తల్లిగా పూజలందుకునే భారతమాత మాతృశక్తికి చిహ్నంగా నిలిచింది.  భారత మహిళా క్రికెట్‌ ‌జట్టు ప్రపంచ కప్‌ ‌గెలవడం ద్వారా ఈ దృక్పథాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. ఈ విజయం కేవలం క్రీడా విజయం కాదు. ఇది భారతీయ సంస్కృతి, సామాజిక ఆత్మలో నిక్షిప్తమై ఉన్న మహిళాశక్తికి నిదర్శనం. నవంబర్‌ 2, 2025‌న నవీ ముంబైలోని డాక్టర్‌ ‌డివై పాటిల్‌ ‌స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్‌ ‌ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి, కెప్టెన్‌ ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ ‌నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్‌ ‌జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచ కప్‌ ‌టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ముంబై నుండి ఢిల్లీ వరకు, మోగా నుండి మీరట్‌ ‌వరకు, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌నుండి హరియాణా వరకు, భారత్‌మాతా కీ జై నినాదాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి.

లక్నో ఆటోలో పుట్టిన మహిళా క్రికెట్‌

1970‌ల ఆరంభంలో భారతదేశంలో మహిళల క్రికెట్‌ అనేది దాదాపు ఊహించని విషయం. పురుషుల క్రికెట్‌ ‌ప్రధాన స్రవంతిలో ఉండగా, మహిళలు ఆడే క్రికెట్‌కు ఎటువంటి గుర్తింపు లేదు, మద్దతు లేదు. అటువంటి సమయంలో లక్నో నగరంలో మహేంద్ర కుమార్‌ ‌శర్మ అనే ఒక సాధారణ వ్యక్తి మహిళల క్రికెట్‌కు జీవం పోశారు. ఆయన ఒక ఉత్సాహవంతుడు, దార్శనికుడు, సంఘ సంస్కర్త. ఆయన చేసిన ప్రయత్నాలు భారత మహిళల క్రికెట్‌ ‌చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి.

మహేంద్ర కుమార్‌ ‌శర్మ లక్నోలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయనకు క్రికెట్‌ ‌పట్ల గాఢమైన అభిమానం ఉండేది. కానీ ఆయన గమనించిన విషయం ఏమిటంటే, మహిళలు క్రికెట్‌ ఆడటానికి ఎటువంటి అవకాశాలు లేవు. సమాజంలో ‘‘అమ్మాయిలు క్రికెట్‌ ఆడతారు’’ అనే ఆలోచన కూడా లేదు. ఈ సవాలును ఎదుర్కొని, ఆయన 1973లో మహిళల క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా-డబ్ల్యూసీఏఐను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ నిర్ణయం అమలు చేయడం అంత సులభం కాదు. అందుకు కావాల్సిన డబ్బు లేదు, మద్దతు లేదు, స్థలం లేదు. చివరకు ఆటగాళ్లు కూడా లేరు.

ఆయన మొదటి అడుగు ఆటగాళ్లను వెతకడం. ఆ వెదుకులాటలో లక్నోలోని పాఠశాలలు, కాలేజీలు, మహిళా సంఘాలతో పాటుగా ఇంటింటికి ఆయన తిరిగారు. ‘‘మీ అమ్మాయి క్రికెట్‌ ఆడాలను కుంటుందా?’’ అని అడిగారు. చాలా మంది తల్లిదండ్రులు నవ్వారు. కొందరైతే కోప్పడ్డారు, ‘‘అమ్మాయిలు బయట ఆడటం ఏమిటి?’’ అని చిరాకుపడ్డారు కూడా. కానీ మహేంద్ర శర్మ వదలలేదు. ఆయన ఒక ఆటో రిక్షా తీసుకుని, దానిపై మైక్‌ అమర్చి, లక్నో రోడ్లపై తిరిగారు. ‘‘మహిళల క్రికెట్‌ ‌టోర్నమెంట్‌లో ఆడండి, గెలవండి, చరిత్ర సృష్టించండి!’’ అని ఎలుగెత్తి చాటారు. ఆటో నుంచే కరపత్రాలు, ఫారాలు పంచారు. ఆ ఆటో రిక్షా లక్నోలో మహిళా క్రికెట్‌కు ఒక చిహ్నంగా మారింది.

మొత్తానికి ఆటగాళ్లు దొరికారు. కానీ వాళ్లతో క్రికెట్‌ ఆడించడానికి స్థలం కావాలి. లక్నోలోని కేడీ సింగ్‌ ‌బాబు స్టేడియం, చౌక్‌ ‌స్టేడియం వంటి మైదానాలు ఉన్నాయి కానీ వాటిని పురుషుల క్రికెట్‌కు మాత్రమే కేటాయించారు. అయినప్పటికీ మహేంద్ర శర్మ నిరాశచెందలేదు. అధికారులను కలిశారు. ‘‘మహిళలకు ఒక్క రోజు ఇవ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు. చాలాసార్లు తిరస్కారాన్ని రుచి చూశారు. చివరకు, ఆయన స్వంత డబ్బు పెట్టి లక్నో శివార్లలో ఒక చిన్న మైదానాన్ని అద్దెకు తీసుకున్నారు. అక్కడ గడ్డి తొలగించారు. పిచ్‌ ‌తయారు చేయించారు. కిట్‌లు, బంతులు, స్టంపులు.. ఇలా ఆటకు అవసరమైన వాటిన్నింటిని ఆయన సేకరించారు. వాటిలో కొన్నింటిని దాతలు ఇస్తే.. మిగిలినవాటిని ఆయన సొంత డబ్బుతో కొన్నారు.

మొదటి టోర్నీకి నగలు తాకట్టు

మహేంద్ర కుమార్‌ ‌శర్మ 1973-74లో మొదటి జాతీయ మహిళల క్రికెట్‌ ‌టోర్నమెంట్‌ను లక్నోలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కానీ దీనికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? ఆయన అందుకోసమని లక్నోలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులను కలిసారు. ‘‘మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వండి, దీనికి ఎంతో భవిష్యత్తు ఉంది’’ అని వేడుకున్నారు. అందరూ ఆయన వేడుకోలును విన్నారు కానీ వారిలో చాలా కొద్దిమంది మాత్రమే సహాయం చేశారు. దాంతో ఆయన టోర్నీ నిర్వహణకు తన ఇంట్లో ఉన్న నగలు అమ్మారు.

అమ్మాయిల క్రికెట్‌ ‌చూడ్డానికి రండి..!

శర్మ ఆధ్వర్యంలో టోర్నీకి రంగం సిద్ధమైంది. ఆయన దాని ప్రచారానికి మరోసారి ఆటోను ఎంచుకున్నారు. ‘‘కన్యాయోంకి క్రికెట్‌ ‌హోగీ.. జరూర్‌ ఆయియే’’- అమ్మాయిలు క్రికెట్‌ ఆడుతున్నారు.. చూడ్డానికి తప్పకుండా రండి అంటూ లక్నో పురవీధుల్లో ఆటోలో ప్రయాణిస్తూ మైక్‌ ‌ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ టోర్నీలో ఉత్తరప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, బాంబే, ఢిల్లీ వంటి జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్‌లో డయానా ఎడుల్జీ, శాంతా రంగస్వామి లాంటి భావి స్టార్‌ ‌క్రికెటర్లు ఆడారు.

ఆటోల్లో ఆటగాళ్లు, అంపైర్లు

ఆయన టోర్నీ నిర్వహణలో ఆటగాళ్లకు భోజనం, బస, యూనిఫాం వంటి ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. అంపైర్లు, స్కోరర్లు. ఆటగాళ్లు గ్రౌండ్‌కు రావడానికి ఆటోలు ఏర్పాటు చేశాడు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. రేడియోలో ప్రసారం చేయించారు. టోర్నీ విజయవంతమైంది. మహిళల క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా-డబ్ల్యూసీఏఐ స్థాపితమైంది. హమీదా హబీబులా మొదటి అధ్యక్షురాలు అయ్యారు. మహేంద్ర శర్మ కార్యదర్శిగా కొనసాగారు.

వెస్టిండీస్‌తో మొదటి సిరీస్‌కు పునాది

మహేంద్ర కుమార్‌ ‌శర్మ మొదటి జాతీయ మహిళల క్రికెట్‌ ‌టోర్నమెంట్‌ను విజయవంతం చేయడంతో ఆగిపోలేదు. 1975లో ఆస్ట్రేలియా అండర్‌-25 ‌జట్టుతో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లు పూణే, ఢిల్లీ, కలకత్తాలో జరగడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1976లో వెస్ట్ ఇం‌డీస్‌తో మొదటి టెస్ట్ ‌సిరీస్‌కు ఆయన పునాది వేశారు. లక్నోలో మహిళల క్రికెట్‌ అకాడమీలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఆటగాళ్లను గుర్తించారు. వారికి ఉచిత శిక్షణ ఇచ్చారు.

మహిళా క్రికెటర్లకు తండ్రి

మహేంద్ర శర్మ జీవన ప్రస్థానం అసాధారణమైనది. ఆయనకు ఎటువంటి ప్రభుత్వ మద్దతు లేదు. పెద్ద స్పాన్సర్లు లేరు. కానీ ఆయన దృఢ సంకల్పం, ఆటో రిక్షా మైక్‌, ఇం‌టి నగలు, రాత్రింబవళ్లు పని ఇవన్నీ కలిసి భారత మహిళా క్రికెట్‌కు జన్మనిచ్చాయి. ఆయన లక్నోను మహిళా క్రికెట్‌ ‌గడ్డగా మార్చారు. శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ వంటి ఆటగాళ్లు ఆయనను ‘‘మా తండ్రి’’ అని పిలుచుకున్నారు. ఈ రోజు భారత మహిళల జట్టు వరల్డ్ ‌కప్‌ ‌గెలిచినప్పటికీ, ఆ ప్రయాణం మహేంద్ర కుమార్‌ ‌శర్మ ఆటో రిక్షా నుండి ప్రారంభమైంది. ఆయన పేరు మహిళా క్రికెట్‌ ‌చరిత్ర పుటల్లో బంగారు అక్షరాలతో లిఖితమైంది. ఒక సాధారణ మనిషి కన్న అసాధారణమైన కల నేడు ప్రపంచ మహిళా క్రికెట్‌ ‌వేదికపై విజయాలను నమోదు చేస్తోంది. కానీ మహేంద్ర కుమార్‌ ‌శర్మ భారత మహిళా క్రికెట్‌ ‌జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకునే మహత్తరమైన ఘట్టాన్ని చూడకుండానే, సరిగ్గా ఆ అద్భుతం ఆవిష్కృతం కావడానికి మూడేళ్ల ముందు నవంబర్‌ 8, 2022‌న పూణేలో తన 75వ ఏట కన్నుమూశారు.


మోదీ ప్రభుత్వం పంచ ప్రోత్సాహకాలు

మోదీ ప్రభుత్వం (2014 నుండి) భారత మహిళల క్రికెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. ఇది కేవలం ఆర్థిక మద్దతు కాదు సామాజిక సాధికారత, సమానత్వంతో పాటుగా యువతకు ప్రేరణలా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మాటలు, సమావేశాలు, విధానాల ద్వారా మహిళల క్రికెట్‌ను ప్రోత్స హించారు. 2025లో మొదటి వన్డే వరల్డ్ ‌కప్‌ ‌విజయం ఈ ప్రయత్నాల ఫలితం నుంచి ఉద్భ వించింది. ఈ మద్దతును పాలసీ మార్పులు, బీసీసీఐ మద్దతు, వ్యక్తిగత సమావేశాలు, ఫిట్‌నెస్‌ ‌ప్రమోషన్‌, ‌భవిష్యత్‌ ‌ప్రణాళికలు అనే ఐదు ప్రోత్సాహాలుగా విభజించవచ్చు.

  1. సమాన జీతాలు, ఆర్థిక సమానత్వం

మోదీ ప్రభుత్వ కాలంలో బీసీసీఐ (భారత క్రికెట్‌ ‌బోర్డు) మహిళల క్రికెటర్లకు పురుషులతో సమాన మ్యాచ్‌ ‌ఫీ అమలు చేసింది. అక్టోబర్‌ 27, 2022‌న బీసీసీఐ కార్యదర్శి జయ్‌ ‌షా ఈ చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించారు. మహిళా క్రికెటర్లకు టెస్ట్ ‌మ్యాచ్‌కు రూ.15 లక్షలు, ఓడీఐకి రూ.6 లక్షలు, టీ-20కు రూ.3 లక్షలు జీతం ఇచ్చారు. ఇది మహిళలకు మొదటి సెంట్రల్‌ ‌కాంట్రాక్ట్‌లలో 7% మాత్రమే ఉండేది. ఈ మార్పు మహిళల క్రికెట్‌ను ప్రొఫెషనల్‌గా మార్చింది. ‘‘ఇది వివక్షకు వ్యతిరేకంగా మొదటి అడుగు’’ జయ్‌ ‌షా చెప్పారు. ఈ నిర్ణయం మిథాలీ రాజ్‌ ‌లాంటి మాజీ కెప్టెన్ల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా, మహిళల జట్టు ప్రదర్శన మెరుగుపడింది. 2025 వరల్డ్ ‌కప్‌ ‌విజయానికి దారి తీసింది. ఈ సమానత్వం మహిళల క్రికెట్‌కు కోట్ల రూపాయల మద్దతు తెచ్చిపెట్టింది. ఆటగాళ్లు ఆర్థికంగా స్వతంత్రులయ్యారు.

  1. విమెన్స్ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌- ‌డబ్ల్యూపీఎల్‌కు మద్దతు

మోదీ ప్రభుత్వం డబ్ల్యూపీఎల్‌ అమలులో కీలకమైన పాత్రను పోషించింది. 2023లో బీసీసీఐ ప్రారంభించిన డబ్ల్యూపీఎల్‌కు ప్రభుత్వం పెద్ద పెట్టుబడులు, పన్ను రాయితీలు, మీడియా ప్రమోషన్‌ ఇప్పించింది. ఈ లీగ్‌ ‌మహిళా క్రికెటర్లకు కోట్ల రూపాయల ఒప్పందాలు తెచ్చిపెట్టింది. స్మృతి మంధాన, హర్మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ ‌వంటి ఆటగాళ్లు రూ.3-4 కోట్లు సంపాదించారు. మోదీ ప్రభుత్వం ‘‘బేటీ బచావో, బేటీ పడావో’’ పథకం ద్వారా గ్రామీణ బాలికలకు క్రికెట్‌ ‌శిక్షణ ఇచ్చింది. డబ్ల్యూపీఎల్‌ అకాడమీలు స్థాపించింది. ప్రభుత్వ మద్దతుతోనే 2025లో డబ్ల్యూపీఎల్‌-2026‌కు మరిన్ని ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టింగ్‌ ‌రైట్స్ ‌పెరిగాయి. ఇది మహిళల క్రికెట్‌ను భారీ జనాదరణ సాధించేలా చేసింది. రాధా యాదవ్‌, ‌రేణుకా సింగ్‌ ‌లాంటి గ్రామీణ ఆటగాళ్లు స్టార్లుగా మారారు.

  1. వరల్డ్ ‌కప్‌ ‌విజేతలతో వ్యక్తిగత సమావేశాలు, ప్రశంసలు

మోదీ ప్రభుత్వం మహిళా క్రికెటర్లను జాతీయ హీరోలుగా చూస్తుంది. ప్రధాని మోదీ 2017 వరల్డ్ ‌కప్‌ ‌ఫైనల్‌ ‌తర్వాత మొదటి సమావేశం నుండి, 2025లో మొదటి వరల్డ్ ‌కప్‌ ‌విజయం తర్వాత నవంబర్‌ 5‌న లోక్‌కల్యాణ్‌ ‌మార్గ్ ‌గృహంలో హర్మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ ‌నేతృత్వంలో జట్టుతో సమావేశ మయ్యారు. జట్టు ధైర్యాన్ని ప్రశంసించారు. ‘‘మీరు మూడు ఓటముల తర్వాత కమ్‌బ్యాక్‌ ‌చేసి చరిత్ర సృష్టించారు’’ అని కొనియాడారు. ఆయన దీప్తి శర్మ ట్యాటూపై ‘‘హనుమాన్‌ ‌జీ కా ట్యాటూ?’’ అని అడిగి, జట్టును నవ్వించారు. స్మృతి మంధానకు ‘‘భేల్‌’’ ఇచ్చి, అమన్‌జోత్‌ ‌కౌర్‌ ‌క్యాచ్‌ను ప్రశంసించారు. ఈ సమావేశం రెండు గంటలు జరిగింది. మోదీ మాటలు ఆటగాళ్లకు ప్రేరణగా మారాయి. నవంబర్‌ 6‌న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గృహంలో కూడా జట్టుకు గౌరవం దక్కింది. హర్మన్‌‌ప్రీత్‌ ‌సంతకాలు చేసిన జెర్సీని బహూకరించింది. ఇచ్చింది. మోదీ ఎక్స్ (‌ట్విటర్‌)‌లో ‘‘స్పెక్టాక్యులర్‌ ‌విన్‌’’ అని పోస్ట్ ‌చేసి, జట్టును అభినందించారు.

  1. ఫిట్‌ ఇం‌డియా మూమెంట్‌, ‌యువతకు ప్రోత్సాహం

మోదీ ప్రభుత్వం ‘‘ఫిట్‌ ఇం‌డియా’’ మూమెంట్‌ను మహిళల క్రికెట్‌తో ముడిపెట్టింది. మోదీ వరల్డ్ ‌కప్‌ ‌విజేతలతో సమావేశంలో ఆటగాళ్లను ‘‘ఫిట్‌ ఇం‌డియా మూమెంట్‌ను ప్రమోట్‌ ‌చేయండి, ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాడండి’’ అని కోరారు. స్కూళ్లకు వెళ్లి, బాలికలను క్రికెట్‌ ఆడేలా ప్రోత్సహించా లని జట్టుకు చెప్పారు. ‘‘మీరు యువతకు ఇన్‌స్పిరేషన్‌’’ అని అన్నారు. ఈ మూమెంట్‌ ‌ద్వారా గ్రామీణ బాలికలకు క్రికెట్‌ అకాడమీలు, స్కాలర్‌షిప్‌లు వచ్చాయి. మోదీ 2017లో మిథాలీ రాజ్‌తో ‘‘ఓటమి నుంచి నేర్చుకోండి’’ అని చెప్పారు. 2025లో హర్మన్‌‌ప్రీత్‌తో తిరిగే అదే మాటలు అన్నారు. ఈ మాటలు ఆటగాళ్లకు మానసిక బలాన్ని ఇచ్చాయి.

  1. ఇతర ప్రోత్సాహకాలు, భవిష్యత్‌ ‌ప్రణాళికలు

మోదీ ప్రభుత్వం మహిళల క్రికెట్‌కు మౌలిక సదుపాయాలను పెంచింది. స్టేడియంలు, ట్రైనింగ్‌ ‌సెంటర్లు నెలకొల్పింది. 2023 •-19 వరల్డ్ ‌కప్‌ ‌విజయానికి మద్దతు ఇచ్చి, యంగ్‌ ‌టాలెంట్‌ ‌పోగ్రామ్‌లు ప్రారంభించింది. 2025 వరల్డ్ ‌కప్‌ ‌విజయం తర్వాత బీసీసీఐ రూ.51 కోట్లు, ఐసీసీ రూ.39 కోట్లు రివార్డులు ప్రకటించాయి. భవిష్యత్తు ప్రణాళికల్లో డబ్ల్యూపీఎల్‌ ‌విస్తరణ, మరిన్ని టెస్ట్ ‌మ్యాచ్‌లు, మరిన్ని గ్రామీణ అకాడమీలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం మహిళల స్పోర్టస్‌కు 2024-25లో రూ3,000 కోట్లు బడ్జెట్‌ ‌కేటాయించింది.

బేటీలు ఆడితే దేశం గెలుస్తుంది

మోదీ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల మహిళల క్రికెట్‌ ‌భారతదేశంలో జనాదరణ సాధించింది. 2025 వరల్డ్ ‌కప్‌ ‌ఫైనల్‌కు 86,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. గ్రామీణ బాలికలు (శ్వేతా సెహ్రావత్‌) ‌నుండి మధ్యతరగతి (స్మృతి మంధాన) వరకు అందరూ ప్రేరణ పొందారు. మోదీ చెప్పినట్టు ‘‘క్రికెట్‌ ‌భారతదేశంలో జీవితం లాంటిది.’’ ఈ ప్రోత్సాహం మహిళల సాధికారతకు చిహ్నం. ‘‘బేటీలు ఆడితే, దేశం గెలుస్తుంది.’’ అనేది ముమ్మాటికి నిజం.


అర్ధ శతాబ్దపు మేటి మహిళా క్రికెటర్లు

వైతాళికులు (1970లు-1980లు)

డయానా ఎడుల్జీ:

జననం: జనవరి 26, 1956, ముంబై.

పాత్ర: ఆల్‌-‌రౌండర్‌, ‌స్పిన్‌ ‌బౌలర్‌, ‌కెప్టెన్‌

ఆరంగేట్రం: 1976లో వెస్టిండీస్‌తో టెస్ట్ ‌మ్యాచ్‌

‌రికార్డులు: 20 టెస్ట్‌లు, 34 ఓడీఐలు

టెస్ట్‌ల్లో 63 వికెట్లు (ఆ కాలంలో భారత మహిళల్లో అత్యధికం )

మొదటి మహిళా క్రికెటర్‌గా అర్జున అవార్డు (1983)

శాంతా రంగస్వామి:

జననం: జనవరి 1, 1954, చెన్నై.

పాత్ర: ఆల్‌-‌రౌండర్‌, ‌మొదటి కెప్టెన్‌

ఆరంగేట్రం: 1976లో వెస్టిండీస్‌తో టెస్ట్ ‌మ్యాచ్‌

‌రికార్డులు: మొదటి భారత మహిళా టెస్ట్ ‌శతకం (న్యూజిలాండ్‌పై108 పరుగులు, 1977.)

16 టెస్ట్‌లు, 19 ఓడీఐలు

సంధ్య అగర్వాల్‌:

‌జననం: 1963, ఇండోర్‌

‌పాత్ర: ఓపెనర్‌ ‌బ్యాట్స్‌వుమన్‌

‌రికార్డులు: టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై 190 పరుగులు (1986). ఆ కాలంలో వరల్డ్ ‌రికార్డ్.

‌శుభాంగి కులకర్ణి:

జననం: 1958, పూణే

పాత్ర: లెగ్‌-‌స్పిన్‌ ‌బౌలర్‌, ‌కెప్టెన్‌

‌రికార్డులు: 19 టెస్ట్‌లు, 27 ఓడీఐలు

టెస్ట్‌లో 60 వికెట్లు

నీతూ డేవిడ్‌:

‌జననం: 1977, విజయవాడ

పాత్ర: స్లో లెఫ్ట్-ఆర్మ్ ‌బౌలర్‌

‌రికార్డులు: 8/53 ఇంగ్లండ్‌పైన (1995). ఆ కాలంలో టెస్ట్ ‌బౌలింగ్‌లో రికార్డ్

‌స్వర్ణ యుగం (1990లు – 2000లు)

మిథాలీ రాజ్‌:

‌జననం: డిసెంబర్‌ 3, 1982,  ‌జోధ్‌పూర్‌.

‌పాత్ర: రైట్‌-‌హ్యాండ్‌ ‌బ్యాట్స్‌వుమన్‌, ‌కెప్టెన్‌

ఆరంగేట్రం: 1999 ఓడీఐ × ఐర్లాండ్‌

‌రికార్డులు: మహిళల ఓడీఐలో అత్యధిక పరుగులు (7,805)

12 టెస్ట్‌లు, 89 టీ20లు, 232 ఓడీఐలు

7 ఓడీఐ శతకాలు, 64 అర్ధశతకాలు

ఝులన్‌ ‌గోస్వామి:

జననం: నవంబర్‌ 25, 1982,  ‌చకా (పశ్చిమ బెంగాల్‌).

‌పాత్ర: ఫాస్ట్ ‌బౌలర్‌, ‌కెప్టెన్‌

‌రికార్డులు: మహిళల ఓడీఐలో అత్యధిక వికెట్లు (255)

12 టెస్ట్‌లు, 68 టీ20లు, 204 ఓడీఐలు

అంజుమ్‌ ‌చోప్రా:

జననం: 1977, ఢిల్లీ

పాత్ర: ఓపెనర్‌, ‌కామెంటేటర్‌

‌రికార్డులు: 12 టెస్ట్‌లు, 127 ఓడీఐలు

విశేషం: మొదటి మహిళా కామెంటేటర్‌.

‌నవతరం (2010లు – 2025)

హర్మన్‌‌ప్రీత్‌ ‌కౌర్‌:

‌జననం: మార్చి 8, 1989,  మోగా (పంజాబ్‌).

‌పాత్ర: ఆల్‌-‌రౌండర్‌, ‌టీ20 కెప్టెన్‌

‌రికార్డులు: 2017 వరల్డ్ ‌కప్‌ ‌సెమీస్‌లో 171 పరుగులు (115 బంతులు). ఓడీఐ  లో అత్యధిక స్కోర్‌ (‌మహిళలు)

విశేషం: 2025 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచిన జట్టు కెప్టెన్‌.

‌స్మృతి మంధాన:

జననం: జులై 18, 1996, ముంబై.

పాత్ర: ఓపెనర్‌

‌రికార్డులు: మహిళల ఓడీఐలో అత్యంత వేగవంతంగా శతకం (67 బంతులు)

జెమిమా రోడ్రిగ్స్:

‌జననం:  సెప్టెంబర్‌ 5, 2000, ‌ముంబై.

పాత్ర: మిడిల్‌ ఆర్డర్‌ ‌బ్యాట్స్‌వుమన్‌

‌విశేషం: 16 ఏళ్లకే ఆరంగేట్రం. గాయకురాలు కూడా.

శఫాలీ వర్మ:

జననం: జనవరి 28, 2004, రోహ్‌తక్‌.

‌పాత్ర: అగ్రెసివ్‌ ఓపెనర్‌

‌రికార్డులు: మహిళల టీ20లో అత్యంత వేగవంతమైన డబుల్‌ ‌సెంచురీ.

 రాధా యాదవ్‌:

‌జననం: 2000, ముంబై (గ్రామీణ నేపథ్యం)

పాత్ర: స్లో లెఫ్ట్-ఆర్మ్ ‌స్పిన్నర్‌

‌రేణుకా సింగ్‌:

‌జననం: 1996, హిమాచల్‌ ‌ప్రదేశ్‌

‌పాత్ర: ఫాస్ట్ ‌బౌలర్‌

‌విశేషం: 2022 కామన్వెల్త్ ‌గేమ్స్‌లో గోల్డ్ ‌మెడల్‌.

About Author

By editor

Twitter
YOUTUBE