నవంబర్‌ 10న దేశ రాజధానిలో ఎర్రకోట దగ్గర సంభవించిన పేలుడు అనూహ్య మైన కొన్ని డెసిబల్స్‌ను దట్టించుకుని జాతిని ఉలిక్కిపడేటట్టు చేసింది. ఇందుకు కారణం` దాదాపు దశాబ్దకాలంగా దేశంలో పేలుళ్లు వినపడలేదు. అందుకే ఎర్రకోట పేలుడు మరింత భయానకంగా చెవులను తాకింది. ఆ రోజు సాయంత్రం, సుభాష్‌ మార్గ్‌లో 6.52 ప్రాంతంలో జరిగిన పేలుడుతో పాటు చాలా కొత్త కోణాలు వినిపించాయి. ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. తవ్విన కొద్దీ అవి కనిపిస్తూనే ఉన్నాయి. పేలుడు శకలాలంత పదునైన కొత్త పదాలు  ఎగిరొచ్చి జాతిని తాకాయి. అందులో మొదటిది ‘వైట్‌కాలర్‌ టెర్రర్‌’. అంటే చదువుకున్న ఉగ్రవాదులు. ఇంతకాలం చదువుకోని మొరటు మతోన్మాదులు రక్తపాతం సృష్టిస్తే, ఇప్పుడు ఇస్లాం మతోన్మాదం తలకెక్కిన విద్యావంతులు ఆ విధ్వంసక కార్యక్ర మాన్ని వాళ్ల చేతులలోకి తీసుకున్నారు. హరియాణాలో మైనారిటీ సంస్థగా పేరున్న అల్‌ ఫలాప్‌ా విశ్వవిద్యాలయం లోని వైద్య కళాశాల ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారంగా యథేచ్ఛగా పనిచేస్తున్న సంగతి బయటపడిరది. పర పురుషుడి కంటపడకుండా నిరంతరం తమ స్త్రీలను  బురఖాల వెనుక ఉంచే ముస్లిం మతోన్మాద ఛాందసులు, ఇప్పుడు వారికి ఎదుటి మతస్థులను వెంటాడి చంపే పద్ధతులలో తర్ఫీదు ఇస్తున్నారు.


ఎర్రకోట నుంచి ఏటా ఆగస్ట్‌ 15 సందర్భంగా ప్రధాని ప్రసంగించే చోటుకు సమీపంలోనే, ఒకటో నెంబర్‌ గేటు దగ్గర పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ ఉందని నిర్థారణ అయ్యింది. పాకిస్తాన్‌ హస్తం గురించి స్పష్టం కావలసి ఉంది. పేలుడుకు బాధ్యత తమదేనని ఏ సంస్థా ప్రకటించుకోలేదు. భూటాన్‌లో ప్రధాని ఇచ్చిన ప్రకటనలో ‘కుట్రదారులు’ అన్న పదం ఉపయో గించారు. అమెరికా, ఇరాన్‌, భూటాన్‌, శ్రీలంక తదితర దేశాలు ఈ పేలుడు కుట్రను ఖండిరచి, మృతుల కుటుంబాల వారికి సానుభూతి ప్రకటించాయి. ఐ20 కారులో అమర్చిన ప్రాణాంతక పేలుడు సామగ్రి పేలి 15 మంది (నవంబర్‌ 18 వరకు) చనిపోయారు, 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ‘ఆపరేషన్‌’ యావత్తు ఒక వైద్యుడి నిర్వాకమే. పది అగ్నిమాపక యంత్రాలు వచ్చి, సమీపంలోని కార్లను చుట్టుముట్టిన మంటలను ఆర్పవలసి వచ్చింది. తీవ్రత, తీరుతెన్నులు పాత పేలుళ్లకి చాలా భిన్నంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

పట్టించిన శ్రీనగర్‌ పోస్టర్‌

ఫరీదాబాద్‌ ముస్లిం వైద్య విశ్వవిద్యాలయం అల్‌ ఫలాప్‌ా కేంద్రంగా జరిగిన ఈ దారుణ కుట్ర బయటపడిన తీరు విస్మయం కలిగిస్తుంది. శ్రీనగర్‌లో కనిపించిన జైషే మహమ్మద్‌ అనుకూల పోస్టర్లు ఈ కుట్ర మూలాలను పట్టించాయి. ఈ సంవత్సరం అక్టోబర్‌ మధ్యలో జైషే పేరుతోనే శ్రీనగర్‌లోని నవగావ్‌లో కొన్ని పోస్టర్లు కనిపించాయి. భద్రతా దళాల మీద, కశ్మీరీయేతరుల మీద దాడులు జరుగు తాయంటూ బెదిరించే రాతలు వాటిలో ఉన్నాయి. దీనితో నిఘా వ్యవస్థలు అప్రమత్తమై సీసీ పుటేజ్‌ క్షుణ్ణంగా పరిశీలించి ఆరిఫ్‌ నిసార్‌ దార్‌, యూసిర్‌ ఉల్‌ అష్రాఫ్‌, మసూద్‌ అహమ్మద్‌ దార్‌ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. వీళ్లని ప్రశ్నించిన తరువాత మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్‌ను అరెస్టు చేశారు. ఎర్రకోట కారు పేలుడులో ఉన్న డాక్టర్‌ ఉమర్‌ను ఉగ్రవాదిగా మార్చినవాడు ఇతడే. సోఫియాన్‌కు చెందిన ఇతడు పారా మెడికల్‌ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం ముస్లిం మత గురువుగా, ఉగ్రవాద ముఠాల ప్రచారం కార్యక్రమాలు జమిలీగా నిర్వహిస్తు న్నాడు. ఇతడి దగ్గర దొరికిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర అధునాతన పరికరాలు, సమాచారం చూశాక జాతీయ అంతర్జాతీయ స్థాయి కుట్ర జరుగుతున్నట్టు ఆధారాలు దొరికాయి. దీనితో దర్యాప్తు  శ్రీనగర్‌ నుంచి హరియాణాలోని ఫరీదాబాద్‌కు విస్తరించ వలసి వచ్చింది. అల్‌ ఫలాప్‌ా విశ్వవిద్యాలయంలో 2900 కిలోల పేలుడు పదార్థాలు (అమ్మోనియం నైట్రేట్‌, పొటాసియం నైట్రేట్‌, సల్ఫర్‌) పట్టుబడ్డాయి. ఇదే జాతిని కలత పెట్టింది.

బాబ్రీ కూల్చివేతకు ప్రతీకారం కూడా

అయోధ్యలో బాబ్రీ కట్టడం కూలి 32 సంవత్సరాలు అయింది కాబట్టి, 32 పాత కార్లలో పేలుడు పదార్థాలు ఉంచి దేశం నలుమూలలా  విస్పోటనాలు జరిపించాలన్నదే మరొక వినూత్న విధ్వంసక యోచన. అందులో మొదటి ప్రయత్నం ఈ ఆగస్ట్‌ 15న విఫలమయింది. రెండో ప్రయత్నం జనవరి 26న జరపాలని అనుకుంటున్న తరుణంలో కుట్రంతా బయటపడిరది. ఈ పథకానికే డి`6 అని పేరు. ఆగస్ట్‌ 15న విఫలమయినది, ప్లాన్‌ ఎ. ఇప్పుడు విఫలమైనది` ప్లాన్‌ బి. అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రతి విషయం ఒక విస్పోటన శకలమే. ఉగ్రవాదులు నోరు విప్పుతుంటే ఉదారవాదులు నోరు వెళ్ల బెట్టవలసి వస్తున్నది. ఉగ్రవాదం ఏదైనా దానికి మతం లేదన్న వెర్రిమొర్రి వాదనలకు ఇక శాశ్వతంగా తెర పడక తప్పదు. బాబ్రీ కట్టడం కూల్చివేత 32 ఏళ్ల సందర్భాన్నే వాళ్లు ఎందుకు ఎంచుకున్నారు? ఈ కేసుతో సంబంధం లేదని ఇప్పటికి అనుకున్నా, హైదరాబాద్‌లో అరెస్టయిన డాక్టర్‌ ఒకరు ఆముదం గింజల ద్వారా తయారు చేసిన విషం ప్రయోగించా లనుకున్నది ఎక్కడ? మంచినీటిలో, హిందూ దేవాలయాలలో తయారు చేసే ప్రసాదాలలో. ఇవన్నీ విన్న తరువాత కూడా సెక్యులర్‌ దివాంధులు ఉగ్రవాదానికి మతం కోణం లేదని వాగితే పాకిస్తాన్‌ భక్తులుగానే చూడవలసి వస్తుంది. అంటే ఈ దేశానికి హితులు కారనే చెప్పడం. ఫరీదాబాద్‌ అల్‌ ఫలాప్‌ా విశ్వవిద్యాలయం ఈ కుట్రదారులందరికీ స్వర్గ ధామంగా పనిచేసింది. దీని నిర్మాతల గత చరిత్ర కూడా ఎంతో ఘనమైనది. ఇప్పుడు సర్వం కోల్పో యింది. విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా చీకటితో నిండిరది.

హమాస్‌ బాట పడుతున్న జైష్‌

నవంబర్‌ 17న జాతీయ దర్యాప్తు సంస్థ మరొక కశ్మీర్‌ వాసిని ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసింది. ఇతడి పేరు జసీర్‌ బలాల్‌ వానీ. ఇతడినే డానిష్‌ అని కూడా పిలుస్తారు. అనంతనాగ్‌ జిల్లాలోని ఖ్వాజీగుండ్‌ ప్రాంతం వాడు. ఇతడు వెల్లడిరచిన వివరాలు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. భారత్‌ మీద పగబట్టిన ఇస్లామిక్‌ తీవ్రవాదులు హమాస్‌ (పాలస్తీనా ఉగ్రసంస్థ) బాట పట్టబోతున్నారని అర్ధమవుతుంది. డ్రోన్ల సాయంతో ఉగ్రదాడులు నిర్వ హించాలని పథకం వేశారని ఇతడు వెల్లడిరచాడు. ఎర్రకోట కారు పేలుడు నిర్వహించిన డాక్టర్‌ ఉమర్‌ ప్రధాన అనుచరుడు ఇతడు. డ్రోన్‌లకు చిన్నవే అయినా శక్తిమంతమైన బాంబులు, కెమేరా, బ్యాటరీ అమర్చి జనసమ్మర్ధం కలిగిన ప్రదేశాలలో పేల్చి వేస్తారు. అయితే ఈ ప్రయత్నం కూడా ఫరీదాబాద్‌ వైద్యుల అరెస్టుతో విఫలమయింది. ఇప్పుడు చాలామంది పరారీలో ఉన్నారు.

నాలుగేళ్లుగా సాగుతున్న కుట్ర

ఈ కుట్ర నాలుగేళ్లుగా సాగుతోందని అరెస్టయిన వైద్య శిఖామణులు బయటపెట్టారు. 32 కార్లతో విధ్వంసానికి అదనంగా కాబోలు, దేశవ్యాప్తంగా ఆరు నగరాలలో పేలుళ్లు ఏకకాలంలో జరపాలన్నది కూడా ఉగ్ర వైద్యుల మరొక కుట్రగా తెలిసింది. దీనికి ఆద్యుడు ఎర్రకోట వద్ద కారు పేలుడులో చనిపోయిన డాక్టర్‌ ఉమర్‌ నబీ. పుల్వామా ప్రాంతానికి చెందిన ఇతడు శ్రీనగర్‌లో ఒక క్లినిక్‌ నడిపేవాడు. అక్కడికే తన కుమారుడిని తీసుకుని ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహమ్మద్‌ వైద్యం కోసం ఆ క్లినిక్‌కు వచ్చాడు. పరిచయం పెరిగి ఇర్ఫాన్‌ డాక్టర్‌ ఉమర్‌ను ఉగ్రవాదం వైపు నెట్టాడు. శ్రీనగర్‌ నుంచి ఫరీదా బాద్‌లోని అల్‌ ఫలాప్‌ా వైద్య కళాశాలలో చేరి, తోటి వైద్యులను కూడా ఉగ్రవాదులుగా మార్చాడు. మహిళా డాక్టర్‌ షాహీన్‌ సహా, ఆ వైద్యులంతా 2021లో కశ్మీర్‌లోనే జైషే మమహ్మద్‌ నెట్‌వర్క్‌ సభ్యులను కలుసుకున్నారని వీరి డైరీలు, డిజిటల్‌ వివరాల ద్వారా వెల్లడైంది. ఆ మరుసటి ఏడాది టర్కీ వెళ్లి జైషే మహమ్మద్‌ విదేశీ కార్యకలాపాలు నిర్వహించే అబూ ఉక్సాను కలుసుకున్నారు. ఆ సంవత్సరమే హవాలా ద్వారా రూ. 20 లక్షల సేకరించారు. ఎట్టకేలకు డిసెంబర్‌ 6న విధ్వంసానికి తేదీ నిర్ణయించుకున్నారు.

ఈ కుట్ర మూలాలు కశ్మీర్‌లోనే ఎక్కువ బయటపడ్డాయి. అక్టోబర్‌లోనే డాక్టర్‌ అదిల్‌ అహ్మద్‌ రాథేర్‌ కూడా అరెస్టయ్యారు. ఈయనను ప్రశ్నించి నప్పుడే ఫరీదాబాద్‌ వైద్య కళాశాలలో పనిచేసే ముజామ్మిల్‌ గనీ పేరు బయటకు వచ్చింది. ముజామ్మిల్‌ అరెస్టుతోనే 2900 కిలోల పేలుడు పదార్థాల వివరాలు తెలిశాయి. ఇతడి కారులో దొరికిన ఏకే 47 తుపాకీ డాక్టర్‌ షాహీన్‌ షాహిదీ గురించిన కూపీ ఇచ్చింది. ఈమె అరెస్టయిన కొద్దిసేపటికే డాక్టర్‌ ఉమార్‌ ఉన్‌ నబీ ఐ20 కారులో పేలుడు పదార్థాలు వేసుకుని, ఫరీదాబాద్‌ నుంచి ఢల్లీి వచ్చాడు. ఈయన కూడా అల్‌ ఫలాప్‌ా కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నవాడే. డాక్టర్‌ షాహీన్‌తో పరిచయం కలిగిన కాన్పూర్‌ హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ ఆరీఫ్‌ను కూడా తరువాత అరెస్టు చేసి ప్రశ్నించారు. ఇంకొక అనుమానితుడు డాక్టర్‌ నిసార్‌ ఉల్‌ హసన్‌. ఇతడిని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ యంత్రాంగం బహిష్కరిస్తే, అల్‌ ఫలాప్‌ా ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఇతడు ఆప్ఘనిస్తాన్‌కు పారిపోయి ఉంటాడని దర్యాప్తు సంస్థలు అనుమాని స్తున్నాయి. ఆ క్రమంలో హసన్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని కోరుతూ జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. అల్‌ ఫలాప్‌ా వైద్య కళాశాలలో ఇంతవరకు దర్యాప్తు సంస్థలు 70 మందిని ప్రశ్నించారు. ఇందులో రెసిడెంట్‌ డాక్టర్లు, సీనియర్‌ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు కూడా ఉన్నారు. డాక్టర్‌ ఉమర్‌ ఉన్‌ నబి, డాక్టర్‌ గనీ ఎప్పుడూ కళాశాలలో కనిపించేవారే కాదని, వాళ్లు అసలు వైద్యులేనా అని ప్రశ్నించుకోవలసి వచ్చేదని, బోధనకు సంబంధించి ఎలాంటి నైపుణ్యం వాళ్లలో ఉండేది కాదని నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి ఒకరు చెప్పారు. ఇందుకు కుట్ర కూడా ఈ కళాశాలలోనే 17 నెంబర్‌ భవనంలో 13వ నెంబర్‌ గదిలో జరిగిందని తేలింది. ఇంత నీచత్వంతో నడుస్తున్న ఈ కళాశాలకు మిగిలిన అనుమతులు, వ్యవహారాలు సజావుగా ఉన్నాయా అని, ఇది చట్టబద్ధంగా నడిచే సంస్థేనా అని ప్రశ్నించుకోవడం వ్యర్థం. అన్నీ లొసుగులే.

డాక్టర్లు ఉగ్రవాదులయ్యారా?

‘ఇవాళ ముస్లింలకు ప్రధానంగా ఎవరి వల్ల హాని జరుగుతున్నదంటే ముస్లిం ఉగ్రవాదుల వల్లనే. మల్లెపూల వంటి దుస్తులలో కనిపించే వైద్యులు కూడా మతోన్మాదులుగా మారిపోగలరు. చదువుకున్న వాళ్లు కూడా ఉగ్రవాదులుగా మారిపోతున్నారు’. నవంబర్‌ 10 ఢల్లీి పేలుడు వెనుక వైద్యుల రూపంలో ఉన్న ఉగ్రవాదులు ఉన్నారని వెల్లడి కావడంతో ప్రవాసంలో గడుపుతున్న బాంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ చేసిన వ్యాఖ్యలివి. ముస్లింలలో చదువుకున్న వారు కూడా ఉగ్రవాదులుగా మారగలరని ఆమె అన్నారు. ఇంకా ఆమె, విజ్ఞానశాస్త్రం చదువుతున్నా కూడా వారిలో మానవత్వం అంకురించడం లేదు. ఎందు కంటే విజ్ఞానశాస్త్రంతో పాటుగా ఖురాన్‌ కూడా చదువుతారు. విజ్ఞానశాస్త్రం ప్రాణాలు రక్షించ మంటుంది. ఇస్లాం ప్రాణాలు తీయమని చెబుతుంది. విజ్ఞానశాస్త్రం ఇహలోకంలో విలాసాలకు హామీ ఇస్తుంది. కానీ ఇస్లాం పరలోకంలోని సౌఖ్యాల గురించి భ్రమలు గుప్పిస్తుంది. అసలు మరణానంతర జీవితమే ఘనమైనదని బోధిస్తూ ఉంటుంది. ఇదీ, ఆమె వ్యాఖ్య. నిజమే, పదుల సంఖ్యలో వైద్యులే కాదు, ఈ కుట్రలో వైద్య, ఇంజనీరింగ్‌ చదివిన 22 మంది వృత్తి నిపుణుల పాత్ర ఉందని తేలింది. ముస్లింలంతా ఉగ్రవాదులు కారు. దీనిని అంగీక రిద్దాం. కానీ ఏ ఉగ్రవాద కుట్ర బయటపడినా, ఉగ్రవాద చర్య జరిగినా దాని వెనుక కనిపిస్తున్నది మాత్రం ముస్లింలేనన్నది ప్రపంచం ఒప్పుకోవాలి.

ఉమర్‌ ‘షూబాంబర్‌’ కావచ్చు

ప్రాణాంతక పేలుడు పదార్థాలతో కారు నడిపి పదమూడు మందిని పొట్టన పెట్టుకున్నవాడే డాక్టర్‌ ఉమర్‌ మహమ్మద్‌. ఇతడే ఉమరన్నబి. ఇతడి డీఎన్‌ఏ, తల్లి డీఎన్‌ఏతో సరిపోయింది. కశ్మీర్‌ లోయలో పుల్వామా దగ్గరి కోలి అనే గ్రామంలో ఉన్న డాక్టర్‌ ఉమర్‌ ఇంటిని భద్రతాదళాలు కూల్చి వేశాయి. అయితే ఇది అన్యాయమని, కుటుంబ సభ్యులన క్షోభ పెట్టరాదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మొసలి కన్నీరు కార్చారు. కానీ ఢల్లీి పేలుడులో బయటపడిన ఒక ఆధారం కొత్త వ్యూహం గురించి బయటపెట్టింది. ఉమర్‌  ‘షూబాం బర్‌’ అయి ఉంటాడా అన్న ప్రశ్న దర్యాప్తు బృందాలకు వచ్చింది. ఇలాంటి ప్రయత్నం పారిస్‌ నుంచి మియామీ వెళుతున్న విమానంలో రిచర్డ్‌ రీయడ్‌ అనే వాడు చేశాడు. టీఏటీపీ అనే పిలిచే ప్రాణాంతక పదార్థాలను పేల్చడానికి అతడు ప్రయత్నించినా విఫలమయింది. ఢల్లీిలో పేలిన కారు సీటు కింద దొరికిన బూటులో లోహంతో చేసిన ఒక పరికరం కనిపించింది. అదే పేలుడుకు ఉపయోగించి ఉంటాడని దర్యాప్తు సంస్థలు అనుమానం. ఈ పేలుడుకు అదే ట్రిగ్గర్‌లా పని చేసి ఉంటుందని అనుకుంటున్నారు. దీనికి తోడు పేలుడు తర్వాత అతడి కాలిచీలమండ తెగిపడి ఉండటంతో అతడు షూబాంబర్‌గా వ్యవహరించాడనే నిర్థారణకు దర్యాప్తు అధికారులు చేరుకున్నారు.

వేల సంఖ్యలో మరణాలను కోరుకున్న ఈ దారుణ మారణకాండకు వ్యూహమంతా ముస్లింలే నడిపే వైద్య కళాశాల కేంద్రంగా జరిగింది. హరియాణాలోని ఫరీదాబాద్‌కు సమీపంలోని ఉన్న ఈ కళాశాలలోనే డాక్టర్‌ ముజుమ్మల్‌ అహ్మద్‌ గనాయ్‌, డాక్టర్‌ అదీల్‌ రాథర్‌లను ఉమర్‌ కలుసు కున్నాడు. ప్రస్తుతం ఈ వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాల వ్యవహారాలన్నిటిని నిఘావర్గాలు వెలికి తీస్తున్నాయి. వైద్య వృత్తిలో ఉన్న ముస్లింలను ఉగ్రవాదులుగా మార్చే కుట్ర ప్రబలంగానే జరుగుతున్నట్టు ఈ ఘటనతో వెల్లడయింది.

ఉగ్రవాదం వైపునకు ముస్లిం మహిళలు?

మహిళలకు ఇస్లాం హక్కులు ఇవ్వదు. కానీ జిహాద్‌లో సగభాగం ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధపడిరది. అల్‌ ఫలాప్‌ా (ఫరీదాబాద్‌ కాలేజీ)లోనే పనిచేస్తున్న డాక్టర్‌ షాహీనా షాహిద్‌ ఇందుకు ఉదాహరణ. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే జైష్‌ ఏ మహమ్మద్‌ ఉగ్ర సంస్థ మహిళా విభాగంతో ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢల్లీి పేలుడుతో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠాకు రూ. 20 లక్షలు విరాళాలు సేకరించిపెట్టినదామె. ఈమె నేపథ్యం పరిశీలిస్తే తస్లీమా మాటలు ఎంత వాస్తవమో బాగా అర్ధమవు తుంది. మతోన్మాదం ఈమెలోని మానవత్వాన్ని హరించింది. ఈమె మాజీ భర్త డాక్టర్‌ జఫార్‌ హయత్‌ మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. అసలు ఆమె బురఖా ధరించడానికి కూడా ప్రాధాన్యం ఇచ్చేది కాదంటున్నాడాయన. ఆ ఇద్దరు 2003 నుంచి 2012 వరకు కాపురం చేశారు. షాహీనాలో ఏనాడూ ఉగ్రవాద లక్షణాలు కనిపించలేదట. విడాకులు తీసుకున్న చాలాకాలం వరకు పిల్లలతో అనుబంధం కొనసాగించారట. యూరప్‌కు లేదా ఆస్ట్రేలియాకు వెళ్లి మరింత సంపాదించాలన్న ఆమె ఆశయాన్ని మాత్రం భర్త అంగీకరించలేదు. నవంబర్‌ 10న ఈమె అరెస్టయ్యారు. జైషే మహమ్మద్‌, అన్సార్‌ ఘజ్వాత్‌ అల్‌ హింద్‌ ఉగ్ర మూకలతో ఈమెకు సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.ఈమె జైషే మహమ్మద్‌ మహిళా విభాగం జమాత్‌ ఉల్‌ మొమినాత్‌కు నాయకత్వం కూడా వహిస్తున్నారు. ఈ నవంబర్‌ 8-10 మధ్య ఈ ఘటనలు జరిగాయి.

భయంతోనే కారు పేలుడు?

హరియాణా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక తెల్ల హ్యుండాయ్‌ ఐ20 కారు 10వ తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ప్రవేశించింది. చాలాచోట్ల చక్కర్లు కొట్టి, మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రోస్టేషన్‌ దగ్గర సుహేరీ మసీదు వద్ద ఆగింది. సాయంత్రం 6.20 ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గరకు నెమ్మదిగా చేరుకున్నాక పేలుడు సంభవించింది. పుల్వామా, జమ్ముకశ్మీర్‌లతో సంబంధం ఉన్నవారే దీనికి పాల్పడ్డారని అర్ధమవు తూనే ఉంది. ఆ కారు ఏడు చేతులు మారింది, చివరికి పేలుడుకు ఉపయోగపడిరది. ఇప్పటి వరకు వినిపించిన పేర్లను బట్టి ఇది ముమ్మాటికీ ఉగ్రదాడే నన్న అనుమానం కలగకమానదు. జైష్‌, అన్సార్‌ గజ్‌వత్‌ ఉల్‌హింద్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన ఏడుగురు వ్యక్తులు, వారి వద్ద నుంచి 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలు స్వాధీనమైన కొన్ని గంటలకే ఈ విస్ఫోటం సంభవించింది. వరస అరెస్టుల తరువాత ఆ పేలుడు పదార్థాలను ఎక్కడ దాచాలో తెలియక అలాంటి తొందరపాటు చర్యకు పాల్పడ్డారన్న వాదన ఉంది. అలాగే ఆ అరెస్టులకు ఇది ప్రతీకారమనే ఎక్కువ మంది అనుమానిస్తు న్నారు. ఆ పేలుడు పదార్థాలను ఎక్కడెక్కడ అమర్చ వలసి ఉంటుందో విధ్వంసకులకు సమాచారం అందవలసిన తరుణంలో అరెస్టులు జరిగాయి. ఆ విధంగా పెద్ద విపత్తు నుంచి దేశం బయటపడిరది. వైట్‌కాలర్‌ ఉగ్రభూతంగా చెబుతున్న ఈ కుట్రలో ఎక్కువ మంది వైద్యులు. కేసు జాతీయ దర్యాప్తు సంస్థ చేతికి ఇచ్చారు. ఢిల్లీ దాడికి బాధ్యుడు పుల్వా మాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ మహమ్మద్‌ అని, ఐఎస్‌ఐ పథకంతో జైషే నిర్వహించిందని జమ్ముకశ్మీర్‌ మాజీ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ వైద్‌ నిర్మొహ మాటంగా ప్రకటించారు. దీనిని బట్టి కశ్మీర్‌ ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతున్నదని దీనితో జాతీయ భద్రతకు పెను ముప్పేనని ఆయన హెచ్చరించారు కూడా. అమోనియం నైట్రేట్‌ ఫూయిల్‌ ఆయిల్‌, డిటొనేటర్ల సాయంతో ఈ పేలుడు జరిపారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ముస్లిం ఉగ్రవాదానికి ఉన్న రూపు, తత్త్వం, తీవ్రత ఘటన ఘటనకు మారుతున్నాయి. ఒకప్పుడు అవిద్యతో కొందరు ముస్లింలు ఉగ్రవాదాన్ని ఆశ్ర యిస్తున్నారని బుద్ధితక్కువ మేధావులు నిరంతరం నమ్మించే ప్రయత్నం చేశారు. అది తప్పని తేలి పోయింది. ఢిల్లీ, అలీఘడ్‌ ముస్లిం విశ్వ విద్యాల యాల నుంచి నేరుగా కశ్మీర్‌లో ఉగ్రవాదానికి వెళ్లిన వారు ఉన్నారు. మరి ఇప్పుడు! ముస్లిం వర్గానికి చెందిన వైద్యులు ఉగ్రవాద కార్యకలాపాలలో నేరుగా పాల్గొన్నారు. ఒక మతానికీ, ఉన్నత విద్యకీ ఇంతకు మించి సిగ్గుచేటయిన విషయం మరొకటి ఉంటుందా? దేశంలో వాతావరణం మారాలి. ఆలోచనా విధానం మారాలి. ఇది ప్రభుత్వ వైఫల్యం, నిఘా వర్గాలు నిద్ర పోతున్నాయా? అంటూ విరుచుకు పడేవారు ఇలాంటి నరహంతక రాక్షస క్రీడలు ఆపాలని ఉగ్రవాద ముఠాలకు కూడా చెప్పరేమి? దాదాపు ముప్పయ్‌ రోజుల నుంచి ఈ ఉగ్రమూఠా కలుగులు కనిపెట్టి 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నది ఎవరు? నిఘా వర్గాలు కాదా? క్షణాలలో ఇంతమంది కుట్ర దారులకు సంకెళ్లు వేయించగలిగినది వారు కాదా? దేశం నలుమూలలా విధ్వంసం సృష్టించాలని మతోన్మాదులు ఎదురు చూస్తున్న తరుణంలో వరసగా అరెస్టులు కూడా జరిగాయి. అక్టోబర్‌ 24న భోపాల్‌, ఢిల్లీలలో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న, ఐఎస్‌ఐతో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేశారు. అంతకు కొంచెం ముందు పంజాబ్‌ పోలీసులు బబ్బర్‌ ఖాల్సా అంతర్జాతీయ ముఠాను జలంధర్‌లో అరెస్టు చేశారు. వీళ్ల దగ్గర నుంచి ఆర్‌డీఎక్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్‌ కాయిదాతో సంబంధాలు ఉన్న పుణే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జుబేర్‌ హంగర్గేకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జైషే మహమ్మద్‌ సంస్థతో సంబంధం ఉన్న ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆధిపత్య ధోరణితో, అయోధ్యకు ప్రతీకారం పేరుతో ఈ విధ్వంసం ఇంకా ఎన్నాళ్లు సాగిస్తారు? అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఫలితం. న్యాయపోరాటం ద్వారా సాధించుకున్నది.

ఎర్రకోట కారు పేలుడులో ఇంకా సమాధానాలు దొరకవలసిన ప్రశ్నలు చాలా ఉన్న మాట నిజం. కానీ ఒకటి స్పష్టమైంది. ముస్లిం మతోన్మాదంతో కూడిన ఉగ్రవాదం కొత్త కోరలతో మళ్లీ సిద్ధమవు తున్నది. దీనికి మత కోణం ఒక వాస్తవం. అదే ప్రధానం. ఉదారులు తమది మానవ జన్మే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగానే దేశంలో మత సామరస్యం వెల్లివిరియా లంటే ముస్లింలు మతోన్మాదాన్ని వీడాలని ఆ రక్తపిపాసులకు సెక్యులరిస్టులు చెప్పగలగాలి. లేకుంటే చానళ్లలో నోరు పారేసుకోవడం మానాలి. సామాజిక మాధ్యమాలు కట్టేసి నోరు మూసుకుని కూర్చోవాలి. ఇన్నేళ్లుగా ఇంత జరిగాక కూడా తప్పంతా హిందువులదేనని ఇంకా మాట్లాడితే హిందువుల నుంచి పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE