బిహార్‌ ‌కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ ‌చౌధురికి అడుగడుగునా సమస్యలు, సవాళ్లే. మరి కొద్ది కాలం పాటు ఆయనకు ఈ అవస్థలు తప్పకపోవచ్చు. ఇటీవలి వరకూ నితీశ్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమ్రాట్‌ ‌చౌధురి (రాకేశ్‌ ‌కుమార్‌) ఈ ‌పదవిలో నిలదొక్కుకోవడం, నితీశ్‌ ‌కుమార్‌ ‌ప్రభావం నుంచి బ్రయటకు తీసుకు వచ్చి బీజేపీ భావజాలానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని నిర్వహించడం కత్తి మీద సామే. సుమారు 46 ఏళ్లుగా బిహార్‌లో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీకి ఈ రాష్ట్రం మీద పట్టు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. 1980లో తొలిసారిగా ఇక్కడ అధికారం చేపట్టిన బీజేపీ ఆ తర్వాత నుంచి తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. సుమారు 46 ఏళ్ల తర్వాత 57 ఏళ్ల సమ్రాట్‌  ‌చౌధురి మొదటిసారిగా బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.

తమ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి కావడం బీజేపీ కార్యకర్తలను, నాయకులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ‘‘ఈ బడే భాయ్‌, ‌ఛోటే భాయ్‌ ‌సంబంధంలో చివరికి బడే భాయ్‌ ‌పూర్తి స్థాయిలో అందలం ఎక్కడం జరిగింది’’ అని పార్టీ మద్దతుదార్లు పాట్నాలోని పార్టీ ప్రధాన కేంద్రంలో వ్యాఖ్యానించడం వినిపించింది. ఇంతవరకూ నితీశ్‌ ‌కుమార్‌ ‌నాయకత్వంలోని జనతాదళ్‌ (‌యు) పార్టీ ప్రభుత్వానికి కొమ్ము కాయాల్సి రావడం మీద వారు ఈ విధంగా అసంతృప్తిని, అసహనాన్ని, అసమ్మతిని వెళ్లగక్కినట్టు కనిపిస్తోంది. ఇదివరకటి ప్రభుత్వం మీద విమర్శలు, వ్యాఖ్యానాలు చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆచితూచి వ్యవహరించ దలచుకున్నట్టు కనిపిస్తోంది.

బీజేపీకి కొత్త శక్తి

బిహార్‌ ‌రాష్ట్రంలో బీజేపీ తమ సొంత ముఖ్య మంత్రిని నియమించుకోవడమంటే ఆ పార్టీ ఒక పెద్ద మలుపు తిరిగినట్టే భావించాలి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంటుందనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి సమ్రాట్‌ ‌చౌధురి పేరు వినిపించడం ప్రారంభించింది. కులపరంగా, అనుభవపరంగా, దక్షత పరంగా ఆయనకే ఎక్కువగా మద్దతు లభించడం, రాజకీయ చర్చల్లో ఎక్కువగా ఆయన ప్రస్తావనే రావడం మొదలైంది. రాజ్యసభకు వెళ్లడానికి నితీశ్‌ ‌కుమార్‌ ‌సిద్ధపడిన మరుక్షణం బీజేపీ ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించు కుంది. తమ పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. పాలనానుభవం పుష్కలంగా ఉండడంతో పాటు, కులపరంగా కూడా రాష్ట్రంలో పట్టు, పలుకుబడి కలిగిన ఈ కోయిరీ కుష్వాహా నాయకుడి వైపు బీజేపీ నాయకత్వం ఎక్కువగా మొగ్గు చూపింది.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టి నప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారి పోయింది. ఇదివరకటి సాత్వికత స్థానంలో దూకుడు పెరిగింది. ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వంటి నాయకుల తరహాలో ఆయన సత్వర ఫలితాల కోసం ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. సమ్రాట్‌ ‌చౌధురి పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నితీశ్‌ ‌కుమార్‌ ‌కూడా దీనికి అభ్యంతర మేమీ చెప్పలేదు. ఎన్‌.‌డి.ఏ కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలకు కూడా ఈ పేరు విషయంలో అభ్యంతరమేమీ కనిపించలేదు. సుస్థిర ప్రభుత్వం, సంకీర్ణ కూటమి నిర్వహణ, ప్రజారంజక పాలన వంటి విషయాల్లో అవి సమ్రాట్‌ ‌చౌధురికి పూర్తి మద్దతు ప్రకటించాయి.

అభివృద్ధే పెద్ద సవాలు

దేశంలోనే అత్యంత పేద రాష్ట్రమైన బిహార్‌ను సంపన్న రాష్ట్రంగా మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఇది దేశంలోనే రెండవ అతి పెద్ద రాష్ట్రం. సుమారు 13.07 కోట్ల జనాభా కలిగిన ఈ రాష్ట్రం ప్రాథమిక సదుపాయాల కల్పనలో కూడా బాగా వెనుకబడి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. గత ఏడాది నవంబర్‌ ‌నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నితీశ్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వం ప్రకటించిన అనేక వాగ్దానాలను నెరవేర్చడానికి నిధులు లభ్యం కాని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఇక కులపరంగా రాష్ట్రం చీలికలు పేలికలయి ఉంది. నేరాలు, అవినీతి బాగా పెరిగిపోయాయి. శాంతి భద్రతలు అడుగంటిపోయాయి. పారిశ్రామికీకరణ స్తంభించిపోయింది. వ్యవసాయ రంగంలో ఎక్కడా పురోగతి కనిపించడం లేదు. సుమారు 94 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రాష్ట్రంలో పట్టణాల విస్తీర్ణం 1096 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ ఈ రాష్ట్రం పట్టణీకరణకు నోచుకోలేదు. ఇటువంటి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, రాష్ట్ర జీడీపీని పెంచడం సమ్రాట్‌ ‌చౌధురికి పెద్ద సవాలుగా పరిణ మించనుంది.

సమస్యలతో ఉక్కిరిబిక్కిరి

బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.‌డి.ఏ కూటమిలో ఉన్న జనతాదళ్‌(‌యు), లోక్‌ ‌జనశక్తి పార్టీ (రాం విలాస్‌ ‌పాశ్వాన్‌), ‌హిందుస్థానీ అవామ్‌ ‌మోర్చా (సెక్యులర్‌), ‌రాష్ట్రీయ లోక్‌ ‌మోర్చా వంటి పార్టీలను ఒప్పిస్తూ, మెప్పిస్తూ పురోగమించడం కూడా చిన్న విషయమేమీ కాదు. సుమారు ఇరవయ్యేళ్లపాటు నితీశ్‌ ‌కుమార్‌ను అధికారంలో నిలబెట్టిన ఈబీసీలు, ఓబీసీలు, యాదవేతరులు, మహాదళితులతో కూడిన ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం కాకుండా కాపాడు కోవడం మీద కూడా సమ్రాట్‌ ‌సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి విషయంలోనూ సమ్రాట్‌ను నితీశ్‌కుమార్‌తో పోల్చి చూసుకునే అవకాశం ఉంది. నితీశ్‌కుమార్‌ అనుసరించిన లౌకికవాదానికి, సమ్రాట్‌ అనుసరించబోయే లౌకికవాదానికి ఏ మాత్రం తేడా ఉన్నా జనతాదళ్‌ (‌యు) అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.

కొంత కాలం పాటు రాష్ట్రీయ జనతాదళ్‌, ఆ ‌తర్వాత జనతాదళ్‌(‌యు) పార్టీలలో ఉండి నాలుగేళ్ల క్రితమే బీజేపీలోకి వచ్చిన సమ్రాట్‌ ‌తమ సొంత పార్టీ నేతలతో కూడా సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరమ అధ్వాన్న స్థితిలో ఉంది. అభివృద్ధి కార్యక్రమాల కంటే, సంపద వృద్ధి ప్రయత్నాలకంటే సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు రూ.10,000 చొప్పున వారి బ్యాంక్‌ ‌ఖాతాల్లో వేయడం వల్ల రాష్ట్ర ఖజానా మీద అదనంగా రూ. 30,000 కోట్ల భారం పడుతోంది.

మొత్తం మీద బిహార్‌ ‌ప్రభుత్వం గత నాలుగైదేళ్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. ప్రభుత్వం ఏటా రూ.23,000 కోట్లను కేవలం వడ్డీలకు చెల్లిస్తోంది. రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే అట్టడుగు స్థితిలో ఉంది. రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటునైనా చూపించ గలుగుతుందా అన్న సందేహం కలుగుతోంది.

రాష్ట్ర ఖజానా ఖాళీ

‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉంది. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఏమాత్రం అవకాశం కనిపించడంలేదు. ఆర్థిక వనరులన్నీ అడుగంటిపోయాయి. అప్పులను వాయిదా వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాలం గడుపుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్నందు వల్ల కొద్దిగా వెసులుబాటు లభిస్తోంది. కానీ, రాష్ట్ర భవిష్యత్తును తలచుకుంటే భయం వేస్తోంది’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ గగ్గోలు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, విద్యుత్‌ ‌సరఫరా, పాఠశాలల నిర్వహణ, తాగునీటి సరఫరా వ్యవస్థలను నిర్వహించ గలుగుతోంది. ఇది ఎంత కాలం సాగుతుందన్నది అర్థం కాని విషయం. సమ్రాట్‌ ‌చౌధురి సమర్థ వంతమైన నాయకుడని, కార్యదక్షుడని పేరుంది. అపారమైన పాలనాను భవం ఉంది. కేంద్ర ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నందువల్ల సమ్రాట్‌ ‌కొంత వరకైనా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మొత్తం 243 స్థానాల శాసనసభలో 200 పైగా స్థానాల బలం ఉన్నందువల్ల సమ్రాట్‌ ‌తన పథకాలు, కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లగలుగుతారని అనిపిస్తోంది. ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని, ప్రజాసేవే తనకు ముఖ్యమని ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచిన సమ్రాట్‌ ఇప్పుడు ఈ అంశాలకు పూర్తిగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. తనను తాను నిరూపించుకోవడానికి కనీసం వంద రోజులైనా అవసరమవుతాయని సమ్రాట్‌ ‌భావి స్తుండగా, ప్రజలు మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆయన వ్యవహార శైలిని గమనించడం ప్రారంభించారు. రాజకీయ కుటుంబా నికి చెందిన సమ్రాట్‌ ‌చౌధురి సుమారు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన తండ్రి శకుని చౌధురి గతంలో మంత్రిగా పని చేశారు.

గత కొన్నేళ్లుగా బిహార్‌ అవినీతిలోనూ, నేరా ల్లోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది.మాఫియా రాజ్యమేలుతోంది. దీనివల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలి, రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ పరిస్థితి ప్రజల్లో కూడా అసంతృప్తిని, అశాంతిని పెంచుతోంది. ఈ పరిస్థితిని సమ్రాట్‌ ‌ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దని పక్షంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో అవినీతిని, నేరాలను నిరోధించగలిగిన పక్షంలో ఇతర సమస్యలన్నీ చాలావరకు వాటంతటవే పరిష్కారమవుతాయని, సమ్రాట్‌ ‌వీటిపై ముందుగా దృష్టి పెట్టగలిగితే ప్రజల్లో కూడా ఆయన ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగు తుందని పార్టీ నేతలు కూడా అభిప్రాయ పడుతున్నారు.

జి.రాజశుక
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE