అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరలు తొడుక్కున్న సుంకాలను విధించాలని పట్టుబట్టడంతో ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి కొత్త ఊపిరి పోసుకుంది, కానీ తగ్గే సూచనలు లేవు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు లేదా సామూహిక విధ్వంసక ఆయుధాల గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు లేదా ఆయన నడిపే రిపబ్లికన్ వైట్ హౌస్‌కు ఎటువంటి తేడా లేదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రాణాంతక ఆయుధాలు సరఫరా చేయటం లేదా అమ్మటం, సుంకాలు విధించటం లేదా వాటిని సమీక్షించƒటం కూడా అంతే ఉత్సాహంతో చేస్తున్నారు.

నా మునుపటి వ్యాసాలలో ఒకదానిలో, డొనాల్డ్ ట్రంప్ భౌగోళిక-రాజకీయ, ఆర్థిక, వాణిజ్య సంబంధాలలో ప్రపంచ క్రమానికి ‘అతిపెద్ద అంతరాయం కలిగించేవారిలో’ ఒకరు అని  చెప్పాను. ఇటీవలి రోజుల్లో ఇది నిస్సందేహంగా నిరూపితమైంది. గత వారం అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు, డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధాన రూపకల్పనలో కీలకమైన సుంకాలకు కొన్ని గంటల విరామం మాత్రమే కావచ్చు. ఆ కొన్ని గంటల్లో, ఆయన చట్టాలను, సంబంధిత నిబంధనలను మార్చారు. అమెరికా మిత్రదేశం అయినా లేదా శత్రువు అయినా, వ్యాపారం చేసే ప్రతి దేశంపైనా 15 శాతం దిగుమతి సుంకాలను విధించారు.

ఏదైతేనేమీ, అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర ఆర్థిక అధికారాల కింద సాగిస్తున్న పరస్పర సుంకాల పాలన ముగిసి ఉండవచ్చు. కానీ, అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందే వరకు 150 రోజుల పాటు సుంకాలను విధించడానికి ఆయన మరో మార్గాన్ని తెరిచారు.

ఫిబ్రవరి నుంచి కొత్త సుంకాల విధానం అమలులోకి వచ్చినప్పటికీ, ఇవి అత్యంత అనుకూల దేశాల (ఎంఎఫఎన్)కు విధించే సుంకాలను మించిపోయాయి. ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏడు సముద్రాల వెంబడి దేశాధినేతలు కొత్త సుంకాల వల్ల తమ దేశాల భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మిత్రదేశాలను, శత్రు దేశాలను లొంగదీసు కోవడానికి సుంకాలను ఆయుధంగా ఉపయో గించడం ద్వారా, సంబంధాలను నిర్మించడంలో ఒక  పరీక్షకు నోచుకోని కొత్త నమూనాను డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు.

ఈ ప్రక్రియలో అధ్యక్షుడు ట్రంప్ తనను ‘నిర్ణయాత్మక నాయకుడు’గా భావించే దేశీయ శ్వేతజాతి ప్రధాన రాజకీయ నియోజకవర్గాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.  అదే సమయంలో ఆయన తనకు అనుకూలమైన ధోరణిలో అమెరికాను పరిపాలించుకుంటూ పోతున్నారు.

చెల్లింపుల సమతుల్యతకు సంబంధించిన నిబంధనల నుండి, అమెరికన్ ప్రయోజనాలపై వివక్ష వరకు, అమెరికాలోని వాణిజ్య చట్టాలలో అనేక ముఖ్యమైన నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్ తన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మాగా) ప్రచారంలో భాగంగా వాడుకుంటున్నారు.

అమెరికా పాలనపై తన ముద్ర వేయడానికి అధ్యక్షుడు ట్రంప్ దేనికైనా తెగిస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే అనిశ్చితి కాలం కొనసాగుతుంది. చాలా దేశాలు తమ చర్చల వ్యూహాన్ని పునర్నిర్వచించుకోవడానికి ఈ అనిశ్చితి నెలకొన్న కాలాన్ని  ఉపయోగించుకుంటాయి.

కొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ఒక సంవత్సరం చర్చల సమయం లభించడంతో చైనా మెరుగ్గా ఉన్నప్పటికీ, భారత్ తన ఎంపికలను తెరిచి ఉంచింది. వాషింగ్టన్ డీసీతో ఒప్పందం కుదుర్చుకునే ముందు గదిలో మరింత స్వచ్ఛమైన గాలి అవసరం కావచ్చు.

ఇప్పుడు, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల వినియోగాన్ని యూఎస్ సుప్రీంకోర్టు కొట్టివేసినందున యూఎస్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)లో భాగం కావడానికి ప్రతిపాదిత 18శాతం పరస్పర సుంకం నిష్ఫలమైంది. అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు ఏమీ మారలేదని పట్టుబడుతూనే ఉన్నప్పటికీ, భారత్, యూఎస్ మధ్య ఒప్పందం కోసం తాజా చర్చలు జరగడానికి సుంకాలు 18 శాతం కంటే తక్కువగా ఉండటం అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఎఫ్‌టీఏపై ప్రస్తుత రౌండ్ చర్చలను తరువాతి తేదీకి వాయిదా వేయడం అమెరికా, భారతదేశం రెండింటికీ మంచిది.

రెండవది, అన్ని ప్రత్యామ్నాయాలను తెరిచి ఉంచడం భారత్, దాని 140 కోట్ల మంది పౌరుల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది. రానున్న ఆరు నెలల్లో అమెరికాతో మొత్తం ఒప్పందాన్ని తిరిగి రూపొందించడం దురాలోచన కాదు. అది  ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’కి కేంద్రంగా ఉంటుంది. ఈ సందర్భంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా సూచించిన విధంగా, అమెరికాకు వ్యతిరేకంగా బిల్డింగ్ బ్లాక్స్ లేదా యూనియన్లు భారత్‌కు ఒక ఎంపిక కాకపోవచ్చు, అయినప్పటికీ  ఇటీవల భారత్‌ను సందర్శించిన అధ్యక్షుడు లూలా అలాంటి వ్యూహాన్ని ప్రతిపాదించారు.

అదేవిధంగా, భారత్ తన ఇంధన భాండాగారం, వనరులను వైవిధ్యపరచడం ,సొంతంగా ఇంధనాన్ని శుద్ధి చేసే పనులను చేపట్టడం కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలుకు పూర్తిగా ముగింపు పలకడం అనేది సరైన విధానం కాదు.

యూరోపియన్ యూనియన్‌కు మించి భారత్ అందించే సేవలను భారత్ తో మంతనాలు చేస్తున్న దేశాలు, మధ్యవర్తులు తీవ్రంగా పరిగణించాలి. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ‘వ్యూహాత్మక సంబంధాలు’ భారత్‌కు ఎంతటి ప్రత్యేకతకు సంతరించుకున్నదో అంతే ప్రత్యేకతకు బ్రెజిల్‌తో కుదుర్చుకున్న ప్రత్యేక ఖనిజ ఒప్పందం ఒక చక్కటి ఉదాహరణ.

అలాగే, సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేసిన దురాక్రమణలు, అతిక్రమణలు ఉన్నప్పటికీ, చైనాతో కార్యాచరణ అవగాహనకు రావడాన్ని(భారత్) తీవ్రంగా పరిగణించాలి. సరిహద్దు సంఘర్షణలను అరికట్టడం, ఇండో-పసిఫిక్‌లో చైనా తన తప్పుడు వాదనలను వదులుకోవడం బీజింగ్‌తో కుదుర్చుకునే కార్యాచరణ ఒప్పందంలో అంతర్భాగంగా ఉండాలి.

మూడవదిగా, రష్యా`ఉక్రెయిన్, ఇజ్రాయెల్` ఇరాన్ మధ్య వివాదంలో భారత్ శాంతియుతమైన దూకుడు పాత్రను పోషించాలి. అంతేకాకుండా తీవ్రవాదం, మతపరమైన ఉగ్రవాదం. విదేశీ జోక్యాలకు వ్యతిరేకంగా ఏమాత్రం ఉపేక్షించడానికి తావులేని వైఖరిని చేపట్టాలి.

నాల్గవది, భారత్ భద్రతా ప్రయోజనాలను కాపాడటానికి మధ్యస్థం నుండి దీర్ఘకాలికంగా మన ప్రపంచవ్యాప్త భాగస్వామ్యంలో బేరసారాలకు తావులేని చక్కటి సమతుల్యతను సాధించడం లక్ష్యం కావాలి. రిపబ్లికన్ లేదా డెమోక్రటిక్ వైట్ హౌస్ వల్ల భారత్‌కు వచ్చేదేమీ ఉండదు. కనుక భారత్ తన  స్వప్రయోజ నాలను కాపాడుకోవాలి.

 కె.ఎ.బదరీనాథ్

 డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్,

సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్

 హోలిస్టిక్ స్టడీస్, న్యూఢిల్లీ.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE