డిసెంబర్ 19, 2025 నుంచి భాగ్యనగర్‌లోను, 2026 జనవరి మొదటివారంలో విజయవాడలోను పుస్తకోత్సవాలు మొదలవుతున్న సందర్భంగా..
ఆర్‌ఎస్‌ఎస్, సంఘ పరివార్ పేరెత్తకుండా ఇవాళ భారతదేశంలో ఏ అంశాన్నీ ఎవరూ ప్రస్తావించలేరు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంఘ శతాబ్దికి అందుకే ప్రాముఖ్యం. సంఘ ప్రయాణం వ్యవస్థల నిర్మాణ చరిత్రలో గొప్ప పాఠం. ఆ ప్రస్థానం ఎలా జరిగింది? అందులో ఎంత త్యాగం ఉంది. ఏ తాత్త్వికత ఇంత దూరం నడిపించింది? ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఇవాళ భారత్‌లో ఏ మూలకు వెళ్లినా పరిచయం అక్కరలేని పేరు ఆర్‌ఎస్‌ఎస్. ఈ సంస్థ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరును ప్రవేశించి, వేళ్లూనుకున్నది. సంఘ శతాబ్ది సందర్భంగా నవయుగ భారతి వెలువరిస్తున్న పుస్తకాలలో తెలుగు ప్రాంతాలలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానమైనది. 1940-1980 మధ్య తెలుగు ప్రాంతాలలో సంఘ విస్తరణ గురించి ఇది చర్చించింది. ఎనిమిది అధ్యాయాలతో ఈ మొదటి భాగం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
నిజానికి చాలా కీలక ఘట్టాలు, సంఘర్షణలు ఈ కాలంలోనే సంఘానికి ఎదురయ్యాయి. గాంధీజీ హత్య నెపం, భారత్ చేసిన మూడు యుద్ధాలు, అత్యవసర పరిస్థితి ఈ కాలంలోనివే.

సంఘ విస్తరణ విధానమే వినూత్నమైనది. సంఘం వారు తాము ఎక్కడి నుంచో వచ్చి, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకోరు. భారతీయ సమాజం నుంచి సంఘం జనించింది. విస్తరించింది. ఇది తెలుగు ప్రాంతాలలో ఎలా జరిగింది? సంఘ వ్యవస్థాపకులు పరమపూజనీయ డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గెవార్ స్వయంసేవకులను ఉద్దేశించి, నాగపూర్ శిబిరంలో ఇచ్చిన పిలుపునకు ఎందరో స్పందించారు. అలా తెలుగు ప్రాంతాలకు సంఘ గంగను తరలించుకు వచ్చిన వారు దత్తాత్రేయ యాద్వడ్కర్, దత్తాత్రేయ బందిష్టే. వారు విద్యార్థులు విజయవాడ వచ్చారు. 11.11.1940 తొలి శాఖను నెలకొల్పారు. అక్కడ నుంచి మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, రాజమహేంద్రవరం, కర్నూలు ఇతర పట్టణాలకు ఎలా విస్తరించినదీ ఈ పుస్తకం వివరించింది. స్వల్పకాలం సేవలు చేయడానికి వచ్చి పూర్తి కాలం పనిచేసే ప్రచారకులుగా మారినవారు ఎందరో. గోపాలరావు ఠాకూర్, వీఎల్ దేశ్‌ముఖ్ తెలుగు ప్రాంతాలలో వందలాది కార్యకర్తలు ఎలా తయారు చేసినదీ చదవడం ఒక మంచి అనుభవం.1946లోనే బాపూరావ్ మోఘే ప్రాంత ప్రచారక్‌గా రావడం, హేమంత శిబిరం నిర్వహించడం వంటి అంశాలు చక్కగా నమోదు చేశారు. ఆ మరుసటి సంవత్సరం స్వాతంత్య్రం వచ్చింది. కాందిశీకులు వచ్చారు. అలా విశాఖకు వచ్చి స్థిరపడినవారు చంద్రకాంత్ సప్రా, చంపాలాల్, సత్వానీ. వీరంతా సంఘ అభిమానులు. అక్కడి తొలితరం స్వయంసేవకులు ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి, కందర్ప రామచంద్రరావు, పులవర్తి వెంకటదుర్గా ప్రసాదరావు గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంది. 1947లోనే రెండో సర్‌సంఘచాలక్ పరమపూజనీయ గురూజీ పిలుపు మేరకు ప్రచారకులుగా వచ్చిన 68 మందిలో పిళ్లా రామారావు, చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. వీరు తుదిశ్వాస వరకు సంఘ విస్తరణకు శ్రమించారు. 1948 నాటి గాంధీజీ హత్య, తరువాత ఆ అపనిందతో స్వయంసేవకులు ఎదుర్కొన్న ఇక్కట్లు తగు రీతిలో నమోదైనాయి. 1948, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 వరకు శిబిరం నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. గాంధీజీ హత్య వార్తతో శిబిరం రద్దు కావడం, వచ్చిన స్వయంసేవకులు తిరిగి ఇల్లు చేరుకోవడానికి పడిన బాధలు ఆగ్రహాన్నీ బాధనీ కూడా కలిగిస్తాయి. ఇదంతా కొన్ని విపరిణామాల కూడిక. అంతా రాజకీయమే. సంఘంపై నిషేధం దీనికి పరాకాష్ట. ఈ ఘటనతో ఎంతమంది జైళ్లకు వెళ్లారో వారందరినీ స్మరించారు. ఇంత నిర్బంధంలోను విస్తరణ పని ఆగలేదు.
1940 ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి వస్తే, 1948లో నిజాం పతనం తరువాత గాని తెలంగాణలో సంఘం ప్రవేశించే అవకాశం రాలేదు. శ్రీరామ్ సాదే, హల్దేకర్‌జీ, గణపతిరావ్‌జీ, ఎంజీ శ్రీనివాసమూర్తి వంటివారు ఇందుకు దోహదపడ్డారు. 1950లో హైదరాబాద్‌లో తొలి శిబిరం నిర్వహించారు.
ఈ పరిణామంలో సంఘానికి మూడు రూపాలలో ప్రతిబంధాలు ఎదురయ్యేవి. ఒకటి కాంగ్రెస్, రెండు కమ్యూనిస్టులు, మూడు నిజాం భక్తులు. నిజానికి తెలుగు ప్రాంతాలలో సంఘ విస్తరణ చెప్పుకోదగినంత వేగంగానే జరిగింది.1955లోనే కృష్ణమ్మ ఒడి (ఉండవల్లి లంక)లో 1300 మందితో శిబిరం జరిపారు. 1956-57లలో విభాగ్‌ల వారీగా శిబిరాలు జరిగాయి.
కాలం గడుస్తున్న కొద్దీ ఏఏ దశాబ్దాలలో ఎవరు ప్రచారకులుగా వచ్చి సంఘ విస్తరణ కృషిలో భాగం పంచుకున్నారో, ఎలాంటి త్యాగాలు చేశారో ఇందులో నమోదు చేయడం ఎంతో సబబు. 1959లో ప్రచారక్‌గా వచ్చిన సోమేపల్లి సోమయ్యగారి పరిచయం అలాంటిదే. 1964లో వడ్లమూడి రామమోహనరావు, వేదాంతం సంగమేశ్వరశాస్త్రి, దీవి ద్వారకాచార్యులు, కొప్పర్తి వెంకటరమణమూర్తి, డా. బీరవోలు సురేంద్రరెడ్డి తరువాత ఇంకా ఎందరో ప్రవేశించారు. వీరంతా ఒక్కొక్క కోణం నుంచి తమదైన శైలిలో సంఘానికి సేవలు అందించి చరితార్థులుగా చరిత్రకెక్కారు.
సంఘ విస్తరణలో అంతర్భాగంగా సాగిన జాగృతి వారపత్రిక స్థాపన, గురూజీ 51వ జన్మదినం సందర్భంగా నిధి సేకరణ, విశ్వహిందూ పరిషత్, సాహిత్య, ప్రచురణ సంస్థల ఆవిర్భావం, జాతీయ సాహిత్య పరిషత్ స్థాపన, శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం వంటి విషయాలను గుర్తు చేస్తూనే ఈ రచన సాగించారు. వివేకానంద శత జయంతిని విజయవంతం చేయడానికి సంఘం కృషి చేసింది. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆరంభించిన సంపూర్ణ విప్లవానికి సంఘం వెన్నుదన్నుగా నిలిచింది. తెలుగు ప్రాంతాలకు ఆయన వచ్చినప్పుడు కూడా చేదు అనుభవాలను చవి చూశారు. ఇక అత్యవసర పరిస్థితి ప్రకటన, ఆర్‌ఎస్‌ఎస్‌పై రెండో పర్యాయం నిషేధం వంటి చీకటి అధ్యాయంలోని భాగాలను కూడా ఈ పుస్తకంలోనే చదువుతాం. చాలామంది చెప్పినట్టు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అగ్ర భాగాన నిలిచిన వారు సంఘ పరివారమే. దానికి చక్కని ఆధారాలు ఇందులో దొరుకుతాయి. ఆర్‌ఎస్‌ఎస్ అంటే సేవకు పర్యాయ పదంగా మార్చిన దివిసీమ సేవల గురించి కూడా మనం ఇందులో చదువుకోవచ్చు. బీఎంఎస్, సేవికా సమితి, సంస్కార భారతి వంటి సంస్థలను ఎలాంటి నేపథ్యంలో స్థాపించారో కూడా మనకు పరిచయమవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు స్థానం లేదని అసంబద్ధంగా వదిరే వారికి సమాధానం అన్నట్టు సంఘ స్ఫూర్తితోనే పనిచేసే సేవికా సమితిలో పనిచేసిన శారదా బ్రహ్మపుర్కర్, బొలపల్లి రమాదేవి, ఆకెళ్ల సీతాలక్ష్మి వంటివారి సేవలను నివేదించారు.
ఈ చరిత్ర నిర్మాణం శాస్త్రీయంగా చేశారు. సమకాలికులు చెప్పిన వివరాలు, పాత స్వయంసేవకులు, పెద్దలు రాసుకున్న డైరీల ఆధారంగా ఈ సమాచారం గుదిగుచ్చారు. ఇక వారందరి ఫోటోలు సేకరించి వేయడం హర్షణీయం. దాదాపు ఎనిమిది దశాబ్దాల సంఘ చరిత్రను నమోదు చేయడం ఎవరికైనా పెద్ద సవాలే. ఆ పని ఈ మొదటి భాగం సంకలనకర్తలు కె. శ్యాంప్రసాద్, వడ్డి విజయసారథి, రాంపల్లి మల్లికార్జునరావు చేశారు. వ్యవస్థల నిర్మాణానికి, వాటిని నిలబెట్టుకోవడానికి, అందుకోసం జరిగే తపస్సు తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు మార్గదర్శనం చేస్తాయి. స్వయంసేవకులతో పాటు హిందువులంతా ఈ పుస్తకం చదవాలి.
– బీఎస్ శర్మ
శ్రీ గురూజీ-దృష్టి, దార్శనికత
పరమ పూజనీయ శ్రీ గురూజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్‌గా 33 ఏళ్ల పాటు (1940-73) చేసిన రచనలు,దేశవ్యాప్త సంభాషణలు,ఉపన్యాసాలు, మార్గ్గదర్శనంపై వెలువడిన 12 సంపుటాల సారం శ్రీ గురూజీ-దృష్టి,దార్శనికత. వారి శత జయంతిని పురస్కరించుకొని ఆ సంపుటాలు వెలువడగా, సంఘ శతవార్షికోత్సవాల సందర్భంగా వాటి సారాంశంతో ఈ పుస్తకం రూపుదాల్చింది. ఈ కోణంలోనే హిందీలో దృష్టి ఔర్ దర్శన్, ఆంగ్లంలో వీ.. +శీశ్రీశ్రీతీ-ఱ ఱఱశీఅ అ వీఱఱశీఅ పేరిట గ్రంథాలు వచ్చాయి. వీటిలో శ్రీ గురూజీ ఉపన్యాసాలే కాకుండా తమ జీవిత ప్రస్థానంలో గ్రహించిన అంశాలు, వారి అధ్యయన విశేషాలు, చవిచూసిన అనుభవాలూ ఉన్నాయి. మానవాళి శ్రేయస్సు, దేశాభ్యున్నతి కోసం శ్రీ గురూజీ చేసిన మార్గదర్శనం నేటికీ ఆచరణీయమని ఈ గ్రంథం చెబుతోంది.
జాతి పునర్నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్ కార్య ప్రణాళికను క్రమపద్ధతిలో వికసింప చేస్తూ వస్తోంది. దేశ పునర్నిర్మాణానికి చేయవలసిన యోచనను, చేపట్టవలసిన కార్యాన్ని స్వామి వివేకానంద ప్రజల ముందు ఉంచగా, అరవిందులు దేశ స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చారు. వారిద్దరి ఆలోచనలకు పరమ పూజనీయ డాక్టర్‌జీ నెలకొల్పిన సంఘం ఒక స్పష్టతను ఇచ్చింది. పూజనీయ డాక్టర్‌జీ పాదులు తీసిన సంస్థకు పూజనీయ గురూజీ పందిళ్లు వేశారు. డాక్టర్‌జీ ఆలోచనలను దేశవ్యాప్తం చేశారు. సంస్థ అనేక ఆటంకాలు, అవరోధాలను ఎదుర్కొంటూ శక్తిమంతమైనదిగా ఎదిగేందుకు శ్రీ గురూజీ నిరంతర పర్యటన, వారి ఆలోచనా విధానం ఎంతోగానో దోహదపడింది. హిందూ సమాజ సంఘటన ప్రపంచశాంతికి అధారభూతమవు తుందని వారు చెప్పిన విషయాలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. పరం పరాగతమైన ధర్మం, సంస్కృతులను ఆధునిక పరిస్థితులకు అన్వయించి చెప్పారు. ఎవరికి వారు మంచి పౌరులుగా జీవించడమే కాదు….ధర్మబద్ధ జీవనం గడిపేలా ఇతరులనూ తీర్చిదిద్దాలని, ఇతర ఆకర్షణలకు లోనుకాకుండా, ప్రతికూల పరిస్థితులనూ ధైర్యంగా అధిగమించాలన్నది గురూజీ సందేశం. దేశాన్ని భగవత్ స్వరూపంగా భావించి సేవించాలి.దేశాన్ని ప్రేమిస్తామని,భక్తితో సేవిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలి. భౌతిక అవసరాలకు అవసరమైనంత వరకే సంపాదించి, వ్యయం చేయాలి. దోపిడీ మనస్తత్వంతో కాక సేవాభావంతో పనిచేయాలి అన్న గురూజీ దివ్యోపదేశం వర్తమాన సమాజం అక్షరాలా అనుసరించదగినది. ఆరు విభాగాలు, 80 అధ్యాయాలుగా విగడించిన ఈ గ్రంథం-పూజనీయుల నుంచి మాతృభూమి, మానవళి సంక్షేమం,ధర్మం-సంస్కృతి, సంస్థాగత నిర్మాణం లాంటి అంశాలను వివరించింది. అధ్యాయాల ముగింపులో శ్రీ గురూజీ సమగ్ర దర్శన్ (హిందీ) నుంచి వివరణలు తెలుగులో పొందుపరిచారు. అనేక అంశాల సమాహారమైన ఈ పుస్తకం నిజంగా హస్తభూషణం, వ్యక్తిత్వ వికాస కరదీపిక. పూజనీయ మోహన్ భాగవత్ ఈగ్రంథాన్ని మాధవ గీతగా అభివర్ణించారు.
పేజీలు: 350 వెల: రూ. 400
వందేళ్ల సంఘ యాత్ర
ఒక వ్యవస్థ/సంస్థ వందేళ్ల నిరాటంక ప్రస్థానం చిన్న మాట కాదు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆ మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళె ఇందులోని ప్రస్తావనలో పేర్కొన్నట్లు..ఆ యాత్ర ఒక ఆసక్తికరమైన కథ. ఈ సుదీర్ఘ యాత్రలో ఎన్నో ఒడుదొడుకులు, అడ్డంకులు, అపహాస్యం, వ్యతిరేకత. సంఘం ఆయా దశలను దాటి సర్వామోదం పొందే స్థితికి ఎదిగింది. అలాంటి విశేషాలు, వర్తమాన సమాజంలోని పరిణామాలను ఈ పుస్తకం వివరిస్తోంది. ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానం; సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబప్రబోధన్, స్వ ఆధారిత జీవనం, పౌర విధుల అవగాహన అనే పంచపరివర్తన సంబంధిత విషయాలను పుస్తకం వివరిస్తోంది.
పేజీలు: 64 వెల: రూ. 20.00
సంఘాన్వేషణ
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గురించి తెలుసుకోవాలనుకునే యువతకు ఇది కరదీపిక లాంటిది. హిందూ సమాజం, ధర్మానికి సంబంధించిన అంశాలతో పాటు- బాల, కిశోర్ స్వయంసేవకులతోనే పరమ పూజ్య డాక్టర్‌జీ సంఘాన్ని ఎందుకు ప్రారంభించారనే అంశాలను ఈ పుస్తకం ఆసక్తికర కోణంలో వివరిస్తుంది. స్వామి వివేకానంద ఉద్బోధించిన ఆధ్యాత్మిక ఉన్నతి, వ్యక్తి నిర్మాణం, హిందూ సంఘటన లాంటివి స్వయంసేవక్ ఎలా ఆచరిస్తారనే దానిని ఈ పుస్తకం వివరిస్తుంది. సంఘ మౌలిక అంశాల పట్ల అవగాహన పెంచుకునేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది.
పేజీలు: 64 వెల: రూ. 60.00
చీఫ్‌తో ముఖాముఖి
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శతాబ్ది సందర్భంగా పూజనీయ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌జీ వివిధ మాధ్యమాల సంస్థల ప్రతినిధులకు ఇచ్చిన ముఖాముఖిల గుచ్ఛం ఈ సంఘ శతాబ్ది గ్రంథం. సాధారణ స్వయంసేవక్‌గా చేరి, సర్ సంఘ్‌చాలక్‌గా బాధ్యతలు వహిస్తున్న మోహన్‌జీ విశేష అనుభవాలు, ప్రపంచం/దేశంలోని పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పట్ల సంఘం దృక్కోణం తదితర అంశాలు ఈ ముఖాముఖీల్లో ప్రస్తావనకు వచ్చాయి. అంతర్జాతీయంగా వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విప్లవాలు వచ్చాయని, మానవ జీవితం పునర్నిర్మాణానికి అవసరమైన ఆధ్యాత్మిక, ధార్మిక విప్లవం రావలసి ఉందంటూ, సంఘం ఆలోచనలను ఈ ముఖాముఖిల ద్వారా మరోసారి దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించారు.
పేజీలు: 32 వెల: రూ.25.00
సంఘ గంగా శతకము
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సంఘ్ సిద్ధాంతం, కార్యపద్ధతి ఆధారంగా వెలవడినది సంఘ గంగా శతకం.దేశ విభజన వేళ కాందిశీకులను, చైనా యుద్ధ సమయంలో సమాజాన్ని సంఘ్ ఆదుకున్న తీరును, పాకిస్తాన్‌తో తలపడుతున్న సైన్యానికి అండగా నిలవడం , 1970వ దశకంలో అత్యయిక స్థితిని సమర్థంగా ఎదుర్కొని ప్రజాస్వామ్య పునరుద్ధరణలో సంఘం పాత్ర తదితర అంశాలు సంఘ గంగా మకుటంతో ఈ శతకంలో వర్ణితమయ్యాయి. గంభీరమైన అంశాలను కవి సరళ శైలిలో వివరించారు.
పేజీలు: 56 వెల. రూ. 50
SOCIAL COMMITMENT AND UNITY
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం శతవార్షికోత్సవ వేళ దాని ఆవిర్భావ వికాసాలపై పరిచయపూర్వక పుస్తకం సామాజిక సేవ నిబద్ధత (SOCIAL COMMITMENT AND UNITY). వందేళ్ల దిగ్విజయ ప్రస్థానంలో సంస్థ నిర్మాణం, అది అందించిన నిస్వార్థ సేవలను సింహావ లోకనం చేసే ప్రయత్నం ఇది. ఈ ప్రయాణంలో సంఘం చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుత సమాజ పరిస్థితులు, నెలకొన్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తీసుకోవలసిన చర్యలు, సామాజిక పరివర్తన కోసం ఉద్దేశించిన పంచ్ పరివర్తన్ అంశాలను మూడు అధ్యాయాలుగా ఈ గ్రంథం వివరించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇంకా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయని, వ్యవస్థీతీకృత సమాజం మాత్రమే వాటిని అధిగమించి, దేశం శక్తిమంతం చేయగలదని సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హొసబళె పుస్తకం ముందు మాటలో పేర్కొన్నారు. ఆ దిశలోనే… ప్రస్తుత సమాజానికి కీలకమైన పంచపరివర్తన్పై స్వయంసేవకులు సంఘ శతాబ్ది వత్సరం నుంచి నిరంతరం ప్రజలలో అవగాహన కల్పించే పక్రియను చేపడుతున్నారు.
పేజీలు: 84 వెల: రూ.20
బాంగ్లాదేశ్ హిందువుల నరమేధం
మన దేశంలో అశాంతికి, హిందూజాతి నిర్మూలనకు అనేక చీకటి శక్తులు పని చేస్తున్న తరుణంలో, ఉమ్మడి పాకిస్థాన్‌లోనూ, బాంగ్లాదేశ్‌లోనూ హిందువు లపై ఇస్లామిస్టుల ఘాతుకాలను ఈ పుస్తకం కళ్లకు కడుతుంది. దేశ విభజన నాటి నుంచి ఏదో ఒక అవకాశాన్ని కల్పించుకొని సాగిస్తున్న దాడులు, చారిత్రక అంశాల నుంచి వర్తమాన పరిస్థితుల వరకు విశ్లేషణ పూర్వకంగా ఇది వివరిస్తుంది. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు బాంగ్లాదేశ్‌లో మనలేక కట్టుబట్టలతో బయటపడుతున్నారు. ఉదారవాదులు, మానవతావాదులుగా భావించుకొనే భారతీయులు కూడా ఈ దుష్పరిణామాలపై స్పందించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు.. ముస్లింలతో కలసి హుందాగా బతకలేనితనాన్ని ప్రపంచ దేశాలకు తెలియాలంటారు రచయిత.
పేజీలు: 194 వెల:రూ. 250
వీరనారీమణులు
దేశ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం పరపాలకులపై ధైర్య సాహసాలు ప్రదర్శించిన మగువలు ఇరవై మంది గురించి పరిచయ పూర్వక వ్యాస సంకలనం భారతీయ వీరనారీమణులు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీరుద్రమ లాంటి ఇద్దరు ముగ్గురిని మినహాయిస్తే, ఈ తరానికి తెలియని వీరవనితలు, వారి త్యాగాల గురించి ఇది సచిత్రంగా వివరిస్తుంది. సాధారణ మహిళల నుంచి రాణులు దాకా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వైనాన్ని ఈ వ్యాసాలు వివరిస్తాయి.
పేజీలు: 72 వెల: రూ.100
సాహిత్య నందనంలో చారిత్రిక పరిమళం
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇరవై నాలుగు నవలల విశేషాలతో కూడిన వ్యాస సంకలనం సాహిత్య నందనంలో చారిత్రిక పరిమళం. జాగృతి వార పత్రికలో సెప్టెంబర్ 22, 2003-ఏప్రిల్ 26, 2004 మధ్య కాలంలో 24 వారాల పాటు) ప్రచురితమైన వ్యాసాల సంపుటి ఇది. సాహిత్యంలో చారిత్రిక పరిమళాలు వెదజల్లిన విశ్వనాథ సత్యనారాయణ, కోట వెంకటాచలం లాంటి మహనీయులకు ఆ కోణంలో తగినంత గుర్తింపు లభించలేదనే వాదన ఉంది. వారు సృష్టించిన పరిమళాలు దశదిశలకు విస్తరించే పవనవీచికలు కావాలని, ఆ దిశగా చిరు ప్రయత్నమే ఈ వ్యాస సంకలనమని రచయిత పేర్కొన్నారు.
పేజీలు: 118 వెల: రూ. 140
చక్కెర తెచ్చే చిక్కులు
చిన్నారుల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ దుష్ప్రభావాన్ని తెలిపే చిరుపుస్తకం. పిల్లలపై గారాబంతో తల్లిదండ్రులు కొనిచ్చే పోషకాహర విలువలు లేని ఆహారం వల్ల కలిగే అనర్థాలను, ఆరోగ్య సూచనలను, బాలల ఆరోగ్యం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి వాటి అధ్యయనాలను ఇది వివరిస్తుంది.
పేజీలు: 32 వెల: రూ.20
తపాలా బిళ్లలలో ఏకాత్మతా స్తోత్రం
భారత భక్తి స్తోత్రంగానూ పేరొందిన ఏకాత్మతా స్తోత్రం భారతీయ సంస్కృతి, ఐక్యత, భక్తి, జాతీయతను సమగ్రంగా ప్రతిబింబించే ఒక పవిత్రమైన స్తోత్రం. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్‌ఎస్‌ఎస్) శాఖలలో స్వయం సేవకులు ప్రతిరోజూ ఉదయం పఠించడం దైనందిన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. తద్వారా దేశంలోని పవిత్ర నదులు, పర్వతాలు, మహాపురుషులు, సాధుసంతులు, కవులు, వీరులు, శాస్త్రవేత్తలతో పాటుగా భారతీయ జ్ఞాన సంపదను స్మరించుకుంటారు. 33 శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతంతో పాటుగా బౌద్ధ, జైన, సిక్కు మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలను ప్రస్తావించడం ద్వారా భారతీయ జ్ఞానమూలాలనూ, హిందూ సంస్కృతిలో వైవిధ్యంతో కూడిన ఐక్యత(ఏకాత్మత)ను ఉద్ఘాటిస్తుంది. దేశం పట్ల, ధర్మం పట్ల భక్తిని రేకెత్తించే మంత్రంగా పనిచేస్తుంది.
ఇదమేకాత్మతా స్తోత్రం శ్రద్ధయా యః సదా పఠేత్
స రాష్ట్రధర్మ నిష్ఠావాన్ అఖండం భారత్ స్మరేత్
ఏకాత్మతా స్తోత్రాన్ని శ్రద్ధగా పఠిస్తే హైందవ ధర్మం, అఖండ భారత్ ఆలోచనలు మనసులో నిలిచిపోతాయని స్తోత్రం చివరి శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న స్తోత్రం స్ఫూర్తితో ఏకాత్మతా స్తోత్రం (భారత భక్తి స్తోత్రం) త్రూ స్టాంప్స్ (తపాలా బిళ్లల ద్వారా ఏకాత్మతా స్తోత్రం (భారత భక్తి స్తోత్రం) ) పేరిట ఆంగ్లంలో ఒక పుస్తకం (కాఫీ టేబుల్ బుక్) 2025లో ప్రచురితమైంది. ఈ పుస్తకం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విడుదలైన తపాలా బిళ్లలను స్తోత్రంతో ముడిపెడుతూ రూపొందింది. 33 శ్లోకాల్లో ప్రతీ ఒక్క దానికి తపాలా బిళ్లలను జోడిస్తూ కొద్ది వాక్యాలతో కూడిన వివరణ పాఠకులను ఆకట్టుకుంటుంది.
ఈ అద్భుతమైన కాఫీ టేబుల్ బుక్‌ను ఇతిహాస సంకలన సమితి (భారతీయ), తెలంగాణ (హైదరాబాద్‌లోని ఒక సాంస్కృతిక, చరిత్రా సంస్థ) ప్రచురించి, విడుదల చేసింది. పెద్ద సైజు పేజీలు (సుమారు ఏ4 లేదా అంతకంటే పెద్దది), హై-క్వాలిటీ ప్రింటింగ్‌తో రంగురంగుల తపాలా బిళ్లలు భారతీయ సంస్కృతిని కళ్లకు కడుతున్నాయి. పెద్ద పెద్ద అక్షరాల్లో స్తోత్ర శ్లోకాలు ఆంగ్లంలోనూ, సంస్కృతంలోనూ ఉన్నాయి. ఇది భక్తి, చరిత్ర, ఫిలటెలీ (స్టాంపు సేకరణ) పట్ల ఆసక్తి ఉన్నవారికి ఒక విలువైన ఆస్తిగా ఉంటుంది. ఇది భారత ఐక్యతకు చిత్రమాలికగా పనిచేస్తూ, యువతకు దేశ చరిత్రను ఆకర్షణీయంగా తెలియజేస్తుంది. స్వయంసేవకులు, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు దీనిని శాఖలలో ఉపయోగించి, యువతకు భారత ఐక్యత గురించి తెలియజేయవచ్చు. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, దేశభక్తికి ఒక స్మారక చిహ్నం. తపాలా బిళ్లల ద్వారా చరిత్రను జీవించేలా చేస్తూ, అఖండ భారత ఆలోచనను ప్రోత్సహిస్తుంది. హిందూ ఈ-షాప్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.
పేజీలు: 175 వెల: రూ. 500
అబ్దుల్ కలాంను ఔపోసన పట్టిన రాజకిశోర్

నాకు అత్యంత ఆప్తులు విశ్వేశ్వరం మాస్టారు గారి అబ్బాయి ఆచార్య దుగ్గిరాల రాజకిశోర్. 2023లో తాను రాసిన ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం అనే గ్రంథ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. తన పర్యావరణమా? పర్యామర ణమా? గ్రంథాన్ని నాకు బహూకరించాడు. మరో గ్రంథం అబ్దుల్ కలాం మీద రాసాను, మీరు ముందు మాట రాయమని కోరాడు.
నాకు అబ్దుల్ కలాం అంటే చాలా గౌరవం. ఆయన గుంటూరు వచ్చినపుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా కలిశాను. రాష్ట్రపతి పదవి ముగిసిన పిదప ప్రొఫెసర్‌గా ఉండా లని అభిలషించిన సాంకేతిక శాస్త్రవేత్త. అంతకు ముందు మిస్సైల్ మ్యాన్‌గా భారత అంతరిక్ష పరిశోధనలో తన సత్తా చాటి, ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుడిగా పోఖ్రాన్ అణు పరీక్షలో ముఖ్యపాత్ర పోషించి అణ్వస్త్ర దేశాల సరసన భారత్‌ను నిలబెట్టారు. విద్యార్థులంటే ఆయనకు చాలా ఇష్టం. వారితో సంభాషించటానికి ఎప్పుడూ ఉత్సుకత చూపేవారు. చివరకు షిల్లాంగ్‌లో ×.×.వీ.లో మాట్లాడుతూనే మరణించారు. అటువంటి మహావ్యక్తి కేంద్రంగా రాజకిశోర్ ఈ కలాంతో కాసేపు అన్న గ్రంథం రాశాడు.
ఇందులో అబ్దుల్ కలాం గురించి జీవిత చరిత్ర రాయలేదు. అందరికీ తెలుసు కదా అనే ఉద్దేశం కావచ్చు. కొన్ని విషయాలు మాత్రం మనం పునశ్చరణ చేసుకోవాలి. కలాం పూర్తి పేరు ఙబశ్రీ ఱతీ జీఱఅబశ్రీవవఅ బశ్రీ ఖశ్రీఎ.అక్టోబర్ 15, 1931న జన్మించిన కలాం తన 83వ ఏట మరణిం చారు. చిన్న వయసులో కుటుంబ ఖర్చులకు తాను కూడా ఆసరాగా ఉండాలని వార్తా పత్రికలు అమ్మేవాడు. రామనాథపురంలో ప్రాథమిక విద్యనభ్యసించిన కలాం, తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్ మెయిన్‌గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1960లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్ చేశాడు. ణ=ణలో సైంటిస్ట్‌గా చేరాడు.
రాజకిశోర్ అబ్దుల్ కలాం రాసిన 16 పుస్తకాల సారాంశాన్ని అనేక కోణాల నుండి పరిశీలించి, శోధించి, పరిశోధించారు. పాఠకులందరిని ఈ 16 పుస్తకాలు అంతకు ముందు చదవకపోతే చదివేటట్లు చేసారు. గ్రంథ రచన ఇలా కూడా చేయవచ్చని రాజకిశోర్ సాహితీ లోకానికి సూచన చేస్తున్నారని అనిపించింది నాకు. అబ్దుల్ కలాంను దుగ్గిరాల రాజకిశోర్ ఔపోసన పట్టాడు. మొదటగా కలాంగారు రాసిన 16 పుస్తకాల లిస్ట్‌ను మొదటి పేజీలోనే పేర్కొన్నారు. జీవితంతో మొదలుపెట్టి, వ్యక్తిత్వం, స్వేచ్చ-సాధికారత, కుటుంబం, ఇవ్వడం, భౌతిక వాంఛలు, ఆశించడం, వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు, ఓర్పు, సంయమనం, ఆత్మ నిగ్రహం, సావధానం, కరుణ, సహకారం, కృతజ్ఞత – ఇలా 57 శీర్హికలలో అబ్దుల్ కలాంగారి సూక్తులను అన్నింటినీ ఒకే పుస్తకంలో ప్రపంచ తెలుగు పాఠకలోకానికి బహుకరిస్తున్నాడు రాజకిశోర్. ఇందులో నీతి వాక్యాలు, జీవిత సత్యాలు పొందుపరిచాడు. ఈ ప్రయత్నం అబ్దుల్ కలాం కూడా ఊహించి ఉండడు. ఆయన జీవించి ఉంటే ప్రత్యేకంగా విశాఖ వచ్చి రాజకిశోర్‌ను ఆలింగనం చేసుకునేవాడు. ఆయన ఆత్మ స్వర్గం నుండి కిశోర్‌ను దీవిస్తూనే ఉంటుంది. ప్రత్యక్షంగా విశ్వేశ్వరం మాస్టారుకు అభినందనలు చెప్తూ ఉంటారు.
57 శీర్షికలు 57 గ్రంథాలుగా కూడా పరిగణింప వచ్చును. అందులో ఉదహరించిన ప్రతి విషయంలో అబ్దుల్ కలాం అందచేసిన సూక్తులు విలువైనవి, పాటించవలసినవి. ఇతరులచే పాటింప చేయవలసి నవి. ఉదాహరణకు మొదటి శీర్షిక జీవితంలో 45 విలువైన సూక్తులు ఉన్నాయి. రాజకిశోర్ ఆషామాషీగా చేసిన ప్రయత్నం కాదు ఈ పరిశోధక గ్రంథం. అభినందనలు. నా కంటే చిన్నవాడైనా ధన్యవాదాలు కూడా చెప్పాలని అనిపి స్తుంది. అన్ని సూక్తులు ఈ కాస్త పరిచయంలో ఉదహరించడం అసాధ్యం. కొన్నింటిని పేర్కొనకుండా ఉండలేను.
జీవితం గురించి-ఒక్కోసారి ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే కొత్తదేదో నీ జీవితంలోనికి చొరబడుతుంది. ఒక నిర్ణయమేదో రహస్యంగా జరిగిపోతుంది. అదేమిటో మొదట్లో నీకెంత మాత్రమూ తెలియకపోయినా సరే (ఔఱఅస్త్ర శీ ఖీఱతీవ), జీవితానికి ఎంతో బాధ్యత ఉంది. జీవితం అంటే కఠోర కృషి, క్రమశిక్షణ (ష్ట్రవ +బఱఱఅస్త్ర శీబశ్రీ), జీవితంలో అమూల్యమైనవి పొందేందుకు నీకు అర్హత ఉందని తెలుసుకోవడం చాలా ముఖ్యం (ష్ట్రవ +బఱఱఅస్త్ర శీబశ్రీ), జీవితాన్ని ఒక యాత్రగా చూసినప్పుడు మనల్ని ఇతరులతో పోలిక చేసుకోవడం ఉండదు. యాత్ర పరుగు పందెం కాదు. అప్పుడు మనం వేసే ప్రతి అడుగూ సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది (శీబ తీవ దీశీతీఅ శీ దీశ్రీశీశీఎ) ఇలా దాదాపూ అన్ని పుస్తకాలనుండి ఎన్నో సూక్తులను వివిధ శీర్షికలలో పొందుపరచారు రాజకిశోర్.
చివరి శీర్షిక సత్యంలో కొన్ని సూక్తులు. ఉదహరిస్తాను. సత్యం మానవ న్యాయసూత్రాల కన్నా అతీతమైనది (తీఅమీవఅవఅమీవ), మనమంతా ఒకే పరమ సత్యమునకు చెందిన వారమన్న వాస్తవాన్ని మరిచిపోవడమే అనేక దుష్పరిణామాలకు మూల కారణమౌతుంది (నబతీఱఅస్త్ర ష్ట్రవ ఱతీమీశ్రీవ). ఈ విధంగా ఓ వినూత్న మైన ఒరవడి సృష్టించాడు చిరంజీవి రాజకిశోర్. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి కలాంతో కాసేపు కాలక్షేపం చేయగలరని, అబ్దుల్ కలాంగారి నుండి అమూల్యమైన మార్గదర్శనం ఆశిస్తూ, చిరంజీవి రాజకిశోర్‌కి అనేక ఆశీస్సులు అందజేస్తున్నాను.
– ఆచార్య వి.బాలమోహన్ దాస్
విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర విశ్వకళాపరిషత్
పూర్వ వైస్ ఛాన్సలర్,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.
పరమహంస

శ్రీమతి దిట్టకవి శ్యామలాదేవి బహు గ్రంథ రచయిత్రి. దిశా దేవి ఈమె సంగ్రహ నామము. లోగడ కైలాసము నుండి కైలాసము వరకు ఆధ్యాత్మిక ప్రయాణము చేసినది. ముఖ్యంగా శ్యామలాదేవి పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయి కావటానికి బాపి బావ అసంపూర్ణ రచనను పూర్తి చేయటం. ఇదొక పరకాయ ప్రవేశం. అనన్య సాధ్యము. దిశాదేవిగారి శ్రీవారు డి.దత్తాత్రేయులు ధార్మికుడు. న్యాయమూర్తి. సామాజిక కార్యకర్త. వారి సహచర్యంతో శ్యామలాదేవిగారు కూడా సమాజాన్ని పట్టించుకున్నారు.
ఇక ప్రస్తుతం వీరి రచన రాజహంస. ఇది ఒక సాంఘిక నవల. ఇందులో కొన్ని భాగాలు ధారావాహికంగా ప్రచురింపబడ్డాయి. ఇప్పుడు గ్రంథ రూపంలో వస్తున్నది. ఇందలి కథ ఉదాత్తము ఒక పరిణిత కథ. ఒక ఆధ్యాత్మిక వీచిక. మానవ జీవితంలో భిన్న స్థాయి స్థానములు ఉన్నాయి. యాదృచ్ఛికంగా కానీ సందర్భోచితంగా కానీ ఆయా స్థానములను జీవుడు అందుకుంటాడు. ఇక్కడ సౌందర్య నందమును స్మరించుకోవాలి. సుందరీ ప్రాణ ధనమును భిక్షకులు తీసుకొనిపోతారు. ఇది అశ్వఘోషుడు. పింగళి లక్ష్మీకాంతంగారు రమణీయంగా చిత్రీకరించారు. భారతీయ జీవన నిర్మాణంలో అంతస్థులు ఉన్నాయి. ఇది ఒక క్రమ పరిణామము. అన్నము నుండి ఆనందానికి నాలుగు ఆశ్రమములు ఎందుకు? నాలుగు వర్ణములు, సాధనా చతుష్టయము. ఇదంతా ఒక ప్రణాళిక. ఋషులు త్రికాలజ్ఞులు. వారి బోధనలు సార్వకిలాకములు, సార్వ దేశికములు. బౌద్ధము నేడు భారతములో నామమాత్రముగా మిగిలింది ఎందుకు? వారి ప్రణాళిక మానవ సహజ ప్రకృతికి విరుద్ధంగా సాగింది.
ఇది ఒక తాత్విక నవల. కథ నైమిత్తికము. రచయిత్రి శివేతరక్షతిని కాంతా సమ్మిత ఉపదేశమును కావ్య ప్రణాళికకారుడు చెప్పిన నిర్వచనం పాటించారు. స్త్రీలు సహజంగా స్త్రీ పాత్రలపై మొగ్గు చూపుతారు. లోగడ శ్యామలాదేవి విశ్వనాథ వారి స్త్రీ పాత్రలపై పరిశోధన చేసి పట్టం పొందారు. ఇందులో స్త్రీ హృదయము ఆవిష్కృతమైనది. మన మనసు క్షీరసాగర మథనం అందరూ అమృతాన్ని కోరుతారు. మరి విషాన్ని మింగే వారెవరు, భయం దేనికి అని ప్రశ్నించారు.
అభీః అనేది ఉపనిషత్ సందేశం. వసంతం శిశిరం జననం మరణం ఇవి సృష్టి సహజమైన ఒక విశ్వప్రణాళిక.
మనవాళ్లు నాటకశైలి, వర్ణనాత్మక శైలి, కథాకథన శైలి ఉంటాయని చెప్పారు. ఇందులో రచయిత్రి కథాకథన పద్ధతి (చీతీతీఱఙవవ శ్రీవ)ను పాటించారు. ఇంతేకాదు ఒకనాటి పూలతోటల మధ్య పరిమళించే మిద్దెలు, ఎర్ర నీళ్లతో దిష్టి తీయడాలు, ధనం కన్నా మానం పరువు మర్యాదలు, ఎక్కువగా పాటించే కాలాతీత వ్యక్తులు మనకు కనపడతారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారని జనపదాలు ఉన్నాయి. ఇందలి వెంకటాపురం అభూత కల్పన కాదు. విలువల వలువలు విప్పు కోవటం ఇష్టంలేని సంప్రదాయాల అగ్రహారం. ఇలాంటివి కృష్ణగోదావరి తీర గ్రామాల్లో ఎన్నో ఉన్నాయి. పెంకుటిల్లు దాబాలుగా మారాయి. పరువు ప్రతిష్టల కోపం పరితపించే సంప్రదాయవాదులు, లుంబిని వనాలు, సరితలు, వెంకట్రామయ్యలు, డాక్టర్ రవీంద్రలు వీరంతా కల్పిత వ్యక్తులు కారు. ఇంకా చెప్పాలంటే విశ్వనాథ వారి సుబ్బన్నపేట వంటిదే వెంకటాపురం.
ఇందలి ప్రతి సన్నివేశమూ ఆమె స్వీయ దర్శనమేనని అని మనం పోల్చుకోవచ్చు. ఇందులో మరియొక అంశం కధా కథనం, అపరాధ పరిశోధక నవల కాదు. అలా అని సస్పెన్స్ క్లైమాక్స్ లేకపోలేదు. తినబోతూ రుచులు అడగడం ఎందుకు? చదివి ఆనందించండి. మనం మరిచిపోయిన మరో మొహంజోదారో ఇది.
దత్తాత్రేయులు గారి కుటుంబంపై నాకున్న అభిమానం, దిశా దేవి మీద నాకు గల గౌరవము ఈ నాలుగు మాటలు రాయించింది. ఇది సంపూర్ణ నవలా పరిచయం కాదు. ఇది నవలలో పూర్తి కథాపరిచయం కాదు, యోగ్యతా పత్రం వంటి ఆనందానుభూతి.
శుభం భూయాత్
– ప్రొ. ముదిగొండ శివప్రసాద్
రాయడం మాత్రం మానొద్దు!

రాస్తే ఏమొస్తుంది? తెలుగువారికి సంబం ధించి ఇది చాలా పెద్ద ప్రశ్నే. మరి అలాంటి విషయం చర్చించడం అంటే, అలాంటి రచన గురించిన రచనను చదివించాలంటే కష్టమే. ఆ కష్టం చేశారు డాక్టర్ గోవిందరాజు చక్రధర్. నా మట్టుకు నాకు రాయటమొక్కటే రససిద్ధినిస్తుంది అని ముందే చెప్పేశారు రచయిత. ఇందులో నాలుగు భాగాలు ఉన్నాయి- సెంట్రల్ థీమ్, క్రాఫ్ట్, కాంబో, కామెంట్.
రచన అంటే, ఎలా రచించాలి వంటి అంశా లతో ఇంగ్లిష్‌లో చాలా పుస్తకాలు, టిప్స్ దొరుకు తాయి. తెలుగులో తక్కువ. ఆ లోటు తీరుస్తుంది ఈ రచన. ఎందుకు రాస్తున్నామో రచయితలకు తెలిసి ఉండాలి. ఎవరి పక్షం వహిస్తున్నామో స్పష్టత ఉండాలి. ఏ మంచి కోసం కలం పట్టామో అవగా హన కావాలి. అచ్చులో కనిపిం చినవన్నీ సంఘ శ్రేయస్సు కోసం కాదని ఒప్పుకోక తప్పదు. కనీసం మానసికానందం వాటి ధ్యేయం కాదనీ మనవి.
వ్యాసం, కథ, కవిత్వం వేర్వేరు. వీటి భాషలోని సాంద్రత వేరు. అనువాదం వీటన్నిటికీ భిన్నమై నది. ఇవన్నీ ఇప్పటి రచయితలకి తప్పకుండా తెలియవలసిన అంశాలు. వీటికి సంబంధించిన మెలకువలను ఈ పుస్తకం ద్వారా నేర్చుకోవచ్చు. చివరన కొన్ని వర్తమాన కాల సామాజికాంశాలను చర్చించడం అందుకేనేమో కూడా. రచయితకు జానర్‌ను బట్టి చక్కని పరిజ్ఞానం ఉండడం అత్యవ సరం. అది కొత్తగా రాస్తున్న వారు అంగీకరించ వలసిన వాస్తవం. రచనలు చేయడానికి తమను తాము ఎలా సంసిద్ధులను చేసుకోవాలో ఈ పుస్తకం చెబుతుంది. మొదట లాభ నష్టాలు బేరీజు వేసుకోవడం మీద దృష్టి పెట్ట కుండా, రాయడం మాత్రం ఎన్నడూ మానకండి అని చక్రధర్ మాస్టారు చెబుతున్న పాఠం విస్మరించరానిది. చదవడం తగ్గిపోతోంది. కాబట్టి రాసేవాళ్లూ తగ్గుతున్నారు. అలా అని అసలు లేకపోలేదు. వాళ్లకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.
పుస్తకాలకై సంప్రదించండి..
సాహిత్యనికేతన్, బర్కత్‌పురా: 040-27563236, 9290127329, 8179163138
సాహిత్యనికేతన్, కోఠీ: 9440589722
సాహిత్యనికేతన్, విజయవాడ: 8333812687