హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ‌శాసనసభ్యుడు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి (బీబిఆర్‌ఎస్‌) ‌పార్టీ గుర్తుపై గెలిచి, ఆ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ ‌బి-ఫామ్‌పై లోక్‌సభకు పోటీ చేసినా స్పీకర్‌ ‌చర్యలు తీసుకోకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నాగేందర్‌ ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించింది..కోర్టు ఒక ఎమ్మెల్యేపై వేటు వేయడం సాధారణ న్యాయ పరమైన నిర్ణయమే కాక అది ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమశిక్షణను, రాజ్యాంగ నైతికతను పునరుద్ధరించే మైలురాయిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ (‌ఫిరాయింపుల నిరోధక చట్టం) ఆధారంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు, శాసన వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేయాలనుకునే వారికి చెంపపెట్టు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒక పార్టీ గుర్తుతో గెలిచి, మరో పార్టీ గుర్తుపై లోక్‌సభ ఎన్నికల్లో పడడాన్ని పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్లుగా నిర్ధారించి, శాసనసభ సభ్యత్వం కోల్పో యినట్లు స్పష్టం చేసింది. సికింద్రాబాద్‌ ఎం‌పీ అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్‌ ‌తరఫున పోటీ చేయడాన్ని న్యాయస్థానం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో స్పీకర్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని, ఉత్తర్వులను కొట్టివేసింది. 2023, అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ ‌నుంచి బీఆర్‌ఎస్‌ ‌తరపును గెలిచిన నాగేందర్‌ 2024 ‌మార్చి 17న కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. ఆ పార్టీ బీ-ఫామ్‌పై సికింద్రాబాద్‌ ‌లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 ఫిరాయింపు ఆధారాలు లేవన్న స్పీకర్‌

‌తమ పార్టీకి చెందిన ప•లువురు శాసన సభ్యులు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ నేతలు శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఈ ఏడాది మార్చి 11వ తేదీన వెలువరించిన తీర్పులో, దానం నాగేందర్‌ ‌పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. దానిపై దాఖలైన పిటిషన్‌లను పలుదఫాలుగా విచారణ చేపట్టిన హైకోర్టు, స్పీకర్‌ ఇచ్చిన తీర్పును  కొట్టివేస్తూ, సెప్టెంబర్‌ 18‌వ తేదీన తుది తీర్పు వెలువరిం చింది. దానం నాగేందర్‌ ఎం‌పీగా పోటీచేసిన తేదీ నుంచే ఆయనపై అనర్హత అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది.

 శాసనవ్యవస్థలో న్యాయ వ్యవస్థఅనివార్య జోక్యం

 సాధారణంగా ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు తమ తమ పరిధుల్లో స్వతంత్రంగా పనిచేస్తాయి. శాసనసభ స్పీకర్‌ ‌లేదా స్పీకర్‌ ‌కార్యాలయానికి ఉన్న విచక్షణాధి కారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదు. న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోలేదు. దానం అనర్హత ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్‌ ‌కాలయాపన చేయడం, లేదా సాక్ష్యాలు లేవంటూ ఫిరాయింపులపై కంటితుడుపు నిర్ణయాలు తీసుకోవడం వల్ల న్యాయస్థానం జోక్యం అనివార్య మైంది.

ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అత్యున్నతమైనది కాదు. రాజ్యాంగమే అత్యున్నతం. స్పీకర్‌ ‌స్వతంత్ర వ్యవస్థగా కాక రాజకీయాధికారానికి ప్రతినిధిగా మారినప్పుడు, న్యాయసమీక్ష ద్వారా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై పడుతుంది. శాసనసభ కార్యకలాపాల్లో, స్పీకర్‌ ‌విచక్షణాధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు శ్రేయస్కరం కాదు అనేది అంగీకరించదగిన అంశమే. అయితే, ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? స్వీయ విధి నిర్వహణలో వైఫల్యం, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ,‘ఆధారాలు లేవు’ అని పిటిషన్లను తోసిపుచ్చడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్నది విశ్లేషకుల మాట.

 స్పీకర్‌ అధికారాలను శాసిస్తోన్నఅధికార పార్టీలు!

 ప్రభుత్వాల రాజకీయ ఒత్తిళ్లకు, స్వార్థ ప్రయోజనాలకు స్పీకర్‌ ‌వ్యవస్థ తలొగ్గడమే నేటి ఈ సంక్షోభానికి వ•లకారణమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌, ‌టీడీపీ ఎమ్మెల్యేలను విలీనాల పేరిట, ఫిరాయింపుల ద్వారా చేర్చుకున్నప్పుడు నాటి స్పీకర్లు కాలయాపన చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారనే విమర్శలు లేకపోలేదు. రాజ్యాంగ పరిరక్షణ గురించి జాతీయ స్థాయిలో మాట్లాడే కాంగ్రెస్‌, ‌తెలంగాణలో మాత్రం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుని స్పీకర్‌ ‌ద్వారా రక్షణ కల్పించే ప్రయత్నం చేసిందని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విమర్శలు చేస్తోంది. అప్పుడు బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ ‌తమ రాజకీయ ప్రయోజనాల కోసం శాసనసభ గౌరవాన్ని భంగపరిచాయన్నది ఈ తీర్పు ద్వారా తేటతెల్లమైంది. స్పీకర్‌ ‌గా ఎన్నికైన వ్యక్తి రాజ కీయాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఆ పదవి ముగిసిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం సాధారణమే. అయితే గత 10 ఏళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలు స్పీకర్‌ ‌పదవిపై కొంత చర్చకు కారణమయ్యాయనే అభిప్రాయం ఉంది. స్పీకర్‌ ‌తనకు గల విచక్షణాధికారాన్ని ఆసరా చేసుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడం ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ఇదే విషయమై గతంలో న్యాయ స్థానాలు స్పీకర్‌కు కాలపరిమితిని విధించాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే లపై చర్యల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని న్యాయస్థానాలు సూచించిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

 ఫిరాయింపునకు పక్కా ఆధారాలు

దానం నాగేందర్‌ ‌పార్టీ ఫిరాయింపునకు సంబం ధించి స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఆయనను అనర్హుడిగా స్పీకర్‌ ‌ప్రకటించకపోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.

ఓటర్లు ఒక సిద్ధాంతానికి, ఒక పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే, ఆ తీర్పును తుంగలో తొక్కి పార్టీ మారడం ఓటర్లను మోసగించడమేనని, ఫిరాయింపు దారులను సమర్థించడం అంటే ఓటరు విలువను కాలరాచినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నాగేందర్‌ ‌కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అం‌దచేసిన ఆడియో, వీడియో ఆధారాలతో పాటు ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌, ‌నాగేందర్‌ ‌పార్టీ మారారనేందుకు తగు ఆధారాలు లేవనండంపై అప్పట్లోనే బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ‘కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ, రాజ్యాంగ ప్రతిని పట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ పేరిట దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు.అయితే, రాజ్యాంగ పరిరక్షణ అనేది చేతిలో పుస్తకం పట్టుకుని తిరిగితే వచ్చేది కాదు.. దానిని ఆచరణలో పెట్టాలి’ అని బీఆర్‌ఎస్‌ ‌వ్యాఖ్యానిస్తోంది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఫిరాయింపులను ప్రోత్సహించడం, స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చి నిర్ణయాలు వాయిదా వేయించడం ద్వారా కాంగ్రెస్‌ ‌పార్టీ తన ద్వంద్వ నీతిని బయటపెట్టుకుందని ఆ పార్టీ విమర్శలు చేస్తోంది.

మరోవైపు.. పార్టీ మారే ప్రజాప్రతినిధులను రాజకీయంగా, నైతికంగా నిలదీసే చైతన్యాన్ని సమాజం పెంచుకోవాలి. దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఒక ఎమ్మెల్యే అనర్హతకు పరిమితమైనది కాదు..

ఇది ప్రజాస్వామ్య విజయం:బీజేపీ

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. తమ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వెలువరించిన తీర్పు అంత్యత కీలక పరిణామమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని నీతులు చెప్పే రాహుల్‌ ‌గాంధీ.. తన తండ్రి రాజీవ్‌ ‌గాంధీ తెచ్చిన 10వ షెడ్యూల్‌ (‌పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) మార్గదర్శకాలను విస్మరించడం హాస్యాస్పదమని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం దారిలోనే ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వెళ్తోందని వ్యాఖ్యానించారు.

ఈ తీర్పు రాజ్యాంగ విజయం: కిషన్‌ ‌రెడ్డి

రాష్ట్రంలో ఫిరాయింపుల రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల బండారం బట్టబయలైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టం అన్నారు.పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో న్యాయస్థానం వెలువరించిన తీర్పు పట్ల యావత్‌ ‌తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోందన్నిరు.ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్‌. ‌రాజశేఖర్‌ ‌రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహించారని, ఆ తర్వాత విభజిత రాష్ట్రంలో కె.చంద్రశేఖరరావు నేతృతంలో అధికారానికి వచ్చిన బీఆర్‌ఎస్‌ అదే పద్ధతిలో చట్టాలను ఉల్లంఘించి కొనసాగారని గుర్తుచేశారు. చ•ట్టాన్ని ఉల్లంఘించడం, రాజకీయ అవసరాల కోసం వాటిని చట్టాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ‘సంవిధాన్‌ ‌బచావో’ అని తిరిగే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తీరు పచ్చి బూటకమని కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు గానీ, రాహుల్‌ ‌గాంధీకి గానీ ఉందా అని ప్రశ్నించారు.

ఈ విజయం నైతికంగా, చట్టపరంగా రాజ్యాంగానికి లభించిన తిరుగులేనిదని, ఈ తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి కొనియాడారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ ‌పార్టీకి నిజమైన గౌరవం ఉంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ప్రజల తీర్పును స్వీకరించాలని బీజేపీ డిమాండ్‌ ‌చేసింది

సుజాత గోపగోని
సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.