సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు శ్రావణ బహుళ విదియ – 11 ఆగస్ట్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘మీరు నిజమైన భారతీయుడే అయితే, ఇలా మాట్లాడి ఉండేవారా?’ ఇది భారత అత్యున్నత న్యాయస్థానం ఆగస్ట్‌ 4న లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ని ఉద్దేశించి చేసిన అతి తీవ్రమైన వ్యాఖ్య. నిజమే, సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి వ్యాఖ్య రావడం అసాధారణం. సమున్నత న్యాయస్థానం చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయక తప్పని పరిస్థితి కల్పించినదీ రాహుల్‌ గాంధీయే. రాజ్యాంగం చేతబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రజాస్వామ్యాన్ని అవమానించేదే. ప్రతిపక్ష నేతగా వేసే ప్రతి అడుగు సమాఖ్య వ్యవస్థకు, దేశ సమైక్యతకు భంగకరమైనదే. వేదిక ఏదైనా, ఎక్కడిదైనా ఆయన నోరు విప్పితే దేశం మీద దూషణలే వినిపిస్తాయి. భారత సైన్యాన్ని నీచాతినీచంగా అవమానిస్తాడు. ఎన్నికల కమిషన్‌ను నిరంతరం ఆడిపోసుకుంటాడు. హిందూధర్మం అన్నా, భారత స్వాతంత్య్ర సమరయోధులన్నా మరీ చులకన భావం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే సుప్రీం కోర్టు అంత తీవ్ర వ్యాఖ్య చేయవలసి వచ్చింది. జస్టిస్‌ దీపంకర్‌ దత్తా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిలతో కూడిన ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలను నిజమైన భారతీయులంతా స్వాగతిస్తారు. రాహుల్‌ నిజమైన భారతీయుడేనా అన్న ప్రశ్న ఇప్పుడు సమున్నత న్యాయస్థానం వేసి ఉండవచ్చు. కానీ అలాంటి సందేహం ఎందరో భారతీయులను చిరకాలంగా వేధిస్తున్న మాట నిజం.

డిసెంబర్‌ 16, 2022న భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఈ గాంధీ`నెహ్రూ వారసుడు సైన్యం మీద కారుకూతలు కూశాడు. గల్వాన్‌లోయలో మన సైనికులు సరిగా వ్యవహరించలేదట. దీని మీద ఉదయ్‌శంకర్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఆ వ్యాజ్యం అలహాబాద్‌ హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టుకు వచ్చింది. అంతిమంగా సుప్రీంకోర్టు ఆయన భారతీయతనే ప్రశ్నించవలసి వచ్చింది. పలుసార్లు రాహుల్‌ భారత సైనిక శక్తిని అవమానించాడు. ఎన్నికల కమిషన్‌ విషయంలోనూ ఇదే తంతు. రాజ్యాంగ వ్యవస్థలను తూలనాడడం అలవాటుగా మార్చుకున్నాడు. పాకిస్తాన్‌ను వెనకేసుకురావడం, చైనాను వేనోళ్ల కీర్తించడం ఆయనకు ప్రీతిపాత్రమైన విషయాలు. ఈ తిక్కను కూడా సుప్రీంకోర్టు కాస్త కుదిర్చింది. గల్వాన్‌ లోయలో చైనా`భారత్‌ సేనల మధ్య ఘర్షణ వేళ 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్‌ ఆక్రమించిందని రాహుల్‌ ఆరోపణ. చైనా ఆక్రమించుకున్నప్పుడు అక్కడ మీరు ఉన్నారా అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఆ దురాక్రమణకు సంబంధించిన బలమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని కూడా నిగ్గదీసింది. ఆధారాలు లేనప్పుడు అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని తలంటింది. ఈ సందర్భంలోనే మీరు నిజమైన భారతీయుడే అయితే ఇలా మాట్లాడి ఉండేవారు కాదని అక్షరాలా వాత పెట్టింది.ప్రతిపక్ష నేతగా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన బాధ్యత అని రాహుల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. దీనికి కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. యుద్ధం అంటే రెండు వైపులా నష్టం ఉంటుంది అని గుర్తు చేసింది. ఎంత విపక్ష నేత అయితే మాత్రం ఇలాగా మాట్లాడేది అనీ మొహం వాయగొట్టింది. కానీ రాహుల్‌ చేస్తున్నదేమిటి? భారత్‌ యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి? మన సైనికులు ఎందరు కన్నుమూశారు? వంటి ప్రశ్నలతో పొరుగుదేశం పట్ల ప్రేమను ఒలకబోయటమే కానీ ఆపరేషన్‌ సిందూర్‌లో తనకు ఎంత నష్టం జరిగిందో పాకిస్తాన్‌ తెలియచేసిన సంగతి ఈ బధిరాంధుడికి తెలియదు. దేశభద్రత, సైనికులు వంటి అంశాలను రాహుల్‌ సామాజిక మాధ్యమాలలో ఎందుకు ప్రస్తావిస్తారని, ఆయన ప్రతిపక్ష నేత అయినా లోక్‌సభలో ఎందుకు లేవనెత్తరని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

రాహుల్‌ నాలుక తీట సంగతి దేశానికంతటికీ తెలుసు. ప్రస్తుతం ఈ గాంధీ`నెహ్రూ వారసుడు, అబద్ధాల పుట్ట 20 వరకు పరువు నష్టం కేసులు, మోసం, వంచన వంటి కేసులను ఎదుర్కొంటున్నాడని ఆయన న్యాయవాది అభిషేక్‌ సింఘ్వియే చెబుతున్నారు. తాను బ్రిటిష్‌ పౌరుడినని రాహులే ఒక కంపెనీకి ఇచ్చిన పత్రంలో పేర్కొన్నాడు. గాంధీజీని హత్య చేసినది ఆర్‌ఎస్‌ఎస్‌ అని వాగినందుకు ఒక కోర్టులో క్షమాపణ చెప్పాడు. గౌరీ లంకేశ్‌ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని ఆరోపించి కేసులో ఇరుక్కున్నాడు. వీర సావర్కర్‌ మీద అత్యంత హేయమైన ఆరోపణలు చేసినందుకు కేసులు ఉన్నాయి. మోదీ ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలేనంటూ హద్దుల్లేని కుసంస్కారం ప్రదర్శించి కేసును ఎదుర్కొంటున్నాడీ కాంగ్రెస్‌ కుక్కమూతి పిందె. ఒకసారి జార్ఖండ్‌లో  ఈ పుణ్యభూమి ‘రేపిస్ట్‌ నేషన్‌’ అంటూ పీకలదాకా తాగినవాడిలా మాటలు తూలాడు. అదొక కేసు. మీ దగ్గర ఎన్ని లైంగిక అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయో ఇవ్వాలని పోలీసులు వెంటపడితే తోక ముడిచాడు. పెగసెసె ద్వారా ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపించాడు. దర్యాప్తు చేస్తాం, ఆ ఫోను ఇవ్వండి అంటే వెన్ను చూపిన భీరువు ఇతడు. ఎన్నికల కమిషన్‌ను తాజాగా ఓట్ల దొంగ అని, అణుబాంబు వంటి ఆధారం బయట పెడతానని చెప్పి, మొహం చాటేశాడు. పచ్చి అబద్ధాలు చెప్పడం, పలాయనం చిత్తగించడం` రాహుల్‌ బతుకంతా ఇంతే. ఇక బీజేపీని, మోదీనీ ఎన్నిసార్లు నిందించాడో!

విదేశీ వనితకు పుట్టినవాడికి దేశభక్తి ఉండదు అంటాడు చాణక్యుడు. అదే నిజమనిపించడం లేదా? మాతృభూమిని అవమానించే రాహుల్‌ను ఎందుకు సమర్ధించాలి అని ప్రశ్నించారు అమెరికా గాయని మేరీ బిల్మెన్‌. కానీ ఆ బుద్ధి ఆ విజ్ఞత కాంగ్రెస్‌ పార్టీకి లేకపోవడమే పెద్ద విషాదం. లోక్‌సభలో ప్రతిపక్ష నేతను సుప్రీంకోర్టు, ‘నిజమైన భారతీయుడవే అయితే…’ అని వ్యాఖ్యానించిందంటే, అంతకంటే పెద్ద అభిశంసన ఉంటుందా! ప్రతిపక్ష పాత్రకు, నాయకుడిగా మోస్తున్న కాంగ్రెస్‌ పార్టీకీ, భారత ప్రజాస్వామ్యానికి రాహుల్‌ ఒక కళంకం కాదా? రాహుల్‌కి నైతిక విలువలే ఉంటే తక్షణం రాజీనామా చేయాలి.

About Author

By editor

Twitter
YOUTUBE