చరిత్ర పుటలలో ఉండే మనదైన మట్టి వాసనను గమనిస్తేనే, గుండె నిండా అఘ్రాణిస్తేనే చరిత్ర సరిగా అర్థమవుతుంది. పేరుకు భారతీయులే అయినా విదేశీ సిద్ధాంతాల చట్రం నుంచి, రంగుటద్దాల నుంచి చూసే వారికి మన చరిత్ర వైవిధ్యం అర్థం కాదు. అందుకే భారతీయ వైవిధ్యమూ అర్థం కావడం లేదు. తేదీలూ, కార్యకారణ సంబంధాలూ వెతుక్కుంటూ, చరిత్ర నుంచి పొందవలసిన స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. దేశ గతమంటే వర్తమాన తరానికి భవిష్యత్తును గురించి దృష్టిని ప్రసాదించేది. అలాంటి సమున్నత దృక్పథం కలిగిన వారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. కాబట్టే అల్లూరి శ్రీరామరాజు అనే సీతారామరాజు ఉద్యమంలోని తాత్త్వికతను గుర్తు పట్టారు. ‘దమ్ముంటే మమ్మల్ని ఆపండి అంటూ శ్రీరామరాజు నాడు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి సవాలు విసిరారు. ఇప్పుడు 130 కోట్ల మంది ఆయన స్ఫూర్తితో మన వ్యతిరేకులకు అలాగే, దమ్ముంటే మమ్మల్ని ఆపండి అని సవాలు విసరాలి. సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆ యుగపురుషుడు ఇస్తున్న స్ఫూర్తితో మనం ముందుకు నడిస్తే మనల్ని ఎవరూ ఆపలేరు’ అన్న గొప్ప సందేశం ప్రధాని హృదయం నుంచి ఉప్పొంగిందంటే, మనదైన చరిత్రను దేశీయమెన• దృష్టితో దర్శించడమే కారణం. ఈ జూలై 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలకు పాత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చిన ప్రధాని మోదీ ఆ చరిత్ర పురుషుడి, యుగపురుషుడి ఖ్యాతిని, స్ఫూర్తిని దేశ ప్రజలందరికీ పరిచయం చేశారు. అది ఎంత అవసరమో ఆయనకి తెలుసు. భారతీయులందరి తరఫున సీతారామరాజుకూ, ఆయన వెంట నడిచి త్యాగాలు చేసిన గిరిజన వీరులకు పాదాభివందనం చేస్తున్నానంటూ అనన్య సామాన్యమైన సంస్కారాన్ని ప్రదర్శించారు. పరిపూర్ణ స్వరాజ్య సమర చరిత్ర ఆవిష్కరించుకోవలసిన అవసరాన్ని  వ్యక్తీకరించారు. ఆజాదీ కా అమృత మహోత్సవాల వేళ జరిగిన ఈ కార్యక్రమం

మొత్తం ఆ మహోత్సవాలకే మకుటాయమానంగా భాసిల్లేదేనంటే అతిశయోక్తి కాబోదు. 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించడం మరింత శోభనిచ్చింది. అల్లూరి కుటుంబీకులు, మల్లుదొర కుటుంబీకులు, గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌, ‌కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి, ప్రముఖ చలనచిత్ర నటుడు చిరంజీవి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నటి, మంత్రి రోజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి తీరంలో మోదీ ఇచ్చిన ఉపన్యాసం చరిత్ర పునాదిగా సాగిన దేశభక్తి పాఠమే.

——–

మన్యం వీరుడు అల్లూరి, మా నాయకుడు అల్లూరి సీతారామరాజు. తెలుగు వీర లేవరా! దీక్షబూని సాగరా! మహానాయకుడు పుట్టిన ఈ నేల మీద కలుసుకోవడం అదృష్టం’ అంటూ నరేంద్ర మోదీ తెలుగులో పలకడంతో సభాస్థలి ఒక్కసారిగా తప్పట్లతో మారుమోగింది.

——–

దాదాపు తొమ్మిది దశాబ్దాలు సాగిన భారత స్వాతంత్య్ర సమరంలో గిరిజనులు చేసిన త్యాగాలను గుర్తు చేసే విధంగా, చరిత్ర పుస్తకాలు మరచిన ఆ త్యాగమూర్తుల గాథలను ఇప్పుడు ఇంటింటికీ చేర్చాలన్న ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ, తమ ప్రభుత్వం గిరిపుత్రుల వెతలు తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో మేళవించి ప్రధాని మోదీ తన అద్భుత ఉపన్యాసాన్ని సాగించారు. తప్పులను చక్కదిద్దే పనిని మోదీ ప్రభుత్వం ఒక దీక్షతో చేస్తున్నది. ఆ క్రమంలోనే చరిత్ర రచనలో జరిగిన తప్పులపై కూడా దృష్టి పెట్టిందనే అనుకోవాలి. మైదాన ప్రాంతంలో ఎంత స్వాతంత్య్రం పోరాటం సాగిందో, దానితో సమంగానే, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంతో ముందు నుంచే కొండకోనలలోను పోరాటం జరిగింది. ఆ రెండు పోరాటాల ధ్యేయం ఆంగ్లేయ పాలనే. కాబట్టే ఆ చరిత్రలు కూడా ఇప్పుడు వెలుగు చూడాలన్న ఆశయం ఆయన మాటలలో వ్యక్తమైంది. ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంతటిదో ఇప్పటికే రుజువు చేసుకున్నారు. ముండా తెగ నాయకుడు బిర్సా ముండా విగ్రహాన్ని పార్లమెంటులో ఆవిష్కరించింది ప్రభుత్వం. ఆయన తన ఉపన్యాసంలో అన్ని పంథాలలో ఉద్యమించిన వారి పేర్లు పలికారు. చరిత్ర రచన పట్ల ఉండవలసిన వాస్తవిక దృక్పథం ఏమిటో వెల్లడించారు. ఇప్పుడు దేశానికి కావలసింది ఇదే. మైదానాలలో, కొండకోనలలో, విదేశాలలో, జాతీయ కాంగ్రెస్‌లో, జాతీయ కాంగ్రెస్‌కు బయట ఉండి… ఎలా పోరాడినా అది దేశం కోసం జరిగిన పోరాటం. త్యాగం. దానికి గుర్తింపు రావాలి.

అల్లూరి సీతారామరాజు, మన్యం గిరిజన వీరుల పోరాటం, త్యాగాలు, వీరగాధలే 130 మంది భారతీయులను సంకల్ప సిద్ధి కోసం ముందుకు నడిపిస్తున్నాయని ప్రధాని  నరేంద్రమోదీ తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌’ ‌కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుని, వారి జీవిత విశేషాలను అందరికీ తెలియచేసేలా కార్యక్రమాలు జరుపుతున్నారు. మన రాష్ట్రంలో మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్‌ ‌వారిపై తన జీవితాంతం పోరాడి మరణించారు. ఆయన జన్మించి 125 ఏళ్లు అయిన సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ స్వేచ్ఛకోసం గిరిజనులు చేసిన ఉద్యమం రంప తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది. ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలలోనే ఆ ఉద్యమ నూరేళ్ల సందర్భమూ కలసి వచ్చింది. అందుకే ఈ సందర్భాన్ని కూడా గౌరవిస్తూ  ఉత్సవాలను సైతం నిర్వహిస్తున్నారు. అల్లూరి 125 జయంత్యుత్సవం, రంప ఉద్యమ నూరేళ్ల కార్యక్రమాలు ఏడాది పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

అల్లూరిని మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడిగా కీర్తించారు. ‘‘తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా’’ అంటూ అల్లూరి సీతారామరాజు సినిమా పాటను గుర్తు చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్‌ ‌భారతావనికే స్ఫూర్తిగా నిలిచిన నాయకుడైన అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేలపై మనం అందరం కలుసుకోవడం మన అదృష్టమని సమున్నత గౌరవం ప్రకటించారు. ‘అల్లూరి  మన సంస్కృతి, వీరత్వం, శౌర్యం, ధైర్యానికి ప్రతీక. గిరిజనుల సం•్క•ృతికి, వైవిధ్యానికి కూడా ప్రతీక. ఏక్‌ ‌భారత్‌, అల్లూరి ఆశయం, పోరాటం, త్యాగాలతో కూడిన జీవన ప్రస్థానం మనకు స్ఫూర్తిదాయకం. గిరిజనుల హక్కుల కోసం ఆయన పోరాడారు. అల్లూరి ఇచ్చిన మనదే రాజ్యం నినాదం… వందే భారతం అనే నినాదానికి సరితూగుతుంది. మన పూర్వికుల చింతనను తన ఉద్యమ పటిమ, అందరి పట్ల సుహృద్భావం ద్వారా అల్లూరి మనకు తెలియచేశారు. 24 ఏళ్ల వయసులో అల్లూరి మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో పోరాడారు. 27 ఏళ్ల చిరుప్రాయంలో మరణించారు. రంప తిరుగుబాటులో పాల్గొని ఆంగ్లేయుల చేతిలో మరణించిన వీరులంతా మనకు స్ఫూర్తిని, ప్రేరణను ఇస్తున్నారు. ఆంగ్లేయులకు ఎదురొడ్ది పోరాడినట్లు నేడు యువత మన దేశం కోసం ఉద్యమించాలి. ఈ రోజు కొత్త అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అభివృద్ధికి దోహదపడాలి.

పుణ్యభూమి – వీరభూమి

ఆంధ్ర ప్రాంతాన్ని, ఇక్కడ స్వరాజ్యం కోసం జరిగిన త్యాగాలను కూడా గుర్తు చేసుకున్నారు ప్రధాని. పుణ్యభూమిగా, వీరభూమిగా కీర్తించారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల కోసం శత్రువులపై పోరాటం చేస్తూ బలిదానాలు చేసిన గిరిజన సోదరుల వీరగాథలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తాయన్నారు. ‘ఆంధప్రదేశ్‌లో దేశభక్తి పురుడు పోసుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇక్కడి వారే. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య నుంచి కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు వరకు ఎందరో మహానుభావులు జన్మించారు. వీరంతా మన కోసం పోరాడి జీవితాలను త్యాగం చేశారు. అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంగా వీరి కలలను మనం సాకారం చేయాలి. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన భారత్‌ను చూడాలంటే అన్నివర్గాలకు సమాన అవకాశాలు గల భారత్‌ను మనం నిర్మించాలి.  అలాంటి పుణ్యభూమికి రావడం తన అదృష్టం’ అని చెబుతూ సవినయంగా శిరస్సు వంచి నమస్కారం చేశారు.

‘ఆంధప్రదేశ్‌లో జన్మించిన గిరిజన వీరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. అల్లూరి జయంత్యుత్స వాలను, రంప తిరుగుబాటు కార్యక్రమాన్ని కలిపి ఏడాదిపాటు పండుగ వాతావరణంలో నిర్వహించాలి. అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండురంగిలోని ఇంటిని, ఆయన దాడిచేసిన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌, ‌మోగల్లులోని ధ్యానమంది రాన్ని జీర్ణోద్ధరణ చేసి జాతికి అంకితం చేస్తాం. స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించిన అన్ని సంఘటనలను, అంశాలను ప్రజలకు చేరువ చేయాలనేదే మా సంకల్పం. స్వాతంత్య్ర పోరాటం కొన్ని ప్రాంతాలకు, కొందరు మహానుభావులకు పరిమితం కాదు. ఇది మనదేశ చరిత్ర. భారత స్వాతంత్య్ర సంగ్రామం…. మన సంస్కృతి, వైవిధ్యం, ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మనం అందరూ ఒకటే అనే భావనను ప్రకటిస్తూ ఉద్యమం జరిగిందని గుర్తుంచుకోవాలి.

అన్నివర్గాలకు అవకాశాలు కల్పించాం

8 ఏళ్ల కాలంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించేలా తమ ప్రభుత్వం పని చేసిందని ప్రధాని చెప్పారు. అల్లూరి, గిరిజనుల బలిదానాలు ఇంటింటికి తీసుకెళ్లాలి. వీటిని తెలియ చెప్పేందుకే విశాఖ మన్యంలోని లంబసింగిలో అల్లూరి, గిరిజనుల పోరాటాలు, సంస్కృతి బలిదానాలు వెల్లడించే  ప్రదర్శనశాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. గతేడాది నవంబరు 15న బిర్సాముండా  జయంతిని కేంద్రం నిర్వహించిన సంగతిని గుర్తు చేశారు.

గిరిజనులు ముందుకు రావాలి

అల్లూరి జీవన ప్రస్ధానాన్ని ఆదర్శంగా తీసుకుని గిరిజనులు యువత ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. అటవీ సంపద ద్వారా యువతకు జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారాయన. ‘గిరిజన యువతలో నైపుణ్యం తీసుకువచ్చేందుకు స్కిల్‌ ఇం‌డియా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఓకల్‌ ‌ఫర్‌ ‌దాదాపు తొమ్మిది దశాబ్దాలు సాగిన భారత స్వాతంత్య్ర సమరంలో గిరిజనులు చేసిన త్యాగాలను గుర్తు చేసే విధంగా, చరిత్ర పుస్తకాలు మరచిన ఆ త్యాగమూర్తుల గాథలను ఇప్పుడు ఇంటింటికీ చేర్చాలన్న ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ, తమ ప్రభుత్వం గిరిపుత్రుల వెతలు తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో మేళవించి ప్రధాని మోదీ తన అద్భుత ఉపన్యాసాన్ని సాగించారు. తప్పులను చక్కదిద్దే పనిని మోదీ ప్రభుత్వం ఒక దీక్షతో చేస్తున్నది. ఆ క్రమంలోనే చరిత్ర రచనలో జరిగిన తప్పులపై కూడా దృష్టి పెట్టిందనే అనుకోవాలి. మైదాన ప్రాంతంలో ఎంత స్వాతంత్య్రం పోరాటం సాగిందో, దానితో సమంగానే, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంతో ముందు నుంచే కొండకోనలలోను పోరాటం జరిగింది. ఆ రెండు పోరాటాల ధ్యేయం ఆంగ్లేయ పాలనే. కాబట్టే ఆ చరిత్రలు కూడా ఇప్పుడు వెలుగు చూడాలన్న ఆశయం ఆయన మాటలలో వ్యక్తమైంది. ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంతటిదో ఇప్పటికే రుజువు చేసుకున్నారు. ముండా తెగ నాయకుడు బిర్సా ముండా విగ్రహాన్ని పార్లమెంటులో ఆవిష్కరించింది ప్రభుత్వం. ఆయన తన ఉపన్యాసంలో అన్ని పంథాలలో ఉద్యమించిన వారి పేర్లు పలికారు. చరిత్ర రచన పట్ల ఉండవలసిన వాస్తవిక దృక్పథం ఏమిటో వెల్లడించారు. ఇప్పుడు దేశానికి కావలసింది ఇదే. మైదానాలలో, కొండకోనలలో, విదేశాలలో, జాతీయ కాంగ్రెస్‌లో, జాతీయ కాంగ్రెస్‌కు బయట ఉండి… ఎలా పోరాడినా అది దేశం కోసం జరిగిన పోరాటం. త్యాగం. దానికి గుర్తింపు రావాలి.

అల్లూరి జీవన ప్రస్ధానాన్ని ఆదర్శంగా తీసుకుని గిరిజనులు యువత ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. అటవీ సంపద ద్వారా యువతకు జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారాయన. ‘గిరిజన యువతలో నైపుణ్యం తీసుకువచ్చేందుకు స్కిల్‌ ఇం‌డియా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఓకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌ ‌నినాదంతో మన సంపదను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి పనిచేస్తున్నాం. గతంలో అడవిలో వెదురును సైతం తీసుకునే అధికారం అడవిబిడ్డలకు ఉండేది కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వెదురును తీసుకునే అధికారం ఇచ్చాం. అటవీ సంపదకు అంతర్జాతీయ స్థాయి కల్పిస్తున్నాం. 8 ఏళ్లకు ముందు 12 అటవీ ఉత్పత్తులకు మాత్రమే కనీస మద్దతు ధర ఉంటే ఇప్పుడు 90కు విస్తరించాం. స్వయం సహాయక సంఘాలు, 3 వేల అటవీ ఉత్పత్తులను ఆధునీకరిస్తున్నాం. విశాఖలో గిరిజన పరిశోధన సంస్థను ఏర్పాటు చేశాం. వెనుకబడిన జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలుగా పేర్కొని వాటిని అభివృద్ధి చేస్తున్నాం. వాటి ద్వారా గిరిజనుల జిల్లాలకు లాభం కలుగనుంది. గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేశాం. మాతృభాషకు పెద్దపీటవేశాం. మాతృభాషలో విద్య అందిస్తేనే మంచి భవిష్యత్‌ అం‌దుతుంది’ అని మోదీ చెప్పారు.

అల్లూరి నినాదమే ఆయుధం

‘దమ్ముంటే నన్ను ఆపండి’ అనే అల్లూరి నినాదాన్ని యువత పుణికి పుచ్చుకుని ‘దమ్ముంటే దేశ పురోగతిని ఆపాలి’ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. ‘దేశంలో వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, మహిళలు ముందు కొచ్చి దేశ నాయకత్వాన్ని చేపట్టాలి. అల్లూరి ప్రేరణ, స్ఫూర్తి మనల్ని నిరంతరం ప్రగతి పథంలో నడిపిస్తోంది. ఈ ఉత్సాహం, జనసందోహం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దశగా కనిపిస్తోంది. తెలుగుగడ్డపై ప్రాణాలర్పించిన వీరులు, స్వాతంత్య్ర సమరయోధులుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జైహింద్‌… ‌జైభారత్‌…’ అన్నారు ప్రధాని. అల్లూరి సీతారామరాజు సోదరుడు, సత్యనారాయణ రాజు కుమారుడు శ్రీరామరాజును, అల్లూరి సహచరుడు, మల్లుదొర మనుమడు బోడిదొరను ప్రధాని నరేంద్రమోదీ సన్మానించారు.

ఏడాది పాటు జయంత్యుత్సవాలు : జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

అల్లూరి చరిత్ర గురించి తనకు తెలుసని ఆయన జయంత్సోవాలను ఘనంగా చేయాలని ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను వస్తానని ప్రధాని నరేంద్రమోదీ నాకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తియిన సందర్భగా ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవం జరుపుకుంటున్నాం. మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం, విదేశాల్లో ఉన్న భారతీయులు, ఎంబసీలు, దేశంలోని భారతీయులంతా ఈ పండుగను ఆనందంతో జరుపుకుంటున్నారు. జూలై 4, 2022 నుంచి 2023 జూలై 4 వరకు దేశ వ్యాప్తంగా అల్లూరి 125వ జయంత్యుత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. అల్లూరి కుటుంబం, గిరిజన సైన్యం, మల్లుదొర, వీరయ్యదొర, ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు కుటుంబాలను కలసి వారి నుంచి స్ఫుర్తిని పొందాలి. ఈ ప్రపంచంలో ఉద్యమాలు చేసిన మహానుభావుల్లో అల్లూరిది భిన్నమైన శైలి. బ్రిటిషర్లకు ముందుగా చెప్పి పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసిన ధైర్యవంతుడు. ప్రతి గ్రామం, పంచాయతీ, యువజన సంఘాలు, మహిళా సంఘాలు అల్లూరి గురించి తెలుసుకుని స్ఫూర్తిని పొందాలి.
—–
• స్వాతంత్య్రం పోరాటంలో గిరిజన సోదరులు చేసిన బలిదానాలు చరిత్ర పుటలలో సరిగా కనిపించకపోవచ్చు. ఇవాళ ఆ చరిత్రలను ఇంటింటికి తీసుకువెళ్లాలి. ఆ చరిత్రను నిర్మించడానికి కేంద్రం కంకణం కట్టుకున్నది.
• స్వాతంత్య్రం తెచ్చుకోవడానికి జరిగిన పోరాటం, అందులోని ఘటనలు ప్రజలకు తెలియచేయాలన్నదే కేంద్రం ఆశయం. అది అల్లూరి ఉద్యమ ఘట్టంతో నేను ప్రారంభించడం నా అదృష్టం.
• స్వాతంత్య్ర సంగ్రామం కొంతమందికే చెందిన చరిత్ర కాదు. ఇది భారతదేశ చరిత్ర. ఎందరో మహానుభావుల చరిత్ర. త్యాగాల చరిత్ర.
• మన స్వాతంత్య్ర పోరాటంలో మన దేశ వైవిధ్యం ప్రతిబింబిస్తుంది.
• అల్లూరి శ్రేష్ట భారత్‌, ఒకే భారత్‌ అన్న విశ్వాసానికి ప్రతీక.
• ఉద్యమంలోని అందరి పట్ల మమకారం హైందవ చింతన నుంచే అల్లూరికి వచ్చింది.
(భీమవరం సభలో ప్రధాని వ్యాఖ్యలు)
———–
జిల్లాకు ఆ మహానుభావుడి పేరు పెట్టాం: జగన్మోహన్‌రెడ్డి

స్వాతంత్య్ర సాధనలో జీవితాన్ని త్యాగం చేసిన చరితార్ధుడు అల్లూరి సీతారామరాజు. దోపిడీలేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్నారు. ఆజాదీ కా అమృత్‌ ‌మహాత్సవ్‌ ‌కార్యక్రమం ద్వారా వారిని స్మరించుకుంటున్నాం. మన పూర్వికులు, స్వాతంత్య్ర సమరయోధులు జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి స్వాతంత్య్రం తెచ్చారు. ఈ మట్టి నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనుల్లో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు. ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన సంస్కర్త. భావాల పరంగా ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడు. ఈ 125వ జయంతి సందర్భంగా.. ఆ అల్లూరిని స్మరించుకునేందుకు మన ప్రధాన మంత్రి సమక్షంలో మనమంతా ఈరోజు సమావేశమయ్యాం. తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తిప్రదాత అయిన ఆ మహనీయుడు అడవిబిడ్డలకు ఆరాధ్యుడు. ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టింది.

– తురగా నాగభూషణం, వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram