేసి, తన చేసంచిలోని మంచినీళ్ల సీసా తీసుకుని వరండాలోకి వెళ్లి పడిపోయిన పాస్టరుగారి ముఖాన నీళ్లు చల్లి లేపి కూర్చోపెట్టి ప్రభువా ప్రభువా అని ఏసు నామస్మరణ చేస్తుడగా రాజు వచ్చాట్ట. వాళ్ల నాన్న అలా పడిపోయి ఉడడం చూసి ‘ఏమైది అకుల్‌?’ అని ఆదామును అడిగాట్ట. ‘నీ గదిలోకి దయ్య దూరిది బాబూ. దాన్ని చూసి నాన్న భయంతో ఇలా పడిపోయారు.’ అన్నాట్ట. రాజు ఏమాత్రం తొణుకు బెణుకు లేకుడా ఓ అదా! చుట్ట, బీడి, సిగరెట్‌ ఏదో ఒకటి కాల్చి ఇమ్మని ఆదామును అడిగాట్ట. అతను అలాగే ఇచ్చి జాగ్రత్త బాబూ దయ్యాలతో చెలగాటం మంచిది కాదని అటూ ఈ అబ్బాయి ఏ చేస్తాడా అని చూస్తూ కూచున్నాట్ట. ఆదాము కాల్చి ఇచ్చిన సిగరెట్టు తీసుకుని రాజు వరండాలోని తన గదిలోకి వెళ్లాట్ట. అతను వెళ్లిన కొద్ది క్షణాలకే గదిలో ఠప్పని చప్పుడు, పెద్ద వెలుగు వచ్చాయట. రాజు తాపీగా బయటికి వచ్చి ‘దయ్య కాలి భస్మమై పోయిది. లేవండి అకుల్‌.. ‌డాడీని ఇట్లోకి చేర్చి మంచం మీద పడుకోబెడదా’ అని ఎతోధైర్యగా అన్నాట్ట. కాసేపు సపర్యలు చేశాక ఆయన తెలివిలోకి వచ్చినా భయం తగ్గలేదట. దాతో ఆదామే అత రాత్రి వేళ మన ఆజనేయ స్వామి గుడి పూజారిని లేపి విషయం చెపితే ఆయన అక్షతలు, కుకుమ మంత్రిచి, తమలపాకులో చుట్టి ఇచ్చాట్ట. రోగి దండ చేతికి కడితే తెల్లవారేసరికి శాతిస్తుది అని చెప్పాట్ట. ఆదాము తెల్లవార్లూ అక్కడే ఉడి పొద్దునే ఇటికి వెళుతూ ‘మీ దయ వల్ల చాలా ఉపశమిచిది సామీ’ అని పూజారి గారితో చెప్పి వెళ్లాట్ట. నువ్వు కూడా లేచి పళ్లు తోముకుని కాఫీ తాగి వెళ్లి రాజును పలకరిచిరా’ అని చెప్పి సీతమ్మ లోపలికి వెళ్లిది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram