ప్రతినిత్యం ప్రజాసేవలో సేవాభావంతో తరించే సంస్థ సేవాభారతి అని  తెలగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు.  భాగ్యనగర్ కోఠీలో వైఎమఐఎస్ భవనంలో ‘రక్తనిధి’కేంద్రాన్ని ఆయన మార్చి 29న ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఇంతటి అధునాతన పరికరాలతో కూడిన రక్త నిధి కేంద్రాన్ని  మొదటిసారిగా  చూశానని ఆనందం వ్యక్తం చేశాను. ఇది కేవలం చికిత్స కేంద్రం కాదని,  మానవతా సేవ మందిరమని కొనియాడారు.  జీవితాన్ని  దేశసేవకు అంకితం చేసిన డాక్టర్ హెడ్గెవార్ పేరు మీద  దీనిని  ఏర్పాటు చేయడం అంటే డాక్టర్జీ జీవితాన్ని చరితార్థం చేసినట్లే అని భావం వ్యక్తం చేశారు.ఈ కేంద్ర ఏర్పాటులో చొరవ చూపిన  సేవాభారతికి శుభాకాంక్షలు తెలిపారు.

తాను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు గవర్నర్ నిధి ద్వారా సేవాభారతి కార్యక్రమాలకు సహకరించేవాడినని గవర్నర్ శుక్లాగుర్తు చేసుకున్నారు. ‘వ్యక్తి బాగుంటే దేశం బాగుంటుంది’ అనే సూత్రంతో పెడదారి పడుతున్న యువతలో మార్పునకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. యువతకు మత్తుపదార్థాల అలవాటు నుంచి విముక్తి కలిగించేలా ఉద్యమాన్ని ప్రారంభించానని, ఆ ఉద్యమం క్రమంగా గ్రామస్థాయి వరకు వెళ్లిందని తెలిపారు. అలా అది వేగం పుంజుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పక్షాలు దానిని ముందుకు తీసుకెళ్లడానికి విశేష కృషి చేశాయని గవర్నర్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సేవాకార్యక్రమాల పట్ల విశేషంగా దృష్టి సారిస్తున్నారని చెప్పారు. ఎంపీలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అంటూ వారికి దిశానిర్దేవం చేస్తున్నారని, పాలనా వ్యవహారాలతో తీరికలేకుండా ఉంటూ కూడా ఈ రకంగా ఆలోచించి ఎంపీలకు మార్గదర్శనం చేయడం గొప్ప విషయంగా భావించాలని అన్నారు.

ఆరఎసఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సుహాస్‌రావు హీరేమఠ్ ప్రసంగిస్తూ, రక్తం వ్యక్తి జీవనానికి చాలా అవసరమైనదని, రక్తదాతలో కర్తవ్యభావన, స్వీకరించేవారిలో కృతజ్ఞతాభావం ఉంటాయని అన్నారు. అయితే ఈ ‘రక్త కేంద్రం’ ఈ రెండు గుణాలు కలిగి ఉండడం విశేషం అని అన్నారు. రక్తదానం ద్వారా సంస్కారం కూడా నిర్మాణమవుతుందని అంటూ కొన్నినెలల క్రితం పూణేలో చోటుచేసుకున్న సంఘటనను ఉదహ రించారు. రహదారి ప్రమాదంలో గాయపడిన యువకుడికి అరుదైన గ్రూప్ రక్తం అవసరకమైంది. ఆస్పత్రి యాజమాన్యం సూచన మేరకు రోగి తండ్రితో  వాహనంలో వెళ్లి రక్తదానం చేసి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంటికి కొంత దూరంలో వాహనం ఆపించి నడచి వెళతానని ఆ దాత చెప్పాడు. ఇంటి సమీపంలో జనం గుమికూడి ఉండడాన్ని గమనించిన రోగి తండ్రి విషయాన్ని ఆర్జాతీయగా, రక్తదాత కుమారుడు మరణించాడని తెలిసింది. కన్నీటి పర్యంతమైన ఆయన ‘ఈ స్థితిలో మీరు ఎలా వచ్చారు’ అని అడిగారు. ‘నా కుమారుడు మరణించాడు. తిరిగిరాడు కదా? కాని ఆపదలో ఉన్న యువకుడి ప్రాణం కాపాడడానికి నా రక్తం ఉపయోగ పడుతుందని తెలిసినపుడు అంతకన్నా మంచి పని ఏముంటుందని భావించి, మీరు పిలిచన వెంటనే వచ్చాను’ అని సమాధానమిచ్చారని సుహాస్ రావు గుర్తు చేశారు.

రక్తదానం చర్య మానవత పెంపునకు ఎలా దారితీసిందో మరో సంఘటలను వివరించారు. ముంబైలో చిరువ్యాపారాలు చేసుకొనే ముగ్గురు యువకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఆ విధిలో అల్లమూకగా తయారైనారు. ముంబైలోనే ఒక వ్యక్తి తన భార్యకు అత్యవసరంగా రక్తం అవసరమై ఆ యువకులను సంప్రదించగా, రక్తం ఇవ్వడానికి వాళ్లు ముందుకు వచ్చారు. రక్తదానం చేయడం అదే వారికి తొలిసారి. తన భార్య ప్రాణాలను కాపాడిన ఆ యువకులకు ఆమె భర్త కంటతడితో పాదాభివం దనం చేశాడు. దాంతో తాము ఒక మంచి పని చేశామనే భావన వారిలో కలిగింది. అప్పటి నుండి ఆదర్శ జీవితం గడపడమే కాదు, వారిలో ఒకరు ప్రస్తుతం ముంబైలో ఏ ఆస్పత్రి యాజమాన్యమైనా రక్తం కోసం అతనిని సంప్రదించే టంత స్థాయికి ఎదిగారని వివరించారు. ‘జీవిస్తూ జీవిస్తూ రక్తదానం.. పోతూ పోతూ నేత్రదానం’ అనే లోకోక్తి నిజం కావాలని, ఈ రక్తం కేంద్రం నిరంతరం సేవలు కొనసాగించేలా సేవాభారతి, సంఘం సంయుక్తంగా యోజన చేస్తాయని సుహాస్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

అఖిల భారతీయ ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలె శ్యాంకుమార్ యంగ్‌మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ (వైఐమఐఎస్) లక్ష్యాలను వివరించారు. ఈ భవనంలో గ్రంథాలయం, వైద్యసేవ, యోగా తరగతులు, రక్తం కేంద్రం, ట్యుషన్‌లు జరుగుతుంటాయని, వీటితోపాటు పేద బస్తీలలో బాలసంస్కార కేంద్రాలు, కిశోరివికాస కేంద్రాలు నిర్వహిస్తున్నదని వివరించారు. వైద్యసేవలో వైద్యుని రుసుముతోపాటు మందులు కూడా ఉచితంగా పంపిణి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన వారు రోగులకు అవసరమైన రక్తం కోసం ఇబ్బందిపడడాన్ని తాను భాగ్యనగర్‌లో జిల్లా ప్రచారక్‌గా ఉన్న సమయంలో గమనించినట్లు చెప్పారు. భాగ్యనగర్‌లో పెద్ద రక్త కేంద్రం ఏర్పాటు చేయాలన్న నాటి సంకల్పం ఈనాటికి నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ భద్రత సలహా మండలి సభ్యులు, డాక్టర్ హెడ్గెవార్ బ్లడ్ సెంటర్ అధ్యక్షులు డాక్టర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, అనేకమంది దాతల సహకారంతో ఏర్పా టైన ఈ బ్లడ్ సెంటర్ బాగా వృద్ధి చెందాలని అన్నారు.

రాష్ట్రీయ సేవాభారతి అధ్యక్షులు సునీల్ సప్రే ప్రసంగిస్తూ హిందూ చింతనలోనే సేవాభావం ఉందని అన్నారు. అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసభగవానుడు వాటి సారాంశాన్ని ‘పరోప కారాయ పుణ్యాయ `పాపాయ పరపీడనం’ అని తెలిపారన్నారు. బలంగా ఉన్నవాడే మనగలడు అనేది మన సిద్ధాంతం కాదని, బలంగా ఉన్నవాడు కూడా బలహీనుల గురించి పట్టించుకోవాలనేది మన భారతీయత అన్నారు. ‘క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం న ఉపకరణే’ అన్న ప్రకారంగా, క్రియాసిద్ధి అనే సంకల్ఫంతో రాష్ట్రీయ సేవాభారతి దేశమంతటా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఉదాహరణకు ‘వైభవశ్రీ పేరుతో` మహిళల ఆర్థిక ఉన్నతి కొరకు తమిళనాడులో విశేషంగా పనిచేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో ధన్వంతరియాత్ర పేరుతో గత 25 సంవత్సరాలుగా వనవాసులకు వైద్యసౌకర్యాలను అందిస్తోంది. మహారాష్ట్రలో జనకల్యాణ సమితి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమీషన్ చైర్మన్ విజయభారతి, సేవాభారతి అధ్యక్షులు దుర్గారెడ్డి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ సుందర్‌రెడ్డి, క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కాచంద్రశేఖర్, ప్రాంత సేవాభారతి కన్వీనర్ వాసు, ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి ప్రబల, ప్రాంత సేవాప్రముఖ్ శివశంకర్, బ్లెడ్ సెంటర్ ప్రధాన కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE