‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

ఆరోజు ఆగస్టు పదిహేను! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. అందుకే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో స్వాతంత్య్రదిన వేడుకలు జరుగుతున్నాయి.

బలభప్రురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంతా మువ్వన్నెల రంగుల కాగితాలతో అందంగా అలంకరించబడింది. ప్రధానోపాధ్యా యుడు కృష్ణమÖర్తిగారు జెండా ఎగురవేశారు. ఆ వెంటనే “జనగణమన అధినాయక జయహే” జాతీయ గీతాలాపన మొదలైంది. మువ్వన్నెల జెండా ఠీవిగా రెపరెపలాడుతూ కనిపిస్తోంది. సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీధర్ విద్య్యార్థులను ఉద్దేశించి…

“ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులకు స్వాతంత్య్రదిన శుభాకాంక్షలు.1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్రం సంగ్రామంలో సిపాయిలు, రాజులు ఓడిపోయారు. ఆ మరుసటి సంవత్సరంలో మన దేశం బ్రిటిష్ రాణి నాయకత్వంలో వారి పాలన కిందకు వెళ్లింది. అనంతరం గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి గొప్పదేశ భక్తుల పోరాటం ఫలితంగా ఆగస్టు 15,1947 మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. మనకు స్వాతంత్య్రం ఇస్తున్నట్లు బ్రిటిష్ ఆఖరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ప్రకటించడంతో మన దేశ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది. దేశంలో ఎన్నో విశ్వ విద్యాలయాలు, ప్రసిద్ధి చెందిన ఐఐటీలు, ఎన్.ఐ.టీ.లు ఏర్పడ్డాయి. మన దేశానికి తూరుపు, పడమర ప్రాంతాల్లో ఎంతో విస్తారమైన సముద్రతీరం ఉంది. ఆ ప్రాంతాల్లో ఎన్నో నౌకాశ్రయాలు నిర్మితమయ్యాయి.

అలాగే భాక్రానంగల్, నాగార్జునసాగర్, హీరాకుడ్ వంటి భారీ ఆనకట్టలు నిర్మించడం వల్ల వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. రైల్వేలు, రహదారులు, విమాన, నౌకారంగాలను కూడా అభివృద్ధి చేశారు. భిలాయ్, రూర్కెలా, విశాఖ పట్నం, దుర్గాపూర్ లాంటి నగరాలలో ఉక్కు పరిశ్రమలను నెలకొల్పారు.

దేశం ఎన్నో ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల సమాచార వ్యవస్థ బాగా మెరుగుపడింది. 15వేల కిలోవిÖటర్ల మేర రైల్వే మార్గాలను నిర్మించి రవాణా రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇలా ఎన్నో రంగాలలో దేశం అభివృద్ధి చెంది ప్రపంచంలోనే నాలుగవ పెద్ద దేశంగా నిలిచింది. కాబట్టి విÖరంతా బాగా చదివి మంచి పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి పాటు పడాలని కోరుతున్నాను” అని ప్రసంగాన్ని ముగించారు.

ఆ తరువాత ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి గారు ప్రసంగించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మిఠాయిలు పంచారు.

ఆవరణలో పిల్లలందరు మిఠాయిలు తింటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటుంటే ఉపాధ్యాయు లందరూ హెడ్మాస్టరు గారి గదిలోకి వెళ్లారు.

ప్రతి సంవత్సరం జెండా వందన కార్యక్రమం తరువాత హెడ్మాస్టరు గారి గదిలో ఉపాధ్యాయులకు తేనీటి విందు జరుగుతుంది. అది ఆ స్కూలు ఆనవాయితీ.

హెడ్మాస్టరు గదిలో మాస్టార్లంతా కూర్చున్నారు. తెలుగు ఉపాధ్యాయుడు పార్వతీశం మాట్లాడుతూ “మాస్టారూ! ఈ రోజు జెండావందనం బాగా జరిగింది. శ్రీధర్ మాస్టారు చాలా ఉత్తేజకరంగా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. కానీ, కార్యక్రమానికి మన ఊరి సర్పంచ్ నాయుడుగారు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది” ఆన్నాడు.

“నేను స్వయంగా వెళ్లి పిలిచాను. అయినా రాలేదు. ఆయన కొడుకు రాజుకి బాగా మార్కులు రాలేదని మొన్న ఆయనతో చెప్పాను. బహుశా ఆ కోపం వల్ల రాలేదేమో?“ చెప్పారు కృష్ణమÖర్తి.

వెంటనే శ్రీధర్ కల్పించుకుంటూ “హెడ్మాస్టరు గారూ! మీరు సర్పంచ్ గురించి ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నాను. ఆయన కొడుకు రాజు అల్లరి స్కూల్లో రాను రాను ఎక్కువై పోతోంది. అమ్మాయిల్ని బాగా ఏడిపిస్తునాడు. మొన్న సోషల్ మాస్టారు రామారావు గారి అమ్మాయి రోజాని, నిన్న మా అమ్మాయి ప్రియని ఏడిపించాడు. దీని గురించి విÖరు ఆలోచించాలి. అవసరం అయితే ఆ నాయుడిని పిలిపించి, కొడుకుని అదుపులో పెట్టుకోవాలని చెప్పండి” అన్నాడు.

“శ్రీధర్! కొడుక్కి నచ్చచెప్పవలసిందిగా సర్పంచ్‌కి ఎన్నోసార్లు సూచించాను. అయినా ఫలితం లేదు. నా ఉద్దేశ్యంలో రాజు తండ్రిమాట వినే రకం కాదు. ఇప్పటికే వాడిని రెండుసార్లు స్కూలు నుంచి సస్పెండ్ చేశాను. అందుకే సర్పంచ్ నాయుడు, నా విÖద, మన స్కూలు విÖద రగిలిపోతున్నాడు. మన ఎమ్మెల్యే గారికి కూడా మన విÖద ఫిర్యాదు చేశాడు.

నెల రోజుల్లో నేను ఇక్కడ నుంచి బదిలీ కావడం ఖాయం. కాబట్టి ఆ రాజు విషయంలో నేనేం చెయ్యలేను. మీరే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడం మంచిది. మీరంతా ఆలోచించుకొనీ ఓ నిర్ణయానికి రండి” అన్నారు హెడ్మాస్టర్.

“మాస్టారూ! మేము ఫిర్యాదు చేసేకన్నా ఈ స్కూలుకి హెడ్‌గా మీరు చేస్తేనే బాగుంటుంది. దానికి ఓ విలువ ఉంటుంది. అప్పుడు మనం అంతా ఒక్క మాటవిÖదే ఉన్నామన్న విషయం అందరికీ తెలుస్తుంది” అన్నాడు పార్వతీశం.

 కృష్ణమÖర్తి గారు బదులిస్తూ, “గ్రామాల్లో ఇటువంటి రాజకీయాలు సహజం. అయినా నేను బదిలీకి భయపడను. విÖరు చెప్పినట్లు మన స్కూలు తరఫున ఒక ఫిర్యాదు పత్రం రాసిస్తాను. మీర ఎస్సైని కలసి దానినిన ఇవ్వండి. అప్పుడు వాళ్లే ఆ రాజు గాడి విÖద చర్య తీసుకుంటారు” అన్నాడు.

ఆ తరువాత అందరూ టీ తాగి వెళ్లిపోయారు. బయట శ్రీధర్ కోసం ఆయన కూతురు ప్రియ మామిడి చెట్టు కింద ఎదురు చూస్తూ కనిపించింది. ఆమెను అక్కడ చూడగానే…

“ఏం తల్లీ! ఇంటికెళ్ల లేదా?”అడిగాడు శ్రీధర్.

“లేదు నాన్నగారూ! ఇప్పుడే వచ్చేస్తాను..ఇక్కడే ఉండు అని విÖరే కదా చెప్పారు. అందుకే ఉన్నాను” అంది నవ్వుతూ ప్రియ.

“సారీ ప్రియా! హెడ్మాస్టర్ గారి గదిలో ఈరోజు మాకు విÖటింగ్ ఇంతసేపు ఉంటుందని అనుకోలేదు” అని చెప్పాను.

తండ్రీకూతురు ఇంటికి బయల్దేరారు.

****

శ్రీధర్ బలభద్రపురం పాఠశాలలో సైన్సు టీచరుగా చేరి ఐదు సంవత్సరాలవుతోంది. ఆయనది ఆ ఊరే. ఆ బడిలోనే పదవ తరగతి వరకు చదివి ఆ తరువాత విజయనగరంలో డిగ్రీ వరకు చదివి, బి.ఈడీ చేశాడు.

అదృష్టవశాత్తూ అతనికి వెంటనే టీచరుగా ఉద్యోగం వచ్చింది. మొదట్లో అతడిని అరకు ఏజన్సీ ప్రాంతంలో వేసారు. ఆ తరువాత మళ్లీ డీయస్సీ రాసి బి.ఈడీ అసిస్టెంట్‌గా ఎంపికై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి మారిపోయాడు.

అతని భార్య కౌసల్య. ఆమె కూడా డిగ్రీ చదివినా గృహిణిగానే ఉండిపోయింది.

ఆ దంపతులకు ప్రియ ఒక్కర్తే కూతురు. ఆ ఊరి హైస్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఆమె క్లాసు ఫస్టు. ముఖ్యంగా లెక్కలు, సైన్స్‌లో మంచి మార్కులు వస్తుంటాయి.

“నాన్నగారూ! ఆ రాజు మమ్మల్ని అల్లరి పెడుతున్నాడని హెడ్మాస్టరు గారికి చెప్పారా?” అడిగింది ప్రియ తండ్రిని.

“చెప్పానమ్మా! నేనే కాదు తెలుగు మాస్టారు, సోషలు మాస్టారు కూడా చెప్పారు.హెడ్మాస్టరుగారు రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.అప్పుడు పోలీసులే వాడి భరతం పడతారు. నువ్వేం గాబరా పడకు. వాడి సంగతి మేము చూసుకుంటాము” అన్నాడు శ్రీధర్.

“నాన్నగారూ! ఎల్లుండి ఆదివారం మా క్లాసువాళ్లంతా పిక్‌నిక్‌కి వెళుతున్నారు. మన ఊరి ఏటి ఒడ్డు తోటలోనే. నేనూ వెళతాను. వంద రూపాయలిస్తే చాలు” అంది ప్రియ.

“విÖ ఆడపిల్లలంతా అక్కడికి వెళితే మళ్లీ ఆ రాజుగాడు వాడి గ్యాంగ్‌తో వచ్చి మిమ్మల్ని అల్లరి పెడతాడేమో? మళ్లీ వారం మా మేస్టర్లంతా పిక్‌నిక్ వెళుతున్నాము. అప్పుడు మాతో వద్దువుగానిలే!” చెప్పాడు శ్రీధర్.

“వాడేం రాడు నాన్నా! మా ఫ్రెండ్సు వాళ్ల నాన్నలొస్తామంటున్నారు కాబట్టి భయమేం ఉండదు. వెళతాను నాన్నా” అంది ప్రియ.

“సరేలే! అలాగే వెళ్లు. అమ్మకి చెబుతాను. డబ్బులిస్తుంది” చెప్పాడు శ్రీధర్.

కొద్ది సేపటికి ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.

“ఇంత ఆలస్యం అయిందేంటి?”అడిగింది కౌసల్య వాళ్లకి నీళ్లు ఇస్తూ…

“హెడ్మాస్టరు గారు టీపార్టీ ఇచ్చారు. అందుకే ఆలస్యమైంది” చెప్పాడు శ్రీధర్.

“అమ్మా! నాన్నగారు ఇప్పుడే వస్తానని చెప్పి గంట వరకూ బయటకురాలేదు. అంతవరకూ నేను చెట్టుకింద ఎదురు చూస్తూ నిలబడ్డాను” అంది ప్రియ తండ్రివిÖద తల్లికి ఫిర్యాదు చేస్తూ.

“మీ నాన్న ఎప్పుడూ అంతే! కబుర్లలో పడితే ఎవ్వరూ గుర్తుండరు. పదండి భోజనాలు చేద్దురు గాని” అంది లోపలికి వెళుతూ…

ఆ తరువాత ఇద్దరికీ డైనింగ్ టేబుల్ విÖద భోజనాలు వడ్డించింది.

“ప్రియ పిక్‌నిక్ వెళతానంటోంది. ఏం చేద్దాం?” అడిగాడు శ్రీధర్ కూర కలుపుకుంటూ.

“నేను వద్దంటే మాత్రం విÖరు వింటారా ఏమిటి? కూతురు ఏం అడిగినా ఈ తండ్రి కాదనడని నాకు బాగా తెలుసు? పంపండి. వెళుతున్నది తన స్నేహితురాళ్లతోనే కదా?” అంది కౌసల్య.

“నేను ఏం చేసినా ఈ ఇంటి ఇల్లాలిగా నీకు చెప్పడం నా ధర్మం. నువ్వు వద్దంటే కాదనే ధైర్యం ఎవరికి ఉంది చెప్పు ఈ ఇంట్లో?” అన్నాడు నవ్వుతూ.

ఇంతలో ప్రియ తల్లివైపు చూస్తూ “అమ్మా! మా ఫ్రెండ్స్ చాలా మంది నా పేరు ప్రియ అయితే చేతి విÖద ‘వనజ’ అని పచ్చబొట్టు ఎందుకుంది?అని అడుగుతున్నారు?” అంది తన ఎడమ చేయి విÖద ‘వనజ’ అని రాసి ఉన్న పచ్చబొట్టును చూపిస్తూ.

ఆమె మాటలకు కూతురుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక భర్త వైపు చూసింది కౌసల్య.

శ్రీధర్ వెంటనే “ప్రియా! నేను చిన్నప్పుడు అరకు`పాడేరు ఏజన్సీ ప్రాంతంలో పని చేసాను. అప్పుడే నువ్వు పుట్టావు. అక్కడ పుట్టిన వాళ్లకు అక్కడి గిరిజనుల ఆచారం ప్రకారం ‘వనజ’ అంటే ‘అడవి బిడ్డ’ అని పచ్చబొట్టు పొడుస్తారు. అందుకే నీకు అలా పచ్చబొట్టు వేయించాము” చెప్పాడు శ్రీధర్.

“అంటే పుట్టగానే నా పేరు ‘ప్రియ’ అనీ పెట్టలేదా విÖరు?” అడిగింది ప్రియ.

“పెట్టాము కానీ అక్కడి వాళ్ల ఆచారం కాబట్టి అలా వేయించాము. అయినా వనజ పేరు కూడా బాగుంది కదా? అయినా పచ్చబొట్టు ఏదైతేనేం నీ పేరు ప్రియే కదా” అన్నాడు శ్రీధర్.

“కానీ ప్రతివాళ్లు ‘వనజ’ పేరు చూసి నన్ను ఈ ప్రశ్నే అడుగుతుంటారు. ఎంతమందికని చెప్పాలి చెప్పండి?” అంది ప్రియ కోపంగా.

“ఈసారికి అందరికీ ఒకేసారి చెప్పేయ్. అప్పుడు ఇంకెవ్వరూ అడగరు“ అన్నాడు శ్రీధర్ నవ్వుతూ.

వాళ్ల మాటలకు విసుక్కున్న కౌసల్య “పచ్చబొట్టు సంగతి సరే! ఆ రాజు గాడు స్కూల్లో అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడట. మొన్న ప్రియ వెంట పడ్డాడట. ఆ విషయం హెడ్మాస్టరు గారికి చెప్పారా?” అడిగింది.

“ఇవాళ మా మేస్టార్లందరం టీ పార్టీ సందర్భంగా హెడ్మాస్టరు గారితో ఈ విషయం చెప్పాం. దీనిపై పోలీసు స్టేషన్‌కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రేపో ఎల్లుండో పోలీసులొచ్చి వాడికి గట్టిగా బుద్ధి చెబుతారు”అన్నాడు శ్రీధర్.

“బుద్ధి చెబుతారో లేక వాడిచ్చే డబ్బులకు కక్కుర్తిపడి వదిలేస్తారో? ఆ పోలీసులు గానీ ఏవిÖ చెయ్యకపోతే వాడు మరీ రెచ్చిపోతాడు. ఇంక వాణ్ణెవ్వరూ పట్టుకోలేరు. సోషలు మాస్టారు గారైతే వాడి బాధ పడలేక తన కుటుంబాన్ని విజయ నగరానికి మార్చేస్తానంటున్నారట” అంది కౌసల్య.

“నువ్వేం గాబరా పడకు కౌసల్యా! రేపు ఎస్సై గారొస్తే మేము ఆయనతో మాట్లాడతాము. అప్పుడు వాడి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది“ అన్నాడు శ్రీధర్.

****

ఆ మర్నాడు మధ్యాహ్నం వేళ ఎస్సై సుధీర్ హైస్కూలుకి ముగ్గురు కానిస్టేబుళ్లతో కలసి వచ్చాడు.

 హెడ్మాస్టరు కృష్ణమÖర్తి ఉపాధ్యాయులందరితో తన గదిలో ఎస్సైతో సమవేశమయ్యారు.

“ఎస్సైగారూ! మా హైస్కూల్లో రెండు వందల మంది పిల్లలు చదువుతున్నారు. చుట్టుపక్కల ఐదు ఊళ్ల నుంచీ కూడా పిల్లలు ఇక్కడికి చదువుకోవడానికి వస్తుంటారు. నాలుగేళ్ల క్రితం ఇదే స్కూల్లో 10వ తరగతి వరకూ చదివిన ఈ ఊరి సర్పంచ్ నాయుడు గారి కొడుకు రాజు మా స్కూలు ఆడపిల్లల్ని బాగా అల్లరి పెడుతున్నాడు.అంటే ఈవ్‌టీజింగ్ చేస్తున్నాడు.

అతనికి ఐదుగురు అనుచరులున్నారు. ఒక విధంగా ఆ ఆరుగురు ఈ ఊరికే కాదు చుట్టుపక్కల ఊళ్లకు కూడా ‘రౌడీగ్యాం>’´ అన్నమాట. రోజూ ఉదయం, సాయంత్రం స్కూలు దగ్గరకు వచ్చి అమ్మాయిలను మారుపేర్లు పెట్టి ఏడిపించటం, వాళ్లకి వాట్సాప్‌ల్లో అసభ్యకరమైన మెసేజెస్ పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఇది రెండు సంవత్సరాల నుంచీ బాగా ఎక్కువై పోయింది. క్రితం సంవత్సరం ఇదే స్కూల్లో నుంచి ఆరుగురు అమ్మాయిలు వాడి బాధపడలేక టీసీలు తీసుకొని వెళ్లిపోయారు. ఇప్పుడు మా ఉపాధ్యాయులు కూడా తమ పిల్లల్ని ఈ స్కూలులో చదివించడానికి భయపడుతున్నారు.

వారం క్రితం మా సోషలు మాస్టారి గారి అమ్మాయిని, మొన్న సైన్స్ మాస్టారు గారి అమ్మాయిని వాళ్లు బాగా ఏడిపించారు. ఈ స్కూలు హెడ్మాస్టరుగా రెండుసార్లు మీ స్టేషన్లో ఫిర్యాదులిచ్చా. కానీ వాడి విÖద ఏ విధమైన చర్య తీసుకోలేదు. దాని వల్ల వాడు మరింత రెచ్చిపోతున్నాడు. మీవల్ల కాకపోతే మేము ఎస్పీగారిని కలుస్తాము” చెప్పారు హెడ్మాస్టరు.

“హెడ్మాస్టరు గారూ! నేను కూడా పదిహేనేళ్ల క్రితం ఇదే స్కూల్లో చదివాను. మండల పోలీస్ స్టేషన్‌కి ఎస్సైగా వచ్చి నాలుగు నెలలవుతోంది. కాబట్టి క్రితంసారి ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్ననే విÖ పిర్యాదు అందింది. దానిని పరిశీలించి.. అది నిజమైతే తప్పక వాడివిÖద చర్యలు తీసు కొంటాను” చెప్పాడు ఎస్సై సుధీర్.

“మీరు ఆ పని చేస్తే ఈ స్కూలుకి, మా అందరికీ ఎంతో మంచి చేసిన వారవుతారు. ఎమ్మెల్యే, సర్పంచ్ గార్ల గురించి విÖరేం భయపడకండి. అతనితో మేము మాట్లాడతాము. ఇలా ఆడపిల్లలను ఏడిపించే వాళ్లను ఎవ్వరూ సమర్థించరు” అన్నాడు కృష్ణమÖర్తి.

“మాస్టారుగారూ! అతను ఎవరెవరిని ఏడిపించాడో వాళ్లను పిలిపించండి.వాళ్లతోనూ, వారి తల్లితండ్రులతో మాట్లాడతాను. వాళ్ల దగ్గరి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకొని వాడిని అరెస్ట్ చేస్తాను” భరోసా ఇచ్చాడు సుధీర్.

వెంటనే హెడ్మాస్టర్ ఆ అమ్మాయిలను పిలిచాడు. వారిలో శ్రీధర్ కూతురు ప్రియ కూడా ఉంది. ఎస్సై వాళ్లతో మాట్లాడి స్టేట్‌మెంట్లు తీసుకున్నాడు. ీసోషల్, సైన్స్ మాస్టార్లు కూడా తండ్రుల హోదాలో, సర్పంచ్ కొడుకు రాజుకి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు.

ఆ మర్నాడు ఎస్సై పదిమంది కానిస్టేబుళ్లతో వెళ్లి రాజును, అతని నలుగురు అనుచరులను అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కి తీసికెళ్లాడు. దాంతో ఊళ్లో గొడవ మొదలైంది. సర్పంచ్ నాయుడు బడి దగ్గరికి వచ్చి హెడ్మాస్టర్‌తో గొడవకి దిగాడు.ఈ విషయం తెలిసిన అతని వ్యతిరేకవర్గం వారు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

గంట తరువాత అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు.రెండు వర్గాల వారిని చెదరగొట్టి వాళ్లలో చాలామందిని అరెస్ట్ చేయడంతో సద్దుమణిగింది.

 (సశేషం)

– గన్నవరపు నరసింహ మూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.