గణపతిదేవుడు అనుమకొండలో అనునిత్యవ• పాలనా సమస్యలతో ఊపిరి ఆడని దైనందిన జీవితంనుండి కాస్త ఆహ్లాదాన్ని కోరుకున్నాడు. ఈ ప్రయా ణంలో పాలనా అంశం కూడా ఉంది.

చామనపల్లె స్థల వద్ద ప్రవహించే గొనుగు కాలువ ఎవరికి చెందుతుందనే వివాదాన్ని తాను పరిష్కరించలేక అనుమకొండకు నివేదించాడు సబ్బినాడు పాలకుడు అక్షయ చంద్రదేవుడు. అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వవలసిందిగా జాయచోడుని మంత్రి అయిన మంచిరాజును రాజధాని ప్రధాన ప్రాడ్వివాహుడు చెమ్మగిరిభట్టు కోరాడు. మంచిరాజు చామనపల్లె వెళ్లి వ•డు గ్రామాల సమయసెట్టిల అభిప్రాయాలు తెలుసుకుని నివేదికను చెమ్మగిరి భట్టుకు సమర్పించాడు. నివేదికను ఆయన గణపతి దేవునికి వివరించాడు. అప్పుడే ఆయనకు స్వయంగా వెళ్లాలన్న ఆలోచన కలిగింది. ఆత్మీయమిత్రుడు, బావమరిది జాయచోడునితో బయలుదేరి వచ్చాడు.

‘‘మీరు నదులకు, కాలువలకు పటిష్టమైన.. ఎత్తైన రాతిగట్టులు కట్టించడం వలే ఇదిగో ఈ నేలతల్లి ఇలా పచ్చటి కోకలతో సింగారించుకుని పసిడి పంటలు పండిస్తోంది బావగారూ..!’’ అన్నాడు జాయచోడుడు.

ఇద్దరూ బండి వెనుకవైపు తెర తొలగించి దగ్గరగానూ, దూరంగానూ చూస్తూ ముచ్చటించు కుంటున్నారు. పచ్చని ప్రకృతి అందాలను చూస్తున్న వారి ముఖాలలో ఓ తన్మయత్వం కనిపిస్తోంది. నిండుగా పండిన పొలాలు,ఆవలగా విరగకాసిన తోటలు చూస్తూ చిన్న కూనిరాగం తీసి ఓ పాట ఎత్తుకున్నాడు జాయచోడుడు.

‘పచ్చా పచ్చని చేలో.. ఓ యమ్మలాలో..

పసుపు పారాడి నట్టుందే.. ఓ యమ్మలాలో..

ఆకూపచ్చని తోటల్ల .. ఓ యమ్మలాలో..

గోరింట పూసినట్టుందే.. ఓ యమ్మలాలో..’

ప్రకృతి సోయగాలకు జాయసేనాపతి గాత్ర మహిమ తోడుకాగా, ఆ అద్భుత ఆవిష్కరణను అనుభూతిస్తూ అరమోడ్పు కన్నులతో మైమరచి పోయాడు గణపతిదేవుడు. బండి కదలక మొరాయించిది కాబోలు.. పెరికవాడు ఎడ్లను గట్టిగా అదిలిస్తూ చెర్నాకోలతో వాటిని కొడుతున్నాడు.

ఇద్దరికి తన్మయత్వభంగం అయ్యింది.

‘‘అరె.. ఏమయ్యింది బాబూ..’’ అంటూ ఇద్దరూ బండి దిగారు. పంట సిరులతో పరవశిస్తున్న ఆ నేలతల్లిని తాకగానే మరింత పులకించారిద్దరూ.

రహదారి అక్కడి నుండి చాలాఎత్తుగా కొండను ఎక్కుతున్నట్లుంది. ఆ పైకి ఎక్కలేక ఎద్దులు ఇబ్బంది పడుతున్నాయి. పెరికను ఆపి ఇద్దరూ చెరోవైపు బండి చక్రాలను పట్టి పైకి తోయసాగారు. ఎద్దులు ఇలాంటి ఇబ్బంది లేకుండా బండిని పైకి లాగుతున్నాయి.

బండి చక్రాలను పట్టి పైకి తోస్తున్న మహానుభావు లిద్దరికి ఆ పని బహు ఆనందంగా, భలే సంతోషం కలిగిస్తున్నట్లుంది. జాయచోడుడు పాడిన పాటను తిరిగి ఆలపిస్తూ హుషారుగా బండిని తోస్తున్నాడు గణపతిదేవుడు. తన పాటను బావగారు పాడుతుంటే మైమరచి తనూ గొంతు కలిపి బండిని నెడుతున్నాడు జాయచోడుడు.

ఇద్దరూ చూశారు బండి పక్కగా ఓ పొలంగట్టు వద్ద కూర్చున్న వృద్ధ్ద రైతుని.

తాటిఆకుల గొడుగు నీడలో కూర్చుని పక్కగా పోతున్న కాలువ నీటిని ఆనందంగా చూస్తున్నాడా రైతు.

‘‘పెరికా..!కాసేపు బండి ఆపు. ఎద్దులను విడిచి పుచ్చు. కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఎద్దులతో పాటు మనం కూడా..’’ అన్నాడు గణపతిదేవుడు. ఆయన ఆజ్ఞ చెవినపడగానే పెరికె మాత్రమే కాదు ఎద్దులు కూడా తలతిప్పి ఆయనను చూశాయి.

ఆయన దృష్టి మాత్రం గట్టుపై కూర్చుని తన్మయత్వంలో పిల్లకాలువలో పారుతున్న నీటి గలగలను వింటున్న ఆ వృద్ధ రైతుపై పడింది.

‘‘ఎంత అద్భుతమైన జీవితం ఈ రైతుది..??!!’’ అన్నాడు ఆయన.

ఆ రైతు తలతిప్పి చూశాడు ఇద్దరిని. వారి తోజోవిలాసం అతడిని చకితుడ్ని చేసింది కాబోలు లేవబోయాడు.

‘‘వద్దు..వద్దు.. కూర్చో కూర్చో..’’ అంటూ గణపతిదేవుడు అతని దగ్గరకు వెళ్లాడు.

ఆవల పెద్ద చెరువు, ఓ మహాసముద్రంలా కనిపిస్తోంది. దాని గట్లపై కూడా ఏదో పంట.. సస్యశ్యామలంగా ఉంది. దూరంగా మరో చెరువు. దాని ఆవలగా మరో చెరువు.ఆ చెరువుల చుట్టూ కనుచూపు మేర పచ్చని పంట పొలాలు, ఏపుగా ఎదిగి ఒయ్యారంగా కదిలి గాలి తెమ్మెరలతో సయ్యాట లాడుతున్నాయి.

వాళ్ల కళ్లల్లో మెరుపును చూస్తూ ఆ రైతు ‘‘ఆ కనిపించే మేరా భూములన్నీ నావే..’’ మీసం మెలివేస్తూ అన్నాడు.అతని మాటల్లో గర్వం లేదు కానీ ఓ స్థిరత్వపు ఆత్మవిశ్వాసం కనిపించింది.

‘‘ఇంత ఎత్తులో చెరువు..??’’ అర్థ్ధోక్తిలో ఆపాడు జాయపుడు.

‘‘అవును బాబూ..! నేనే తవ్వించుకున్నాను. మొత్తం వ•డు గొలుసు చెరువులు. ఇది నిండితే ఆ నీరు కిందికి పోతుంది. అక్కడో చెరువు. అది నిండితే.. మళ్లీ దానికి కాలవలు. వాటి ద్వారా కిందికి పొతే అక్కడ ఇంకో చెరువు. ఈ వ•డో చెరువు ఎప్పుడూ ఎండదు. బాగా పల్లంలో ఉంది కదా. మొన్న కరవొచ్చిందే.. ఏడేళ్ల కరవు. మీకు కరవు అంటే తెలిసినట్టు తెలీదు. మిమ్మల్ని చూస్తే బాగా బలిసినోళ్లులాగా ఉండారు. ఆ కరవులో కూడా నా ఆ వ•డో చెరువు ఎండలేదు. అప్పుడు అదిగో ఆ పది గ్రామాలలో పంటలు పండాయి. ఎవరో వర్తకుడు వచ్చి మొత్తం పంట అంతా పట్టుకు పోయాడు. గంజి కేంద్రాలు తెరిచి పేదోల్లకు పోస్తానంటే నేనే సొమ్ము తీసుకోకుండా ఇచ్చేశా..’’

ఇద్దరి శరీరాలు జలదరించాయి. అతనికి చెరో పక్కనా చతికిలబడ్డారు.

‘‘దగ్గరలో నది లేదు కదా. కాలువలూ లేవు. వరదలు రావు. మాకు తాగడానికే నీళ్లు లేవు. నా పిల్లలు చెప్పినా వినరు. అందుకే నేనే.. ఒక్కడినే తవ్వుకున్నా. ఇప్పుడు ఈ వ•డు చెరువులు మొత్తం పాతిక ఊళ్లకు..అంటే మొత్తం స్థలకే బువ్వ పెడుతున్నాయి. ఇప్పుడందరూ నన్ను గ్రామదేవుడులా కొలుస్తున్నారు..’’

ఇద్దరూ వంగి ఆ రైతు కాళ్లకి దండం పెట్టారు.

కాస్త మొహమాట పడినా అతడు కూడా సంతోషించాడు.

‘‘నీ పేరేవిటి?’’ అడిగాడు జాయపుడు.

‘‘ఏవో..అంతా చెరువుల బోసోడు అంటారు నన్ను..’’ ఫక్కున నవ్వాడు.. బోసినోటితో.

‘‘రాళ్ల నేలలో నీరు నిలువచేసి పంటలు పండిస్తు న్నాను కానీ నా నోట్లో పళ్లు కాపాడుకోలేకపోయాను. పళ్లన్నీ రాలిపోయాయి..’’ బోసినోటితో మళ్లీ నవ్వాడు.

ఇద్దరూ అతని హాస్య చతురతకు ఫక్కున నవ్వారు.

‘‘ఇలా చెరువులు..అదే గొలుసు చెరువులు తవ్వాలని, తద్వారా నీరు నిలువ ఉంటుందని, పంటలకు ఎప్పుడూ నీళ్లు అందుతాయని నీకు ఎవరు చెప్పారు?’’ అడిగాడు గణపతిదేవుడు.

‘‘మా ఊళ్లో ఎప్పుడో వ•డుతరాల నాడే అప్పటి రాజుగోరు తవ్వించాడంట. నా చిన్నప్పుడు మా తాత చెప్పాడు. ఈ వ•డు తరాలుగా మావూళ్లో కరవు అనేదే లేదు. అది నాకెప్పుడూ గుర్తే..’’

ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు.

‘‘అవును అప్పటి రాజు గోరు.. తవ్వించాడు పెద్ద చెరువు. సముద్రమంత. అక్కడ ఎప్పుడూ కరవులేదు..కానీ మాకు పొలం లేదు. అందుకని నన్ను మా అయ్య ఇల్లరికం ఇచ్చాడు. ఈ రాళ్లపల్లి మా అత్తారి ఊరు. ఈడ పొలం ఉంది కానీ నీళ్లులేక పంటల్లేవ్‌.‌నన్ను మోసంచేసి ఆ యమ్మికి కట్టబెట్టారు. కానీ ఎంతైనా నా ఇంటిది కదా బాబూ.! ఆమెను వదల్లేక నేనే ఇట్టా చెరువులు తవ్వి నీళ్ల దాచిపెట్టుకుని పొలం పండించుకుంటన్నా. ఇప్పుడు ఈ స్థలలోని పాతిక ఊళ్లూ నా చెరువుల నీటితో పంటలతో కళకళ లాడుతున్నాయి. మా యాడది సంతోషించింది. అంతకంటే నాకేమి కావాలి బాబూ..’’

చేతులెత్తి నమస్కరించడం కన్నా విజ్ఞులైన వాళ్లిద్దరూ మరేమీ మాట్లాడలేక •పోయారు. లేచి బండి వైపు కదిలారు.

అప్పుడా వృద్ధ్దుడు ‘‘మా అయ్య నాకు పెట్టిన పేరు. మా రాజుగారి పేరే. ఆయన పేరు అరిగజకేసరి ప్రోలరాజులుం గారు! ఆయన పేరున ఊరును కేసరి సముద్రం అంటారు..’’

మరి కొన్నిగంటల అనంతరం ఎడ్లబండి చామనపల్లె వద్దనున్న గొనుగు కాలువ వద్దకు చేరింది. ఐదు గ్రామాల సమయసెట్టిలు, రైతులు అక్కడికి వచ్చారు. ప్రతివారూ ఆ కాలువపై హక్కులు తమకే దక్కుతాయని గొప్పగా వివరించారు.

గణపతిదేవుడు విన్నాడు. మౌనంగా బండి ఎక్కారు. బండి వెనుతిరిగింది.

సబ్బినాడు మండలేశ్వరుని నివాసానికి వచ్చాక…

‘‘ఆ కాలువపై సర్వహక్కులు.. రాళ్లపాడు గ్రామరైతు కేసరికి సర్వమాన్యంగా రాసి ఇవ్వండి. ఇది నా ఆజ్ఞ!!’’ అన్నాడు.

కేసరి నేర్పిన పాఠం కాకతీయ రాజ్యాన్ని, గణపతిదేవుని వంశాన్ని చరిత్రలో శాశ్వతంగా నిలిపింది..

గొలుసుకట్టు చెరువుల ఆలోచనకు బీజం వేసినవాడు గణపతిదేవుని తాత పేరు పెట్టుకున్న వాడు, చెరువుల బోసోడు.. కేసరి!!

ళి       ళి       ళి

తొమ్మిదవ మెట్టు: కళింగ సరిహద్దులో తెలుగు గ్రామాల విలీనం అఖండ గోదావరి తీరం.. కొలని రాజ్యపు అంచు..

కళింగరాజ్యంపై యుద్ధం ప్రకటించి రుద్రమదేవి, మురారిదేవుల నాయకత్వంలో అపార కాకతీయ సైనిక పారావారం తరలివచ్చి గోదావరి తీరాన ఆగింది. కొలని రాజ్యపు చిట్టచివర..గోదావరి నదీతీరంలోని దట్టమైన అడవుల సవ•హం.

దాదాపు పదివేల గొల్లెనలు వేసుకుని రెండు వ•డు రోజులుగా అక్కడ నిలిచి ఉంది కాకతీయ సైన్యం. నది దాటాల్సిఉంది కాబట్టి సైనికులు కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిదని రుద్రమ భావించింది.

వ•డవ రోజు బాగా తెల్లవారింది. సైనికులు అప్పుడప్పుడే లేచి కాల కృత్యాలు తీర్చుకుంటున్నారు.

మంచి యుద్ధాశ్వం ఒకటి చాలా వేగంగా అక్కడికి వచ్చింది. గొల్లెనల చుట్టూ కాపలా తిరుగుతున్న రక్షణభటులు పరుగున ముందుకు వెళ్లి ఆ అశ్వాన్ని ఆపారు. అశ్వంపై నుండి అశ్వికుడు దబ్బున కిందికి ఉరికాడు. తానెవ్వరో అతడు చెప్పగానే ఓ భటుడు అతని వద్ద ఉండగా, ఆగంతుకుని వివరాలతో ఒకరిద్దరు భటులు లోపలికి పరిగెత్తారు. వెళ్లినంత వేగంగా తిరిగి వచ్చి మరింత గౌరవంగా అతనిని లోపలికి తీసుకువెళ్లారు.ఓ గొల్లెన ముందు ఆగి, లోపలికి సమాచారం పంపించి.. లోపలి నుండి ఆహ్వానం రాగానే అతన్ని లోపలికి పంపి రక్షకభటులు వెనుదిరిగారు.

‘‘రా రా.. గోకర్ణా.. నీ కోసమే చూస్తున్నాను..’’

ఆ మృదుమధుర కంఠం యువరాజ్ఞి రుద్రదేవమ్మ వారిది.

వచ్చిన ఆగంతుకుడు దూరంగానే పూర్తిగా మోకాళ్లపై కూర్చుని తలవాల్చి ఆమెకు నమస్క రించాడు.

‘‘జయము జయము యువరాజ్ఞి..’’

సర్వసైన్యాధ్యక్షులు, మహాయోధులు, శూన్య పాలుడు, సంధి విగ్రహిలు, యుద్ధ తంత్రజ్ఞులు, మందడులు, అంచె బృందాల అధ్యక్షులు.. లాంటి యుద్ధ ప్రముఖుల గొల్లెనలు కొన్ని రహస్యమైన చోట్ల ఉంటాయి. యుద్ధ తంత్రజ్ఞతలో ఈ ముఖ్యుల గొల్లెనల ఏర్పాట్లు కూడా ఓ భాగం. శూన్యపాలునితో పాటు మందడి, సైన్య సాహిణిలు.. ముఖ్యుల స్థానం నిర్ణయిస్తారు. యుద్ధభూమిలోనైనా, దండుబాట లోనైనా, కాకతీయసైన్యంలోని సాధారణ సైనికులు కూడా ఆయా ముఖ్యుల గొల్లెనలను గుర్తించలేరు. యుద్ధవీరుల రక్షణలో అంతటి తంత్రజ్ఞత ఉంటుంది.

చరిత్ర తొలినాటి నుండి కళింగ, ఆంధ్ర రాజ్యాలు రెండూ వేరువేరు జన పదాలుగానే ప్రసిద్ధి చెందాయి.నిజానికి ఉత్తరాన గంగానది నుండి దక్షిణాన గోదావరి నది వరకు విస్తరించి ఉన్న కళింగ రాజ్యం వ•డు భాషలతో మమేకమైన రాజ్యం. దక్షిణ కళింగంలో ముప్పాతిక భాగం ఒండ్రతో తెలుగు, ఉత్తరమంతా ఒండ్రతో బెంగాళం, మధ్య కళింగంపై ఒండ్రతో కలిపి కోసల భాష ఎక్కువగా మాట్లాడతారు.

ఇప్పుడు భాషలు స్పష్టమై తెలుగు వేరుగా, ఒండ్ర వేరుగా మాట్లాడుతూ.. ‘మేము తెలుగువారం’.. ‘మేము ఒండ్ర భాషీయులం’ అని విస్పష్టంగా చెప్పు కుంటున్న ఈ కాలానికి తెలుగుభాష మాట్లాడే కొన్నిగ్రామాలే కాదు…స్థల, విషయ, మండలాలు కూడా ఉన్నాయి. మా తెలుగు ప్రాంతాలన్నీ మా రాజ్యంలో ఉండాలనే కాకతీయ రాజ్యపు వాదనకు తెలుగు ప్రజలు బ్రహ్మరథ•ం పడుతున్నారు.

ఈశాన్య రాజ్యాలలోని తెలుగుభాషా ప్రాంతాలను సాధించుకోవాలంటే కళింగ రాజ్యంపై పూర్తి స్థాయి యుద్ధంతోనే సాధ్యం. చర్చలతో ఫలితం శూన్యం. తన అధీనంలోని ప్రాంతాలను భాష పేరు చెప్పి వదలి వేయడానికి కళింగ పాలకుడు నారసింహదేవుడు సిద్ధ్దంగా లేడు.యుద్ధ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నాడని వార్త.

‘అయినను పోయిరావలె హస్తినకు..’ అని తిక్కనామాత్యులు అన్నట్లు సంధివిగ్రహి ఉరువేల శర్మకు లేఖ ఇచ్చి పంపాడు గణపతిదేవుడు.

‘‘కళింగ ప్రభువులు శ్రీశ్రీశ్రీ నారసింహదేవులకు ప్రణామములు. కాకతీయ రాజ్యాధిపతి మహామండ లేశ్వరులు, రాయగజకేసరి, వ•రు రాయలగండ, శ్రీశ్రీశ్రీ గణపతిదేవ మహారాజులుం గారు తమరికి మరొక్కమారు చేసుకుంటున్న విన్నపములు.

నేటి ఈ ఆధునిక కాలానికి మనం మాట్లాడుకునే భాషలు ప్రస్ఫుటమై తెలుగు, ఒండ్ర భాషలు విడివడ్డాయి. తెలుగుభాష మాట్లాడే ప్రజలున్న ‘మండలా’లను, ‘విషయ’లను మాకు అప్పగించ వలసినదిగా మరోమారు కోరుతున్నాము. మా రాజ్యాలలో ఒండ్ర భాష మాట్లాడే గ్రామాలున్నట్లు మీరు తెలియజేస్తే తప్పక తమరికి అప్పగించగలము. ఇది సుహృద్భావ వాతావరణంలో ఇచ్చి పుచ్చుకునే అంశం. సహజంగా తెలుగుభాషీయులంతా తెలుగు రాజ్య పౌరులుగా కలసి మెలసి జీవించాలని మేము గాఢంగా వాంఛిస్తున్నాము. అదే భావనతో మీరూ ఉన్నారని భావిస్తున్నాము. ఇది సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటే ఉభయులకు శ్రేయోదాయకం. లేకుంటే మేము యుద్ధ రీతిలోనయినా మా గ్రామాలను సాధించుకోగలమని తెలియజేస్తున్నాము.

చిత్తగించవలెను.

భవదీయుడు

గణపతిదేవుడు, కాకతీయరాజ్య మహామండ లేశ్వరుడు.’’

ఊహించినట్లే కళింగ మహారాజు నారసింహదేవుడు దానిని తిరస్కరించాడు. యుద్ధానికి సిద్ధ్దమని ప్రకటించాడు.

కళింగ రాజ్యంతో యుద్ధమంటే మాటలు కాదు. అందుకు రెండు పెద్ద అవరోధాలున్నాయి. మొదటిది గోదావరి నది. రెండవది కళింగ రాజ్యపు బలిష్టమైన గజసైనిక వ్యవస్థ.

చాలాకాలంగా గజసాహిణి జాయచోడుని అధ్వర్యంలో కాకతీయ గజ సైనిక వ్యవస్థ కూడా బలిష్టంగా సిద్ధమైంది.ప్రస్తుతం ఆయన గజసాహిణి కాక పోయినా కాకతీయ గజసైనికవ్యవస్థకు వచ్చిన లోపం ఏమీ లేదు. నాట్యంపై గ్రంథరచనలో ఉన్న జాయసేనాపతి గణపతిదేవుని ఆజ్ఞపై రెప్పపాటులో యుద్ధ క్షేత్రంలోకి దూకగలడు.

కళింగపై యుద్ధానికి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు కాకతీయ యువతరం పాలకులు రుద్రమదేవి, మురారి దేవుడు. యువరాణి రుద్రమ కత్తి యుద్ధ్దంలో సాటిలేని యోధురాలు అని ప్రతీతి. ఆమె కత్తిపట్టి నిలబడితే ఎదుటివాడికి ఊపిరిపీల్చడం కూడా కష్టమేనని చెప్పుకుంటారు ఖడ్గయోధులు. ఆమె ఖడ్గాలు ప్రత్యేకమైనవి. ఆమె ప్రత్యేకంగా తయారు చేయించుకుంటుంది.

‘‘కత్తి పట్టడమా! చెయ్యి చూడు..లేత తామరతూడులా ఉంది.కత్తి ప్రహారాలు సరే! అసలు కత్తిని గట్టిగా పట్టు కోగాలదా..?’’ అని హాస్యమాడిన శత్రు ఖడ్గ యోధుడు వెకిలిగా వాగుతుండగానే అతనికి తెలియకుండా అతను ఖడ్గం పట్టుకున్న చేతిని ముంజేతివరకు నరికి పట్టుకుని అతని ముఖానే చూపిందట కొలని యుద్ధ్దంలో. అప్పుడు వాడు తల దించి చూసుకుంటే ఖడ్గం సంగతి సరే.. అసలు చెయ్యే లేదట!!

కొలని యుద్ధ్దంలో ఆమె ప్రతిభను స్వయంగా చూసిన మేనమామ జాయచోడుడు ఈ ముచ్చట అంతఃపురంలో చెప్పినప్పుడు రుద్రమ పక్కన కూర్చున్న తల్లులిద్దరూ కాస్త పక్కకు జరిగారు. అప్పుడా దృశ్యం చూసిన గణపతిదేవుడు, పరిచారికలు.. ఘోల్లున నవ్వారట.

మురారిదేవుడు మేనమామలాగా గజయుద్ధ విశారదుడని అతని మిత్ర బృందం చెబుతుంది. యుద్ధం, పరాక్రమం సంగతి అటుంచితే ఎప్పుడూ పది మంది మిత్రులను వెంటేసుకుని కబుర్లు చెబుతూ తిరుగుతుంటాడు. ‘కబుర్లు కాదు.. యుద్ధ్దక్షేత్రంలో చూపిస్తా నాతడాఖా..’’ అనేది మురారి నినాదం.

కాల్బలాన్ని, అశ్వదళాలను, గజదళాలను, ఖడ్గయోధులను, గజయుద్ధ విశారదులను సమాయత్తపరచారు. మహామహా సైనికవీరులతోను, సేనానులు, సర్వసైన్యాధ్యక్షుల తోనూ సమావేశాలు నిర్వహించి వారిని పూర్తిగా యుద్ధానికి సిద్ధం చేశారు. ఏ దళాలు ఎక్కడ మొహరించాలో, ఎప్పుడు ఏ దళం ఎటు కదలాలో నిర్ణయించే యుద్ధ నిపుణులతో కూలంకషంగా చర్చించారు.

ఓ శుభ ముహూర్తాన కాకతీయ సైన్యం కళింగంపై యుద్ధానికి తరలింది.

సైన్యం వెళ్లగలిగింది గోదావరి నదీతీరం వరకే. కళింగరాజ్యం గోదావరికి ఆవల, ఈశాన్య వ•లగా ఉంటుంది. గోదావరి చాలా పొడవుగా చాలా చోట్ల చాలా వెడల్పుగా, అనేక చోట్ల చాలా లోతుగా ఉంటుంది. తూర్పు కనుమల్లో చిన్నపెద్ద చాలా కొండలు ఉన్నాయి. నది ఆవల ప్రోలవరం, రేఖపల్లి తదితర రాజ్యభాగాలూ ఈ నైరుతి వ•లగా ఉన్నాయి. నిజానికి గోదావరి నైరుతి వ•లగా మాత్రమే కాక తూర్పు, పడమర వైపున్న అనేక చిన్న పెద్ద రాజ్యాలు కూడా గోదావరికి ఆవల ఉన్నాయి.

ఈ రాజ్యాలన్నింటిని దాటాక కళింగ రాజ్యం ఉంటుంది కానీ ఈ గోదావరి తీరం వరకు ఉన్న రాజ్యాలపై దాడులు చేస్తూ తన రాజ్యంలో కలిపేసుకుంటూ రాజ్యాన్ని విస్తృతపరచుకుంటారు కళింగ పాలకులు.

ఇదంతా గతం!..

ఇప్పుడు భాష ప్రధాన పాత్ర వహించడంవల్ల కళింగరాజ్య పరిధిలో ఉన్న తెలుగు భాషా ప్రాంతాలను తప్పకుండా కలల రాజ్యమైన తెలుగు సామ్రాజ్యంలో కలిపి తీరాలని తిక్కనామాత్యునికి, గణపతిదేవునికి తీవ్రమైన పట్టుదల. తిక్కన విక్రమసింహపుర రాజ్య సమస్యలు ఎన్ని ఉన్నా, ఎవరితో సంఘర్షిస్తున్నా.. ‘తెలుగు రాజ్యం తెలుగు రాజ్యం’ అంటూ గణపతిదేవుని నిత్యవ• పోరుతుంటాడు. తిక్కనామాత్యునికి ఉన్న గూఢచార వ్యవస్థ, సమాచార వ్యవస్థ.. మరే మహాకవులకు, పండితులకు లేవు.

‘కళింగ రాజ్యంలో మన తెలుగు గ్రామాలు బోలెడు ఉన్నాయి. వాటిని తమరు ఎప్పుడు జయిస్తారు?’’ అంటూ లేఖ రాసి• నెల్లూరు నుండి అనుమకొండకు ఓ సమాచారభటుడ్ని పంపిస్తాడు తిక్కనార్యుడు.

అలా నిత్యవ• సొద పెడుతుంటే గణపతిదేవుడు రుద్రమ, మురారిలతో చర్చించి యుద్ధానికి సిద్ధ్దమయ్యాడు.

సైన్యం నది దాటడం అనేదే ఓ పెద్ద యుద్ధం.

లక్షల సైన్యం..మహామత్తగజాలు, అద్భుతమైన యుద్ధ అశ్వాలు.. కత్తులు, కటారులు, డాళ్లు, విల్లంబులు, బల్లేలు మొదలైన ఆయుధాలు, దుస్తులు, ఆహార తినుబండారాలు.వీటన్నింటిని మోసుకువచ్చే ఎడ్ల బళ్లు. వైద్యులు లాంటి సహాయ బృందాలు, చతురంగ సైన్యాలతోపాటు సహాయ బృందాలు, సదుపాయ బృందాలు, ప్రోత్సాహక బృందాలు అనే వ•డు అంచే బృందాలుంటాయి. యుద్ధభూమిలో వారికి పూర్తి తోడ్పాటునందించేవే ఈ అంచే బృందాలు. మంత్రాంగ నిపుణులు, సమాహర్తలు, వేగులు, లేఖకులు, సమాచార నిపుణులు, వార్తాహరులు మొదటి అంచే బృందం.

కత్తులు, ఖడ్గాలు, కవచాలు, డాళ్లు, బల్లేలు, విల్లంబులు, బాణాలు, అంబుల పొదులు మొదలైన ఆయుధాల నిర్వహణ, అశ్వాల సమస్యలు, గజసైన్యపు అవసరాలు, రథాలు, ఎడ్లబళ్ల అంశాలను రెండో అంచె బృందాలు చూస్తాయి. వైద్యబృందాలు, భోజనబృందాలు, చాకలి, మంగలి, కంసాలి, భోగపుసానుల బృందాలు, కళాకారుల బృందాలు, పురోహిత, జ్యోతిష్య బృందాలు.. మొదలైన వారంతా ఈ వ•డో అంచె బృందాల్లోకి వస్తారు.

సైనికులే కాదు ఈ మొత్తం అందరూ..వారి వారి స•కు, సరంజామాతో నది దాటాల్సిందే.

నది దాటించడం అంటే ఏదో చేయి పట్టి పడవ ఎక్కించడం కాదు.

సాధారణంగా అనేకానేక సామాజిక కార్య కలాపాలు నదుల మీదుగానే జరుగుతుంటాయి. నది వెంబడి, రెండు వైపులా రేవులు ఎన్నో ఉంటాయి. అవన్నీ నిత్యవ• పూర్తి స•ందడిగా ఉంటాయి. వచ్చే పోయే ప్రయాణికులే కాదు వస్తురవాణా కూడా నది మీదుగా నిరంతరంగా జరుగుతుంటుంది.

ఇవన్నీ ఒకెత్తు. యుద్ధానికి బయలుదేరిన లక్షోపలక్షల సైన్యం నది దాటడం ఒకెత్తు.

మహాగజరాజులు ఎలా నదిని దాటుతాయి. అశ్వాలు, ఎద్దులు నదిలోపడి మునిగి చనిపోవా! ఒకరు ఇద్దరు కాదు.. లక్షల సైనికులు ఎలా దాటుతారు? ఎన్నిరోజులు పడుతుంది దాటడానికి??

ఇవన్నీ పెద్ద ప్రశ్నలు.

మరో అంశం.. అవతల శత్రువు కూడా నది దాటకుండా అడ్డుకుంటాడు. నదిలో వస్తుండగానే బాణాలు వేసి.. బరిసేలు విసిరి చంపేస్తే??

వీటన్నిటికి జవాబులున్నాయి.

ఆదిమకాలం నుండి జనులు ఎక్కువగా ప్రయాణించింది నదుల మీదుగానే. నదులతో ప్రజలకున్న అనుబంధం ఇంతా అంతా కాదు. అనాది నుండి యుద్ధాలున్నాయి. ఒక్కసారిగా వేలకొద్ది సైనికులు నదులు దాటిన చరిత్రలున్నాయి. అలెగ్జాండర్‌ ‌లాంటి ప్రపంచ ప్రఖ్యాత యుద్ధ యోధుడు ప్రపంచాన్ని జయించాలనే ఆశయంతో సింధు దేశం వరకు వచ్చేడంటే ఎన్నో చిన్న పెద్ద నదులు, సముద్రాలూ దాటడం వల్లనే.

ప్రాచీనకాలంలో మానవ ప్రయాణం ఎక్కువగా నీటి మీదనే జరిగేది అంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ అది నిజం. భూమిపై ప్రయాణం చాలా కష్టతరం, క్లిష్టతరం. ప్రమాదం కూడా. అన్ని కీకారణ్యాలే కావడం వల్ల ఎప్పుడు ఎటు నుండి ఏ జంతువో, ఏ దోచుకునే క్రూరుడో మీద పడతాడనే భయంతోనే ప్రయాణించాలి. నీటిపై ఆ సమస్య లేదు. హాయిగా పడవలో తేలిపోతూ వెళ్ల వచ్చు. వానలూ వరదల కాలంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి.

సైన్యానికి కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది.

సాధారణంగా యుద్ధాలు వేసవి కాలంలోనే నిర్ణయిస్తారు. అప్పుడైతే గోదావరి లాంటి నదులు ఎండకపోయినా ప్రవాహ ఉధృతి తగ్గుతుంది. సాధారణ రేవులు అన్నిచోట్ల నీటి ప్రవాహం తక్కువగానే ఉంటుంది. సైన్యం అక్కడ నది దాటడం చేయదు. కాకపోతే దానికి దరిదాపులలో దాటుతాయి. నీటి ప్రవాహ ఉధృతి తక్కువగా ఉన్నా గోదావరి లాంటి నదుల లోతు మాత్రం భయానకం. దాదాపు రెండు తాడిచెట్లలోతు ఉంటుంది.

అన్ని రాజ్యాలకు నదుల లోతుపాతుల పట్ల అనుభవమున్న నిపుణులు ఉంటారు. నదీతీరాలలో ఉన్న రాజ్యాలలో ఎక్కువగా.. దూరపు రాజ్యాలలో తక్కువ ఉంటారు.

కళింగరాజ్యంలో ఈ సముద్రనిపుణులు ఎక్కువ. కారణం అటు సముద్రం, పైన గంగానది, మధ్యలో మహానది, దిగువన గోదావరి వాళ్లకు సరిహద్దులుగా ఉండటంతో వారి సంస్కృతీ, దైనందిన జీవనం అంతా ఈ సహజ జీవజలాలపైనే పరిణామం చెందింది.

– ‌మత్తి భానుమూరి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE