పాకిస్తాన్‌కు భస్మాసుర హస్తంగా మారిన ఆక్రమిత జవ్మ కశ్మీర్ (పీఓకే)లో ప్రస్తుతం తీవ్రమైన ప్రజా తిరుగుబాటు, పౌర అశాంతి నెలకొంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు, లాంగ్‌మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. భద్రతాదళాల కాల్పులు, హింసాత్మక ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు సుమారు 30 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. నిరసనలను అణచివేయడానికి పాక్ ప్రభుత్వం జాక్ (జెఎఎసి)సంస్థను ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించింది. ఆ సంస్థ ముఖ్య నాయకుడు షౌకత్ నవాజ్ మీర్‌తో పాటు 600మందికి పైగా సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసారు, కఠినమైన కర్ఫ్యూ విధించారు.
సరిహద్దులు, రహదారుల దిగ్బంధనం కారణంగా ఆహార పదార్థాలు, మందుల సరఫరా నిలిచిపోయి తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది. నిరసనకారుల నేతృత్వంలోని ‘జాక్’ నాయకులు ఇప్పటికే ఆహార, మందుల కొరత దృష్ట్యా తమకు సహాయం చేయాలని, నియంత్రణ రేఖ మార్గాలను తెరవాలని భారతదేశానికి బహిరంగ విజ్ఞప్తిచేస్తు న్నారు. కొందరు నిరసనకారులు తమను భారత్‌తో విలీనం చేయాలని, అందుకు సహాయం చేయాలని బహిరంగంగా కోరుతున్నారు. మొదట్లో నిరసన కారులు భారత్‌తో విలీనం కోరలేదు. కాకపోతే తమకు కావలసిన ఆహారపదార్థాల సరఫరాతో పాటు, తమ హక్కుల పరిరక్షణకు పాక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. తర్వాత క్రమంగా తమకు స్వాతంత్య్రం కావాలనే స్థాయికి వీరి డిమాండ్లు చేరాయి. తాజాగా తమకు పాక్ వద్దు, భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుగుబాటుకు కారణాలు
పీఓకేలో మంగ్లా డ్యామ్‌వంటి జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా చౌకగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ, ఆ విద్యుత్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతా నికి తరలించి, స్థానిక పీఓకే ప్రజలకు మాత్రం విపరీతమైన పన్నులతో భారీ కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారు. గోధుమలు, పిండివంటి ప్రాథమిక ఆహారపదార్థాలపై పాక్ ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందకుండాపోయాయి. పీఓకే పరిపాలన అంతా పాకిస్తాన్ మిలిటరీ, పంజాబీ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది. స్థానిక కాశ్మీరీలకు ఎలాంటి స్వయంప్రతిపత్తి లేదా సరైన ప్రాతినిధ్యం లేదు. జూలై 27న జరగబోయే స్థానిక ఎన్నికల కోసం, పీఓకే శాసనసభలో శరణార్థుల పేరిట 12 స్థానాలను పాక్ కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది. దీనిద్వారా పాక్ పాలకులు తమకు నచ్చిన వెలుపలి వ్యక్తులను గెలిపించుకుని స్థానిక అసెంబ్లీని నియంత్రిస్తున్నారని, ఈ 12 సీట్లను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఈ ప్రాంత వనరులను వాడుకుంటూ, ఇక్కడి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యరంగాలను పూర్తిగా నిర్లక్ష్యంచేసింది. తమ హక్కుల కోసం శాంతి యుతంగా పోరాడుతున్న వారిపై సైన్యం తూటాల వర్షం కురిపించడం ప్రజల్లో తిరుగుబాటు కసిని మరింత పెంచింది.
పాక్ సైన్యం, ఐఎస్‌ఐ వ్యూహం
జూలై15న జవ్మ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) నేతృత్వంలో ముజఫరాబాద్‌కు భారీ ‘‘లాంగ్ మార్చ్’’కు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం, దాని నిఘా సంస్థ ఐఎస్‌ఐలు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) నేతృత్వంలో నిర్వహించ తలపెట్టిన దీనిని అణచి వేయడానికి, పక్కదారి పట్టించడానికి నిషేధిత ఉగ్రవాద సంస్థలను వాడుకోవాలని చూస్తున్నట్లు అంతర్జాతీయ నిఘావర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దీనిని నేరుగా అణచివేస్తే ప్రపంచవ్యాప్తంగా చెడ్డపేరు వస్తుందని భావించిన పాక్ సైన్యం, తమ గుప్పిట్లో ఉండే జైషే మహ్మద్ (జెమ్), లష్కర్-ఎ-తొయిబా (లెట్) వంటి ఉగ్రవాద గ్రూపుల సహాయంతో ఈ నిరసనల్లోకి చొరబడి హింసను, అల్లర్లను రేపాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ ప్రజా ఉద్యమాన్ని అణచి వేయాలని చూస్తుండడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మార్చ్‌ను జూలై 21వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ, రావలాకోట్, మీర్‌పూర్, కోట్లి, బాగ్‌వంటి ప్రధాన నగరాల్లో ధర్నాలు, నిరసన శిబిరాలు కొనసాగు తున్నాయి. విద్యుత్ బిల్లుల తగ్గింపు, గోధుమపిండిపై• సబ్సిడీలు, అదనపు పన్నుల రద్దు, తమ కార్యకర్తలను విడుదల చేయాలని శరణార్థుల పేరిట అసెంబ్లీలో కేటాయించిన 12 స్థానాలను రద్దుచేయాలని, పాక్ ప్రధాన రాజకీయపార్టీల జోక్యాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇస్లామాబాద్‌పై ఒత్తిడి
ఈ నిరసనలు పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ పరిపాలనా నియంత్రణకు మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద సవాలుగా మారాయి. నిరసన కారుల డిమాండ్లను నెరవేరిస్తే పాక్ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది, నెరవేర్చకపోతే ఉద్యమం మరింత హింసాత్మకంగా మారుతుందని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భయపడుతోంది. ఇదిలావుండగా జేఏఏసీ కీలక నాయకుడు సర్దార్ అమ్మాన్‌ఖాన్ మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని ఇకపై ‘వివాదాస్పద ప్రాంతం’ అని కాకుండా పాకిస్తాన్ ‘‘బలవంతంగా ఆక్రమించిన ప్రాంతం’’ అని పిలవాలని బహిరంగంగా పిలుపు నిచ్చారు. ఈ ప్రకటన పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్న అంతర్జాతీయవాదనను దెబ్బ తీసింది. పీఓకేలో జూలై 27న స్థానిక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
పరిస్థితి నియంత్రణ తప్పితే…
పాక్ రేంజర్లు, సైన్యం భారీగా బలగాలను ప్రయోగించి కాల్పులు జరుపుతుండడంతో, ప్రజలు కూడా ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. ఇది పీఓకేని ఒక స్వతంత్ర సాయుధపోరాటం లేదా అంతర్యుద్ధంవైపు నెట్టవచ్చు. ఇప్పటికే ఆహారం, మందుల సరఫరా నిలిచిపోయింది. ఇంటర్నెట్, కవ్యనికేషన్ బ్లాకౌట్ వల్ల లక్షలాదిమంది ప్రజలు ఆకలితో, వైద్యం అందక అల్లాడిపోయే తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది. గిల్గిత్-బల్టిస్తాన్, పీఓకే లోని స్థానిక పోలీసు బలగాలు కూడా పాక్ ఆర్మీ పంజాబీ ముఠా చర్యలను వ్యతిరేకించి, సొంత ప్రజల వైపు నిలబడే ప్రమాదం ఉంది. ఇది పాక్ సైన్యంలో అంతర్గత చీలికకు దారితీయవచ్చు. బలూచిస్తాన్ ఇప్పటికే స్వాతంత్య్రం ప్రకటించుకుంది (ఇంతవరకు ఏ దేశం దాన్ని గుర్తించలేదు). ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కేపీకే)లో ఇప్పటికే తీవ్రవాద దాడులు, అశాంతి ఉన్నాయి. ఇప్పుడు పీఓజేకే కూడా పూర్తిగా చేజారితే, పాకిస్తాన్ దేశం ముక్కలయ్యే పరిస్థితి వస్తుంది.
భారత్‌కు నైతిక విజయం
పాకిస్తాన్ దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజం ముందు ‘‘కశ్మీరీ ప్రజలు భారత్‌ను వ్యతిరేకిస్తున్నారు’’ అని అబద్ధపు ప్రచారం చేస్తోంది. కానీ ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న పీఓజేకే ప్రజలే పాక్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, భారత్ నుండి మానవతా సహాయంకోరడం, భారత్‌లో కలిసి పోతామని చేసిన హెచ్చరికతో పాక్ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ఇది అంతర్జాతీయ వేదికలపై భారతదేశ దౌత్యపరమైన నైతిక విజయాన్ని చాటి చెబుతున్నది. ఒకవేళ పీఓకేలో పరిస్థితి చేయిదాటి, అది అధికారికంగా భారతదేశంలో విలీనమైతే భారత్‌కు అపారమైన వ్యూహాత్మక బలం చేకూరు తుంది. ప్రస్తుతం భారత్‌కు ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి నేరుగా భూమార్గం లేదు. పీఓకే భారత్ చేతికి వస్తే, పాకిస్తాన్‌తో సంబంధం లేకుండానే భారత్ ఆయా దేశాలతో అనుసంధానం కాగలదు. ప్రపంచంలో చైనా విస్తరణవాదానికి అడ్డుకట్ట వేసిన ఏకైక గ్లోబల్ లీడర్‌గా భారత్ అవతరిస్తుంది. పీఓకేలో ఉన్న అపారమైన జలవిద్యుత్ వనరులు, పర్యాటక రంగాన్ని భారత్ సుస్థిర పద్ధతిలో అభివృద్ధి చేయగ లదు. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత జవ్మ క•శ్మీర్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూసే పీఓకే ప్రజలు ఆకర్షితులవు తున్నారు. 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంట్ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం పీఓకే భారతదేశంలో అంతర్భాగం.
స్వాధీనానికి చట్టపరమైన అవకాశాలు
భారతదేశం ఒకవేళ పాకిస్తాన్ ఆక్రమిత జవ్మ కశ్మీర్(పీఓకే)ని చట్టబద్ధంగా తిరిగి స్వాధీనం చేసు కోవాలని భావిస్తే, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (•••ఎన్‌ఎస్‌సీ) తీర్మానాల ప్రకారం భారత్‌కు బలమైన, తిరుగులేని చట్టపరమైన అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, 1947 అక్టోబర్ 26న జవ్మ కశ్మీర్ పాలకుడైన మహారాజా హరిసింగ్ ‘ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్’పై సంతకం చేసి, తన రాజ్యాన్ని పూర్తిగా భారత్‌లో విలీనం చేశారు. 1947నాటి ‘ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్’ ప్రకారమే ఈ విలీనం జరిగింది. కాబట్టి, పీఓకే, గిల్గిత్ -బల్టిస్తాన్ లతో సహా మొత్తం జవ్మ కశ్మీర్ భూభాగం చట్ట బద్ధంగా భారత్‌దే. పాకిస్తాన్ అక్కడ కేవలం ఒక ‘ఆక్రమణదారుడు’ మాత్రమే. 1948 నాటి •••ఎన్ ఎస్‌సీ తీర్మానం ప్రకారం వ•డు దశలున్నాయి. మొదటి దశగా పాకిస్తాన్ తన సైన్యాన్ని, గిరిజన ముఠాలను జవ్మ కశ్మీర్ మొత్తం భూభాగం నుండి పూర్తిగా ఉపసంహరించుకోవాలి. పాకిస్తాన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాతే, శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారత సైన్యం అక్కడ మోహరించాలని తీర్మానం పేర్కొంది. పాకిస్తాన్ గత 78 ఏళ్లుగా మొదటి షరతునే అమలు చేయలేదు కాబట్టి, ఆ తీర్మానం ప్రకారం కూడా ఆ భూభాగంపై పాక్‌కు ఎలాంటి హక్కులేదు. బాంగ్లాదేశ్ యుద్ధం తర్వాత భారత్-పాక్‌ల మధ్య కుదిరిన ‘సిమ్లా ఒప్పందం’ ప్రకారం, కశ్మీర్ వివాదాన్ని కేవలం ఇరు దేశాలే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. పీఓకేని తిరిగి తీసుకునే క్రమంలో అంతర్జాతీయ జోక్యాన్ని చట్టబద్ధమని భారత్ తిరస్కరించవచ్చు. అంతర్జాతీయ చట్టంలోని ‘‘•••టిపోసిడెటిస్ జురిస్’’ సూత్రం ప్రకారం, ఒక దేశం సుదీర్ఘకాలం పాటు ఒక భూభాగాన్ని నియంత్రిస్తుంటే, దానిని మార్చడం అంత సులభం కాదు. పీఓకేలో చైనా బిలియన్ల డాలర్ల సీపెక్ పెట్టుబడులు పెట్టింది కాబట్టి, భారత్ అక్కడ సైనికచర్యకు దిగితే చైనా అంతర్జాతీయ వేదికలపై (ఐరాసలో వీటో ద్వారా) భారత్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ పీఓకేలో ప్రజా తిరుగుబాటు తీవ్రమై, అక్కడి ప్రజలే స్వచ్ఛం దంగా పాక్ నియంత్రణను ధిక్కరించి భారత్‌లో విలీనం కావాలని కోరితే, అంతర్జాతీయ చట్టం ప్రకారం ‘స్వయం నిర్ణయాధికారం’, ‘మానవతా దృక్పథ జోక్యం’ కింద భారత్ ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవ డానికి తిరుగులేని గ్లోబల్ మద్దతు లభిస్తుంది.
భారత్‌పై ప్రభావం
పాక్ సైన్యం దాడులు తట్టుకోలేక, ఆకలితో అలమటించే పీఓకే ప్రజలు సరిహద్దులు దాటి భారతదేశం (జవ్మ కశ్మీర్) వైపు వచ్చే ప్రమాదం ఉంది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) ద్వారా తమకు మానవతా సహాయం అందించాలని నిరసనకారులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. పాక్ సైన్యం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్‌తో సరిహద్దు ఘర్షణలు సృష్టించవచ్చు. భారత సైన్యం ఎల్‌ఓసీ వెంబడి అత్యంత కఠినమైన నిఘా ఉంచాల్సి వస్తుంది.‘‘మాకు పాకిస్తాన్ వద్దు, భారత్‌తో విలీనం చేయండి’’ అనే పీఓకే ప్రజల నినాదాలు ప్రపంచవేదికలపై భారతదేశ వాదనను బలపరుస్తాయి. 1947 నుండి పీఓకే భారత్‌లో అంతర్భాగమేనన్న ఢిల్లీ పార్లమెంట్ తీర్మానానికి ఇది మరింత ఊతాన్ని ఇస్తుంది. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనపై పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలు దోషిగా నిలబెట్టేలా భారత్ దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురాగలదు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టులు పీఓకే, గిల్గిత్ మీదుగానే సాగుతాయి. ఇక్కడ అశాంతి ఎక్కువైతే చైనా పెట్టు బడులు ఆగిపోతాయి. ఇది వ్యూహాత్మకంగా చైనా, పాక్ కూటమిని దెబ్బతీస్తుంది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్