కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికలు జాతీయ స్థాయిలో చిన్నవే కావచ్చు. కానీ అది బీజేపీ వశం కావడం ఇప్పుడు దేశ రాజకీయా లలో కీలక రాజకీయ పరిణామంగా చెబుతున్నారు. అక్కడి రాజకీయాలలో నవశకం కూడా భావిస్తున్నారు. కేరళ దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే భిన్నమైన రాజకీయ వాతావరణం కలిగిన రాష్ట్రం. ఇక్కడ ఎప్పుడూ ఎల్‌డీఎఫ్‌ (‌వామపక్షాలు), యూడీఎఫ్‌ (‌కాంగ్రెస్‌ ‌కూటమి)ల మధ్యే అధికారం చేతులు మారుతూ ఉండేది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ పాత లెక్కలన్నింటినీ సమూలంగా మార్చే శాయి. ఈ ఫలితాలు కేవలం విజయాలు కాదు, దశాబ్దాల కమ్యూనిస్ట్ ‌కంచుకోట గోడలను కూల్చిన చారిత్రక ఘట్టాలు. తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికలలో నేషనల్‌ ‌డెమోక్రటిక్‌ అలయన్స్ (ఎన్‌డీఏ) సాధించిన తిరుగులేని విజయం, కేరళ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఒక అద్వితీయ శక్తిగా ఆవిర్భ వించడానికి స్పష్టమైన సంకేతం. ఈ విజయం, ‘వికసిత కేరళ నిర్మాణం’లో బీజేపీ రాబోయే రోజుల్లో కింగ్‌ ‌మేకర్‌’’‌గా మారుతోందని బలంగా చాటిచెబుతోంది.

తిరువనంతపురం కార్పొరేషన్లో గత 45 సంవత్స రాలుగా ఎల్‌డీఎఫ్‌ ‌తిరుగులేని అధికారాన్ని చెలాయిం చింది. మొత్తం 101 వార్డుల్లో 50కి పైగా సీట్లను గెలుచుకుని, ఎల్‌డీఎఫ్‌ను 29 సీట్లకు, యూడీఎఫ్‌ను 19 సీట్లకే పరిమితం చేయడం అనేది వికసిత భారత సంకల్పం పట్ల ప్రజలు చూపిన నమ్మకం.

ఈ విజయం ఒక్క రోజులోనో, ఈ ఒక్క ఎన్నిక ల్లోనో సాధించింది కాదు. 2010లో కేవలం 6 సీట్లతో మొదలైన బీజేపీ ప్రయాణం, 2015లో 35, 2020లో 34 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి, ఇప్పుడు 50 సీట్లకు చేరుకోవడం స్థిరమైన, వ్యూహాత్మక మైన వృద్ధికి నిదర్శనం. ప్రతి ఐదేళ్లకూ రాజధాని ప్రజల్లో జాతీయవాద భావజాలం పట్ల, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండా పట్ల పెరుగుతున్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు తిరువనంతపురంలో బీజేపీ తిరుగులేని శక్తి.

కేరళలో బీజేపీకి దక్కిన ఓట్ల శాతంలో మార్పును పరిశీలిస్తే, విపత్కర పరిస్థితులు నేడు ఎలా ప్రజాదర ణగా మారుతున్నాయో స్పష్టమవుతుంది. దశాబ్దాల పాటు, కేరళలో బీజేపీకి ఓట్ల శాతం 10% లోపే. 2010 స్థానిక ఎన్నికల్లో కేవలం 11 లోపు ఉన్న ఓట్ల శాతం, కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వం వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగింది. తిరువనంత పురం కార్పొరేషన్లోనే ఓట్లు 30% మార్కును దాటి, ఎల్‌డీఎఫ్‌, ‌యూడీఎఫ్‌లతో సమానంగా ఎదిగింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, బీజేపీ ఓట్ల శాతం 15% నుంచి 20% వైపు స్థిరంగా దూసుకెళుతున్నది. ముఖ్యంగా, త్రిపునితుర వంటి ఇతర మున్సిపాలిటీ లలో కూడా ఎన్‌డీఏ విజయం సాధించడం, పట్టణ ప్రాంత ప్రజల దృక్పథం మారుతున్నట్లు సూచిస్తోంది. ఈ పెరుగుదల ఒక వర్గానికో లేదా ప్రాంతానికో పరిమితం కాలేదు. స్థానిక సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత, కేంద్రంలో ఉన్న అభివృద్ధి పాలన పట్ల ఆకర్షణ – కలయికతో ఏర్పడుతున్న కొత్త రాజకీయ సమీకరణం.

ఈ స్థానిక ఎన్నికలలో బీజేపీ పట్ల యువత, మహిళలలు సుముఖత వ్యక్తం చేయడం చూస్తే కేరళలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించేది నవ యువశక్తి, నారీశక్తి అని అర్థమవుతోంది. అనేక గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో బీజేపీ తరపున పోటీ చేసిన యువతలో కనిపించిన ఉత్సాహం ప్రశంస నీయం. ఈ యువ కార్యకర్తలు ఎలాంటి గడ్డు పరిస్థితు లనూ లెక్కచేయకుండా, వీధుల వెంట జాతీయవాద భావజాలాన్ని, అభివృద్ధి సందేశాన్ని తీసుకెళ్లారు. కమ్యూనిజం, కాంగ్రెస్‌లతో విసిగిపోయిన యువత ఇప్పుడు వికసిత భారత నిర్మాణంలో పాలుపంచుకోవ డానికి బీజేపీని ఒక సరైన వేదికగా చూస్తోంది. ఈ యువశక్తి రాబోయే రోజుల్లో కేరళలో బీజేపీని నిజమైన కింగ్‌ ‌మేకర్‌గా నిలబెడుతుంది. బీజేపీకి మహిళల మద్దతు గణనీయంగా పెరుగుతోంది. దీనికి నిదర్శనం, మాజీ ఐపీఎస్‌ అధికారిణి, కేరళ తొలి మహిళా డీజీపీగా పనిచేసిన ఆర్‌. శ్రీ‌లేఖ తిరువనంత పురం కార్పొరేషన్‌లోని శాస్త మంగళం వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందడం. ఇలాంటి ప్రముఖ మహిళా నాయకురాళ్లను రంగంలోకి దింపడం, నారీ శక్తి సేవలను స్థానిక స్థాయిలో ఉపయోగించుకోవా లని బీజేపీ చూపిన చొరవ, మహిళా ఓటర్లలో గొప్ప నమ్మకాన్ని పెంచింది. కేరళలో బీజేపీ అధికారాన్ని పొందగలదా? అనే ప్రశ్నకు ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు ధీమాతో కూడిన సమాధానాన్ని ఇచ్చాయి. తిరువనంతపురం కార్పొరేషన్‌ ‌విజయం కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వైపు బీజేపీ వేస్తున్న అడుగులు చాలా పటిష్టంగా ఉన్నాయి. కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌ ‌నాయకత్వంలో, పార్టీ కేవలం రాజకీయ పరమైన అంశాలపై కాకుండా, రాజధాని అభివృద్ధి, అవినీతి రహిత పాలన అనే అంశాలపై దృష్టి పెట్టింది. ఇది కమ్యూనిజం, కాంగ్రెస్‌ ‌పాలనలో కలుషితమైన రాజకీయాలను చూసిన మధ్య తరగతి, మేధావి వర్గాన్ని బలంగా ఆకట్టుకుంటోంది.

గతంలోను, ప్రస్తుతం ఎల్‌డీఎఫ్‌ ‌ప్రభుత్వం అను సరించిన హిందూ వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా శబరిమల బంగారు స్కామ్‌ ‌వంటి అంశాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇది హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్‌లో బీజేపీ అభ్యర్థిగా తొలిసారి సురేష్‌ ‌గోపి గెలుచుకోవడం, ప్రస్తుతం తిరువనంతపురంలో సాధించిన కార్పొరేషన్‌ ‌విజయం-ఇవి రెండూ రాబోయే అసెంబ్లీ ఎన్నిక లలో నమ్మకంతో ముందుకు సాగేటట్టు చేస్తాయి. కేరళలో సంప్రదాయ రాజకీయ శక్తులు ఎల్‌డీఎఫ్‌, ‌యూడీఎఫ్‌ ‌పట్ల ప్రజల్లో విసుగు, అవినీతి పట్ల ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ శూన్యాన్ని బీజేపీ జాతీయవాద, అభివృద్ధి ఎజెండా నింపు తోంది. ఈ నేపథ్యంలోనే తిరువనంతపురం విజయం కార్యకర్తల పట్టుదలకు, నిబద్ధతకు, త్యాగానికి దక్కిన ప్రతిఫలం. కమ్యూనిస్టుల కంచుకోట కూలింది. మోదీజీ వికసిత భారత సంకల్పం, స్వయం సమృద్ధ భారత్‌ ‌మంత్రం – భవిష్యత్తుకు మార్గదర్శకాలు. దేశ పురోగతి కోసం, కేరళ అభివృద్ధి కోసం, జాతీయ వాద భావజాలంతో బీజేపీ వేస్తున్న అడుగులు సరైన మార్గంలోనే పడుతున్నాయి. ప్రతి పంచాయ తీలో, ప్రతి వార్డులో యువతరం సాధించిన నేటి చిన్నపాటి విజయాలన్నీ ఒకరోజు పెద్ద శక్తిగా మారుతాయి.

– బీఎల్‌ఎన్‌ ‌పవన్‌

 ‌బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, ఏపీ.

About Author

By editor

Twitter
YOUTUBE