పేరు పెట్టడం ఆనందదాయకం అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదికగా విశాఖ నిలుస్తుంది. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా కొత్త రూపు దాల్చనుంది. దీనికి తోడు కొత్త రైల్వేజోను, పోర్టులు, జలరవాణా, జాతీయ రహదారులు ఇలా విశిష్ట సామర్థ్యమున్న విశాఖకు కాలాను గుణంగా అనుసంధానం పెరగాల్సి ఉంది. అయితే నేవీ ఇచ్చిన స్లాట్స్ ప్రకారం 85 విమానాల కంటే ఎక్కువ నడపలేని పరిస్థితి ఉంది. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా ప్రసిద్ధి చెందిన ఈ భోగాపురం విమానాశ్రయం, విజయనగరానికి 28 కిలోమీటర్లు, విశాఖకు 48 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండి, ఈ మÖడు జిల్లాలతోపాటు ఒడిశా ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

అల్లూరి సీతారామరాజు మీద ఎన్నో గ్రంథాలు (సుమారు 40 పైన) వచ్చినా డాక్టర్ గోపరాజు నారాయణ రావు రాసిన “ఆకుపచ్చ సూర్యోదయం: మన్యం వీరుడు అల్లూరి గాథ” గ్రంథం సమగ్ర రచన అని చెప్పవచ్చు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లాలోని పండ్రంగి గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్య నారాయణమ్మ. ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు. 1908లో తండ్రి మరణించడంతో కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డది. భీమవరం, కొవ్వాడ, రాజమండ్రి, కాకినాడ లలో విద్యా భ్యాసం జరిగింది. కాకినాడలో మద్దూరి అన్నపూర్ణయ్య (గోదావరి జిల్లా స్వాతంత్య్ర సమరయోధుడు)కి సహాధ్యాయి అయ్యాడు. చివరగా విశాఖపట్నం మిసెస్స్ ఎ.వి.ఎన్. కళాశాలలో ఉండగా, ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు.

అల్లూరి సీతారామరాజు, మద్దూరి అన్నపూర్ణయ్య కాకినాడ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. బానిస చదువులు వద్దు దేశసేవే ముఖ్యమని ఇద్దరూ చర్చించుకునేవారు. బ్రిటిష్ వారి చిహ్నాలున్న పతాకాలను నిరసిస్తూ వాటిని నేలకేసి కొట్టేవారు. మన్యంలో అల్లూరి పోరాట వార్తలను ప్రజలకు తెలియజేస్తూ విప్లవ బీజాలను ప్రోత్సహించారు మద్దూరి.

మన్యం ప్రాంతంలో బ్రిటిష్‌వారు గిరిజనులను వేధించడాన్ని అల్లూరి తీవ్రంగా వ్యతిరేకించారు. సాంప్రదాయ విల్లంబులు, పోలీసుస్టేషన్ల నుండి ఎత్తుకొచ్చిన తుపాకులతో బ్రిటిష్‌సైన్యంపై గెరిల్లా దాడి పద్దతిలో పోరాడాడు. ఆయుధాల కోసం చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్ల పై విజయవంతంగా దాడులు చేశారు. తన ఆచూకీ కోసం గిరిజనులను బ్రిటిష్ పోలీసులు హింసించడాన్ని చూసి మనస్సు కరిగి ఆ ఘోరాలను ఆపడానికి 1924 మే 7న స్వయంగా లొంగిపోయారు అల్లూరి. ఆ తరువాత బ్రిటిష్ వారు ఆయన్ను చెట్టుకు కట్టి కాల్చిచంపారు.

మద్దూరి అన్నపూర్ణయ్య, “కాంగ్రెసు, నవ్య” అనే పత్రికలను స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. అల్లూరి సీతారామరాజు మన్య విప్లవ విశేషాలు, ఆయన వీరత్వాన్ని తన పత్రికల ద్వారా మైదానప్రాంత ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఆ రాతల కారణంగా మద్దూరిని దాదాపు 12 సంవత్సరాలకు పైగా జైలులో నిర్భంధించారు.

ఆయన్ను ఒక జైలులో స్థిరంగా ఉంచలేదు. జైలు నుంచి జైలుకు మారుస్తూ చివరకు మధ్య భారత్‌లోని (నేటి మధ్యప్రదేశ్) జైలుకు పంపారు. కూతురుకు మేనమామతో వివాహం జరిగింది. కూతురు పెళ్లికి వెళ్లడానికి పెరోల్ రాలేదు. తరువాత అన్నపూర్ణయ్య భార్య వెంకటరమణమ్మ అల్లుడి ఇంట్లో ఉండి పోయింది. దుర్భరదారిద్య్రం, భర్తకు ఉత్తరం రాయ డానికి మÖడు పైసలు అల్లుడిని అడగలేక ఉత్తరం రాయలేక సతమతమయ్యేది. చివరకు మÖడు పైసలు సంపాదించి తారీఖు వేయకుండా కార్డు రాసి పోస్టు చేసిsది. దానిలో ఇలా వ్రాసింది “ఇంటి దగ్గర నుంచి మీకు ఉత్తరం రావాలని ఎప్ప్పుడు అనిపించినా ఈ కార్డే తీసుకొని చదువుకోవలసినది, దీని మీద తేదీ వేయనిది అందుకే.” అదే ఉత్తరాన్ని ఆయన పదే పదే చదువుకునేవారు. ఆయన జైలులో ఉండగానే భార్య వేంకటరణమ్మ మరణించింది. స్వతంత్ర భారతాన్ని అన్నపూర్ణయ్య చూశాడు కాని ఆమె చూడలేదు.

మద్దూరి వేంకటరమణమ్మ కొల్లూరి వారి ఆడపడచు పెద్దాపురం వాసి. కొల్లూరు కామేశ్వరమ్మ, రామశర్మలకు జన్మించింది. భర్తతోపాటు అనేక కార్యక్రమాలలో పాల్గొంది. రాజమండ్రిలో విదేశీ వస్తువులు అమ్మే షాపు దగ్గర ధŠర్నా చేసి జైలుకు వెళ్ళి 6 మాసాలు జైలుశిక్ష అనుభవించింది. రాత్రులు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేది. సీతానగరంలో మహిళల సంక్షేమం కోసం ఉన్న ఆశ్రమంలో ఎక్కువ సేవా కార్యక్రమాలు నిర్వ హించింది. 1943 జనవరి 6న మరణించింది. వీరి సోదరుడు కె.ఎన్. శాస్త్రి విశాఖకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు.

మహాత్మాగాంధీ తన Young India పత్రికలో అల్లూరి సీతారామరాజు వీరత్వాన్ని, త్యాగాన్ని గురించి కొనియాడుతూ వ్రాసిన వ్యాసంలో “Calling him a ‘great hero’ and bowing head to Raju’s Supreme bravery and sacrifice”. Even though Gandhi was fully committed to non violence (Ahimsa). He publicly recognized Raju’s extraordinary dedication to liberating the mother land.
Gandhiji Wrote “Though I have no sympathy with and cannot admire armed rebellion, I cannot withhold my homage .. a Youth so brave, so sacrificing, so simple and so noble in character as young Shri Rama Raju”.
“I bow my head to the bravery and sacrifice of Sitaramaraju. His dedication to the country is unparalleled, “Raju was not a fituri but a great hero”.

బ్రిటిష్ పోలీసులు తీసిన అల్లూరి సీతారామ రాజు మృతదేహం ఫోటోను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు మద్దూరి అన్నపూర్ణయ్య అంగీకరించలేదు. కారణం, అల్లూరి సీతారామరాజు కాకినాడలోని పిఠాపురం రాజా పాఠశాలలో 3వఫారం (నేటి 8వ తరగతి) కలిసి చదువుకున్నారు. చిన్నప్పటి నుండి ఎంతో అందంగా ఉండి నాటకాలలో ‘శశిరేఖ’ వంటి పాత్రలు వేసేవారని అన్నపూర్ణయ్యకి బాగా తెలుసును. బ్రిటిష్ వారు విడుదల చేసిన ఫోటో అల్లూరిది కాదని వారివాదన. ఇది నకిలీ ఎన్‌కౌంటర్ అని, అల్లూరి బ్రతికే ఉన్నాడని వాదన చేశాడు. గిరిజనులు నేటికి దీన్ని నమ్ముతారు.

అల్లూరి సీతారామరాజు మరణం (1924 మే 7) తర్వాత నాటి జాతీయ నాయకులు, పాత్రికేయులు అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు బ్రిటిష్ వారి క్రూరత్వాన్ని ఎండగట్టడంలో కీలక పాత్రను పోషించాయి. నాటి కాంగ్రెసు సాయుధపోరాటాన్ని సమర్థించకపోయినా, అల్లూరి మరణం తర్వాత వీరత్వాన్ని చారిత్రాత్మకంగా నమోదు చేశారు. “ది హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెసు”లో పట్టాభి బ్రిటిష్‌వారి క్రూరమైన పాలనవలన ఏజెన్సీలో అల్లూరి తిరుగుబాటు, కేరళలో మోప్లా తిరుగుబాటు వచ్చాయని, అడవుýపై గిరిజన హక్కులను కాలరాయడమే దానికి కారణమని ఆయన స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు భౌతికంగా మనకు దూరమైనా ఆయన రగిల్చిన విప్లవజ్వాలలు దేశవ్యాప్తంగా స్వాతంత్య్రకాంక్షను రగిల్చింది. గిరిజనుల గుండెల్లో ఆయన దేవుడిగా నిలిచి పోయాడు. అల్లూరి త్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జిల్లాకు అల్లూరిసీతారామరాజు జిల్లా అని పేరు పెట్టి ఆయనను గౌరవించుకుంది. భారతీయుల గుండెల్లో ఆయన ఇప్పటికీ మన్యం వీరుడు గానే చిరస్మరణీయుడు.

భారత ప్రధాని నరేంద్రమోదీ జూలై 4, 2022లో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తెలుగులో “ఆంధ్రప్రదేశ్ పుణ్యభూమికి నా నమస్కారములు. మన్యం వీరుడు తెలుగుజాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు గారికి నా శతకోటి ప్రణామాలు. ఈ చారిత్రాత్మక వేడుకలో పాల్గొనడం నా అదృష్టం” అంటూ ఉపన్యాసం మొదలు పెట్టారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అల్లూరి చేసిన పోరాటం దేశయువతకు ఎప్పటికి ఒక గొప్ప స్ఫూర్తి. పింగళి వెంకయ్య, పొట్టిశ్రీరాములు, కందుకూరి వీరేశలింగం వంటి ఎందరో మహానుభావులను కన్న పుణ్యభూమి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రంపా విప్ల వానికి వందేళ్లు నిండిన సందర్భంగా దేశస్వాతంత్ర సమరంలో గిరిజనుల పాత్రను కేంద్రప్రభుత్వం గౌరవిస్తోంది. మనదేశం మన సంస్కృతి అనే అల్లూరి సిద్ధాంతాలతోనే నవభారత నిర్మాణం సాధ్య మవుతుంది.

సీతారామరాజు పేరును భారతదేశ సాంస్కృతిక ఏకత్వానికి, గిరిజన గుర్తింపునకు, ధైర్య సాహసాలకు నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. సీతారామ రాజు అనే పేరు కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు. అది భారతదేశపు ఆత్మకు ప్రతిరూపం అని మోదీ పేర్కొన్నారు.

ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్‌కు ప్రతీక అల్లూరి సీతారామరాజు జీవితం. ఆయన పేరు మన దేశాన్ని ఏకం చేసే సమైక్యభారత సిద్ధాంతాన్ని ప్రతిబింబి స్తుంది. సీతారామ అనే పదం భారతదేశ సంస్కృతిని విలువలను, ఆదర్శాలను గుర్తు చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే భారతస్వాతంత్య్రం కోసం, గిరిజన సమాజ హక్కుల రక్షణకోసం ప్రాణాలర్పించిన అల్లూరి పేరు వింటేనే బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిందని అది మన్యం ప్రజల తెగువకు బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని మోదీ ప్రశంసించారు.

 అల్లూరి జననం నుండి బలిదానం వరకు సాగిన జీవితం యావత్ దేశానికి స్ఫూర్తిదాయక మంటూ, మోదీ ఆయనను “మన్యం వీరుడు, తెలుగు జాతియుగ పురుషుడని కీర్తించారు”. విజయనగరం జిల్లా, భోగాపురంలో నిర్మించిన ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్ర యంగా పేరు పెట్టడం ముదావహం

ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సుమారు 2,200 ఎకరాల్లో 4,500 కోట్లతో నిర్మించారు. దానివల్ల భారీ ఎయిర్‌బస్సులు, బోయింగ్ విమానాలు దిగేలా పెద్ద రన్‌వే కలిగి వుండటం, ఉత్తర ఆంధ్రా అభివృద్ధికి గేమ్ చేంజర్‌గా మారనుంది. ఎగిరేపక్షి ఆకారంలో టెర్మినల్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

—-

భారతదేశంలో అనేక విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టారు. వాటిలో

1)       వీరసావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం (పోర్ట్‌బ్ల్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు)

2)       నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (కలకత్తా, పశ్చిమ బెంగాల్).

3)       సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం (అహ్మదాబాద్, గుజరాత్).

4)       షహీద్ భగత్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (చంఢీఘర్).

5)       బిర్సాముండా విమానాశ్రయం (రాంచి, ఝార్ఖండ్)

6)       లోక్‌ప్రియ గోపీనాధ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (గౌహతీ, అస్సాం)

7)       ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం (కర్నూల్, ఆంధ్రప్రదేశ్)

8)       అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనవి.

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.