ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పరివర్తనాత్మక పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యం దిశగా కీలక మలుపు వద్ద నిలిచింది. ఈ పన్నెండేళ్లు ఆంధ్రóప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కలిగినవిగా నిలిచాయి. రాష్ట్రానికి భారీ ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామికాభివృద్ధి, జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటు వంటి వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధి, కొత్త ఆశావాద యుగంలోకి అడుగుపెడుతోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందించి తన నిబద్ధతను చాటుకొంది. 2004-2014 మధ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర పన్నుల వాటాగా రూ.1.32 లక్షల కోట్లు లభించగా, 2014-2027 మధ్య విభజిత రాష్ట్రానికి రూ.4.05 లక్షల కోట్లకుపైగా చేరి 206 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన గ్రాంట్లు 2004-14లో రూ.78,112 కోట్ల నుంచి 2014-27లో రూ.3.32 లక్షల కోట్లకు పెరిగి 325 శాతం వృద్ధి నమోదైంది.ఈ నిధులు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాల అమలుకు బలాన్ని చేకూర్చాయి.
మౌలిక సదుపాయాలు – అభివృద్ధికి పునాది
ఆర్థిక పరివర్తనకు మౌలిక సదుపాయాలే కీలకమని మోదీ ప్రభుత్వం విశ్వసి సిస్తోంది. 2014లో సుమారు 4,193 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారుల పొడవు ప్రస్తుతం 8,700 కిలోమీటర్లకు పైగా పెరిగింది. బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే, విశాఖపట్నం-రాయపూర్ ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్ వంటి ప్రధాన ప్రాజెక్టులు రాష్ట్ర అను సంధానతను విప్లవాత్మకంగా మార్చుతున్నాయి. భారతమాల ఫేజ్-1 కిందరూ.71,842 కోట్లకు పైగా విలువైన రహదారి ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.
విమానయాన రంగంలో భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ విమానా శ్రయాలకు అనుమతులు లభించాయి. తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చెందగా, విశాఖ పట్నం, రాజమండ్రి, కడప, విజయవాడ విమానాశ్రయాలు ఆధునీకరణకు నోచుకున్నాయి.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కల సాకారం
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల ప్రత్యేక రైల్వే జోన్ కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది. విశాఖ పట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరినట్లయింది. రాష్ట్రానికి 2009-14 మధ్య కాలంలో సగటు రూ.886 కోట్లుగా ఉన్న రైల్వే బడ్జెట్ కేటాయింపులు 2026 నాటికి రూ.10,134 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో రూ. 73,743 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. 100 శాతం రైల్వే విద్యుదీకరణను సాధించగా, డబ్లింగ్, కొత్త రైల్వే లైన్లు, ఫ్లైఓవర్లు, స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
సంక్షేమం, పారదర్శకతలతో విస్తృత ప్రయోజనం
మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 21 లక్షలకుపైగా పట్టణ గృహాలు, 2.47 లక్షల గ్రామీణ గృహాలు మంజూరయ్యాయి. 2.68 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ధాన్యం అందుతోంది. 41 లక్షలకుపైగా రైతులు పీఎం కిసాన్ ద్వారా ప్రత్యక్ష ఆర్థిక సహాయం పొందుతున్నారు. 1.69 కోట్ల జనధన్ ఖాతాలు తెరిచారు.1.86 కోట్ల మందికిపైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భద్రత కల్పించింది. 71 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటా తాగునీటి కనెక్షన్లు అందాయి. రూ.1.36 లక్షల కోట్లకు పైగా ముద్ర రుణాలు మంజూరై యువత, చిన్న వ్యాపారులకు తోడ్పాటు నందించాయి.
రైతులు, మహిళలు, గ్రామీణ సమాజ సాధికారత
పీఎం కిసాన్, ఈ-నామ్, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన, కిసాన్ రైల్ సేవల ద్వారా రైతులకు విస్తృత మద్దతు అందుతోంది. ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, పోషణ అభియాన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన వంటి పథకాల ద్వారా మహిళల సాధికారతకు విశేష ప్రాధాన్యం లభించింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీ మద్దతు లభించింది.
విద్య, వైద్యం, మానవ వనరుల అభివృద్ధి
మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత విద్య, పరిశోధన, వైద్య రంగాల్లో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దింది. AIIMS మంగళగిరి, IIM విశాఖపట్నం, IIPE విశాఖపట్నం, IIFT కాకినాడ, NIT తాడేపల్లిగూడెం, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, IISజు= తిరుపతి, IIITణవీ కర్నూలు, కేంద్ర విశ్వ విద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు రాష్ట్ర విద్యారంగాన్ని బలోపేతం చేశాయి. 17 వైద్య కళాశాలలకు ఆమోదం, మెడికల్ డివైసెస్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రాజెక్టులు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి.
పారిశ్రామికాభివృద్ధి, భవిష్యత్ పెట్టుబడులు
కేవలం సంక్షేమానికే కాకుండా భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై కూడా మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. క్రిస్ సిటీ, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియా, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, రక్షణ తయారీ కేంద్రాలు, గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి ప్రాజెక్టులు భారీ పారిశ్రామికీకరణకు పునాది వేస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. విశాఖలో ప్రతిపాదిత 15 బిలియన్ డాలర్ల AI డేటా హబ్ రాష్ట్రాన్ని సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా నిలబెడుతోంది.
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధికి కొత్త వేగం వచ్చింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక కారిడార్లు, రైల్వే విస్తరణ, విమానాశ్రయాల అభివృద్ధి వంటి అనేక కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాయి. అమరావతికి రూ.15 వేల కోట్ల సహాయం, రూ.11 వేల కోట్ల హడ్కో రుణం, రూ.2,245 కోట్ల రైల్వే కనెక్టివిటీ మద్దతు లభించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు దాదాపు రూ.24,000కోట్ల కేంద్ర సహాయం అందింది.
వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుండటంతో రాష్ట్రం స్వర్ణయుగం దిశగా పయనిస్తోంది. భారత్ 2047 నాటికి వికసిత భారత లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో, ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఆవిష్కరణలు, మానవాభివృద్ధికి ప్రధాన శక్తిగా అవతరించడానికి సిద్ధంగా ఉంది.
– ఎన్. మధుకర్
రాష్ట్ర బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్