ఒక సిద్ధాంతానికి ఉండే బలం దానిని ఆచరించే వ్యక్తుల గుణశీలాల మీద ఆధారపడి ఉంటుంది. కమ్యూనిజం వైఫల్యానికి కొందరు వ్యక్తుల జఘన్య జీవితాలూ; రష్యా, చైనా, క్యూబా మన కళ్లముందే పెట్టుబడిదారి దేశాలుగా మారడం ప్రధాన కారణం. సరిగ్గా క్రైస్తవానిదీ ఇదే పరిస్థితి. కరుణామయుని పేరు మీద పుట్టిన మతంలో పవిత్ర యుద్ధాలూ, ఇక్విజిషన్‌లా ఎలా చొరబడ్డాయి? ఇది మేధావులు ఆలోచించవలసిన విషయం.

తిరుమల కొండ మీద క్యూలో నిలబడిన భక్తులక• మదర్‌ ‌థెరిసా సంస్థ మిషనరీలు వచ్చి కరపత్రాలు పంచిపెట్టారు. శ్రీశైలం హిందువుల మహా పుణ్యక్షేత్రం. అక్కడ గోడల మీద యోహాను సువార్త వాక్యాలు నేను చూశాను. మొన్న ఉగాది నాడు ఒక కర్ణాటక భక్తుని తల మీద శామ్యూల్‌ అనే క్రైస్తవుడు శ్రీశైలంలోనే గొడ్డలితో దాడి చేశాడు. శ్రీశైలంలో క్రైస్తవులు ఎలా దుకాణాలు నడుపు తున్నారు? ఇది అడగకూడదు? తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం, కె. గంగవరం గ్రామంలోని రామాలయంలో హలలూయాలు ఎందుకు కూటములు నిర్వహించారు? భక్తుడైన వెంకటరమణ ఈ అకృత్యాన్ని అడ్డుకుంటే అతని మీద హలలూయాలు దాడి చేసి కేసు పెట్టడం సమర్థనీయమేనా? ఆంధప్రదేశ్‌లోని చాలా దేవాలయాల వద్ద హైందవేతరులు దుకాణాలు నడుపు కుంటున్నారు. ఆ పేరుతో వారి నిర్వాకాలు, ఫలితాలకు శ్రీశైలం ఘటన చిన్న ఉదాహరణ. 2021 శ్రీశైలంలో స్వామివారికి తెచ్చే పూలగంపల చాటున రజాక్‌ ‌మద్యం బాటిల్స్ ‌తెచ్చిన మాట నిజమేనా?అన్నదాన సత్రం వెనుక బెల్టుషాపులు ఎలా వచ్చాయి? గోశాలలో ఆవులు ఎందుకు చనిపోతున్నాయి? పాపాల చెరువు ప్రాంతలో గంజాయి సాగు నిజమేనా? హిందువులు పుణ్యక్షేత్రం పవితత్రను మంటగలుపుతున్న ఈ దుశ్చర్యలకు సంబంధించి ఎవరు సమాధానం చెబుతారు? ఎవరు కారకులు?

తెనాలి ఐతానగర్‌లోని సండే స్కూలులో తొమ్మిది సంవత్సరాల బాలుడిపై పాస్టరు అత్యాచారం చేశాడు. ఆ పిల్లవాడి తండ్రి ఫిర్యాదు చేస్తే కేసు బయటకు రాకుండా మనోరంజని అనే క్రైస్తవ స్త్రీ ఆయనకు కోటి రూపాయలు ఇవ్వజూపింది. ‘ఈ వార్త వెలుగులోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు మనల్ని విమర్శిస్తారు’ అని ఆమె చెప్పిన మాటలు రికార్డయి నాయి. మనోరంజని ఏపీ మైనారిటీ ఫైనాన్షియల్‌ ‌కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌. ‘‌నాకు డబ్బు అక్కరలేదు. నా కుమారుడికి పట్టిన గతి మరొకడికి పట్టకూడదు’ అన్నాడు ఆ బాధిత విద్యార్థి తండ్రి. ప్రతి సండే స్కూలులోను దేశద్రోహాన్ని నేర్పుతుంటారు. నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, గణేషుణ్ణి పూజించను అని విద్యార్థుల చేత ప్రవీణ్‌కుమార్‌ అనే ఆఫీసర్‌ ‌సమక్షంలో ప్రమాణం చేయించిన ఘటన తెలంగాణలో జరిగింది. ఈయన ఇటీవల ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. కేసీఆర్‌ ‌గడీని నా ‘ఏనుగు’ (బీఎస్‌పీ ఎన్నికల గుర్తు) బద్దలు కొడుతుంది అని ప్రకటించాడు. మేరీ ఒక క్రైస్తవురాలు. చర్చిలో ఈమెకు సకల మర్యాదలూ దక్కుతూ ఉండేవి. తర్వాతి కాలంలో ఆమె అయ్యర్‌ అనే తమిళ బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకొని, హిందూమతంలోకి వచ్చింది. దీనితో హలలూయాలు పగబట్టారు. ‘ఏమే పోరంబోకూ!’ అని తిడుతూ పాస్టరు సాంబశివరావు ఈమెను అవమానించాడు. సాంబశివరావు తండ్రి హిందువు. తన కొడుకును గుంటూరు సమీపంలోని కాకాని శివాలయానికి తీసుకొని పోయి నామకరణం చేశాడు. ఆర్థిక లాభాలతో సాంబశివరావు క్రైస్తవం పుచ్చుకొని హిందూ పురాణాలను అశ్లీల భాషలో తిట్టడం మొదలుపెట్టాడు. మతం మారిన తర్వాత కూడా ఇతడు హిందువుల పేర్లు పెట్టుకోవడం మోసం కాదా? మనోరంజని, ఆరోగ్యం, ఆశీర్వాదం, లవణం ఇలాంటి సెక్యులర్‌ ‌నామాలు నాస్తికులు, క్రైస్తవులు కూడా పెట్టుకుంటున్నారు. ఒక వ్యక్తికి చర్చి రిజిస్టర్‌లో ఒక పేరు, గవర్నమెంటు రిజిస్టర్‌లో మరొక పేరు ఉండడం సర్వ సామాన్యం. ఇందుకు కారణం చర్చిలో పదిశాతం వాటా క్రైస్తవ భక్తుల నుండి (దశాంశం) ఈ దైవజనులు సంపాదించు కుంటూ ప్రభుత్వం (రాజ్యాంగం) కల్పించిన ఆరక్షణలను ఎస్‌.‌సి., ఎస్‌.‌టి.ల కోటాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇంకా అమెరికా, బ్రిటన్‌, ‌జర్మనీ వంటి అనేక క్రైస్తవ దేశాల నుండి భారీగా మత మార్పిడి నిధులు రకరకాల పేర్లతో లభిస్తూ ఉంటాయి. ఎన్‌జీవో ఫండ్స్ ఇలాంటివే. వీటిని దేశంలో అస్థిరత నెలకొల్పడానికి కూడా ఉపయో గించాలని శత్రు దేశాలు నిర్దేశిస్తూ ఉంటాయి.

ఆత్మకూరులో ఏం జరిగింది? ఇది కర్నూలు జిల్లాలోనిది. అక్కడ ఒక ముస్లిం కుటుంబం ఉండేది. భార్యాభర్తలిద్దరూ మరణించాక వారింటి స్థలంలో ఒక మసీదు నిర్మించే ప్రయత్నం జరిగింది (2022). స్థానిక జాతీయ రాజకీయ నాయకుడు శ్రీకాంతరెడ్డి వెళ్లి నిర్మాణానికి పోలీసుల, మునిసిపాలిటీ అధికారుల అనుమతులున్నాయా? అని ప్రశ్నించాడు. అంతే! అరగంటలో 3000 మంది ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. ఇంత త్వరగా ఈ వార్త ఇన్ని వేల మందికి ఎలా చేరింది? అంటే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో క్రియాత్మకంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు రాయలసీమలో ప్రవేశించాయని అర్థం. పోలీసుస్టేషనును ధ్వంసం చేశారు. ఆ జిల్లాలో సంస్థాగతంగా సోషల్‌ ‌డెమొక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా అనే పేరుతో ఈ ఉగ్రవాద సంస్థ బలంగా పనిచేస్తున్నది. ఏపీ హలలూయాలు వీరికి ఎందుకు మద్దతునిచ్చారు? తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయ రథం తగలబడితే ఎవడో పిచ్చివాడు తేనె పట్టుకోసం పొగ పెట్టాడని సర్ది చెప్పారు.

శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ గుడిలో జరిగిన ప్రత్యక్ష ప్రసారాల వీడియోలో ఏసు నామ ప్రచార ఎందుకు జరిగింది?

2021లో శ్రీకాళుకు జిల్లాలోని రామతీర్థంలోని శ్రీరాములవారి విగ్రహం తల నరికి కోనేరులో పడవేసింది ఎవరు? అందరికీ తెలుసు. అయినా పట్టించుకోలేదు. మరిచిపోయాం కూడా! ఇదే వెయ్యేళ్ల భారతదేశ చరిత్ర. 08.04.2022 కాణిపాకం శ్రీ గణేశ దేవాలయంలో వసంతోత్స వాలలో చేసిన అలంకరణలల్లో అన్యమతం ఫ్లెక్సీలు ఎలా వచ్చాయి? శ్రీరాముడి తండ్రి గుర్రమా? భూతమా? అంటూ పాస్టర్‌ ‌గానీ జాన్సన్‌ (‌విశాఖ) ఎందుకు సోషల్‌ ‌మీడియాలో వీడియో పెట్టవలసి వచ్చింది?

సిరాజ్‌ ‌రహమాన్‌ అనే వ్యక్తి ఇటీవల సోషల్‌ ‌మీడియాలో ఒక వీడియో పెట్టాడు. వాల్మీకి మహర్షి వశిష్ట మహారాజుకు ఆవు మాంసం వండి పెట్టాడన్నది దాని సారాంశం. గీత 7-252లో గోవధ ఉందట. గోవును చంపి ఇంద్రునికి పెట్టినట్టు ఉపనిషత్తులలో ఉందట. ఇవీ సెమిటిక్‌ ‌మతస్థుల ప్రసంగాలు. వశిష్ట ‘‘మహారాజు’’ ఏమిటి? గీత 7వ అధ్యాయంలో 252 శ్లోకాలు ఉండటం ఏమిటి?

పాల్‌ ‌దినకరన్‌ ‌తమిళనాడులో నిర్వహించే కారుణ్య సంస్థలు చేసే భూ కబ్జాలు జగద్విదితం. సహాయ మేరీ, రాక్వెల్‌ ‌మేరీ పెట్టిన బాధలు తట్టుకోలేక యం. మురగనాథన్‌ ‌కుమార్తె లావణ్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన 19.01.2022 తమిళనాడు తంజావూరు జిల్లాలో జరిగింది. ఇలా బలవంతపెట్టి మత మార్పిడులు చేయవలసిన అవసరం ఈ హలలూయాలకు ఎందుకు కలిగింది? కేరళలో ఫ్రాంకో ములక్కల్‌ అనే ఫాదర్‌ ఎం‌దరో మత కన్యలను (నన్స్) ‌గర్భవతులను చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. హైదరాబాదు బోడుప్పల్‌ ‌చర్చిలోని సాధు చినవెంకటేశ్వర్లు అలియాస్‌ ‌జోసఫ్‌ ‌చేసిన దుర్మార్గాలు ఇటీవలి కథలే.

ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గ (షిమోగా)లో మరికంబ ఉత్సవాల్లో హైందవేతరులు దుకాణాలు నడపకుండా చూచారు. ఇది సెక్యులరిజాన్ని తిరస్కరించడమేనన్నారు కాంగ్రెసు, కమ్యూనిస్టు నేతలు. చైనా ఆర్థిక లాభాల కోసం మహాలక్ష్మి, గణేశ విగ్రహాలను లక్షల సంఖ్యలో నిర్మించి వినాయక చవితి, దీపావళి పండుగలకు భారతీయ మార్కెట్‌లోకి పంపి ఆర్థికంగా దేశాన్ని కొల్లగొట్టడం మాత్రం సెక్యులరిజం అనుకోవాలి. క్రైస్తవ విద్యాసంస్థలు విద్యార్థినుల గాజులు, రిబ్బను, బొట్లు, ఆభరణాలపై చిరకాలంగా నిషేధం అమలు చేస్తూ ఉంటే ఈ కాంగో కమ్యూనిస్టులు ఇప్పటివరకు నోరెత్తలేదు. కాని ఉడిపిలోని ఒక చిన్న పాఠశాలలో డ్రస్‌కోడ్‌కు భిన్నంగా ముస్లిం ఆడపిల్లలు హిజాబ్‌ ‌ధరించి రావడాన్ని నిషేధిస్తే అంతర్జాతీయ వివాదమై పోయింది. విద్యార్థులు ఎవరైనా పాఠశాల డ్రస్‌కోడ్‌ను అనుసరించడవలసిందేననీ, ఇందుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం చట్ట విరుద్ధం కాదనీ చెప్పింది. కానీ వివాదం వివాదమే, కోర్టు తీర్పులు కోర్టు తీర్పులే.

రాలివ్‌ (ఇస్లాంలోకి మతం మార్చుకోండి), సాలివ్‌ (‌లేదా లోయను వదిలిపొండి), గాలివ్‌ (‌లేదంటే చావండి)- భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీరులో వినబడే నినాదమిది. దీనిని అక్కడి రాజకీయ నాయకులు బహిరంగంగా బలపరుస్తు న్నారు. పొగ చూరిన ఏచూరి వర్గం జెఎన్‌యు విద్యార్థుల చేత ఆజాద్‌ ‌కశ్మీర్‌ అనుకూలంగా నినాదాలిప్పించారు. ఇంకా వివరాలు కావాలంటే ‘ది కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌సినిమా చూడవచ్చు. ‘కశ్మీరీ పండితులారా! ఆడవాళ్లను మా కోసం వదిలి మగవాళ్లంతా కశ్మీర్‌ను వదిలి పొండి’-అన్నది ఉగ్రవాదుల పిలుపు.

ఈ శ్రీరామనవమికి కర్ణాటక, గోవా, జార్ఖండ్‌, ‌గుజరాత్‌, ‌బెంగాల్‌ ‌వంటి వివిధ రాష్ట్రాలల్లో ఊరేగింపుల మీద రాళ్లవర్ష కురిసింది. కొందరు చనిపోయారు. జెఎన్‌యులో శ్రీరామనవమి జరుపుకుంటే వామపక్ష సంఘాల విద్యార్థులు ఎందుకు దాడి చేశారు? ఇప్పుడు అర్ధమయింది కదా ఈ అల్లర్ల వెనుక హలలూయాలు, అల్లాహో అక్బర్‌లు ఉన్నారని. రాహుల్‌ ‌గాంధీ ఈ మధ్య ఒక ఉపన్యాసంలో విద్వేష దేశాన్ని బలహీన పరుస్తుందంటూ నీతులు చెప్పారు. ఇంతకీ ఆ విద్వేషం ఎవరిది? ఈయన దృష్టిలో దెబ్బలు తిన్న రామ భక్తులదేనని తాత్పర్యం. వంద ఏండ్లుగా ఈయన తాతముత్తాతలు ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదాన్ని పెంచి పోషించారు. భిన్న సంస్కృతీ సమ్మేళనమైన భారతదేశాన్ని కాపాడుకుందాం అని రాహుల్‌ ‌హితవు పలికాడు. ఈ వాక్యానికి అర్థం ఏమిటి? క్రైస్తవీకరణం, జిహాదీ ఉగ్రవాదదాడులు జరుగుతున్నా అదంతా భిన్న సంస్కృతుల సమ్మేళనమేనా? హిందుత్వం తన అస్తిత్వాన్ని కోల్పోవాలని ఈయన ప్రసంగ సారాంశం. ఈ భిన్న సంస్కృతీ సమ్మేళన వాదం పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లలో ఏమైంది?

దేశంలో ఎక్కడెక్కడో ఏవేవో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలా సంఘటనలు ప్రజలు పట్టించుకోరు. సోషల్‌ ‌మీడియాలో వాటికి ప్రాధాన్యం ఉండదు. అయితే వీటన్నింటినీ జతకూర్చి సమన్వయం చేసి విశ్లేషిస్తే ఇవి వేరు వేరు సంఘటనలు కావనీ, ఇదొక అంతర్జాతీయ కుట్ర అనీ తేలుతుంది.

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, ‌విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
Instagram