ఈశాన్య రాష్ట్రాýకు గుండెకాయ అయిన అస్సాంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అల్లకల్లోలమైన బాంగ్లా దేశ్‌కు సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్షం కాంగ్రెస్‌లమధ్య విమర్శలు, ప్రతి విమర్శలను కేవలం ఎన్నికలవేళ రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకుండా లోతుగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నేత గౌరవ్ గొగొయ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన ఆరోపణలు దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో నిత్యం అశాంతిని రెచ్చగొట్టే పాకిస్తాన్‌లోని ఏజెంట్లతో గొగొయ్ కుటుంబానికి సంబంధాలున్నాయని బిశ్వ శర్మ ఆధారాలు చూపిస్తూ ఆరోపణలు చేశారు. ఇప్పటికే  బాంగ్లాదేశ్ అక్రమ వలసదారులతో ఇబ్బందులు పడుతున్న అస్సాంలో రాష్ట్ర కీలక నేత పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగున్నారనే ఆరోపణలు అత్యంత కీలకమైనవి.


అస్సాం రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఏకచ్ఛత్రాధిపత్యంతో పాలించిన తరుణ్ గొగొయ్ కుమారుడు గౌరవ్ గొగొయ్ 2013లో పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రహస్యంగా పర్యటించారనే కీలక విషయాలు ఇప్పుడు హిమంత బిశ్వశర్మ ఆరోపణలతో వెలుగులోకి వచ్చాయి. 2013లో అటు అస్సాంలో ఇటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉండడంతో గౌరవ్ గొగొయ్ పాకిస్తాన్ పర్యటనను రహస్యంగా దాచారా? అనే సందేహాలను బలపరుస్తు న్నాయి. గొగొయ్ పాక్ పర్యటనకు సంబంధించి ఏడాది కాలంగా రేగుతున్న దుమారంపై ప్రత్యేక దర్యాప్తు బృదం (సిట్) ఇచ్చిన నివేదికలో కీలకాం శాలు వెలుగులోకి వచ్చాయి. గౌరవ్ గొగొయ్, ఆయన భార్య ఎలిజిబెత్ కాల్‌బర్న్ పలుమార్లు పాకి స్తాన్‌లో పర్యటించడం అనుమానాస్పద వ్యక్తులను కలవడం, వారితో సంబంధాలు ఏర్పర్చుకున్నారని బిశ్వశర్మ ఆరోపించడంతో పెద్ద దుమారం రేగింది.

శర్మ చెప్పిన వివరాల ప్రకారం బ్రిటన్‌కు చెందిన గొగొయ్ సతీమణి ఎలిజిబెత్ పాకిస్తాన్‌లో ఉద్యోగ రీత్యా పనిచేస్తున్నప్పుడు ఆమెకు అక్కడ అలీ తౌఖీర్ షేక్ అనే వ్యక్తితో సత్సంబంధాలుండేవి. ప్రపంచ వ్యాప్తంగా భారత్ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేసిన అలీ 2010 నుండి 2013 మధ్యకాలంలో డజను సార్లకుపైగా భారత్‌లో పర్యటించాడు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం గమనార్హం. ఇదే సమయంలో అలీకి చెందిన ‘లీడ్ పాకిస్తాన’ అనే సంస్థలో ఆమె విధులు నిర్వహించారు. అనంతరం ఆమె భారత్‌కు బదిలీ అయి ‘లీడ్ ఇండియా’ సంస్థలో పనిచేశారు. ఆమె భారత్‌లో పనిచేస్తున్నా జీతం చెల్లించిన అలీ ఎఫ్‌సీఆరఏ చ{్టం నిబంధనలు ఉల్లంఘించారు. ఈ సమయంలోనే ఆమె భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. భారత్‌లో పనిచేస్తున్నప్పుడు ఎలిజిబెత్ తొమ్మిదిసార్లు పాకిస్తాన్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో గౌరవ్ గొగొయ్ 2013లో పాకిస్తాన్‌లో పర్యటించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వీసా నిబంధనలు ఉల్లంఘించి రావల్పిండిలో పర్యటించారు. అనుమతి లేకుండా ఇక్కడ పర్యటనకు ఆయనకు ఎవరు రహస్యంగా సహకరించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పర్యటనలపై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వని ఆయన బహిరంగ ప్రపంచానికి దూరంగా రహస్యంగా ఉన్నారు. భార్య ఎలిజిబెత్ ఉద్యోగ పనుల నిమిత్తం డిసెంబర్,2013లో పాకిస్తాన్‌కు 10 రోజులు వెళ్లానని గౌరవ్ గొగొయ్ చెబుతున్నా రావల్పిండి ప్రాంతంలోని తక్షశిలకు గొగొయ్ దంపతులు వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరో కీలకాంశం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ప్రధాన కార్యాలయం కూడా రావల్పిండిలోనే ఉండడంతో వీరి రహస్య పర్యటనతో భారత రహస్య అంశాలపై ఆందోళనలు రెట్టింపయ్యాయి.

అధికార అండతో 2013లో గొగొయ్ కుటుంబం భారత కీలక రక్షణ రహస్యాలను శత్రు దేశానికి లీక్ చేసిందా అనే భయాందోళనలు కూడా కనిపిస్తున్నాయి. బిశ్వశర్మ ఆరోపించినట్టు భారత ఇంటలిజెన్స్ సమచారాన్ని పాక్‌కు రహస్యంగా చేర వేయడం, విదేశీ విరాళాల చట్టాన్ని ఉల్లంఘించడం, వాతావరణ చర్యలపై భారత ప్రభుత్వ నివేదికను అలీకి పంపడం వంటి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నిగ్గుతేల్చేందుకు చర్యలు తీసుకొని నిజాలను బహిర్గతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బిశ్వశర్మ సిట్ నివేదిక ఆధారంగా చేసిన ఆరోపణలను కేవలం రాజకీయ కోణంలో చూడలేము. అస్సాంలో బిశ్వ శర్మ కుటుంబం భూఅక్రమాలకు పాల్పడినట్టు విమర్శించిన నేపథ్యంలోనే తనపై, తన కుటుంబంపై పాకిస్తాన్ పర్యటన ఆరోపణలు చేస్తున్నారని గౌరవ్ గొగొయ్ ప్రకటించారు. బిశ్వశర్మ తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారని, తాను కూడా ఆ పని చేయవచ్చని గొగొయ్ అన్నారు కానీ ఆధారాలు చూపించలేకపోయారు. తన కుటుంబానికి 12 బిఘాల (3960 ఎకరాల) భూమి బినామీ పేర్ల మీద ఉందంటూ గొగొయ్‌తో పాటు కాంగ్రెస్ నేతల విమర్శలపై తీవ్రంగా ప్రతిస్పందించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వారిపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసి సవాలు చేశారు. అయితే ప్రత్యా రోపణýతో గొగొయ్ దేశ భద్రత అంశాలను పక్కదారి పట్టిస్తున్నారా అనిపిస్తోంది. భూఅక్రమాలు, అవినీతి ఆరోపణలొస్తే వాటిపై తక్షణమే న్యాయ స్థానాన్ని ఆశ్రయించవచ్చు. లేదా విచారణ కోరవచ్చు. అయితే శత్రు దేశమైన పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉండి దేశ భద్రతపై రాజకీయాలు చేయడం మాత్రం క్షమించరాని నేరం. గొగొయ్ పాక్ పర్యటనపై ఆరోపణలు వచ్చినా వాటిపై స్పష్టత ఇవ్వకుండా ఇవన్నీ ఎన్నికల్లో భాగమని చెబుతూ తప్పించుకోలేరు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలో ఉక్కిరిబిక్కిరైన గౌరవ్ గొగొయ్ తమ అధినేత రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో వారసత్వ రాజకీయాలను ఆశ్రయించారు. తన తండ్రి వారసత్వంతో తాను రాజకీయ నేతగా ఎదిగానని గొగొయ్ గర్వంగా చెప్పుకున్నారు. ఆయన తండ్రి తరుణ్ గొగొయ్ పాలనలోనే గౌరవ్ గొగొయ్ నిబంధ నలకు విరుద్ధంగా వ్యవహరించారనేది గమనార్హం. గౌరవ్ గొగొయ్ తన తండ్రి రాజకీయ వారసత్వం గురించి గొప్పగా చెప్పుకుంటున్నా ఆయన ధతరాష్ట్ర ప్రేమ గురించి అస్సాం ప్రజలకు బాగా తెలుసు. తరుణ్ గొగొయ్ హయాంలో గౌరవ్ గొగొయ్, హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర కాంగ్రెస్ యువ నేతలుగా రాణించారు. అయితే కొడుకు రాజకీయ ఎదుగుదల కోసం తరుణ్ గొగొయ్ అణిచివేయడంతో బిశ్వ శర్మ బీజేపీలో చేరి రెండుసార్లు వరుసగా రాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారసత్వ రాజకీయా లతో బిశ్వ శర్మను తొక్కివేయాలని చూసిన గౌరవ్ గొగొయ్ ఇప్పుడు మరోసారి అదే వారసత్వ రాజకీయాలతో ప్రమాదకరమైన ఆరోపణల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు.

బాంగ్లాదేశ్ అక్రమ వలసదారులతో, బాంగ్లాలో మైనార్టీ హిందువులపై దాడులతో అస్సాంలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సంబంధించి ఆ రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న గొగొయ్‌పై తీవ్ర ఆరోపణలు రావడం అస్సాం ఎన్నికల్లో ప్రభావం చూపడం ఖాయం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అందుకే బిశ్వశర్మ తనను లక్ష్యంగా చేసుకున్నారని గొగొయ్ చెప్పడం హాస్యాస్పదం. వాస్తవానికి అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం కనబర్చింది. 2018 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే 2024లో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ 42 శాతంపైగా ఓట్లతో 11 స్థానాల్లో గెలిచింది. 2018లో 36 శాతంతో 9 సీట్లు గెలిచిన బీజేపీ 2024లో మెరుగైన ఫలితాలను పొందింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి భారీ విజ యంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఇప్పటికే పలు జాతీయ ఎన్నికల సర్వేలు, అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేళ ఈ విమర్శలు, ప్రతివిమర్శలతో గౌరవ్ గొగొయ్‌కు కాంగ్రెస్‌లో ప్రయోజనం కలిగింది. అస్సాంలో బిశ్వ శర్మకు ప్రత్యామ్నాయంగా బలమైన నేతలు లేక కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి గొగొయ్ రూపంలో నేత లభించాడు. అదే సమయంలో ఆయనపై దేశ భద్రతకు సంబంధించి ప్రమాదకరమైన ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలోకి పడ్డట్టు అయ్యింది.

ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశ భద్రతకు సంబంధించి వివాదాస్పదంగా వ్యవహరిస్తు న్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంగా ప్రత్యర్థి దేశాలకు ప్రయోజనం కలిగించేలా పావుగా మారుతున్నారు. గతంలో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్, ఇటీవల ఆపరేషన్ సింధూర్‌పై కూడా కాంగ్రెస్ పార్లమెంట్ లోపల, బయట ఇలాగే వ్యవహరించింది. ఇప్పుడు చైనా అంశంలో కూడా ప్రచురితం కానీ నరవణే పుస్తకంతో రాజకీయాలు చేస్తుంది. అమెరికా భారత్‌ల మధ్య వాణిజ్య అంశాలపై కూడా మన దేశానికి నష్టం కలిగించేలా, దేశం పరువు తీసేలా రాహుల్ గాంధీ బృదం వ్యవహరిస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ మార్గదర్శ కత్వంలో లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేత గౌరవ్ గొగొయ్ నడుస్తున్నారు. దేశ భద్రతపై కాంగ్రెస్ పార్టీకి రాజ కీయాలు చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో గొగొయ్ వ్యవహారంపై కూడా దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అని, వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పాత పార్టీ అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి దేశ భద్రతతో రాజకీయాలు చేయడం దురదృష్టకరం.

దేశంలో ఎక్కడో చోట ఎన్నికలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ ఎన్నికల్లో గెలుపోటమలు కూడా సహజమే. అయితే దేశ భద్రతకు సంబంధించి శత్రు దేశాలకు సహకరించారనే ప్రమాదకరమైన ఆరోపణలను కూడా రాజకీయ కోణంలోనే చూపిస్తూ తప్పించోవాలని చూస్తున్న వారిపట్ల ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాలి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ ఆరోపణలపై వాస్తవాలను బహిర్గతం చేయాలి. దేశ భద్రతతో పరాచికాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి.

– శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE