భారతదేశంలో అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నేతగా నరేంద్ర మోదీ ఒక కీలక మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు అభినందనలు తెలియజేశారు. మోదీ వరుసగా 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగిన సందర్భంగా వివిధ దేశాధినేతలు, ప్రభుత్వ అధినేతలు ఆయన నాయకత్వాన్ని, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజా తీర్పును, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న  భారత్ ప్రభావాన్ని ప్రశంసించారు.

రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్, మోదీని “భారత ప్రధానమంత్రులందరిలో అత్యంత విశిష్టమైన నాయకుడు”గా అభివర్ణించారు. ఆయన భారత్-రష్యా సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని, భారత్ అధునాతన సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసిందని, ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగిందని పెస్కోవ్ పేర్కొన్నారు. రష్యా-భారత్ వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని విస్తరించడంపై కూడా ఆయన నొక్కి చెప్పారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ మోదీకి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వాల మధ్య చర్చలకు ఆయనను ఆహ్వానిస్తూనే, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి జర్మనీ ఆసక్తిగా ఎదురు చూస్తోందని మెర్జ్ పేర్కొన్నారు. మోదీ సాధించిన చారిత్రాత్మక మైలురాయిని, వరుస పదవీకాలాల్లో సాధించిన రాజకీయ స్థిరత్వాన్ని అభినందిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సందేశం పంపారు. ఫ్రాన్స్, భారతదేశం మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని నొక్కిచెప్పిన మాక్రాన్, సాంకేతికత, రక్షణ, ప్రపంచ పాలన (global governance) రంగాలలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మోదీకి అభినందనలు తెలిపారు. ఇరు దేశాలు, ప్రజల కోసం భవిష్యత్తు అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ఇద్దరు నాయకులు ప్రారంభించిన ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ (Special Strategic Partnership) గురించి ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ మోదీకి అభినందనలు తెలిపారు. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూనే, ఐరోపా, ఆసియాల మధ్య అనుసంధానాన్ని పెంపొం దించడంలో గ్రీస్, భారతదేశం కలిసి పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో స్వీడన్-భారత్ సంబంధాలు ఆవిష్కరణ (innovation), సుస్థిరత (sustainability) కేంద్రంగా సాగే భాగస్వామ్యంగా మారడాన్ని స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ ప్రస్తావించారు. గోథెన్‌బర్గ్‌లో ప్రారంభమైన ‘భారత-స్వీడన్ వ్యూహాత్మక భాగ స్వామ్యం’ ఒక మైలురాయి అని పేర్కొన్న ఆయన, దృఢమైన, వినూత్నమైన, సుసంపన్నమైన భవిష్యత్తును కలిసి రూపొందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ విశిష్ట ఘనత సాధించినందుకు డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ మోదీకి అభినంద నలు తెలిపారు. భారత్-డెన్మార్క్ భాగస్వామ్యాన్ని కొత్త రంగాలకు విస్తరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ విజయం అంకితభావంతో కూడిన సేవ, నాయకత్వానికి నిదర్శనమని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అభివర్ణించారు. భారత్‌తో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి సైప్రస్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విజయాన్ని ఒక అద్భుతమైన మైలురాయిగా యÖకే మాజీ ప్రధాని రిషి సునక్ అభివర్ణించారు. ఇది యూకే-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మోదీకి అభినందనలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో భారతదేశం చంద్రునిపై అడుగుపెట్టడమే కాకుండా “నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుంటోందని” పేర్కొన్నారు. సాంకేతికత, రవాణా, భద్రత, రక్షణ రంగాలలో సహకారాన్ని, అలాగే “అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి”గా ఆమె అభివర్ణించిన ఒప్పందంపై చర్చలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈయూ-భారత్ సంబంధాలు గతంలో కంటే బలంగా ఉన్నాయని పేర్కొంటూ, ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించిన మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఆయనను బలమైన, ఆరోగ్యవంతమైన, వివేకవంతుడైన నాయకుడిగా అభివర్ణిస్తూ, రానున్న అనేక సంవత్సరాలు ఆయన విజయవంతంగా రాణిస్తారని పేర్కొన్నారు.

కెనడా ప్రధాని మార్క్ కార్నీ మోదీకి అభినంద నలు తెలుపుతూ, ఈ విజయాన్ని కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు ముడిపెట్టారు. ఇరు దేశాలకు మరింత శ్రేయస్సును అందించడానికి, ఉమ్మడి ప్రయత్నాలను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో పెరుగుతున్న భారత్ పాత్రను, విస్తరిస్తున్న ఆర్థిక సంబంధాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల నుండి సందేశాలు వచ్చాయి. మోదీ సాధించిన విజయాన్ని భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా బ్రెజిల్ అభివర్ణించింది. 2026 నాటికి బ్రెజిల్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 20వ వార్షికోత్సవం వస్తుందని పేర్కొంటూ, సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో, దాని అంతర్జాతీయ స్థాయిని పెంచడంలో దూరదృష్టి గల మోదీ నాయకత్వాన్ని అర్జెంటీనా రాయబారి ప్రశంసించారు. గత పన్నెండేళ్లుగా మోదీ చూపిన ప్రభావాన్ని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆయన అందించిన మద్దతును, దక్షిణ అమెరికా-భారత్ సంబంధాలను విస్తరించడంలో ఆయన పోషించిన పాత్రను ఉరుగ్వే రాయబారి అల్బెర్టో ఆంటోనియో గువానీ అమరిల్లా ప్రశంసిం చారు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వాధినేతగా నిలిచినందుకు గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని ట్రినిడాడ్` టొబాగో ప్రధాని కీత్ రౌలీ కొనియాడారు.

 మోదీకి కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రూటో అభినందనలు తెలిపారు. సామాన్య నేపథ్యం నుండి భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా ఆయన ఎదగడం అంకితభావం, పట్టుదల, ప్రజాసేవకు నిదర్శనమని పేర్కొన్నారు. మోదీని తన అన్నగా, ప్రియమైన స్నేహితుడిగా ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ అభివర్ణించారు. కోట్లాది మందిని పేదరికం నుండి బయటపడేయడం, జనాభా స్థాయిలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను అమలు చేయడం, మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహించడం, గ్లోబల్ సౌత్‌కు బలమైన గొంతుకగా మారడం వంటి ఘనతలను మోదీ పాలనకు ఆయన ఆపాదించారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు, ప్రజా సేవ, జాతీయ అభివృద్ధి పట్ల మోదీకి ఉన్న నిబద్ధతను, ప్రపంచ వేదికపై ఆయన చూపిన ప్రభావవంతమైన నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ విజయం ప్రజలలో నెలకొన్న శాశ్వత విశ్వాసానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

దక్షిణాఫ్రికాలో అలాన్ బీస్లీ, డారెన్ బెర్గ్‌మాన్‌లు సహా జాతీయ అసెంబ్లీ సభ్యులు అంతర్జాతీయ సదస్సులలో మోదీ ప్రదర్శించిన మానవత్వాన్ని, వినయాన్ని ప్రశంసిం చారు. అలాగే భారతదేశం చేపట్టిన మౌలిక సదుపాయాల విస్తరణ, ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అభినం దించారు. మారిషస్ ప్రతినిధులు గ్లోబల్ సౌత్ కోసం మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో భారత దేశం అందిస్తున్న మద్దతును వారు గుర్తించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఈజిప్ట్ ప్రతినిధులు ప్రముఖంగా ప్రస్తావించారు. అనేక రంగాలలో భారతదేశం అందిస్తున్న మద్దతును వారు స్వాగతించారు.

కజకిస్తాన్ అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ టోకాయెవ్ మోదీ పన్నెండేళ్ల స్థిరమైన పదవీకాలాన్ని భారత్-కజకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక మూలస్తంభంగా అభివర్ణించారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ వాణిజ్యం, అనుసంధానం, సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి, అలాగే దక్షిణాసియా, మధ్య ఆసియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిం చారు. తజికిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్తాన్ నాయకులు ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, ఫిన్‌టెక్, సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయత్నాలలో సహకారాన్ని నొక్కి చెప్పారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక వీడియో సందేశంలో, భారతదేశ పరివర్తనలో, ఆర్థిక వృద్ధిని పెంచడంలో, 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుండి విముక్తి కల్పించడంలో మోదీ పాత్రను ప్రశంసించారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు బలపడటాన్ని కూడా నెతన్యాహు ప్రముఖంగా ప్రస్తావించారు. “మజెల్ టోవ్, గుడ్ లక్, నా ప్రియ మిత్రమా, మీ నాయకత్వంలో భారతదేశానికి శుభాకాంక్షలు” అనే మాటలతో ముగించారు. భారతదేశంతో బలపడుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వేడుకగా జరుపుకుంటూ వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ యూఏఈ నాయకులు అభినందన లేఖను పంపారు.గత పన్నెండేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు బలపడటాన్ని, ఆర్థిక సహకారం పెరగడాన్ని సౌదీ అరేబియా నాయకత్వం ప్రశంసించింది. భారత్, గల్ఫ్ సహకార మండలి మధ్య ద్వైపాక్షిక విశ్వాసాన్ని, ఆర్థిక సమైక్యతను పెంపొందించిన మోదీని ఒమన్, ఖతార్, బహ్రెయిన్ దేశాలు ప్రశంసించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు ద్వారా ప్రాంతీయ అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని విస్తరించడంలో మోదీ హయాంలో సాధించిన పురోగతిని ఇరాన్ నాయకత్వం ప్రశంసించింది.

భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే “నా స్నేహితుడు, నా సోదరుడు, నా గురువు” అని మోదీని సంబోధిస్తూ ఒక భావోద్వేగ లేఖను పంపారు. ఆయన మోదీని “బరాయ్ భాయ” లేదా అన్నగా అభివర్ణిం చారు. నమ్మకం, మార్గదర్శకత్వం, ఆప్యాయత, వివేకానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

నేపాల్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఛైర్మన్ రబీ లమిచానే, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే, మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మోదీకి అభినందనలు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మోదీకి అభినందనలు తెలుపుతూ, ఆయన నాయకత్వంపై పదేపదే విశ్వాసం ఉంచిన భారత ప్రజలకు సేవ చేయడంలో నిరంతర విజయం సాధించాలని ఆకాంక్షించారు. బాంగ్లాదేశ్ ప్రభుత్వం హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ విజయాన్ని ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య మైలురాయిగా అభివర్ణించింది. గత పన్నెండేళ్లుగా భారత్-మలేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరంగా విస్తరించిందని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు. పన్నెండేళ్ల మోదీ సుస్థిర నాయకత్వం ఈ ప్రాంతమంతటా పాలనలో స్థిరత్వాన్ని కల్పించిందని మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లాయింగ్ చెప్పారు. మోదీకి సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ అభినందనలు తెలిపారు. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), సింగపూర్ పేనౌ వ్యవస్థ మధ్య చారిత్రాత్మక అనుసంధా నాన్ని ప్రస్తావించారు. మోదీ సాధించిన విజయాన్ని వియత్నాం, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ దేశాల నాయకులు అభినందించారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ మోదీకి అభినందనలు తెలుపుతూ భారతదేశ వృద్ధి, అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచిన ఘనతను ఆయనకు ఆపాదించారు. ఆయన కొరియా-భారత్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఇరు దేశాలకు స్పష్టమైన ఫలితాలు సాధించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచిన మోదీకి మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్సుఖ్ అభి నందనలు తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో మోదీ దార్శనిక నాయకత్వాన్ని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రశంసించారు.

– జాగృతి డెస్క్

About Author

By editor