రతనాల సీమ మనది. వజ్రపురాశులను వీధుల్లో పోసి అమ్మిన గడ్డ మనది. అనేక విశ్వవిఖ్యాత వజ్రాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన దేశం మనది. 16వ శతాబ్దంలో ట్రావెర్ నీయర్ 1630-1668 మధ్య షాజహాన్, ఔరంగజేబు, గోల్కొండ నవాబు లను ప్రధానంగా దర్శించాడు. ఇతడు ఆభరణాల వ్యాపారి, విలువైన రాళ్లను, ముఖ్యంగా వజ్రాలను ఖరీదు చేయడానికి వచ్చాడు. గోల్కోండ రాజ్యంతో సహా వివిధ ప్రాంతాలలో వజ్రాల గనులను దర్శించాడు. కొల్లూరుగని 1675లో దర్శించి ఫ్రెంచ్ రాజు లూయీ 14 కోసం “ట్రావెర్నియర్ బ్లూ” ను కనుగొన్నాడు. 116 కారెట్లు డైమండును దర్శించి నట్లు ఆయన రాసిన పుస్తకం “లెస్ సిక్స్ వాయేజస్ డీ జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర”లో ప్రచురించాడు. ఇలాంటి ఎన్నో వజ్రాలు లూయీ 14 కిరీటంలో ఉండేవి.

గోల్కొండ అసఫ్ ఝా రాజ వంశస్తుల పాలనలో ఉంది. వీరి రాజధాని ఔరంగాబాద్‌లో ఉండేది. 2వ అసఫ్ ఝా (1762-1803) అధికారంలోకి రాగానే రాజధానిని హైదరాబాదుకు మార్చాడు.1798లో బ్రిటిష్ వారితో సైన్య సహకార పద్దతికి అంగీకరిం చాడు. సైనిక ఖర్చుల క్రింద రాయలసీమ ప్రాంతం లోని అనంతపురం, కర్నూలు, కడప, బళ్లారి జిల్లాలను బ్రిటిష్t వారికి అప్పగించాడు. సైన్య సహకార పద్ధతి ప్రకారం మొట్టమొదటి రెసిడెంట్‌గా జేమ్స్ ప్యాట్రిక్‌ను హైదరాబాద్‌లో నియమించాడు. జేమ్స్ ప్యాట్రిక్ ఖైరున్సీషా బేగంను పెళ్లి చేసుకున్నాడు.

నిజాం రాజులు విలువైన వజ్రాలను సేకరించి, వాటిని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేవారు. దీనివల్ల హైదరాబాదు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన ఆర్థికకేంద్రంగా ఎదిగింది. 184.75 క్యారెట్లు గల జాకబ్ డైమండ్‌ను నిజాంలు పేపరు వెయిట్‌గా వాడేవారట. దాని ఖరీదు సుమారు 1000 కోట్ల నుండి 5000కోట్ల వరకు పలుకుతుంది. గోల్కొండలో లభించేవి టైప్`2ఎ వజ్రాలు. ఇవి స్వచ్చతకు ప్రసిద్ధి. వీటిలో నైట్రోజెన్ ఉండదు. అత్యంత ఖరీదైనవి.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనిలో 17వ శతాబ్దంలో “రీజెంట్ డైమండ” దొరికింది. దీని ఖరీదు నాటి రేట్ల ప్రకారం 552 కోట్లుగా నిర్ధారించారు. ఇది ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని లూవర్ మÖ్యజియంలో ఉంది. ఒక గని కార్మికుడు, ఈ వజ్రాన్ని తనకాలికి గాయం చేసుకొని దానికి ఒక కట్టువేసుకుని కట్టులోపల వజ్రాన్ని దాచి మద్రాసు నుండి ఓడలో ఇంగ్లండు పారిపోవడానికి ప్రయత్నించగా, ఆ ఓడ కెప్టెన్ దీనిని గమనించి వాడిని హత్యచేసి ఆ డైమండ్‌ను ఇంగ్లండులో “పిట” అనే వ్యాపారికి అమ్మాడు. ఫ్రాన్స్ పాలకుడు 2వ ఫిలిప్ ఆ వ్యాపారి నుండి దాన్ని కొనుగోలుచేశాడు. దీనితో ఇది రీజెంట్ డైమండ్ అయ్యింది. ఆ తరువాత అది డ్యూక్ ఆఫ్ ఆర్లియన్‌కు వచ్చింది. ఫ్రెంచ్ విప్లవకాలంలో దీన్ని దొంగలు దొంగిలించారు. నెపోలియన్, చక్రవర్తి అయ్యాక, ఆ దొంగను పట్టుకొని ఆ డైమండ్‌ను తీసుకుని తన ఖడ్గానికి గల పిడికి అమర్చుకున్నాడు.

ప్రపంచంలోని విలువైన వజ్రాలలో ఒకటి గోల్కొండ నీలివజ్రం (గోల్కొండ బ్లూ). ఒకప్ప్పుడు ఇండోర్, బరోడా మహారాజులవద్ద ఉన్న ఈ వజ్రం జెనీవాలో జరిగే క్రిష్టీన్ మ్యాగ్నిఫిసెంట్ సేల్‌లో వేలం వేయగా, నాడు 430 కోట్లు పలికింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాలలో “ది గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా” కల్లినన్‌ను రాణికి చెందిన రాజ దండంపై అమర్చారు. ‘ది గ్రేట్ మొగల్ డైమండ్ అని పిలిచే ‘ది ఒర్లోఫ’ ప్రస్తుతం మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీ డైమండ్ ఫండ్ సేకరణలో ఉంది. 1774లో రష్యన్ రాణి కేథŠరిన్ ది గ్రేట్ రాజదండంలో దీన్ని పొదిగారు.

శ్రీరంగ పట్టణంలో రంగనాథస్వామి దేవాలయంలో ఉన్న దీనిని ఒక ఫ్రెంచ్ సోల్జర్ హిందూమతాన్ని స్వీకరించినట్లుగా నటించి, పూజారులతో  సన్నిహితంగా ఉంటూ, ఒకనాడు ఈ వజ్రంతో ఉడాయించాడు. ఈ వజ్రాన్ని ఆర్లోవ్ అనే ఉన్నత సైనికాధికారి కొని తన ప్రేయసి (రాజు భార్య అయిన కేథóŠరిన్‌కు)కి బహుమానంగా ఇచ్చాడు. అప్పటికి రష్యాను కేథరిన్ భర్త 3వపీటర్ పరిపాలిస్తున్నాడు. ఆర్లోవ్ సహాయంతో పీటర్‌ను పదవీచ్యుతునిచేసి తానే రష్యాకి రాణిగా తనను తాను ప్రకటించుకున్నది.

కోహినూర్ డైమండ్ వరంగల్‌లోని భద్రకాళీ మాత కన్నుగా ఉండేది. దీనిని విదేశీయులు ఎత్తుకు పోయారు. 105.6 కేరట్ల ఈ వజ్రాన్ని, పెర్షియన్, ఆఫ్గన్ పాలకుల నుండి బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. దీనికి ఖరీదు కట్టలేకపోయారు. “బడల్స్ ఐ” కూడా గోల్కొండ వజ్రమే. 1600లలో గోల్కొండ నవాబులు దీన్ని సొంతం చేసుకున్నారు. తరువాత పర్షియా యువరాజు రహాబ్ సొంతం చేసుకుని, అప్ప్పులపాలై, అప్ప్పులు తీర్చడానికి జూలై 14, 1865లో లండన్ క్రిష్టీస్‌లో వేలంలో అమ్మేశాడు. “సాన్సీ డైమండ” బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మధ్య చేతులు మారింది.

“హÃప్ డైమండ్ కూడా భారతదేశంలోనే పుట్టింది. ఫ్రెంచ్ విప్లవ సమయంలో చోరీకి గురైంది. తరువాత హెన్రీఫిలిప్ హÃప్ కొనుగోలు చేశాడు. 17వ శతాబ్ద నుండి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. అయితే దీన్ని కొన్నవాళ్లందరూ అకాల మరణం చెందారట, చివరగా లూయీ 14 చేతికిచేరిన తరువాత ఫ్రాన్స్‌లో విప్లవమే వచ్చింది. దానితో 14వ లూయీ వాషింగ్‌టన్‌లోని స్మిత్ సోనియన్‌కు దానంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది అమెరికాలో వుంది.

1765లో మొగల్ చక్రవర్తి 2వ షాఆలం నుండి రాబర్ట్ క్లైవ్ ఒక ఫర్మానాను పొందాడు. దీని ద్వారా ఉత్తర సర్కారు జిల్లాలు (శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు) బ్రిటిష్‌వారికి లభించాయి, అయితే అవి అప్పటికి గోల్కొండ నవాబు నిజాం ఆలీఖాన్ చేతిలో ఉన్నాయి.  బ్రిటిష్‌వారు 1766, 1768లో జరిగిన మచిలీపట్నం ఒప్పందం ద్వారా షాఆలం ఆ ఫర్మానాను అంగీక రించి, ఉత్తర సర్కారు జిల్లాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. దీనికి బదులుగా ఏటా 50 వేల పౌండ్లు (సుమారు 5 లక్షలు) నిజామ్‌కు చెల్లించడానికి అంగీకరించాడు. కానీ నాటి గుంటూరు జిల్లాలోని ఏడు గ్రామాలను పరిటాల, మోగులూరు, ఉస్తేపల్లి, మల్లవల్లి, బత్తినపాడు, గనీఆతుకూరు తనకు వదలాలని, దానికి బదులుగా నైజాం ప్రాంతమైన మునగాల పరగణా (సూర్యపేట జిల్లా) హుజూర్ నగర్ దగ్గర లింగగిరి పరగణాలోని 9 గ్రామాలను బ్రిటిష్ వారికి ఇవ్వడానికి అంగీకరించారు. దీనితో పరిటాల,  ఇతర ఏడు గ్రామాలు నిజాంపాలనలో ఉంటే చుట్టూ బ్రిటిష్ భూభాగంగా ఉండేది. బ్రిటిష్ వారి భూభాగానికి నిజాం రాజ్య భాగమైన జుజ్జూరు పరిధిలోని పరిటాలలో నాకా (చెక్ పోస్టులు) ఉండేవి. ఈ ఏడు గ్రామాలు పరిటాల, మోగుల్తూరు, ఉస్తేపల్లి, మల్లివల్లి బత్తినపాడు, గని ఆతుకూరు, కొడవటి కల్లు,

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాని హైదరాబాదు సంస్థానానికి కాదు. హైదరాబాదు నైజాం తాను స్వతంత్ర ర్పు్యాంగా ఉండ దల్చినట్లు ప్రకటించాడు.దానితో పరిటాలకు కూడా స్వాతంత్య్రం సిద్ధించలేదు, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ సైనిక చర్యతో హైదరాబాదు సంస్థానం1948 సెప్టెంబరు 17న భారత్‌లో విలీనమైంది. పరిటాల పరిస్థితి వేరు. భారత్‌లో హైదరాబాద్ విలీనానికి ముందే, 1947 నవంబరు 15నే తిరుగుబాటు చేసి నిజాం పాలన నుండి విముక్తమెంది. విముక్తి పొందిన వెంటనే తమని తాము స్వతంత్ర గణతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ ప్రాంతానికి “పరిటాల రిపబ్లిక” అనే పేరు పెట్టుకుంది. ప్రత్యేక రాజ్యాంగం రాసుకుంది. ఈ విషయాలను తెలియజేస్తూ డా॥ కృష్ణా సాగరపు ఉపేంద్ర “1947 నాటి పరిటాల రిపబ్లిక్ పాలన” అనే శీర్షికతో కుప్పంలోని ద్రావిడ యÖనివర్శిటీలో తన సిద్ధాంత వ్యాసాన్ని రాసి ప్రచురించాడు.

పరిటాల తాలూకా జుజ్జురు కానత్‌లో భాగంగా కృష్ణాజిల్లాలో ఉంది. హైదరాబాదు నైజాం మే 14, 1759న ఉత్తర సర్కారు జిల్లాలను పరిటాల, 6 గ్రామాలను మినహాయించుకుని జజ్జురుతో సహా బ్రిటిష్ వారికి బదిలీ చేశాడు. అయితే తాను తీసుకున్న ఏడు గ్రామాలకు నష్టపరిహారంగా తెలంగాణాలోని మునగాల పరిగణాను హుజూర్త్ నగర్ దగ్గర గల లింగగిరి పరగణాలోని 9 గ్రామా లను ఇచ్చాడు. దీనితో పరిటాలలో వజ్రాల వేట ప్రారంభమైంది, నైజాంలకు వజ్రాలపై మక్కువ ఎక్కువ. ఈ వజ్రాల డబ్బువల్లే నైజాం నవాబులకు అన్ని అవలక్షణాలు వచ్చాయి అని ప్రతీతి. 1937 ఫిబ్రవరి 22న విడుదలైన టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అనే కథనాన్ని ప్రచురించింది. నైజాం పరిపాలనాకాలంలో నిజాం అధికారుల ఆకృత్యాలు పెచ్చుపెరిగిపోయాయి. వేధిస్తున్న నిజాం అధికారిని హత్యచేసి చెరువు ఒడ్డున పారేసి పరిటాలవాసులు పరారయ్యారు.

విచారణలో అందరూ ఒకేసారి “మేమే చేశాం” ఈ హత్య అనేసరికి అధికారులు నివ్వెరపోయారు. అయితే పరిటాలలో ఈ సంఘటన జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపంపై ఈ పేర్లు లిఖించారు – వీరమాచనేని వేంకటేశ్వరరావు, పెర్నా శ్రీరామ్ మÖర్తి, దొడ్డపనేని రామారావు, మల్లెల నర్శయ్య, కూటం నాగయ్య, సిద్ధిరాములు, మలసా వీరయ్య, పెన్నా రాధా కృష్ణమÖర్తి, గుణ్ణం రామిరెడ్డి, కర్రా వేంకట నరసయ్యతో మరికొందరు అని రాసుంది.  రజాకారులకు కూడా గ్రామస్తులు భయపడలేదు, కలిసికట్టుగా ఎదుర్కొన్నారు.

ఉస్మానియా యÖనివర్శిటీలో 1938లో వందేమాతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అనేకమంది పరిటాలవారు కావడం పరిటాల ఉద్యమ స్ఫూర్తికి కారణమైంది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసు ఫౌండర్ స్వామి రామానంద తీర్థ, హయగ్రీవాచారి కూడా కొంతకాలం పరిటాలలో ఉండి ఉద్యమం గాడి తప్పకుండా ఉండేటట్లు వారికి సలహా ఇచ్చారు. “ఆంధ్రాలో అప్పటికే జరిగిన సహాయ నిరాకరణోద్యమం, చీరాల-పేరాల ఉద్యమం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ పోరాటం, పర్లాకిమిడి పోరాటం వంటివి పరిటాల వాసులను బాగా ప్రభావితం చేశాయి. దీనితో 1946 నాటికే నిజాంపాలన నుండి బయటపడాలన్న కాంక్ష ఎక్కువైంది” అని రచయిత  ఉపేంద్ర పేర్కొన్నారు.

టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి వంటి నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పు కున్నారు. వారి సూచన మేరకే నడుచుకున్నారు. కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు చేయడానికి అవ్వా సత్యనారాయణను నియమించారు. స్థానికంగా ఉద్యమం నడపడానికి మాదిరాజు దేవరాజును వినియోగించారు. జయప్రకాశ్ నారాయణ, అరుణా ఆసఫఆలీలు స్వయంగా పరిటాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పివెళ్లారు.

 భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన మÖడు నెలల తరువాత 12.11.1947న పరిటాలలోని పోలీస్‌స్టేషన్‌పై కొందరు దేశభక్తులు దాడి చేసి, 15-11-1947 పరిటాల ఖనాత్ పరిధిలో ఏడు గ్రామాలను “స్వతంత్ర గణతంత్ర దేశంగా” ప్రకటించి పరిటాల రిపబ్లిక్ అని పేరు పెట్టారు. అవ్వా సత్యనారాయణ ఈ రిపబ్లిక్‌కు ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. పరిపాలన కొరకు ప్రతీ గ్రామాన్నుండి ముగ్గురు సభ్యుల చొప్ప్పున ఏడు గ్రామాల నుండి 21 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ప్రకటించారు. పరిటాల రిపబ్లిక్ సెంట్రల్ కమిటీ అధ్యక్షునిగా మాదిరాజు దేవరాజు, ఉపాధ్యక్షునిగా మాగంటి రామకోటయ్య, కార్యదర్శిగా చింత అచ్చయ్య చౌదరి, సభ్యులుగా చింతలపాటి విశ్వనాధం, అవ్వా సత్యనారాయణ, చింతా బాపయ్య, మన్నెం కోటయ్య, వెలగా రామకృష్ణయ్య, మాదిరాజు నాగ భూషణరావు, బండి వెంకయ్య, అక్కినేని రామారావు ఇంకా కొందరు ఉన్నారని పరిటాల స్థూపంపై రాసుకున్నారు. ఈ కమిటీ సభ్యులు నిత్యం జాతీయ నాయకులతో సంప్రదిస్తూ, సలహాలను తీసుకుంటూ ఉన్నారు. పరిపాలన పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. భద్రత సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు.

చివరకు జాతీయనాయకుల సలహా మేరకు పరిటాల ఖానాత్ తాలూకాను 26-01-1950 న భారత రిపబ్లిక్‌లో విలీనం చేయడం, పరిటాల ఖానాత్‌ను కృష్ణాజిల్లాకు, మునగాల, లింగగిరి ప్రాంతాన్ని తెలంగాణా జిల్లాలలో చేర్చడం ద్వారా పరిటాల రిపబ్లిక్ కథ సుఖాంతమైంది. నేటికీ పరిటాల గ్రామాలలో వర్షాకాలం వచ్చిందంటే వజ్రాలవేట మొదలవుతుంది.

మూలం: 1. వజ్రాలు పండుతున్నాయి బై తమ్మిశెట్టి రఘుబాబు (వ్యాసం), 2. 1947 నాటి పరిటాల రిపబ్లిక్ బై డా॥ కృష్ణసాగరపు  ఉపేంద్ర.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.