గత కొద్ది వారాలుగా తట్టా బుట్టా సర్దుకొని కుటుంబాలతో తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు భారత్‌ – ‌బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దుల్లో కనిపిస్తు న్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ వారికి కష్టకాలం వచ్చిపడింది. బాంగ్లాదేశ్‌ ‌నుంచి అక్రమంగా వచ్చి తిష్ఠవేసినవారిని తిరిగి పంపించేం దుకు సువేందు అధికారి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. వారిని జైళ్లలో పెట్టి పోషించేందుకు అల్లుళ్లు కాదని, పారిపోవడమే ఉత్తమమని హెచ్చరించారు. మరోవైపు అక్రమ చొరబాట్ల కారణంగా దేశంలో ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ‌జడ్జి జస్టిస్‌ ‌ప్రకాష్‌ ‌ప్రభాకర్‌ ‌నావ్లేకర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా అధికారులను ఆదేశించారు. అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాలుగా మారాయని జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పొరుగు దేశం నుంచి చొరబాట్లు పెరిగితే జనాభా సమతుల్యం దెబ్బతిని అంతర్గత భద్రతకు, శాంతిభద్రతలకు పెద్ద సవాలుగా మారుతుంది. భారీగా జరిగే చొరబాట్ల వల్ల స్థానిక ప్రాంతాలలో జనాభా నిష్పత్తి వేగంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అక్రమ వలసల కారణంగా స్థానిక ఉపాధి, విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ వనరు లపై విపరీతమైన భారం పడుతుంది. వ్యూహాత్మకంగా జనాభా సమతుల్యతను దెబ్బతీయడానికి ఇటువంటి చర్యలను ఒక సాధనంగా వాడుతుంటారని అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ముఖ్యంగా బాంగ్లాదేశ్‌ ‌నుంచి దశాబ్దాలుగా అక్రమ చొరబాట్లు కొనసాగాయి.
పశ్చిమ బెంగాల్‌ ‌జనాభా సుమారు 10.06 కోట్లుకాగా అక్కడ బాంగ్లాదేశీ చొరబాటుదారులు కోటికి పైగా ఉండవచ్చని అంచనా. అస్సోం జనాభా సుమారు 3.68 కోట్లు కాగా బాంగ్లాదేశ్‌ ‌నుంచి చొరబడ్డవారు 50 లక్షల దాకా ఉంటారని భావిస్తు న్నారు. వ•డు వైపులా బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దు ఉండే త్రిపుర మొత్తం జనాభా సుమారు 43 లక్షల వరకు ఉంటే అక్రమ చొరబాట్లు వేలల్లోనే ఉన్నాయని చెబుతున్నారు. మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో కూడా ఇదే సమస్య ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలావరకూ మార్పు వచ్చింది. ఇందుకు కారణం కొత కొన్నేళ్లుగా అస్సోం, త్రిపురలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. మేఘాలయలో ఎన్డీయే, మిజోరాంలో ఎన్డీయే అనుకూల ప్రభుత్వాలున్నాయి. తాజాగా బాంగ్లాదేశీ చొరబాట్లు ఎక్కువగా జరిగే పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కారు రావడంతో ఈ సమస్యకు ఇక తెరపడినట్లయింది.
గుర్తించు, తొలగించు, పంపించు..
‘భారత్‌ ‌ధర్మసత్రం కాదు.. చొరబాటుదారులను వదిలేద్దామా? వారు మన వనరులను దోచు కుంటుంటే చూస్తూ ఊరుకుందామా? బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటుదారులను ఏరివేస్తాం. సరిహద్దు భద్రతను పటిష్టం చేస్తాం’ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్రహోంమంత్రి అమిత్‌ ‌షా చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సువేందు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దీన్ని ఆచరణలో చూపిస్తున్నారు. ముందుగా ఎన్నికల హామీల్లో కీలకమైన మిగిలిన బాంగ్లాదేశ్‌ ‌సరిహద్దులో కంచె ఏర్పాటు కోసం అవసరమైన భూమిని బీఎస్‌ఎఫ్‌ ‌కు బదిలీ చేయడానికి సువేందు అధికారి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దు భద్రత, బాంగ్లాదేశ్‌ ‌నుంచి చొరబాట్లను నియంత్రించడంలో భాగంగా భూమి బదిలీ పక్రియను వెంటనే ప్రారంభించి, 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అక్రమ వలసదారులను ప్రత్యేకంగా వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తే, వారిలో అనేక మంది స్వయంగా వెనక్కి వెళ్లిపోతారంటూ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు అన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. బీజెపీ అధికారంలోకి రాగానే ఇదే పని మొదలుపెట్టింది. బెంగాల్‌లో అక్రమ వలసదారులు పొందుతున్న సంక్షేమ పథకాలను గుర్తించి, వాటిని నిలిపివేస్తున్నట్లు బెంగాల్‌ ‌కొత్త ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ వలసదారుల ఏరివేతకు ‘‘డిటెక్ట్, ‌డిలీట్‌, ‌డిపోర్ట్’’ (గుర్తించు, తొలగించు, పంపించు) విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులను ఏరివేయడానికి జిల్లాల వారీగా జైళ్ల లాంటి ‘హోల్డింగ్‌ ‌సెంటర్లు’ ఏర్పాటు చేసింది. బాంగ్లాదేశీయులు, రోహింగ్యాలను పట్టుకొని వారి వివరాలు తేలేదాకా అందులో ఉంచుతారు. వారి దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి బయోమెట్రిక్‌ ‌వివరాలు సేకరిస్తున్నారు. ఈ తతంగం అంతా సీసీటీవీ, కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది.
వారు ఇంటి అల్లుళ్లు కాదు..
పశ్చిమ బెంగాల్‌ ‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ మనుగడ కష్టమని బాంగ్లాదేశీ అక్రమ వలసదారులు అర్థమైపోయింది. దీంతో తమ సామానులంతా సర్దుకొని కుటుంబాలతో సహా బాంగ్లాదేశ్‌కు తిరిగివెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. సరిహద్దు దగ్గర పెద్ద సందడి కనిపిస్తోంది. హకీంపూర్‌ ‌చెక్‌పోస్ట్ ‌నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్‌ అం‌తటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వామపక్షాలు, తర్వాత తృణవ•ల్‌ ‌సర్కారు వీరిని ఓటు బ్యాంకుగా భావించి ఇప్పించిన నకిలీ గుర్తింపు కార్డులు, పత్రాలతో ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలతో లబ్ధి పొందారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నకిలీ ఓట్ల తొలగింపు పక్రియ చేపట్టినప్పుడే వీరి భయాలు, తిరిగి వెళ్లిపోవడాలు మొదలయ్యాయి. అయితే మమతా బెనర్జీ ఇచ్చిన అభయంతో చివరి ఆశతో ఆగిపోయారు. ఆమె అధికారం కోల్పోవడంతో వీరి ధీమా చెదిరింది.
బాంగ్లాదేశీ వలసదారులను తిప్పిపంపడానికి అమలు చేస్తున్న డిటెక్ట్, ‌డిలీట్‌, ‌డిపోర్ట్ ‌కార్యక్రమాన్ని పరిశీలించడానికి నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. సరిహద్దులకు వెళ్లి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో చేసిన హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. భారత్‌ ‌లోకి అక్రమంగా ఎలా వచ్చారో, అలాగే వెళ్లిపోవాలని సూచించారు సువేందు. పట్టుకొని జైళ్లలో తిండి పెట్టి పోషించడానికి వారేమైనా ఇంటి అల్లుళ్లా? ఇందుకోసం ప్రజాధనం వృథా చేయడం ఇష్టం లేదని.. త్వరత్వరగా పారిపోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
సరిహద్దు చెక్‌ ‌పోస్టుల దగ్గర బోర్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు, సిబ్బంది వీరి పత్రాలు పరిశీలిస్తూ వంతుల వారీగా సరిహద్దు దాటివెళ్లిపోయే అవకాశం కల్పిస్తున్నారు. చొరబాటుదారులు తమంతట తామే తిరిగి వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా స్పష్టం చేశారు.
చొరబాట్ల అడ్డుకట్టకు కమిటీ
దేశంలో అక్రమ వలసలు, చొరబాట్ల కారణంగా జరుగుతున్న జనాభా నిష్పత్తిలో మార్పులను అధ్యయనం చేసి చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధ మైన వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులు తీవ్రమైనవని ఎక్స్ ‌వేదికగా అమిత్‌ ‌షా తెలిపారు. సార్వభౌమత్వానికే కాకుండా జాతీయ భద్రత, అంతర్గత శాంతిభద్రతకు, గిరిజనుల ఉనికికి ముప్పుగా మారాయన్నారు. కేంద్రం నియమించిన కమిటీకి రిటైర్డ్ ‌జడ్జి జస్టిస్‌ ‌ప్రకాష్‌ ‌ప్రభాకర్‌ ‌నావ్లేకర్‌ ‌నాయకత్వం వహిస్తారు. కేంద్ర హోం శాఖ జాయింట్‌ ‌సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్‌ ‌సెక్రటరీగా వ్యవహ రిస్తారు. ఇంకా ఈ కమిటీలో మాజీ ఐఏఎస్‌ అధికారి దుర్గా శంకర్‌ ‌మిశ్రా, మాజీ ఐపీఎస్‌ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త శామికా రవి సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ మతపరమైన, సామాజిక వర్గాల స్థాయిలో జనాభా నిష్పత్తిలో వస్తున్న అసాధారణ మార్పుల తీరును విశ్లేషిస్తుంది. ఆపై దీనికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధమైన, కాలపరిమితితో కూడిన పరిష్కారాన్ని సూచిస్తుందని అమిత్‌ ‌షా తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా పోకడలను అధ్యయనం చేస్తుందని, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతుందని అమిత్‌ ‌షా చెప్పారు. అక్రమ వలసల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విధానపరమైన మార్పులను సిఫారసు చేస్తుందన్నారు.కాగా ఈ కమిటీ ఆచరణాత్మక చర్యలపై దృష్టి సారిస్తూ, నిర్దేశిత గడువులోనే తన నివేదికను సమర్పించాల్సి ఉంటుందని అమిత్‌ ‌షా స్పష్టం చేశారు. సమగ్రమైన సమాచారం, పటిష్టమైన నిర్ణయాల ద్వారా దేశ సమగ్రతను, సామాజిక నిర్మాణాన్ని కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో జనాభా మార్పులు జరగకుండా నిరోధించాల్సిన పూర్తి బాధ్యత బోర్డర్‌ ‌సెక్యూరిటీ ఫోర్స్ ‌మీద ఉందన్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగాలతో కలిసి బీఎస్‌ఎఫ్‌ ‌పనిచేయాలని సూచించారు. చొరబాటుదారుల రహస్య మార్గాలను గుర్తించి, వాటిని శాశ్వతంగా వ•సివేయడం ద్వారా చొరబాట్లకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్‌ ‌షా స్పష్టం చేశారు. అస్సాం త్రిపురలతో పాటు పశ్చిమ బెంగాల్‌ ‌కొత్త ప్రభుత్వం అక్రమ చొరబాట్ల పట్ల వ్యతిరేకంగా కఠిన విధానాలను అనుసరిస్తున్నాయని గుర్తుచేశారు.
సరిహద్దు ఆక్రమణల కూల్చివేత
అక్రమ వలసల ప్రభావం ఇప్పుడు కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. వాటి ప్రభావం పట్టణ కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, గిరిజన ప్రాంతాలు, ఇతర సామాజికంగా, ఆర్థికంగా సున్నితమైన ప్రాంతాల వరకు విస్తరించిందని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని బ్యాంకింగ్‌ ‌లావాదేవీల్లో చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనల అమలును పర్యవేక్షించాలని సూచించింది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను తనిఖీ చేసి, వాటికి అందుతున్న నిధుల వ•లాలను పరిశీలించాలని తెలిపింది. వ్యల్‌ అకౌంట్లు, నకిలీ కంపెనీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ ‌చేస్తూ ఉండాలని సూచించింది. నకిలీ ఆధార్‌ ‌కార్డులను గుర్తించడంతో పాటు సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్‌ను పూర్తిగా అరి కట్టాలని జిల్లా కలెక్టర్లను హోంశాఖ ఆదేశించింది. సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్న నేరాలు, డ్రగ్స్ ‌మహమ్మారి వెనుక ఉన్న నెట్‌వర్క్‌లపై లోతైన అధ్యయనం చేయాలని సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని, ఈ విషయంలో రాజీలేని విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా అధికారులను ఆదేశించారు. ప్రతి సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన 360-డిగ్రీల భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. చొరబాట్లు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌, ఆక్ర మణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యలను పరిష్కరించడానికి బీఎస్‌ఎఫ్‌, ‌సీబీడీటీ, ఎన్‌సీబీ, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సరిహద్దు నిర్వహణకు సమన్వయ విధానం అవసరమన్నారు. ఈ సమావేశంలో సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అందేలా చూడాలని అమిత్‌ ‌షా ఆదేశించారు. అలాగే సైబర్‌ ‌నేరాలను ఎదుర్కోవడానికి ‘1930’ నంబర్‌త• గల కాల్‌ ‌సెంటర్‌ను సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని పిలుపునిచ్చారు.

‌క్రాంతిదేవ్‌ ‌మిత్ర
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE