విశ్వమాంగళ్య సభలో మోహన్‌జీ భాగవత్ ప్రసంగం
భగవద్గీతలో విభూతి యోగంలో భగవంతుడు తన విభూతుల (శక్తుల) వర్ణన చేశాడు. నేను మాసాలలో మార్గశిర మాసాన్ని, ప్రకాశాన్ని ఇచ్చే వస్తువుల్లో సూర్యుడిని. అస్త్రశస్త్రాలు ధరించడంలో రాముడిని. యాదవ వంశంలో నేను కృష్ణుడిని… పురుషవాచకమైన ఆ శక్తులన్నీ వ్యక్తిలో ఒక ఉన్నతమైన గుణం రూపంలో ఉన్నాయి. కానీ మహిళల విషయంలో ఒక్కొక్కటిగా ప్రస్తావన లేదు. సంపూర్ణ మహిళ ప్రస్తావన ఉంది. కీర్తి, శ్రీ, వాక్కు, నారీ స్మృతి, మేధ, ధృతి, క్షమ వంటి ఉన్నతమైన గుణాలన్నీ మహిళల్లో కనిపిస్తాయి. అందుకే, మహిళాజాతి శక్తిమంతమైనది.
అందుకే, సంతు సన్యాసులు వచ్చినప్పుడు, చిన్న పిల్లలతో కూడా మాట్లాడతారు. పేరుపెట్టి పిలిచే పరిచయం లేనంతవరకూ ఆమెను అమ్మా అని పిలుస్తారు. జగత్‌జనని అనే అర్థంలో ఇక్కడ మహిళలకు మర్యాద ఎందుకంటే, ఆమె శక్తి, జగత్‌జనని, ఆమె దేవి. ఆమె ఏమైనా చేయగలదు. స్వయంగా శక్తి స్వరూపం. అందుకే, మోక్షం, పురుషార్థంలో స్వతంత్రురాలు. ప్రతి ఒక్కరి ఆత్మ సమానమే, కనుక ప్రతి ఒక్కరూ దానిని సాధించాలి. ఆత్మ నుంచి పరమాత్మ కావడంలో, అర్థకామాలలో కూడా ఇద్దరూ సమానమే. కానీ, అర్థకామాలు ఉపభోక్తలు, వాటి సాధనాలు మనకు తెలుసు. కానీ, మనం ‘నేను సుఖంగా ఉంటే సంభవమ’ని అనుకున్నాం. ఎందుకంటే, సుఖంగా ఉండాలన్న కోరిక అనంతమైనది.
ఏమీ లేనప్పుడు నడిచి వెళ్లేవాళ్లం, బజారు దగ్గరగా ఉంటే బాగా అనిపించేది. తర్వాత సైకిల్ వచ్చింది. అప్పుడు అదే బజారుకు నడిచి వెళ్లడం కష్టంగా అనిపించింది. స్కూటర్ వచ్చింది, కారు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇంకా కావాలి. ఉన్నదాని గొప్పదనం ఏమీ లేదు. ఇది మనిషి గుణం. ఇది దుర్గుణమే. మనుషుల కోరికలు అనంతం. పృథ్విపై వనరులు పరిమితం. అందుకే, వనరులు అందరికీ దక్కాలి. అందరితో కలిసి నడవాలి. అందరి ఉన్నతి జరగాలి. ఎందుకంటే, అందరూ ఒక్కటే. కానీ, వేరువేరుగా కనిపిస్తారు. నమ్మకాలు వేరు, భక్తి వేరు, పూజ వేరు, భాష వేరు, బుద్ధి కూడా భిన్నంగా ఉంటుంది. ఆర్ధిక స్థాయి వేరు. అందరూ సుఖంగా ఉండాలి. కనుక, అర్థం అంటే పని అనే ఒక క్రమశిక్షణ. దానిని ఒక ముఖ్య పురుషార్ధంగా భావిస్తారు. ప్రధానంగా, గృహస్తులు ధర్మాన్ని నిర్వహించాలంటే, ఒక్కరూ సరిపోరు. కేవలం పురుషుడు ఒక్కడే పూజ చేయలేడు. అతడితో పాటు అతని భార్య ఉండాలి. కేవలం మహిళ మాత్రమే పూజ చేయలేరు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఉండాలి. ఇదే ధర్మం.
ధర్మం అనేది క్రమశిక్షణ. దీని ద్వారా కామార్థాల కోసం సహజంగా శ్రమిస్తుంది కుటుంబం. అన్ని జీవులూ జీవించాలి, వారి పొట్టనింపుకోవాలి. అందుకు ఒక సాధానం కావాలి. అది నేర్పనవసరం లేదు. అది అందరూ చేస్తారు. కానీ, అందులో ఒక క్రమశిక్షణ, సంయమనం, మరొకరి కోసం త్యాగం ఉండాలి. త్యాగం లేకుండా ధర్మం ఉండదు.
ధర్మం మనుషులు చేసే త్యాగం ద్వారా నెరవేరుతుంది. త్యాగం మనుష్యుల బాధ్యత. ఇది మిగిలిన జీవులకు లేదు. మనుషులు, పశువులలో ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తి అనే నాలుగు విషయాలు సమానం. జీవశాస్త్రం మనం కూడా పశువులమే. కానీ, విశేషించి మనుషులు ధర్మాన్ని అనుసరిస్తారు. బుద్ధి కారణంగా ఇతర ప్రాణుల కన్నా మనిషి సమర్థవంతుడు. జ్ఞానంతో వనరులను ఉత్పన్నంచేసి, వాటి ఆధారంగా సమర్ధుడై పాలిస్తాడు. అందుకే, అది అతడి బాధ్యత. సృష్టి నడవాలి, సృష్టిని నడిపించాలి, అందుకే ధర్మం అతడి ప్రత్యేకత. ధర్మం లేకుంటే అతడు పశువుతో సమానం.
విశ్వకళ్యాణం కోరుకునే రుషులు మునులు దీక్ష తీసుకొని కఠోర తపస్సు చేశారు. దాని నుంచి జాతీయ బలం, శక్తి ఉత్పన్నమయ్యాయి అని మన చరిత్ర చెబుతుంది. వేదం బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ బాధ్యతను తీసుకోవాలంటే, పెద్ద సమాజం అవసరం. మొత్తం ప్రపంచానికి ఇవ్వాలంటే, కనీసం 140 కోట్లమంది తమ జీవితాలను ప్రపంచానికి విషయం తెలిసేలా జీవించాలి. కానీ వీరందరికీ ఏక కాలంలో నేర్పలేం. అందుకని యÖనిట్లుగా విభజిం చాలి. సమాజపు యÖనిట్ కుటుంబం. సమాజంలో ఉన్నట్టే కుటుంబంలో కూడా పురుషుడు ఉంటాడు. మహిళ కూడా అంతే. వారు సమాజ స్థాయిలో, కుటుంబస్థాయిలో ఉంటారు. కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ పుట్టి పెరిగే పిల్లలను సామాజికంగా, యోగ్యంగా, ధార్మిక చరిత్ర ఉన్నవారిగా తయారు చేయాలి. తద్వారా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, విశ్వ అస్తిత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదం చేయగలరు. ఇది కుటుంబ విధి. కానీ ఇదంతా చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? దీనితో ధర్మం పెరగాలి, మొత్తం ప్రపంచం సవ్యంగా సాగాలి. ఇది కుటుంబం పని. వివాహం అయిన తర్వాత కుటుంబం ఏర్పడుతుంది.
మన సంప్రదాయంలో వ్యక్తి వివాహం చేసుకునే అవసరం లేదనుకొనే పద్ధతి రుషుల కాలంలోనే భావించారు. కానీ, వివాహం చేసుకోకూడదనుకుంటే దాని క్రమశిక్షణ వేరే ఉంటుంది. బ్రహ్మచారిణి, బ్రహ్మచారి,సన్యాసి, సన్యాసిని వీరందరికీ నియమాలు భిన్నమైనవి. సమాజం వారిని క్రమశిక్షణలో ఉంచు తుంది. అందుకోసమే నియమాలు తయారుచేసింది. వాటికి అనుగుణంగా ఉండాలి. అలా ఎందుకుంటా రంటే, వారికి ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. వీటన్నింటినీ వదిలిపెడతారు. కానీ, వాటిని వదలకపోతే ఏం చేయాలి? అందుకే, ధర్మాన్ని పాటించే సమాజంలో వివాహం ఒక క్రమశిక్షణ అవు తుంది. ఇప్పుడు దానికి పర్యాయం లివింగ్ రిలేషన్ షిప్. మోడర్నిటీ.. కానీ దీని పరిణామాలు ఏమిటి? దీనికి ఆధారం సరిగ్గాఉందా? వీరికి బాధ్యత వద్దు, సుఖం కావాలి. అందువల్ల, కావాలన్నప్పుడు కలిసి ఉండ టం, లేదంటే వదిలిపోవడం. బాధ్యతలేదు. కానీ, దీనివల్ల ఏం వృద్ధి చెందుతుంది? మొత్తం ప్రపంచాన్ని చూడండి.
మోడర్నిటీ అవసరమే. సమయానికి అనుసారంగా మారాలన్నది కూడా మన పరంపరలో నియమం. గతంలో ఉన్నదంతా సరైనదే అని చెప్పడం లేదు. తెలివైన వారిని పరీక్షించి నియమిస్తారు. పరీక్ష మనకేం చెప్తోంది? మోడర్నిటీని స్వీకరించాలి, కానీ మోడర్నిటీ లేకపోతే డిగ్రడేషన్ ఉంటుందని అనుకోనక్కరలేదు. కానీ వీరు కళ్లు మÖసుకుని పాశ్చాత్యులను అనుకరిస్తారు. మనం నిస్సహాయులం కాము. మనం అంతా సరిగ్గా చేస్తాం, చేయగలం. అటువంటి వారసత్వం మనకు లభిం చింది. మనలో ఆ శక్తి ఉంది. దీని గురించి చింత వ్యక్తం అవుతోంది మీ నుంచి. ఇప్పుడు సంపన్న వర్గాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఆంగ్ల విద్య వచ్చింది, దానివల్ల లాభం ఉంది. విద్య అవసరమే. కానీ, దానితో పాటుగా ఈ బ్యాగేజ్ వస్తుంది. ఈ విద్య లభ్యం కాని వారున్నారు. వారు కష్టంలో ఉన్నారు. వారికి విద్య లభించాలి, కానీ ఈ బ్యాగేజ్ కాదు.
సమాజంలో ఎల్జీబీటి ప్రవృత్తులు ఉంటాయి. కొన్ని ప్రకృతి సిద్ధంగా వచ్చినవి. మనమేం చేయలేం. వారు అలా జన్మించారు. కానీ, కొన్ని మానసికత కారణంగా తెచ్చుకున్నవి. కొన్ని శరీరానికి శస్త్రచికిత్స చేయించుకుని తెచ్చుకున్నవి. ఈ జాడ్యం మొత్తం ప్రపంచంలో ఉంది. కానీ మన దేశంలో లేదు అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నారు. వారు కూడా మనుషులే. వారికి జీవించే అధికారం ఉంది. వారిని సమాజం నుంచి మనం దూరం చేయలేం. సమాజంలో వీరికి కూడా ఒక ఏర్పాటు ఉంది. వారిని హీనభావనతో చూడవద్దు. శిఖండి ఒక రాజు, ఇతర వీరులతో సమానంగా పోరాడాడు. వారికి కూడా దేవీ దేవతలు ఉన్నారని మనకు తెలుసు. కుంభమేళాకు వస్తుంటారు. అక్కడ కూడా ఏర్పాట్లు జరిగాయి. ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పగల సమగ్ర ఏకాత్మదృష్టి ఆధారంగా మనం ఆలోచన చేస్తే, అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ ఉండే మాతృత్వ భావన పరంపరాగతంగా, కాలాను గుణంగా తయారు కాబడినదే. మాతృత్వానికి శక్తి ఉంది. ఒక కాలంలో తల్లిని దేవత అన్నాం, జగత్‌జనని శక్తి అన్నాం. అయితే విదేశీ దాడుల దుష్పరిణామంతో శక్తికి ప్రతిరూపంగా ఆరాధిస్తున్న ఆమెను బంధించటం ప్రారంభించాం. మధ్యలో కొంతకాలం సమాజం అస్థిరంగా ఉంది, దేవి అని భావిస్తూనే ఆమెను దాసిగా చేసి, ఇంట్లో కట్టి పడేశాం. ఇప్పుడు మనం స్వతంత్రులం. మన మెదడు కూడా మెల్లమెల్లగా స్వతంత్రం అవుతోంది. శక్తి స్వరూపిణియే మహిళ. ఆమెను గౌరవిస్తాం, మంచిదే. కానీ, భౌతికంగా, మానసికంగా ఆమె మనలాంటిదే. బుద్ధిపరంగా కూడా ఆమె మనిషే. ఆమెకు అవస రాలు, కోరికలు ఉంటాయి. కుటుంబం నడపడం అన్నది ఆమె పనే. ఎందుకంటే, కుటుంబాన్ని నిర్వహించాలంటే మమత, వాత్సల్యం అవసరం. అందుకే, ఆమె కుటుంబానికి కేంద్రం బిందువు అవుతుంది. పిల్లలకు తొలి గురువు అవుతుంది. కానీ, అదంతా చేసిన తర్వాత కూడా, ఆమెకు తనదైన జీవితం ఉంటుంది. ఆమెకు కూడా ఆకాంక్షలు ఉంటాయి. పూర్వకాలంలో మహిళలు పని చేయాల్సిన అవసరం పడేది కాదు. కొంచెం కష్టపడి సంపాదించిన దానితో సర్దుకునేవారు. ఇప్పుడు అలా కాదు, మహిళలు పని చేయవలసిందే, కలిసి కుటుంబాన్ని నడపాలి. తల్లిదండ్రుల నేతృత్వంలో అందరూ నడవాలి. కుటుంబంలో టీం వర్క్ అవసరం. మనం అసంపూర్ణ దృష్టితో అంధాను కరణం చేయడంవల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు కాలం మారింది కొత్త కొత్త అవసరాలు పెరుగుతున్నాయి. గతకాలపు శాశ్వత విలువలను బలంగా ఉంచుతూ, కాలానుగుణమైన రూపం కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు చేయగలరు? ఈ విషయంపై నా ఉపన్యాసం వినే బదులు, ఇక్కడున్నవారు సమర్ధులు. యుగ యుగాలుగా వారు ఇదే పని చేస్తూ వస్తున్నారు. ఇది మీ పనే. మీరు కదలండి, అడుగువేయండి. భారతీయ మహిళలకు అన్నీ చేయడం తెలుసు, వారు అన్నీ చేయగలరు అని వివేకానందుడంతటివాడు అన్నాడు. మన (పురుషులం) పని ఏమిటంటే, మధ్యలో మనం జోక్యం చేసుకోకుండా ఉండడం. మన సమాజంలో ఏదైనా జరగాలంటే స్త్రీ పురుషులు ఐక్యంగా ఉండాలి. వాస్తవానికి, ఇదే మన సంప్రదాయ లక్షణం. అయినప్పటికీ, ఇది ఆధిపత్య ప్రాతిపదికన పనిచేసినట్లుగా ప్రచారం జరుగుతోంది, కొంతమంది దీనిని గుడ్డిగా అంగీకరించారు.
మన పూర్వీకులు సృష్టికి సంబంధించిన సత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, స్వీకరించి, భవిష్యత్ తరాలకు అందించి, మనమందరం ఒక్కటే అని బోధించే వారసత్వాన్ని మనకు వదిలివెళ్లారు. కుటుంబ విషయంలో మహిళలే పరిష్కారాలను వెతకండి, అమలు చేయండి, ఈ మహత్తరమైన ప్రయోగాన్ని ప్రపంచానికి చూపండి.