సేవ, సాంఘిక సామరస్యం, స్వదేశీ, పౌర క్రమశిక్షణ, భిన్నత్వంలో ఏకత్వం వంటి వాటిలో వేళ్లూనుకున్న ఒక వ్యవస్థీకృత, ఐక్య సమాజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌  ‌పిలుపునిచ్చారు. సమకాలీన విలువలకు అనుగుణంగా తమను తాము మలచుకుని, సమాజాన్ని ముందుకు నడిపించాలని యువతరాన్ని కోరారు. సెప్టెంబర్‌ 6‌న లండన్‌లో జరిగిన ‘సెలబ్రేషన్‌ ఆఫ్‌ ‌వన్‌నెస్‌’ (ఏకత్వ వేడుక) కార్యక్రమంలో ప్రసంగిస్తూ హిందూ భావజాలం కేవలం వ్యక్తికి మాత్రమే పరిమితం కాదని, అది సమాజం, మానవాళి, ప్రకృతిని కూడా కలుపుకొని ఉంటుందని అన్నారు. ‘‘హిందువులు ప్రకృతిని కేవలం ఆరాధించడమే కాదు, దానిని ప్రేమిస్తారు కూడా’’ అని తెలిపారు. ఈ ప్రేమే ఐక్యతకు, వ్యక్తిత్వ, గుణగణాల పరమైన పురోగతికి వ•లాధారమని చెప్పారు. సంఘ కార్యకలాపాలు కొనసాగడానికి ఈ సూత్రమే పునాదిగా నిలిచిందని తెలిపారు. వందేళ్ల తర్వాత కూడా ఆ సంస్థ  వాతావరణంలోనూ, సభ్యుల ప్రవర్తనలోనూ అదే సూత్రాన్ని చూడవచ్చని పేర్కొన్నారు.

‌ప్రస్తుత అశాంతియుత కాలంలో ప్రపంచానికి అత్యవసరమైన అంశాలను హిందూ నాగరికత ఏ విధంగా అందిస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా, వైవిధ్యమే ఉనికి సహజ స్వభావమని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌పేర్కొన్నారు. హిందూ దృక్పథం, వైవిధ్యాన్ని అంగీకరిస్తుందని ఆయన చెప్పారు. ‘‘ఒక్కటే అనేకం అయ్యింది, అందుకే భిన్న దృక్పథాలు ఏర్పడ్డాయి’’ అని తెలిపారు. ప్రజలు తమ ఆచరణాత్మక జీవితంలో వైవిధ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నప్పటికీ, వివిధ రూపాలను వేర్వేరుగా భావించకూడదని సూచించారు. ‘‘మనం ఒక్కటే, అంతా ఒక్కటే; ఈ ప్రాతిపదికనే మేము ప్రతి విషయాన్నీ పరిగణిస్తాము’’ అని అన్నారు. ఈ విధానం సంఘర్షణల పరిష్కారానికి కూడా ఒక పునాదిని అందిస్తుందని చెప్పారు. శత్రుభావం లేదా పోటీకి బదులుగా ‘‘అందరికీ ప్రయోజనకరమైన పరిష్కారం’’ (win-win solution) గురించి ఆలోచించినప్పుడు సంఘర్షణలను మరింత సులభంగా పరిష్కరించు కోవచ్చు. ఒకరి నష్టంతో మరొకరు లాభపడాలని ఆలోచించే బదులు, ఇరుపక్షాల అవసరాలు ఏమిటో పరిగణించి, ఇద్దరి పురోగతికి కృషి చేయాలని తెలిపారు. మానవులు కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి, మానవాళి ప్రకృతిని జయించాలని చూడకూడదని అన్నారు. అందువల్ల, మానవ పురోగతి ప్రకృతి పురోగతికి దోహదపడాలని తెలిపారు. ‘‘అభివృద్ధి, పురోగతి ఎందుకు ఒకదాని కొకటి విరుద్ధంగా ఉండాలి? అవి ఒకదానికొకటి పూరకంగానే ఉండాలి’’ అని అన్నారు. ప్రస్తుతం ‘‘హరిత పరిష్కారాలు’’గా పిలవబడేవి, మానవ అవసరాలకు పరిష్కారాలను అందించడంతో పాటు ప్రకృతిని కూడా పరిరక్షించడానికి ప్రయత్నిస్తాయని తెలిపారు. ‘‘బతకండి, బతకనివ్వండి’’ అనే సూత్రం కాకుండా, ‘‘బతకనివ్వండి, ఇతరులను బతికించండి’’ అనే సూత్రం ఉండాలని అన్నారు. వ్యక్తి, సమాజం, మానవాళి, ప్రకృతి కలిసి పురోగమించగల ఒక చట్రాన్ని హిందూ తత్వం అందిస్తుందని తెలిపారు. ఆధునిక ఆలోచనా విధానాలు వ్యక్తిగత హక్కులకు, సమాజ ప్రయోజనాలకు మధ్య విభజనను సృష్టి స్తాయని అన్నారు. ‘హిందూ రాష్ట్రం’, ‘హిందుత్వం’ అంశాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ దీనికి సంబంధించిన వ•ల సందేశం ‘‘మనం జీవిద్దాం, ఇతరులను జీవించనిద్దాం’’ అని చెప్పారు. ప్రజలు ఇతరులతో మమేకమై, అందరూ కలిసి జీవించేలా చేయగలరని అన్నారు. ‘‘హిందూ’’ అనే పదం అర్థాన్ని వివరిస్తూ, దీనిని కేవలం ఒక నిర్దిష్ట మతపరమైన ఆచారం లేదా జీవనశైలి ఆధారంగా మాత్రమే అర్థం చేసుకోలేమని చెప్పారు. వైవిధ్యాన్ని అంగీకరించి, గౌరవించే సమాజ స్వభావమే ‘హిందూ’ అని తెలిపారు. ఎందుకంటే విభిన్న మార్గాలు ఒకే లక్ష్యా నికి దారితీస్తాయని అది విశ్వసిస్తుందని చెప్పారు.

విభిన్న అభిరుచులు వేర్వేరు మార్గాలకు దారితీసినప్పటికీ, అంతిమంగా గమ్యం ఒక్కటేనని తెలిపే ‘శివ మహిమ స్తోత్రం’లోని ప్రసిద్ధ శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు. వైవిధ్యం సహజమని, సమాజాన్ని ఏకరూపంగా మార్చాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘‘ఐక్యతకు ఏకరూపత అవసరం లేదు. వైవిధ్యంలోనే ఐక్యత ఉంటుంది,’’ అని పేర్కొన్నారు. అంతర్లీనంగా ఉన్న ఐక్యతలోనే వైవిధ్యం ఇమిడి ఉంటుందని తెలిపారు. కాబట్టి, ప్రజలు ఆ ఐక్యతను గుర్తించినప్పుడు, వైవిధ్యాన్ని గౌరవించగలరు, అంగీకరించగలరు అని చెప్పారు. ‘‘ఆ ఆలోచనే హిందూ ఆలోచన. అటువంటి స్వభావమే హిందూ స్వభావం. అదే హిందూ సమాజం, భారత్‌ ఇతిహాసం’’ అని డాక్టర్‌ ‌భాగవత్‌ అన్నారు.  భారతదేశంలో నాస్తికత్వం మొదలుకొని బహుదేవతారాధన వరకు అనేక రకాలైన ఆలోచనా విధానాలు ఉద్భవించాయని, అదే సమయంలో ప్రజలు వేర్వేరు మార్గాలను అనుసరించవచ్చనే దృక్పథాన్ని భారత్‌ ‌కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘మనం ఒకరినొకరు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ‘మేము మాత్రమే సరైనవాళ్లం’ అనేది కాదు; ‘మేము సరైనవారమే, మీరు కూడా సరైనవారే’ అని భావించడమే హిందూ దృక్పథం,’’ అని అన్నారు. ఈ దృక్పథాన్ని ఒక నిర్దిష్ట వర్గం, ఆరాధనా విధానం, ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలికి మాత్రమే పరిమితం చేయలేమని చెప్పారు. ఒక వ్యక్తి తన సొంత మార్గం పట్ల విశ్వాసం, నిబద్ధత కలిగి ఉంటూనే, మరొకరి మార్గం కూడా వారికి సరైనదేనని గుర్తించవచ్చు. ‘‘మనం కలిసి ముందుకు సాగవచ్చు. కలిసి పని చేయవచ్చు. కలిసి జీవించవచ్చు. మనం కలిసి జీవించాలి. అదే సత్యం’’ అని అన్నారు. ‘రాష్ట్రం’ భావనను వివరిస్తూ, ‘నేషన్‌’ (nation) అనే పదాన్ని ‘రాష్ట్రం’కు ప్రత్యక్ష అనువాదంగా భావించకూడదని చెప్పారు. ఎందుకంటే ఆ రెండూ వేర్వేరు భావనలను సూచిస్తాయి.భాష, పాలనా విధానం లేదా మతం వంటి అంశాలలో ఉన్న సారూప్యతల ఆధారంగా ప్రజలు ఏకమై, తమ ఉమ్మడి శ్రేయస్సు కోసం నియమాలు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక ‘దేశం-రాజ్యం’ (nation-state) ఏర్పడుతుందని ఆయన అన్నారు. ‘రాష్ట్రం’ (Rashtra) భావన భిన్నమైనది, ఎందుకంటే ఇందులో ‘రాజ్యం’ (state) అనేది ప్రాథమిక అంశం కాదు. హిందూ రాష్ట్ర ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, వైవిధ్యం అనేది సహజమైనదని, అంతర్లీన వాస్తవికత ఐక్యత అని చెప్పే సత్యాన్ని ప్రపంచంతో పంచుకోవడమే దీని లక్ష్యమని డాక్టర్‌ ‌భాగవత్‌ అన్నారు. ఈ సూత్రం మానవాళికి ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం శాశ్వత ఆనందానికి, అస్తిత్వ ఐక్యతను అనుభవించడానికి దారితీస్తుంది. భారతీయ రుషులు ఈ సూత్రాన్ని గుర్తించారని, దీనిని ప్రపంచంతో పంచుకోవాలని ఆకాంక్షించారని తెలిపారు. ఇది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక చిన్న వర్గం చేయగలిగే పని కాదని, ఈ బృహత్తర కార్యం కోసం యావత్‌ ‌దేశాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కఠినమైన తపస్సు ఆచరించి, తమ కృషి ద్వారా దేశ శక్తిని పెంపొందించిన లోక హితైషులు, సదుద్దేశ్యం కలిగిన వ్యక్తులుగా రుషులను అభివర్ణించారు.‘రాష్ట్రం’ (జాతి) భావన ప్రారంభ దశలో ప్రత్యేకమైన ‘రాజ్యం’ (ప్రభుత్వ వ్యవస్థ) అవసరం ఉండేది కాదని, ఎందుకంటే సమాజమే తన సభ్యులను రక్షించి, వారికి అండగా నిలిచేదని తెలిపారు. అయితే, పరిస్థితులు మారడంతో రాజ్యం, పాలకుడి ఆవశ్యకత ఏర్పడింది. ఒకే లక్ష్యాన్ని పంచుకునే ప్రజలు సమాజంగా ఏర్పడతారని, వారు ఒక నిర్దిష్ట భూభాగంతో అనుసంధానమైనప్పుడు జనపదంగా మారుతారని చెప్పారు. ఇందులో భూమి అనేది ఒక కీలకమైన అంశమని, ఇతర అంశాలు కాలక్రమేణా మారవచ్చని చెప్పారు. ‘‘మనం ఎల్లప్పుడూ ఒక జాతిగానే ఉంటూ వచ్చాము’’ అని తెలిపారు. భారత్‌ అనేక రకాల రాజకీయ వ్యవస్థ లను, పాలనా విధానాలను చూసిందని చెప్పారు. వివిధకాలాల్లో భారత్‌లో చక్రవర్తి సమ్రాట్‌ ‌పాలన, గణరాజ్యాలు, విదేశీ పాలన వంటి దశలు ఉన్నాయని గుర్తుచేశారు. మరికొన్ని సమయాల్లో ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాటాలలో నిమగ్నమయ్యారు. ‘‘పరిస్థితులు మారాయి. కాబట్టి జనపదం, భూమి కలయికే ‘రాష్ట్రం’ (జాతి),’’ అని అన్నారు. ఇతర దేశాల ప్రజలు తమ సొంత సమాజాల లక్ష్యాలను నెరవేర్చుకునే మార్గాలను కనుగొనడానికి స్ఫూర్తినిచ్చేలా జీవించడమే ‘రాష్ట్ర’ ఉద్దేశ్యమని చెప్పారు. భారత్‌ ‌తన జీవన విధానం ద్వారా ఇతర దేశాల ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవాలని, తద్వారా వారు తమ దేశాల లక్ష్యాలను నెరవేర్చుకుంటూనే తమ జీవితాలను ఎలా గడపాలో తెలుసుకునేలా ప్రేరణ పొందాలని అన్నారు. ‘‘‘రాష్ట్రం’ అంటే మేము భావించేది ఇదే’’ అని తెలిపారు. జాతీయవాదానికి సంబంధించిన చారిత్రక అనుభవాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘దేశం’ (nationhood) అనే భావన పట్ల కొంత ఆందోళన ఉన్నప్పటికీ, ‘రాష్ట్రం’ అనే నాగరికతాపరమైన భావనను దాని ప్రత్యేక సందర్భంలోనే అర్థం చేసుకోవాలని అన్నారు. భవిష్యత్‌ ‌తరాల పట్ల, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దడంలో వారి సామర్థ్యం పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.ఈ లక్ష్యం కోసం అన్ని రకాల చిన్నపాటి విభేదాలను పక్కనపెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. యువత నిజాయతీగా ఉంటారని, ఏదైనా సరైనదని భావించినప్పుడు దానిని ఆచరించడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. వయసు పెరిగేకొద్దీ ప్రజలకు అనుభవం వస్తుందని, తద్వారా తమ చర్యల వల్ల కలిగే పరిణామాల పట్ల వారు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారని తెలిపారు. యువతపై నిర్దిష్ట పద్ధతులను రుద్దకుండా, వారికి స్పష్టమైన లక్ష్యాన్ని, అనుభవం ద్వారా లభించిన అవసరమైన సమాచారాన్ని అందించడమే పెద్దల బాధ్యత అని ఆయన అన్నారు. ‘‘లక్ష్యాన్ని నిర్దేశించండి, పద్ధతిని కాదు. ఆ పనిని వారినే చేయనివ్వండి’’ అని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌తెలిపారు. అంతేకాకుండా, మునుపటి తరాల కంటే యువత తాము ఆశించిన లక్ష్యాలను మరింత వేగంగా, మరింత ప్రయోజనకరమైన రీతిలో సాధించగలరని అన్నారు. బ్రిటన్‌, ‌భారత్‌ ‌ప్రయోజనాల మధ్య ఎప్పుడైనా విభేదాలు తలెత్తితే బ్రిటన్‌ ‌లోని హిందువుల బాధ్యత ఏమిటన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, సాధారణంగా బ్రిటన్‌ -‌భారత్‌ ‌ప్రయోజనాల మధ్య ఎటువంటి సంఘర్షణ ఉండకూడదని అన్నారు. ‘‘బ్రిటన్‌లోని హిందువులు, మంచి హిందువులుగా ఉంటే, బ్రిటన్‌- ‌భారత్‌ ‌ప్రయోజనాల మధ్య ఎప్పటికీ సంఘర్షణ ఉండదు,’’ అని చెప్పారు. ఒకవేళ అటువంటి పరిస్థితి తలెత్తితే, బ్రిటన్‌లోని హిందువులు సహజంగానే తమ ‘కర్మభూమి’ అయిన బ్రిటన్‌ ‌పక్షాన నిలబడతారని అన్నారు. ఒక వ్యక్తి నివసించే, తన విధేయతను కలిగి ఉండే ప్రాంతాన్ని ‘కర్మభూమి’ అని, పుట్టిన లేదా వ•లాలు ఉన్న ప్రాంతాన్ని ‘జన్మభూమి’ అని పిలుస్తారని వివరించారు. ‘‘హిందుత్వం ఎప్పుడూ కూడా మీ కర్మభూమికి ద్రోహం చేయమని చెప్పదు. మీరు అక్కడ నివసిస్తున్నారు, అక్కడ సంపాదిస్తున్నారు, కాబట్టి మీరు దానికి తగినట్లుగా నడుచుకోవాలి’’ అని అన్నారు. తమ జన్మభూమి నుండి పొందిన విలువలను ప్రజలు తమ కర్మభూమిలో సంపూర్ణంగా, సరైన రీతిలో ఆచరించాలని, తద్వారా మానవాళికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (ముఖ్యంగా •••కే, కామన్వెల్త్ ‌దేశాల్లోని యువత) ‘వసుధైవ కుటుంబకం’, సేవాభావం,  ‘భిన్నత్వంలో ఏకత్వం’ వంటి విలువలను ఆచరణాత్మకమైన ఆర్థిక, సామాజిక మానవతా భాగస్వామ్యాలుగా ఎలా మలచుకోవాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ, డాక్టర్‌ ‌భాగవత్‌ అటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆవిర్భ వించిందని అన్నారు. ప్రపంచం ఇప్పటికే ‘‘గ్లోబల్‌’’ (‌ప్రపంచవ్యాప్త), ‘‘వన్‌ ‌వరల్డ్’’ (ఏక ప్రపంచం) వంటి భావనలను వినియోగించడం ప్రారంభించిందని, అనేక కార్యక్రమాలు ఆ దిశగా సాగుతున్నాయని ఆయన అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (ముఖ్యంగా •••కే, కామన్వెల్త్ ‌దేశాల్లోని యువత) ‘వసుధైవ కుటుంబకం’, సేవాభావం, ‘వైవిధ్యంలో ఏకత్వం’ వంటి విలువలను ఆచరణాత్మక ఆర్థిక, సామాజిక, మానవతా భాగస్వామ్యాలుగా ఎలా మలచుకోవాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆవిర్భవించిందని డాక్టర్‌ ‌భాగవత్‌ అన్నారు. ప్రపంచం ఇప్పటికే ‘‘గ్లోబల్‌’’ (‌ప్రపంచవ్యాప్త), ‘‘వన్‌ ‌వరల్డ్’’ (ఏక ప్రపంచం) వంటి భావనలను వినియో గించడం ప్రారంభించిందని, అనేక కార్యక్రమాలు ఆ దిశగా సాగుతున్నాయని తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ ‘కర్మభూమి’ (తాము జీవిస్తున్న దేశం) పట్ల నిజాయతీగా ఉంటూనే, ఆ దేశానికి, మానవాళికి సేవ చేయడానికి తమను తాము బలోపేతం చేసుకోవచ్చని చెప్పారు. ‘‘బ్రిటన్‌ ‌పట్ల విధేయతతో ఉంటూనే, భారత్‌కు సేవ చేయడానికి మీకు అదనపు వనరులు ,సమయం ఉంటే, అలా చేయకుండా మిమ్మల్ని ఎవరూ అడ్డుకోరు’’ అని అన్నారు. ‘‘ప్రపంచ స్థాయిలో ఆలోచించడం – స్థానిక స్థాయిలో పనిచేయడం (think globally, act locally) అనే సమకాలీన విధానాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలు తాము నివసిస్తున్న దేశం పట్ల విశ్వాసంతో ఉంటూనే ప్రపంచ స్థాయి సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం అందించవచ్చని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పనిచేయని రంగం దాదాపు ఏదీ లేదని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎటువంటి బ్యానర్లు లేదా క్రెడిట్‌ (‌కీర్తి) కోసం పాకులాడకుండా, అందరితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా, ‘‘ఈశాన్యం నుండి పడమర వరకు’’, ‘‘కశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు’’ స్వయంసేవకులు సమాజం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సంఘం రాబోయే 100 ఏళ్ల గురించి మాట్లాడుతూ, సమాజాన్ని ఏకం చేసే పనిని పూర్తి చేయడానికి అంత ఎక్కువ సమయం పట్టకూడదన్నదే తన మనసులో మెదిలిన మొదటి ఆలోచన అని చెప్పారు. సమాజాన్ని సంఘటితం చేయడం అంటే సమాజ శక్తిని ఏకం చేయడమేనని తెలిపారు. సమాజంలో విస్తృత ఆదరణను పొంది ఉండటం వల్ల, అటువంటి వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడే స్థితిలో ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ ఉం‌దని చెప్పారు. ‘‘మమ్మల్ని వ్యతిరేకించే వారికి కూడా సంఘం విలువ, సంఘ ఉపయోగం తెలుసు’’ అని తెలిపారు. అవసరమైనప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సేవలను కోరడానికి లేదా కీలకమైన విషయాలలో సహకరించ డానికి వారు వెనుకాడరని, ఆ ఆదరణ లభిస్తోందని డాక్టర్‌ ‌భాగవత్‌ ‌చెప్పారు. గ్రామాభివృద్ధి గురించి మాట్లాడుతూ దీని పట్ల అందరికీ శ్రద్ధ ఉందని, అక్కడ వ్యతిరేకత కంటే సహకారమే ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. అదేవిధంగా, భారతదేశంలో గోరక్షణ గురించి ప్రస్తావిస్తూ, అన్ని మతాల ప్రజలు దీనిని అంగీకరించారని అటువంటి ప్రయత్నాలలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. సమాజం కోసం నిజాయతీగా, నిస్వార్థంగా పనిచేసే వారు ఎవరైనా సరే, ఒకవేళ వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి తెలియక పోయినప్పటికీ, వారిని సంస్థ సహకారులు గానే పరిగణిస్తుందని చెప్పారు. ‘‘సమాజం మొత్తాన్ని ఏకం చేయడమే మా ఆలోచన,’’ అని అన్నారు. అయితే, సమాజంలోని ప్రతి ఒక్కరూ ‘శాఖ’ (ఆర్‌ ఎస్‌ఎస్‌ ‌శిక్షణా కేంద్రం) మైదానానికి రావాల్సిన అవసరం లేదని తెలిపారు. అయినప్పటికీ, ఒకరినొకరు పక్కకు నెట్టేయకుండా అందరూ కలిసి ఒకే మార్గంలో పయనించవచ్చని చెప్పారు. ‘‘మేము చేతులు కలిపి, కలిసికట్టుగా ముందుకు సాగుతాము. వ్యవస్థీకృత సమాజం పట్ల మాకున్న భావన ఇదే’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలక్‌ అన్నారు. అటువంటి వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడం అనేది ప్రగతిలో తదుపరి దశ అని, దీనికి మరో 100 ఏళ్లు పట్ట కూడదని అన్నారు. ‘సెలబ్రేషన్‌ ఆఫ్‌ ‌వన్‌నెస్‌’ (ఏకత్వ వేడుక) కార్యక్రమంలో 326 సంస్థలకు చెందిన 600 మంది పాల్గొన్నారు. హౌస్‌ ఆఫ్‌ ‌లార్డస్ ‌సభ్యులు, హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్ ఎం‌పీలు, మేయర్లు, కౌన్సిలర్లు, సామాజికవేత్తలు ఈ కార్యక్రమంలో హాజరైన వారిలో ఉన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.