– హరీష్‌ –

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌.. ‌విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వాపై 346 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నిక లోనూ విపక్షానికి చెందిన సుమారు ఇరవైకి పైగా సభ్యులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి కోలుకోలేని దెబ్బకొట్టారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల సభ్యులు పెద్దఎత్తున క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో వాటి అనైక్యత మరోసారి స్పష్టమైందని చెప్పాలి.

ఆగస్ట్ 6‌న జరిగిన ఈ ఎన్నికలో మొత్తం 725 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా ధన్‌ఖడ్‌కు 528 ఓట్లు పోలయ్యాయి. మార్గరెట్‌ ఆల్వాకు 182 మంది సభ్యులు ఓటేశారు. మరో 15 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు వెల్లడిం చారు. 55 మంది ఎంపీలు ఓటుహక్కు వినియో గించుకోలేదు (టీఎంసీ సహా మరికొన్ని పార్టీల ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు). ఈ ఎన్నికలో మొత్తం 93 శాతం ఓటింగ్‌ ‌నమోదైంది.

1997 తర్వాత ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగ్గా అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తిగా ధన్‌ఖడ్‌ ‌నిలిచారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన 71 ఏళ్ల జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌భారత 14వఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌గానూ పనిచేసిన ఈయన ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్‌ ‌పదవిలోనూ సత్తా చాటబోతున్నారు.

రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా..

జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌స్వస్థలం రాజస్తాన్‌లోని కితానా గ్రామం. మే 18, 1951న గోకుల్‌చంద్‌, ‌కేసరిదేవి దంపతులకు ఆయన జన్మించారు. వీరిది సామాన్య రైతు కుటుంబం. ధన్‌ఖడ్‌ ‌ప్రాథమిక విద్యను కితానా గ్రామంలోనే పూర్తిచేశారు. చితోర్ఘర్‌ ‌సైనిక పాఠశా లలో చదివారు. రాజస్తాన్‌ ‌యూనివర్సీటీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. సుదేశ్‌ ‌ధన్‌ఖడ్‌ను వివాహమాడారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు.

ధన్‌ఖడ్‌కు అనేక రంగాలపై పట్టుంది. రాజ కీయాలతో పాటు న్యాయవాదిగా, క్రీడాకారుడిగానూ రాణించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ సేవలం దించారు. సట్లెజ్‌ ‌నదీజలాల వివాదంలో హరియాణా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి గుర్తింపు తెచ్చుకున్నారు.

1989-91 మధ్య ఝుంజున్‌ ‌లోక్‌సభ నియోజక వర్గం నుంచి జనతాదళ్‌ ‌పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 1990లో కేంద్రమంత్రి గానూ విశేష సేవలందించారు. 1993-98లో రాజస్తాన్‌లోని కిషన్‌గంజ్‌ ‌నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. లోక్‌సభతో పాటు రాజస్తాన్‌ అసెంబ్లీలో వివిధ కమిటీలో పనిచేశారు. క్రీడల మీద ఉన్న ఆసక్తితో రాజస్తాన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌, ‌రాజస్తాన్‌ ‌టెన్నిస్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.

జూలై 20, 2019న కేంద్ర ప్రభుత్వం ధన్‌ఖడ్‌ను బెంగాల్‌ ‌గవర్నర్‌గా నియమించింది. ఆ రాష్ట్ర గవర్న ర్‌గా ఆయన ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. నిరంకుశ మమత బెనర్జీ ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేశారు. తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తనపై ఎన్ని ఒత్తిడులు తెచ్చినా రాజ్యాంగ బద్ధంగా తనకు దఖలుపడ్డ అధికారాల మేరకు మమతను దీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి మమత తీసుకుంటున్న అనేక ఏకపక్ష నిర్ణయాలను ఆయన ముక్కుసూటిగా ఖండించారు. గవర్నర్‌ అం‌టే రబ్బర్‌స్టాంప్‌ ‌పదవి కాదని నిరూపించిన ధన్‌ఖడ్‌ ‌తన పనితీరుతో అనేకమంది ప్రశంసలు అందు కున్నారు.

రాజ్యసభను నడిపించడంలో తెలుగు నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమర్థతను చాటు కున్నారు. ఆయన స్థానాన్ని ధన్‌ఖడ్‌ ‌సమర్థవంతంగా భర్తీ చేస్తారని ఎన్డీయే భావిస్తోంది. అందుకే కీలకమైన రాజ్యసభ ఛైర్మన్‌ ‌పదవిని ఆయనకు కట్టబెట్టింది.

వెంకయ్యకు వీడ్కోలు

భారత 13వ ఉపరాష్ట్రపతి, ఆంధప్రదేశ్‌కు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్ట్ 10‌తో ముగిసింది. ఆగస్ట్ 11, 2017‌న ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్య తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చాకచక్యంగా రాజ్యసభా సమావేశాలను నిర్వహించి సమర్థతను చాటుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్దల సభను నడపడం కత్తిమీద సామే. రాజ్య సభలో సంఖ్యాబలం లేకున్నా.. ఎన్డీయేను పలు కీలక బిల్లుల విషయంలో గట్టెక్కించారు, వెంకయ్య. అటు విపక్షాల అభిమానాన్నీ చూరగొన్నారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..

బీజేపీలో వెంకయ్యనాయుడుది సుదీర్ఘ ప్రయాణం. 1993 వరకూ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఆయన.. తరువాత ఢిల్లీ రాజకీయాల వైపు అడుగులేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా హస్తినా రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన వాగ్ధాటి, అంకితభావంతో అధిష్టానానికి, బీజేపీ శ్రేణులకు ఇష్టుడైన నాయకుడిగా మారిపోయారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి వంటి పదవుల్లో రాణించారు. రాజ్యసభలో విపక్షాలను అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషించారు.

2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు. నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికైన ఏకైక బీజేపీ నాయకుడిగా ఖ్యాతికెక్కారు. వాజపేయి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తిం చారు. గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించినప్పుడు ప్రధానమంత్రి గ్రామ సడక్‌ ‌యోజనను ప్రవేశ పెట్టింది వెంకయ్యనాయుడే. పట్టణాభివృద్ది, గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవ హారాలు, సమాచార శాఖలను నిర్వర్తించి శాఖల్లో పురోగతి సాధించారు.

దేశంలోనే రెండో అత్యున్నత పదవిని అధిష్టించి, ఆ పదవికే వన్నె తెచ్చిన వెంకయ్యనాయుడు తెలుగు వ్యక్తి కావడం మనందరకీ గర్వకారణం.

About Author

By editor

Twitter
Instagram