సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  ‌నిజ శ్రావణ బహుళ ద్వాదశి – 11 సెప్టెంబర్‌ 2023, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


లెక్కలేనన్ని నికృష్టపు పనులు చేసి, కేసుల కొద్దీ అపకీర్తి మూటగట్టుకున్న నేరగాడైనా సరే, హిందూధర్మాన్ని దూషిస్తే మరుక్షణంలో వాడొక వర్గానికి సాక్షాత్తు ప్రవక్తలా కనిపిస్తాడు. రేప్‌లు, హత్యలు, అవినీతి చేసి, జైలుకి వెళ్లొచ్చినా సరే, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీదనో, బీజేపీ మీదనో నోరు పారేసుకుంటే చాలు, వాడిలో గొప్ప పురోగామిని దర్శించే దౌర్భాగ్యానికీ ఈ దేశంలో కొదవలేదు. నిన్నటిదాకా బీజేపీని అంటకాగి, మైనారిటీ ఓట్ల కోసం గోడ దూకి పురాణాలను తగలబెట్టినా, వాడికి సామాజిక న్యాయ పోరాట యోధుడి బిరుదిచ్చి వీరతాళ్లు వేస్తారు. తమకంటూ చెప్పుకోవడానికి వెంట్రుక పాటి ఘనత లేకున్నా, తాత, తండ్రి అప్పనంగా ఇచ్చిన అందలం ఎక్కి, తన ప్రతిభే అనుకునేవాళ్లు కూడా హిందూ వ్యతిరేకతతో బతికేస్తున్నారు. ద్రవిడవాద పైత్యం తలకెక్కి, అధికారమదంతో కొవ్వెక్కి ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ వాగిన ఉదయనిధి స్టాలిన్‌ ఈ ‌బాపతు మూకలలో ఎక్కడో ఒకచోట కనిపిస్తాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కారుకూతలు కూసినవాడు ఇతడే. ఇప్పుడు దేశమంతా భగ్గుమంటున్నది ఈ నోటివాటం మీదనే.

అదేం పోయేకాలమో! కొందరు రచయితలు, కవులు హిందూ వ్యతిరేకతనే దేశ నిత్యావసరంగా, వ్యవస్థను రాత్రికి రాత్రికి మార్చేసే ఆయుధమన్నట్టు చెబుతారు. రైతుల చావులు, చేనేతల ఇక్కట్లు, విద్యార్థుల బలవన్మరణాలు ఏమీ అక్కర్లలేదు వీళ్లకి. హిందూ దేవుళ్ల దూషణే సమన్యాయాన్ని తెచ్చే మహోద్యమమని నమ్మించాలని చూస్తారు. అలాంటి వాళ్ల సనాత ధర్మనిర్మూలనా మహానాడులో ఉదయనిధి ఈ ప్రేలాపన వినిపించాడు. సెప్టెంబర్‌ 2‌వ తేదీన చెన్నైలో జరిగిన తమిళనాడు పోగ్రెసివ్‌ ‌రైటర్స్ అం‌డ్‌ ఆర్టిస్టస్ ‌సంఘం సమావేశంలో ఉదయనిధి తన మెదడులోని బురదనంతా కుమ్మరించాడు. దీనికే అక్కడ చేరిన మేధావి బిరుదాంకితులంతా పోటీపడి తప్పట్లు కొట్టారు. అసలు ద్రవిడవాదం సాహిత్యం, కళ, సినిమా పేరుతో బలిసింది. సనాతనం అనేది సంస్కృత పదమట. శాశ్వతమైనదని అర్థమట. ఇక మార్చడానికి వీల్లేనిదట. ఎవరూ ప్రశ్నించలేనిదట. కులం ఆధారంగా సమాజాన్ని విడదీస్తుందట. దీనిని ఖండించడం కాదు, నిర్మూలించాలని తేల్చిపారేశాడు ఉదయనిధి. అసలు సనాతనమంటే శాశ్వతమైనదని ఇతడికి బోధించినవాడు ఎవడో వాడిని సత్కరించాలి. అంతేనా. సనాతన ధర్మం కరోనా, డెంగూ, మలేరియా వంటిదంటూ ముందురాత్రి సదరు రైటర్స్, ఆర్టిస్టస్‌తో కలసి పీకల వరకు సేవించిన మందు బాపతు మైకం దిగనట్టే వాగాడు.

ఉచ్ఛనీచాలు లేకుండా ఉదయనిధి వాగిన వాగుడు ఆశ్చర్యం కలిగించదు. వీళ్లంతా నమ్ముతున్నట్టు నటించే ద్రవిడవాదం, దాని పెద్ద పెరియార్‌ ‌హిందూ దేవతల విగ్రహాలకు చెప్పుల దండలు వేసి ఊరేగించి, ‘ఏదీ నాకేం కాలేదే’ అంటూ చంకలు గుద్దుకున్న కుసంస్కారి. ఏడుపదుల వయసులో రెండు పదుల యువతిని పెళ్లిచేసుకున్నా కూడా ద్రవిడ పైత్యవాదులకి ఆదర్శపురుషుడుగా నిలిచినవాడే ఆ పెరియార్‌ ‌రామస్వామి. భారతదేశం నుంచి ద్రవిడస్తాన్‌ అనే ప్రత్యేక దేశమే కావాలని క్రిప్స్ ‌మిషన్‌కు వినతిపత్రం ఇచ్చిన వేర్పాటువాది. తనను తాను జిన్నాతో పోల్చుకోవాలని అనుకున్నా, ఆ ముస్లిం మతోన్మాది సైతం పెరియార్‌ను ఛీకొట్టాడు. ఇంతకీ ‘నీ వికారపు ద్రవిడవాదం దళితులకు ఏం చేసిందో చెబుతావా’ అంటే ఇప్పటికీ డీఎంకే పార్టీ నుంచి సమాధానం లేదు. ఈ వారసత్వం ఉన్న అధముల, అంగుష్టమాత్రుల మాటలలో ఇంతకు మించిన మర్యాద ఎలా ఉంటుంది? ఇంతకు మించి ఏం సంస్కారం ఆశిస్తాం? ఈ ద్రవిడ పైత్యపు మర్కటానికి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇస్తున్న విద్యుదాఘాతాలు వెర్రెత్తిస్తున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన తమిళనాడు ప్రథమ కుటుంబం గుట్టును బోషాణాల కొద్దీ తవ్వి తీసి గవర్నర్‌కు పంపారు అన్నామలై. ఇదే ఈ ద్రవిడ నాయకమూకను హిందూత్వ మీద ఇంతగా రెచ్చిపోవడానికి ప్రేరేపించింది.

 దేశంలో సనాతన ధర్మాన్నే పాటించేవారు 80 శాతం ఉన్నారు. వారందరిని మూకుమ్మడిగా చంపాలన్నదే ఈ వెండితెర గంధోళిగాడి ఆంతర్యమని చాలా మంది నిశ్చితాభిప్రాయం. ఇది మొగల్‌ ‌వంశ నరహంతల; చంఘీజ్‌ఖాన్‌, ‌తామర్లేన్‌ ‌వంటివాళ్ల ఆంతర్యాన్ని వ్యక్తీకరిస్తున్న మాటే అది. ఈ జుగుప్స మీద హిందూ సంస్థలు, ప్రధానంగా సంఘ పరివార్‌ ‌భగ్గుమన్న తరువాత కూడా ఈ విషపు పురుగుకు జన్మనిచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌బీజేపీని అడ్డం పెట్టుకుని హిందూత్వం మీద ఇంకాస్త విషం కుమ్మరించారు.

 పైగా ఈ వాగుడుకు కట్టుబడే ఉంటాడట ఉదయనిధి. న్యాయపరంగా ఎలాంటి సవాలుకైనా సిద్ధమట. మరి ఇలాంటి దారుణమైన విధ్వంసకర వాగుడు గురించి కోర్టుల• పట్టించుకుంటాయా? మణిపూర్‌ ‌సహా చాలా అంశాల మీద సూమోటోగా స్పందించిన భారతీయ న్యాయస్థానాలు సనాతన ధర్మావలంబీకులను నిశ్శేషం చేయాలంటూ అత్యంత ప్రమాదకర, విధ్వంసకర వాగుడు వాగితే దానిని సూమోటోగా విచారణకు స్వీకరిస్తాయా? వేచిచూద్దాం! ఇప్పటికైనా హిందువులు మేల్కొనడం అవసరం. నా ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని మాట్లాడేవాడికి, ఆ ధర్మాన్ని పాటించే వాళ్లని మూకుమ్మడిగా నాశనం చేయాలని అనుకున్నవాడిని నా ఓటుతో ఎందుకు గెలిపించాలి? అన్న ప్రశ్న వేసుకోవాలి. హిందూధర్మాన్ని ఇంత కసిగా దూషిస్తున్న వీళ్లందరి దృష్టి ఎటు ఉంది? క్రైస్తవం మీద. లేదంటే ఇస్లాం మీద.

దీనికో కొసమెరుపు: తెల్లజాతి బూట్లు నాకిన జస్టిస్‌ ‌పార్టీ, నాస్తికత్వాల అక్రమ సంతానం డీఎంకే పార్టీ నేత ఈ సభలో ఒక పుస్తకం విడుదల చేశాడు. స్వతంత్ర సమరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అని కాబోలు దాని పేరు. అందులో రెండు తప్ప మిగిలినవి తెల్ల కాగితాలట. ఆ రెండింటిలో ఒకటి గాంధీ హత్య ఫోటోనట. రెండోపేజీలో సావర్కర్‌పై ప్రేలాపన తెల్లజాతి బూట్ల తీపి ఇంకా ఈ నాలుకల నుంచి వదల్లేదు. వాళ్లు నూరిపోసిన భారత విధ్వంసం సిద్దాంతం ఆ మెదళ్ల నుంచి పోలేదు.ఈ కేన్సర్‌కు తొలికణం పెరియార్‌ అన్నమాటగా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ‘మీ అడుగు ఆవుపేడలో పడకూడ దని అనుకుంటూనే మలంలో వేయించాను’ అన్నాడట. ఇదైనా హిందువు లందరూ గుర్తించాలి. సనాతన ధర్మాన్ని పెకలించాలన్న క్రూర ఆలోచన ఉన్న డీఎంకేనే నిర్మూలించడానికి భారతజాతి కంకణం కట్టుకోవాలి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram