విద్యాలయం అనేది మతాలకతీతమై. విజ్ఞానాన్ని, నైతిక విలువలను అందించే పవిత్రమైన ప్రదేశం. అందుకు భిన్నంగా హైదరాబాద్‌, ‌సైదాబాద్‌లో స•క్సెస్‌ ‌స్కూల్‌ అనే ఒక ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్ ‌వివాదం ప్రకంపనలు సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి డైరీలో హోం వర్క్ ‌గురించి రాస్తూ.. అన్యమత గ్రంథానికి సంబంధించిన అంశాలు నేర్చుకోవాలంటూ ఆదేశించడంతో మొదలైన ఈ వ్యవహారం క్రమంగా రాజకీయ, సామాజికంగానే కాక, న్యాయపరమైన చర్చలకు కూడా దారి తీసింది. తల్లిదండ్రుల అభ్యంతరం, పాఠశాల యాజమాన్యం స్పందన, పోలీసుల జోక్యం, హిందూ సంఘాలు, బీజేపీ నేతల ఆందోళనలు, రాజకీయ పార్టీల ప్రతిస్పందనలు నుంచి ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జోక్యానికి దారి తీసింది.?

హైదరాబాద్‌ ‌పాతబస్తీ పరిధిలోని సైదాబాద్‌ ‌లోని సక్సెస్‌ ‌స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి ఇచ్చిన హోంవర్క్‌లో, ఇతర మత ప్రార్థనలకు సంబంధించిన అంశాలు చదవాలని క్లాస్‌ ‌టీచర్‌ ‌సూచించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని స్కూల్‌ ‌డైరీలో కూడా స్పష్టంగా నమోదు చేసినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. కుమారుడి హోంవర్క్ ‌వివరాలను ప•రిశీలించిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలకు సంబంధం లేని అంశాలను ఎందుకు బోధిస్తున్నారని నేరుగా పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ అంశాన్ని నేర్చుకోవాలంటూ గత కొన్ని రోజులుగా విద్యార్థిపై మానసిక ఒత్తిడి తీసుకొచ్చారని కూడా వారు ఆరోపించారు. పాఠశాల నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాక పోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ, హిందూ సంఘాల నిరసనలు

ఈ ఉదంతంపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యా సంస్థవద్ద తల్లి దండ్రులు ఆందోళనకు దిగారు.బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున స్కూల్‌ ‌వద్దకు చేరుకుని నిరసన చేపట్టాయి. వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. విద్యార్థిని వేధిస్తూ, ఇలాంటి హోంవర్క్ ఇచ్చిన ఉపాధ్యాయురాలిపైనే కాకుండా పాఠశాల యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కూడా కొంతమంది నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాఠశాల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనివార్యంగా స్కూల్‌ ‌యాజమాన్యం వివరణ

 ఈ ఉపాధ్యాయురాలి తీరుకు నిరసనగా వీహెచ్‌పీ, బీజేపీ సహా పలు సంఘాలు, పార్టీలు కన్నెర్ర జేశాయి. భాగ్యనగర్‌ ‌జిల్లా బీజేపీ నాయకులు, హిందూవాహిని ప్రతినిధులు కూడా స్కూల్‌ ‌దగ్గర నిరసనలకు దిగారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. పత్రికలు, టీవీ ఛానెళ్లు, డిజిటల్‌ ‌మీడియా వేదికలుగా ఈ వివాదం ముమ్మరంగా ప్రచారం, ప్రసారం అయింది. అన్ని వైపుల నుంచి పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి పెరగడంతో తాము ఉద్దేశపూర్వకంగా అలాంటివి బోధించడంలేదని పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. అంతేకాదు.. విద్యార్థికి హోంవర్క్ ఇచ్చిన ఉపాధ్యాయురాలు • షేక్‌ ఆయేషా పర్వీన్‌ను సర్వీసు నుంచి తొలగించామని, ఆమెకు భవిష్యత్తులో కూడా తమ విద్యాసంస్థల గ్రూపులో ఎలాంటి ఉద్యోగావ కాశాలు ఉండవని స్పష్టం చేస్తూ, అనివార్యంగా కాళ్లబేరానికి వచ్చింది. తమ పాఠశాలలో అధిక సంఖ్యలో ఒక మతానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ‘‘దీనియత్‌’’ అనే ప్రత్యేక సబ్జెక్టు బోధిస్తామని, ఇతర మతాలకు చెందిన విద్యార్థులకు అలాంటి బోధన ఉండదని యాజమాన్యం వివరణ ఇచ్చింది.

పాఠశాలలపై ప్రత్యేక నిఘా పెట్టాలి: కిషన్‌ ‌రెడ్డి

ఈ సంఘటనపై కేంద్ర మంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండో తరగతి చిన్నారిపై మతపరమైన అంశాలను హోంవర్క్ ‌రూపంలో రుద్దడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పసిపిల్లల మనసుల్లో మతపరమైన భావాలను బలవంతంగా నాటే ప్రయత్నంగా దీన్ని అభివర్ణిం చారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీస్‌ ‌యంత్రాంగం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మద్దతు ఉందని ఎవరైనా మతాంతీకరణకు ప్రయత్నిస్తే.. చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

 ఇటీవల ఆర్మూరులో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా భరత్‌చంద్ర కాన్వెంట్‌లో హిందూమతానికి చెందిన పిల్లలకు మరో మతానికి చెందిన భాష నేర్పించారని, దానిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక హిందూసంఘాలు, బీజేపీ నాయకులు పాఠశాలను మూసివేయాలని డిమాండ్‌ ‌చేయడం గమనార్హం. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ ‌చేశారు.

సంస్కృతిపై దాడికి కుట్ర:బండి సంజయ్‌

ఒక మతానికి చెందిన విద్యార్థికి మరో మతానికి చెందిన ప్రార్థనల హోంవర్క్ ఇవ్వడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌తీవ్రంగా ఖండించారు. ఇది హిందూ సంస్కృతిపై దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. చిన్న పిల్లల మనసుల్లో మతపరమైన అంశాలను బలవంతంగా నాటే ప్రయత్నాలను సమాజం మొత్తం ఖండించాలని పిలుపునిచ్చారు. సంబంధిత పాఠశాల యాజమా న్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ ఘటనపై కొందరు లౌకిక వాదులు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని, హిందూ విద్యార్థులకు తిలక ధారణను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

బోధనే తప్ప మత ప్రచారం కూడదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. ‌రామచందర్‌రావు ఈ ఘటనను తీవ్రంగా ఆక్షేపించారు. తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి విషయాన్ని వెలుగులోకి తీసుకురావడాన్ని అభినందించారు. కేవలం ఒక ఉపాధ్యాయురాలిని తొలగించడం ద్వారా సమస్య ముగిసినట్లుకాదని, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని అన్నారు. విద్యాసంస్థలు చదువు మాత్రమే చెప్పాలని, ఏ మతాన్నీ విద్యార్థులపై రుద్దే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అవసరమైతే సంబంధిత పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ ‌మార్క్ ‘ఎడ్యుకేషన్‌ ‌జిహాద్‌’‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్‌ ‌సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే సంబంధిత పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

మరోవైపు.. సక్సెస్‌ ‌స్కూల్‌లో అన్యమత ప్రార్థనలకు సంబంధించిన హోంవర్క్‌గా ఇవ్వడాన్ని విశ్వహిందూపరిషత్‌ ‌జాతీయ కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. ఇది ఏదైనా ‘కుట్ర’లో భాగమా? అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలని డిమాండ్‌ ‌చేసింది. ఇందులో ప్రమేయం ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు జరపాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

జనసేన పార్టీ కూడా ఈ అంశంపై స్పందిం చింది. సాధారణ విద్యాసంస్థల్లో ఏ ఒక్క మతానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వకూడదని పేర్కొంది. పాఠశాలలు రాజ్యాంగ విలువలు, నైతిక విద్య, విజ్ఞానాన్ని బోధించాలే తప్ప మత ప్రచార కేంద్రాలుగా మారకూడదని స్పష్టం చేసింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది.

నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్‌

‌వివాదం తీవ్రతను గుర్తించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ , ఈ అం‌శంపై రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌, ‌హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు నిజమైతే ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చని కమిషన్‌ అభిప్రాయపడింది.

సుజాత గోపగోని
సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.