సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు శ్రావణ శుద్ధ దశమి – 4 ఆగస్ట్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


జూలై 28న పార్లమెంట్‌ ప్రాంగణం ఓ విచిత్ర సన్నివేశానికి వేదికయింది. అఖిల భారత ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు మౌలానా సాజిద్‌ రషీద్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు తెర లేపాయి. ఆ వ్యాఖలు నీచమైనవి. అత్యంత వివాదాస్పదమైనవీ కూడా. సమాజ్‌వాదీ పార్టీ నుంచి మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిరపుల్‌ యాదవ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలవి. సాజిద్‌ రషీద్‌ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? జూలై 24 ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కనౌజ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలేశ్‌ యాదవ్‌ పార్లమెంట్‌ భవనానికి సమీపంలో ఉన్న మసీదుకు డిరపుల్‌తో కలసి వెళ్లాడు. ఆ ఇద్దరు భార్యాభర్తలన్న సంగతి తెలిసిందే. కానీ డిరపుల్‌ మసీదులో ప్రవేశించినప్పుడు కూడా తల మీద ముసుగు వేసుకోకపోవడం సాజిద్‌ రషీద్‌కు తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. అక్కడితో ఆగితే అతడు వివాదాస్పద మౌల్వీ ఎందుకవుతాడు? ‘ఆమె వీపు భాగం (ఫోటోలు లేదా వీడియోలో) చూడండి! అనాచ్ఛాదితంగా ఉంది.’ అని కూడా నోరు పారేసుకున్నాడు. నిజానికి ఫోటోలో ఆమె వేషధారణ ఈ మౌల్వీ చెప్పినంత విపరీతంగా ఏమీ లేదు. ఆ వేషధారణ కూడా ఇస్లాంకు పూర్తి వ్యతిరేకం అని ప్రకటించాడు. ఏదో ఒక మూల కూర్చుని మత నిబంధనలు వల్లించే క్రమంలో అతడు ఈ మాటలు అనలేదు. ఒక టీవీ చానెల్‌లో జూలై 27న జరిగిన చర్చలో ఎలుగెత్తి చాటాడు. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మరునాడు కూడా సవాలు విసిరాడు. అది స్త్రీ జాతి గౌరవ ప్రతిష్టల మీద విసిరిన సవాలేనన్నది మరచిపోరాదు. చీమూ, నెత్తురు కాస్తయినా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసినవాడు ఎవడైనా వాడి పట్ల జనం కనీస నిరసన వ్యక్తం చేయాలి.

చాలామంది ఎంపీలు పార్లమెంట్‌ బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని సాజిద్‌ రషీద్‌ వ్యాఖ్యలకు తీవ్ర నిరసన ప్రకటించారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్త్రీ గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. అయితే ఆ ఎంపీలందరూ ఎన్డీయేకు చెందినవారు కావడమే అసలు విషయం. ఇండీ కూటమిలో భాగస్వామి సమాజ్‌వాదీ పార్టీ. కానీ ఆ కూటమి మాత్రం సాజిద్‌ రషీద్‌ మనసు నొప్పించే పనేదీ పెట్టుకోలేదు. ఇండీ కూటమి కూడా ఖాళీగా లేదు. బిహార్‌లో ఓటర్ల జాబితాల సవరణ, ఓటర్ల తొలగింపు మీద పార్లమెంట్‌ ప్రాంగణంలోనే నిరసన ప్రదర్శన చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ను విమర్శించే పనిలో తలమునకలై ఉంది. వీళ్లంతా మకర ద్వారం దగ్గర నిరసన కార్యక్రమంలో నిమగ్నమై పోయారు. అటు ఎన్డీయే, ఇటు ఇండీ కూటమి కూడా ఒకే సమయంలో నిరసనలకు దిగడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా కనిపించింది.

లక్నో పోలీసులు సాజిద్‌ రషీద్‌ మీద కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కొందరు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కూడా తమకు అంతో ఇంతో చీమూ నెత్తురు ఉన్నాయని నిరూపించుకుంటూ కాస్త ఆవేశపడ్డారు. ఇంతకీ ఇండీ కూటమి బిహార్‌ ఓట్ల తొలగింపు నిరసన కార్యక్రమంలోనే అఖిలేశ్‌ కూడా ఉన్నాడు. అయితే సాజిద్‌ రషీద్‌ మనసు నొప్పించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. తన భార్య వీపు భాగం అనాచ్ఛాదితంగా ఉందంటూ టీవీ చానల్‌లో నీచమైన వ్యాఖ్యలు చేసినా ఈ వీర విక్రమ సెక్యులరిస్టు చలించలేదు. ఆయనకు తగ్గ ఇల్లాలు డిరపుల్‌. ఇద్దరిదీ సరైన సెక్యులర్‌ జోడీ. సాజిద్‌ వ్యాఖ్యల గురించి ఏమీ మాట్లాడకుండా, ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వెల్లడిరచిన మహిళా సైనికాధికారిపై బీజేపీ సభ్యుడు చేసిన వ్యాఖ్యను మొదట వారు గుర్తు చేసుకుంటే మంచిదని డిరపుల్‌ మౌల్వీ పట్ల పెద్ద మనసే ప్రదర్శించారు. కానీ సమాజ్‌వాదీ మహిళా ఎంపీ ఇక్రా హసన్‌ మాత్రం సరిగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు దారుణమనీ, ఆ మౌల్వీపై చర్యలు తీసుకోవాలనీ ఒక ప్రకటన అయినా ఇచ్చారు. మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేయడం సరికాదనీ, ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారు సామాజిక బహిష్కరణ ఎదుర్కొనాలనీ హెచ్చరించారు. సాజిద్‌ వ్యాఖ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పర్వేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి, ఇది ఆ మౌల్వీ జాతి వ్యతిరేక ధోరణికి నిదర్శనమని తీవ్రంగానే విమర్శించారు. ఆ వ్యాఖ్యలు మహిళల గౌరవ ప్రతిష్టలను దిగజార్చేవి మాత్రమే కాదు, దేశ సమైక్యతకు, శాంతిభద్రతలకు భంగకరమని పర్వేశ్‌ అభిప్రాయపడ్డారు. అయినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసే సమయంలో సాజిద్‌, తన వ్యాఖ్యలలో ఎలాంటి దోషం లేదనే ప్రకటించాడు. అఖిలేశ్‌ బృందంతోటే మసీదుకు వచ్చిన మరో సమాజ్‌వాదీ ఎంపీ మొహిబ్బుల్లా నద్వీ, నాయకుడి ఎదుట ‘చేతులు కట్టుకుని బానిసలా’ కూర్చోవడం కూడా సాజిద్‌కు ఏమాత్రం నచ్చలేదు. సమాజ్‌వాదీ బృందానికి మసీదులో తేనీరు ఇవ్వడం  ఇస్లాంకు వ్యతిరేకంగానే పరిగణించారు.

నిజానికి డిరపుల్‌ మీద సాజిద్‌ చేసిన వ్యాఖ్యలు ఓ వివాదానికి పరాకాష్ట. అఖిలేశ్‌, డిరపుల్‌, ఇంకొందరు సమాజ్‌వాదీ ఎంపీలు కలసి జూలై 24 ప్రాంతంలో ఆ మసీదుకు వెళ్లి మంతనాలు జరపడం గురించి ఎందరో మౌల్వీలు ఆలస్యం లేకుండా దుమ్మెత్తి పోశారు. మసీదులు రాజకీయ కార్యకలాపాలకు ఉన్నాయా అంటూ మండిపడ్డారు. కాబట్టి ముస్లింల ఓట్లు కావాలంటే వాళ్లు కూర్చోమంటే కూర్చోవాలి. కూర్చోమన్నట్టు కూర్చోవాలి కూడా. ఓట్లు కావాలంటే వాళ్లు చేయమన్న ప్రతి విన్యాసం చేయాలి. విన్యాసాలు చేస్తాం, వాళ్లు తమ స్త్రీలని ఏమన్నా పడతాం అన్న ధోరణిలోనే అఖిలేశ్‌ ప్రవర్తించారు. ఇదీ భారత్‌లో సెక్యులరిజం అసలు రూపం. ఆ పార్టీకి చెందిన ఇక్రా హసన్‌ను చూసి డిరపుల్‌ నేర్చుకోవాలని సాజిద్‌ అన్నాడు కానీ, నిజానికి ఇక్రాను చూసి అఖిలేశ్‌ యాదవ్‌ నేర్చకోవలసిందే ఎక్కువ. మతమేదైనా స్త్రీని అవమానించడం కుసంస్కారమని ఇక్రా గ్రహించారు. కానీ అఖిలేశ్‌ బుజ్జగింపు మత్తులో కాస్త కూడా విజ్ఞత చూపలేకపోయాడు.

About Author

By editor

Twitter
YOUTUBE