తెలంగాణలో బీజేపీ దూసుకుపోతుంది. క్షేత్రస్థాయిలో క్రమంగా విస్తరించుకుంటూ పోతుంది. ఏ ఎన్నికలు జరిగినా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకుంటూ రాష్ట్రంలో అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది.
మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. బీజేపీ తరపున 5,457 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ గుర్తుపై పోటీ చేయడానికి అభ్యర్థులు ఏ స్థాయిలో పోటీపడ్డారు అన్నదానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ చాపకింద నీరు తరహాలో ప్రభావం చూపించింది. ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీని పూర్తిగా కైవసం చేసుకుంది. భైంసాలో ఇండిపెండెంట్‌కు మద్దతు ఇచ్చింది. ఫలితంగా ఆ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసు కుంది. ఐదు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా సొంతంగా వశం చేసుకుంది. నారా యణపేట్ మున్సిపాలిటీలో కూడా కమలం వికసించింది. 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు, 2 మున్సిపాలిటీల్లో బీఆరఎస్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ చైర్మన్‌లు ఎన్నికైన ఆమన్‌గల్, నర్సాపూర్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో బీజేపీ కౌన్సిలర్లు వైస్ చైర్మన్‌లుగా ఎన్నికయ్యారు. బీఆరఎస్ చైర్మన్ పదవిని దక్కించుకున్న జిన్నారం, ఎల్లంపేట మున్సి పాలిటీల్లో బీజేపీ అభ్యర్థులు వైస్ చైర్మన్‌లుగా ఎన్నికయ్యారు.
తన సంప్రదాయ కంచుకోటల్లో, పట్టణ కేంద్రాల్లో తిరుగులేని ఉత్సాహాన్ని ప్రదర్శించింది బీజేపీ కేడర్. అక్కడ నామినేషన్ల సంఖ్య వార్డుల కంటే ఐదారు రెట్లు ఎక్కువగా నమోదయ్యింది. ఉత్తర తెలంగాణలోని ఎక్కువ మున్సిపాల్టీల్లో పార్టీ పరిస్థితి అతివృష్టి అన్నట్టుగా కనిపించింది. అక్కడ రెబెల్స్ బెడద కూడా పెరిగిపోయింది. కరీంనగర్ కార్పొ¹ sషన్‌లో చూసుకుంటే, 66 డివిజన్లు ఉంటే, బీజేపీ తరఫున 375 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి వార్డులో సగటున ఐదుగురు అభ్యర్థులు కమలం గుర్తు కోసం పోటీపడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకుగాను 253 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్‌లో 49 డివిజన్లకు 124 మంది నామినేషన్లు వేశారు. చాలా ప్రాంతాల్లో అభ్యర్థులకు రెబల్స్ బెడద కూడా కనిపించింది. ఉత్తర తెలంగాణలో పార్టీ ఎంత బలోపేతం అవుతోందో, పార్టీ టిక్కెట్ కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పార్టీ ముఖ్య నాయకులు సంబరపడిపోయారు. వాళ్ల సంబరం వృథా కాలేదు. చరిత్రలోనే తొలిసారిగా భారతీయ జనతా పార్టీ సొంతంగా ఒక కార్పొరేషన్ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసింది. అలాగే, ఒక మున్సిపాలిటీని సొంతంగా కైవసం చేసుకుంది.
ఎన్నికల ముందు బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా వ్యూహాలు రచించింది. జాతీయ స్థాయి నేతలను ఇన్‌ఛార్జీలుగా నియమించింది. ఈ మేరకు జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, సహ ఇన్‌ఛార్జ్‌లుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మలను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు జిల్లాల్లో పర్యటనలు చేపట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఇచ్చారు.
ఆత్మహత్యతో ఢిల్లీలో ప్రకంపనలు
ఫిబ్రవరి 10న నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహ దేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మక్తల్ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు రేగాయి. ఆయన తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్ల ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు, కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపించారు.
మహదేవప్పది ఆత్మహత్య కాదనీ, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని, అరాచకాలు తట్టుకోలేక మహదేవప్ప ప్రాణాలు విడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తున్నారా? అంటూ వైరిపక్షాలను ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌పై సమరం చేస్తామని ప్రకటించారు. బీఆరఎస్ అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులొచ్చాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలనీ, పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌తో అతని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఉన్నారు. అదేరోజు ఈ ఘటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పార్ల మెంట్‌లో ప్రస్తావించారు. మహదేవప్ప మరణంపై పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆ మరుసటి రోజే కిషన్‌రెడ్డి మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పది లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. వేరే పార్టీ నేతల ఒత్తిడి వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని తెలంగాణలో అటు కాంగ్రెస్, ఇటు బీఆరఎస్ బీజేపీ శ్రేణులపై దౌర్జ న్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ అంశం కూడా తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో చర్చనీయాంశం అయింది.
ఎసఐఆర్ ద్వారా ఓట్ల ప్రక్షాళన జరగాలి : – రామచందర్ రావు
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ప్రత్యేక సమగ్ర సవరణ` ఎసఐఆర్ ద్వారా ఓట్ల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. అయినప్పటికీ గతంలో కంటే ఎక్కువగా ఓట్లను, సీట్లను గెలుచుకున్నామన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు భైంసా, నారాయణపేటలలో బీజేపీ జెండా ఎగురవేయడంపై హర్షం వ్యక్తం చేశారు. భైంసాలో తమ కార్యకర్తలను వేధించి, పదుల సంఖ్యలో కేసులు పెట్టి జైలుకు పంపారని, అయినా అక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీ ఓట్ల శాతం భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రంలోని 25 మున్సిపాలిటీలో నిర్ణయాత్మక శక్తిగా,15 మున్సిపాలిటీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచిందన్నారు. ప్రతిచోట పార్టీ ప్రాతినిధ్యం, పట్టు పెరిగిందని చెప్పారు. బీఆరఎస్ సంఖ్య 43 నుంచి 27కు పడిపోయింది, ఓట్ల శాతంలో 14 శాతం కోత పడింది, 550 వార్డులను ఆ పార్టీ నష్ట పోయిందని తెలిపారు. 2003తో పోలిస్తే అధికార కాంగ్రెస్‌కు చాలా తక్కువ స్థానాలు వచ్చాయనీ, రూలింగ్ పార్టీకీ ఆశించిన ఫలితాలు రాలేదనీ అన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం పార్టీకి వచ్చేలా వ్యూహాలు రచించిన బండి సంజయ్‌కి అభినంద నలు, ధన్యవాదాలు తెలియజేశారు. నిజామాబాద్‌లో కూడా తమ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలవడం గర్వకారణం అన్నారు. అక్కడ పార్టీ పటిష్టత కోసం పని చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి , ధనపాల్ సూర్యనారాయణకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మజ్లీస్ పార్టీ ఓట్లు ఎలా పెరుగుతున్నాయని రామచందర్‌రావు ప్రశ్నించారు. నిజామాబాద్ లో అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకున్నా.. అధికార కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు బీజేపీ ఎక్కడ వస్తుందో అని భయపడి ఆ రెండు పార్టీలు కలిసిపోయి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు బీజేపీకి రాకుండా చేశాయన్నారు. రాష్ట్రంలో కనుమరుగై పోయిన కమ్యూనిస్టు పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాణం పోసేలా చూస్తున్నారనీ విమర్శలు చేశారు. బీజేపీపై ఇన్నాళ్లు విమర్శలు చేసిన కాంగ్రెస్, బీఆరఎస్ నాయకులు.. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ల సంబంధంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క బీజేపీని నిలువరించడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోవడం వింతగా ఉందన్నారు. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆలోచన చేయాలనీ ప్రజలను కోరారు. తెలంగాణలో ఏప్రిల్‌లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించనున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని, దొంగ ఓట్లు తొలగించాలని అధికారులకు సూచించారు. ఇంటి యజమానులకు తెలియకుండానే వారి ఇళ్లలో పెద్ద ఎత్తున ఓట్లు చేర్పిస్తున్నారని, అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేలా ఎన్నికల కమిషన్‌కు లేఖ ఇస్తామని తెలిపారు. మున్సి పాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై పార్టీలో అంతర్గతంగా సమీక్షిస్తామని ఆయన చెప్పారు. కొన్ని చోట్ల పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లపై, పార్టీ జారీ చేసిన విప్ ధిక్కరించిన వాళ్లపై చర్యలు తీసుకుంటామని రామచందర్‌రావు స్పష్టం చేశారు.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068