లవ్‌జిహాద్. అప్పుడప్పుడూ ప్రకంపనలు రేపుతోన్న మహమ్మారి. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోన్న భూతం. మతం పేరిట మహిళలను ఆట బొమ్మలుగా మారుస్తూ, కన్నవాళ్లకు గుండెకోత మిగులుస్తూ, నమ్మిన వాళ్లను అత్యంత క్రూరంగా మోసం చేస్తూ పబ్బం గడుపుకునే నయా గేమ్. ఈ పేరుతో జీవితాలతో ఆడుకుంటోన్న ఒక మతం వాళ్ల దుర్మార్గపు కోరల్లో చిక్కుకుంటోన్న అమాయకపు అమ్మాయిల జీవితాలు నరకప్రాయం అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘరానా మోసం దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. జాతీయస్థాయిలో మహిళా కమిషన్‌ను కదిలించింది. పోలీసులకు ఆదేశాలు జారీ చేసేందుకు కారణమయ్యింది.
హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన పక్కా వ్యూహంతో పరాయి మతానికి చెందిన అమ్మాయిని చెరబట్టేందుకు చేసిన ప్రణాళిక అని స్పష్టంగా అర్థమయ్యింది. ఆ అమ్మాయికి అతను ప్రేమించే మనిషిలా కనిపించాడు. అతను చెప్పిన మాటలు నమ్మింది. చూపించిన సర్టిఫికెట్లు నిజమే అనుకుంది. దుర్మార్గుడని అర్థమైనా.. తన ప్రేమ కోసమే అన్నీ చేశానని అమాయకుడిలా నటిస్తే.. సరేనని తలవంచుకొని తాళి కట్టించుకుంది. వాడు కట్టిన తాళి తన జీవితాన్ని నిలబెడుతుందని ఆశ పడింది. కానీ, పెళ్లయిన మొదటి రోజే ఆ నమ్మకం అంతా నీరుగారిపోయింది. వాడి అసలు బండారం బయటపడింది. ఇక, తన జీవితం చీకటిమయమే అని అర్థమయ్యింది. అయినప్పటికీ కన్నతల్లి, కుటుంబసభ్యులు కుమిలిపోతారన్న ఆలోచనతో అన్నింటినీ మౌనంగా భరించింది. చివరకు వాడు కనిపించకుండా పోయేసరికి ధైర్యం తెచ్చుకొని తన బాధలన్నింటినీ చెప్పుకుంది. తనకు భరోసా కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, ఇది కేవలం అనుకోకుండా జరిగిన మోసం కాదు. ఇది ఒక క్రమపద్ధతిలో, పథకం ప్రకారం అమలు చేసిన మోసం అని అర్థమయ్యింది. దేశంలో “లవ్ జిహాద” పేరుతో బట్టబయలవుతోన్న బండారాల్లో ఇది మరో భయంకరమైన అధ్యాయంగా నిలుస్తోంది.
రెంటల్ వెబ్‌సైట్ ద్వారా మొదలైన వ్యూహం
కూకట్‌పల్లిలో ఒక సాధారణ కుటుంబం. తల్లి, ఇద్దరు కుమార్తెలు. ఆ ఇంట్లో ఒక గది అదనంగా ఉంది. ఆర్థిక అవసరాల కోసం ఆ గదిని అద్దెకు ఇవ్వాలని రెంటల్ వెబ్ సైట్ అయిన నోబ్రోకర్ డాట్ కామ్‌లో ప్రకటన పెట్టింది ఆ తల్లి. ఆ ఒక్క ప్రకటన.. ఆ కుటుంబం జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ఇంటి పెద్ద కూతురు జీవితాన్ని నాశనం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ నవాజ్ అనే 28 ఏళ్ల యువకుడు ఆ రెంటల్ ప్రకటన చూసి ఇల్లు అద్దెకోసం వెతుకుతున్నట్లు నటించాడు. ఆ తల్లీ కూతుళ్లను నమ్మించి వాళ్లింట్లో ఖాళీగా ఉన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో అన్నీ సాధారణంగా కనిపించాయి. కానీ, నవాజ్ వచ్చింది ఆ గది అద్దె కోసం మాత్రమే కాదని అతని చేష్టల్లో అర్థమయ్యింది. కొద్ది రోజుల్లోనే ఇంటి పెద్ద కూతురుతో పరిచయం పెంచుకున్నాడు. మాటలు కలిపాడు. మెల్లగా అవి ప్రేమగా మారాయని నమ్మింప చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ అమ్మాయి వెంటనే ఒప్పుకోలేదు. “మీరు మా మతం కాదు” అని సున్నితంగా తిరస్కరించింది. కానీ, నవాజ్ అన్ని పరిస్థితులనూ ఎదుర్కొనేందుకు, సమాధానాలు చెప్పేందుకు సిద్ధమై వచ్చాడు. తాను గతంలో వేరే మతం అయినా ఇప్పుడు మీ మతంలోకి మారానని మతమార్పిడి సర్టిఫికెట్లు చూపించాడు. అవి నకలీవో, నిజమైనవో తెలియదు.. కానీ ఆ కాగితాలు ఆ అమ్మాయి మనసులో సందేహాన్ని తగ్గించాయి. నవాజ్‌పై నమ్మకాన్ని పెంచాయి. అయితే, ఆమెకు అప్పుడు అర్థం కాలేదు. అది లవ్ జిహాద్ వ్యూహంలో మొదటి అడుగు అని. మత మార్పిడి నటించడం, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవడం, మహిళను నమ్మించడం అనేవి యాదృచ్ఛికంగా జరగవు. ఇవన్నీ ఒక సుదీర్ఘ వ్యూహంలో భాగం. ఇదే లవ్ జిహాద్ మోడస్ ఆపరెండీ అని విశ్లేషకులు అంటున్నారు.
పెళ్లికి ముందే కుతంత్రం
తన ప్రేమను అమ్మాయి నమ్మిందని నిర్థారించు కున్న నవాజ్ పెళ్లి విషయం అప్పుడే తీయలేదు. పెళ్లికి ముందే తన అసలు స్వరూపం బయట పెట్టాడు. బేగంపేట్ ప్రకాశ్‌నగర్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నానని, అది చూపిస్తానని ఒకరోజు అమ్మాయిని తీసుకెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన ఆమెపై తన స్నేహితులతో కలిసి సామూహికంగా లైంగిక దాడికి తెగబడ్డాడు. మరోసారి మొయినా బాద్‌కు తీసుకెళ్లి కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అర్థమైనప్పటికీ ఆమెను నోరు విప్పకుండా చేశాడా దుర్మార్గుడు. ఈ విషయం ఎవరికైనా చెబితే, ఆమె తల్లిని, చెల్లినీ చంపేస్తానని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక వాడికి బలంగా పనిచేసింది. బాధితురాలు ఏమీ చేయలేక, ఎవరికీ చెప్పుకోలేక తనలోతానే కుంగిపోయింది.
పెళ్లి పేరుతో బిగుసుకున్న ఉచ్చు
ఈ పరిణామాలతో అమ్మాయిలో అనుమానం పెరుగుతోందని గ్రహించిన నవాజ్.. మరో కొత్త కథను చెప్పాడు. తనను నిజంగా ప్రేమిస్తున్నానని, పెళ్లికి మీ వాళ్లు ఎక్కడ కాదంటారో, నువ్వు ఎక్కడ వద్దంటావో అన్న ఉద్దేశ్యంతోనే అలా చేశానని.. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని నమ్మించాడు. మరోసారి ఆ నయవంచకుడి మాటలు నమ్మింది. పెళ్లి అయితే అన్నీ సర్దుకుంటాయని ఆశపడింది. జూలై 28, 2025న కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టబద్ధంగాఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ కాగితాలు ఆమెకు రక్షణ కాలేదు. పైగా ఆమెకు ఉచ్చు మరింత బిగుసుకుంది. పెళ్లయిన తర్వాత మొదటి రాత్రి ఆమెకు జీవితంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా ఉండాల్సింది. తాళి కట్టిన చేతులు, జీవితాంతం తోడుం టానని ఇచ్చిన మాటలు.. అన్నీ నిజమే అనుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితం మొదలవుతుందని ఆశపడింది. ఇక తన జీవితంలో అంతా పూలపాన్పూ అనుకుంది. కానీ, ఆ రాత్రి వేచి ఉన్నది ఆమె జీవితంలో వేరే చీకటి. ఆమె సర్వస్వం అనుకొని నమ్మిన వాడే ఆ చీకటిని సృష్టించాడు. ఆమె ప్రేమించిన మనిషే ఆ నరకానికి తెరతీశాడు. పెళ్లయిన మరుసటి రోజు నవాజ్ బేగంపేటలో గది అద్దెకు తీసుకున్నాడు. పెళ్లి వేడుక పేరుతో తన ఐదుగురు స్నేహితులను పిలిపించాడు. ఆ రాత్రి సంబరాల పేరుతో అందరూ మద్యం తాగారు. ఆమెకు వద్దంటున్నా బలవంతంగా మద్యం తాగించారు. స్పృహ కోల్పోయిన తర్వాత భర్త, అతని ఐదుగురు స్నేహితులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలా.. ఆమె జీవితంలో చీకటి తొలిరాత్రి నుంచే మొదలయ్యింది. బాధితు రాలు స్పృహలోకి వచ్చిన తర్వాత మరోసారి ఆమె తల్లినీ, చెల్లెలినీ చంపేస్తామని బెదిరించడంతో ఆ దుర్మార్గాన్ని మౌనంగా భరించింది.
నెలల తరబడి నరకం.. ఆపై మోసం
పెళ్లి తర్వాత కూడా నవాజ్ హింస ఆగలేదు. అతనితో పాటు.. అతని స్నేహితులు, సోదరులు కూడా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ సభ్యులను ఏమైనా చేస్తాడన్న భయంతో వాడి ఆగడాలను మౌనంగా భరించినట్లు వాపోయింది. అంతేకాదు, తరచూ బెదిరిస్తూ.. లక్షలాది రూపాయలతో పాటు బంగారం కూడా పుట్టింటినుంచీ పలు దఫాలుగా తెప్పించాడు నవాజ్. వాడి దుర్మార్గం ప్రేమ పేరుతో మొదలై, పెళ్లి పేరుతో కొనసాగి, లూటీతో ముగిసింది. అయినప్పటికీ బాధితురాలు నెలల తరబడి ఒంటరిగా ఆ బాధను తనలోనే దిగమింగుకుంది. తల్లికి చెప్పలేదు. సోదరికి చెప్పలేదు. తనలో తానే ఏడ్చింది. లోలోపలే కుంగిపోయింది. తన నోటికి తాళం వేసుకుంది.
ఇంత జరిగిన తర్వాత ఈ యేడాది జనవరిలో నవాజ్ హఠాత్తుగా మాయమైపోవడంతో వాడి బండారం మొత్తం బయటపడింది. నవాజ్ ఏమయ్యాడో తెలియదు. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు. అడ్రస్ తెలియదు, దీంతో, బాధితురాలు అతని ఆచూకీ గురించి వెతికే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఒక భయంకర మైన నిజం తెలిసింది. నవాజ్‌కు ఇంతకుముందే మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఈ అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికీ గానీ, ఆమెకు అర్థం కాలేదు. అది ప్రేమ కాదని, ఒక పద్ధతిగా అమలు చేసిన వంచన అని.
ఫిర్యాదు, అరెస్టు
నెలల తరబడి మౌనంగా ఉండి.. వాడి దుర్మా ర్గాలకు గురైన బాధితురాలు వాడి గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాక.. చివరకు ధైర్యం కూడగట్టుకుంది. కుటుంబ సభ్యులకు జరిగిన విషయ మంతా చెప్పింది. వారి సహాయంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫఐఆర్ నమోదైంది. ప్రధాన నేరం బేగంపేటలో జరిగి నందున ఆ కేసు బేగంపేట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. విచారణ ప్రారంభ మయ్యింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రధాన నిందితుడైన నవాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న స్నేహితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
జాతీయ మహిళా కమిషన్ సీరియస్
సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును Deeply Disturbing అంటే అత్యంత కలవరపెట్టే ఘటనగా అభివర్ణించింది. కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ సుమోటోగా ఈ కేసును స్వీకరించి, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే సంబంధిత సెక్షన్ల కింద ఎఫఐఆర్ నమోదు చేయాలని, నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని, విచారణ నిర్ణీత గడువులోగా, వేగంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని, అలాగే, నిందితుల నుండి బాధితురాలికి ఎలాంటి ప్రాణహాని కలగకుండా తగిన రక్షణ కల్పించాలని, బాధితురాలికి వైద్య సహాయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించాలని, అంతేకాకుండా.. ఏడు రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అంతేకాదు.. నూతన వధువుపై ఆమెకు అత్యంత సన్నిహితులే దాడి చేసిన ఈ ఘటన గౌరవానికి, శారీరక స్వేచ్ఛకు, వివాహ పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించడమే అని కమిషన్ స్పష్టంగా ప్రకటించింది. మహిళలపై జరుగుతున్న ఇలాంటి పైశాచిక దాడులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రశ్నే లేదని కమిషన్ తేల్చి చెప్పింది.
నేరస్తులు ఏరూపంలో వస్తారో తెలియదు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ బెదిరింపు వచ్చినా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలి. న్యాయం కాస్త ఆలస్యం కావచ్చు.. కానీ చివరకు గెలుస్తుంది. అలాంటి న్యాయం కోసం ఇప్పుడు మనం చెప్పుకున్న భాగ్యనగరం బాధితురాలు ఎదురుచూస్తోంది.


వ్యూహాత్మక దుర్మార్గం
ఈ వ్యవహారంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.. ఇది హఠాత్తుగా జరిగిన ఘటన కాదు. ఇది వ్యవస్థీకృతంగా, దశల వారీగా అమలు చేసిన వ్యూహాత్మక నేరం.
మొదటి దశ: వెబ్‌సైట్ ప్రకటన చూసి పరిచయం చేసుకోవడం.
రెండవ దశ: ప్రేమ నాటకమాడడం, మత మార్పిడి సర్టిఫికెట్లు చూపించి నమ్మించడం.
మూడవ దశ: మత్తు మందు ఇచ్చి పెళ్లికి ముందే అత్యాచారం చేయడం, బెదిరింపులతో నోరు మూయించడం.
నాలవ దశ: వివాహం చేసుకుని చట్టపరమైన రక్షణ పొందడం.
ఐదవ దశ: పెళ్లి తర్వాత కూడా స్నేహితులతో కలిసి పలుమార్లు అత్యాచారం చేయడం.
ఆరవ దశ: నగదు, బంగారం వసూలు చేయడం.
ఏడవ దశ: మాయమైపోవడం.


సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE