కర్నూలు జిల్లా, శ్రీశైలం అసెంబ్లీ పరిధిలోని ఆత్మకూరు పట్టణం మొదటినుండి జాతీయవాద శక్తులకు పుట్టినిల్లు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మాణ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న స్వర్గీయ పద్మనాభాచార్యులు లాంటివారికి జన్మనిచ్చిన గడ్డ. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికలలో జనతాపార్టీ అభ్యర్థి డా।। టి.రంగసాయి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆత్మకూరులో ముస్లిం జనాభా 30 శాతం వరకూ ఉంది. కొన్ని దశాబ్దాలుగా గ్రామపంచా యితీ, నగర పంచాయితీ కూడా వారి చేతిలోనే ఉన్నాయి. 1980 దశకంలో పట్టణంలో జరిగిన గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా ముస్లింలు శోభా యాత్రకు ఆటంకం కల్గించినపుడు పోలీసులు కాల్పులు జరిపారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

జిల్లాలో ఆదోని, ఎమ్మిగన్నూరు, గూడూరు, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లి, ఆళ్లగడ్డ, వెలుగోడు, శిరివెళ్ల లాంటి కీలక ప్రాంతాలలో ముస్లిం జనాభా అధికమే. 1995లో జరిగిన ద్వితీయ ఏకాత్మతా రథయాత్ర సందర్భంగా ఆత్మకూరు సమీపంలో ఉన్న వెలుగోడులో రథయాత్ర మీద దాడి జరిగి, ఘర్షణలు చెలరేగాయి.

ఆత్మకూరు కుబాతి సమీపంలోని కొలనుభారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి ముష్కరులు ప్రవేశించి, అంతర్వాహినిగా ఉండే జలాలను అపవిత్రం చేస్తుంటే, అక్కడున్న హిందు యువకులు నంద్యాల పార్లమెంట్‌ ‌జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి నాయకత్వంలో అడ్డుకున్నారు. కొలనుభారతికి పక్కనే ఉన్న శివపురం గ్రామంలో 2021 సంవత్సరంలో గణేశ్‌ ‌నిమజ్జన ఊరేగింపు ముస్లిం ప్రార్థనా మందిరం ముందునుండి వెళ్లకుండా ఆటంకం కల్గించారు. హిందువులు తిరగబడి తగిన బుద్ధి చెప్పారు. ఇటీవల బక్రీదు సందర్భంగా ఎమ్మిగ న్నూరులోని ఒక ఈద్గాలో గోవులను వధిస్తుండగా, స్థానిక హిందూ సమాజం వ్యతిరేకించింది. దాంతో వేలాది ముస్లింలు రోడ్డెక్కి గొడవలు సృష్టించారు. ఆదోని పట్టణంలో 6 సంవత్సరాల క్రితం గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా గొడవలు జరగ్గా, వందలాది హిందూ యువకుల మీద కేసులు బనాయించారు. కర్నూలు పట్టణంలో 20-20 క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌సందర్భంగా గొడవ జరిగితే పలువురు ముస్లింలు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ, పాత పట్టణంలో అల్లర్లు సృష్టించారు. రుద్రవరం గ్రామంలో హిందువుల ఉత్సవం సందర్భంగా కాల్పులు జరిపిన జిలాని అనే వ్యక్తిని అధికార పార్టీ ఆదుకుంది.

ఇటీవల శిరివెళ్ల గ్రామంలో పార్కింగ్‌ ‌విషయమై ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ, ఆ గ్రామంలోని ముస్లిం యువకులను రెచ్చగొట్టి, హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలపై దాడులు చేసి గాయపరచడానికి కారణమైంది. గడివేముల గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన గొడవలో పాల్గొన్న వారిలో ఒక బంగ్లాదేశ్‌ ‌పౌరుడు ఉన్నట్టు వెల్లడి కావడం పోలీసులనే ఆశ్చర్యపరచింది. పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో వందలాది దుకాణాలు టీ మొదలుకుని విభూతి వరకూ జరిగే విక్రయాలేగాక, దేవాలయ ప్రాంగణంలో జరిగే అన్నిరకాల సివిల్‌ ‌కాంట్రాక్ట్ ‌పనులు అబ్దుల్‌ ‌రజాక్‌, అతని సోదరులే చేపట్టి ఆర్థికంగా బలపడ్డారు. శ్రీశైలక్షేత్రాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. 2020 సంవత్సరంలో దుకాణాల వేలం జరుగుతున్నపుడు, హైందవేతరులు వేలంపాటలో పాల్గొనరాదని భారతీయ జనతాపార్టీ నంద్యాల పార్లమెంట్‌ ‌జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి అడ్డుపడగా, ఆయనను అరెస్టు చేశారు.

ఇక్కడ నానాటికీ బలపడుతున్న ఘర్షణ పూరిత వాతావరణానికి, అల్లర్లకు ఇటీవల కర్నూలు జిల్లాలో పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ వంటి మతోన్మాద ముస్లిం సంస్థల పని గణనీయంగా పెరగడమే కారణం. సేవ ముసుగేసుకుని ఈ సంస్థలు హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలలోకి వెళుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయా పట్టణాలు, గ్రామాలలో ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు కోకొల్లలు. ఈ విధంగా ఒక దశాబ్దకాలంగా కర్నూలు జిల్లాలో ప్రణాళికాబద్ధంగా, సంఘ విద్రోహశక్తుల సంఖ్య పెరగటం, వ్యూహాత్మకంగా హిందూ సమాజంపైన దాడులు చేయడం జరుగుతోంది.

ఆత్మకూరులోని తోటగేరి అనేది హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ప్రదేశం. అక్కడ హిందువులకు చెందిన ఒక ఇంటిని నివాసం కోసం ముస్లింలు కొన్నారు. అయితే ఎనిమిది నెలల క్రితం ఇంటిని కాకుండా, ఆ స్థలంలో మసీదు నిర్మించాలనే ప్రయత్నం జరిగినపుడు స్థానిక హిందువులు వ్యతిరేకించారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో, తాత్కాలికంగా నిర్మాణం ఆగింది. అయితే 2022 జనవరి 5న అదే స్థలంలో నిర్మాణపనులు మొదలెట్టే ప్రయత్నం జరగగా, హిందువులందరూ మరోమారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతకీ ఆ స్థలంలో మసీదు నిర్మాణం కోసం నగర పంచాయితీ నుండి ఎలాంటి అనుమతులు గానీ, ప్లాన్‌ అ‌ప్రూవల్‌ ‌గానీ చేసుకోలేదని పోలీసుల విచారణలో బహిర్గత మవడంతో, అక్రమంగా నిర్మాణం చేపట్టవద్దని పోలీసులే ఆపేశారు. అధికారుల మాటలు కూడా పెడచెవిన పెట్టి తిరిగి నిర్మాణం మొదలు పెట్టారు. హిందువులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. అధికారపార్టీ ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి ఒత్తిడి మేరకు పోలీసు యంత్రాంగం మిన్నకుండిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎటూ పాలుపోని స్థానికులు శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా, ఆయన డీఎస్పీ శ్రుతిని ఫోన్‌లో సంప్రదించారు. ఆమె వ్యక్తిగతంగా సాయంత్రం వచ్చి కలవమని చెప్పారు. డీఎస్పీ సూచన మేరకు శ్రీకాంత్‌రెడ్డి ఆత్మకూరు పట్టణానికి వెళ్లారు. అప్పటికే స్థానికులు అక్రమ నిర్మాణ పనులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో, ఒక సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌, ఇద్దరు సబ్‌ ఇన్స్‌పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు వివాద స్థలాన్ని పరిశీలిస్తుండగా సుమారు 50 మంది ముష్కరులు మూకుమ్మడిగా రాళ్లతో దాడికి దిగారు. ఆ దాడిలో భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయం తెలిసిన తర్వాత, తానే ఆ స్థలానికి వస్తానని, అక్కడున్న వారందరిని పక్కకు పంపేయమని డీఎస్పీ ఆదేశించారు. స్థానికంగా ఒక ఇంట్లో శ్రీకాంత్‌రెడ్డి డీఎస్పీ కోసం నిరీక్షించారు. సుమారు 45 నిమిషాలు గడిచినా, డీఎస్పీ రాకపోవడంతో, స్థానిక హిందువులందరితో కలిసి, డీఎస్పీని కార్యాలయంలోనే కలుద్దామని బయల్దేరారు. దాంతో శ్రీకాంత్‌రెడ్డి వాహనంపైన రెండువందల మంది దాకా ముస్లిం యువకులు దాడిచేసి రాళ్లవర్షం కురిపించారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో శ్రీకాంత్‌రెడ్డి, మరో ముగ్గురు కార్యకర్తలు అదే వాహనంలో ప్రాణరక్షణ కోసం పోలీస్‌ ‌స్టేషన్‌కు వెళ్లి ఆశ్రయం తీసుకోవలసి వచ్చింది. కేవలం అర్ధగంటలో సుమారు మూడు వేలమంది ముస్లింలు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టి ‘అల్లాహో అక్బర్‌’ అం‌టూ, శ్రీకాంత్‌రెడ్డిని మాకు అప్పగించండి, మేము చంపేస్తాం అంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసు యంత్రాంగం కూడా నియంత్రించలేని పరిస్థితి. రెచ్చిపోయిన ముస్లిం మూకలు పోలీస్‌ ‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న శ్రీకాంత్‌ ‌రెడ్డి వాహనానికి నిప్పుపెట్టారు. అంతేకాదు, పోలీస్‌ ‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. సకాలంలో ఫైరింజన్‌ ‌వచ్చి మంటలను అదుపు చేసింది. పోలీసులు రెండుసార్లు గాలిలోకి కాల్పులు జరిపినప్పటికీ దుండగులు ఏ మాత్రం తగ్గలేదు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కర్నూలు జిల్లా ఎస్పీ సాయుధ బలగాలతో వచ్చి పరిస్థితిని అదుపు చేయవలసి వచ్చింది. కేవలం అరగంట సమయంలో మూడు వేలమంది ఎలా జమ అయ్యారనేది పెద్ద ప్రశ్న.

 సాక్షాత్తూ జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో నంద్యాల, ఆత్మకూరు పట్టణాలలో ఇటీవల ఎస్‌డీపీఐ శిక్షణ తరగతులు జరిగాయని, అక్కడ శిక్షణ పొందినవారికి తోడుగా ఆత్మకూరు చుట్టుపక్కల గ్రామాలనుండి వచ్చిన ముస్లిం యువకులు ఈ ఘర్షణలో పాల్గొన్నారని చెప్పారు. దీన్ని బట్టి ఆత్మకూరులో ఎంత వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా హిందూసమాజం, హిందూ నేతలమీద దాడులే గాక, పోలీస్‌ ‌స్టేషన్‌కు కూడా నిప్పంటించే స్థాయికి ముస్లిం మూకలు వెళ్లారో స్పష్టమవుతోంది. ప్రాణరక్షణ కోసం పోలీస్‌ ‌స్టేషన్‌ను ఆశ్రయించిన హిందూసంస్థల కార్యకర్తలపైన అధికార పార్టీ ఒత్తిడికి లోనై పోలీసులు కేసులు బనాయించారు.


చరిత్రంతా రక్తసిక్తమే!

కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ, ఇతర హిందూ సంస్థలే కాకుండా, సీపీఎం,  ముస్లింలీగ్‌ ‌కార్యకర్తలను కూడా చంపుతూ వార్తలోకి వచ్చిన సంస్థ సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా. జూన్‌ 21,2009‌లో ఈ పార్టీని ఢిల్లీలో స్థాపించారు. మరుసటి సంవత్సరమే అంటే, ఏప్రిల్‌ 13,2010‌లో ఎన్నికల కమిషన్‌ ‌గుర్తింపు కూడా ఇచ్చింది. ఇది పొలిటికల్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ) అనే సంస్థకు రాజకీయ విభాగం. పీఎఫ్‌ఐ ‌పూర్తిగా మతోన్మాద సంస్థ. ఒక్క కేరళలోనే ఈ సంస్థ సభ్యుల మీద 27 హత్య కేసులు ఉన్నాయి. ఆ హత్యలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలవే. కేరళలో వీర విహారం చేస్తున్నప్పటికీ ఎస్‌డీపీఐ తమిళనాడు, కర్ణాటక, ఆంధప్రదేశ్‌, ‌గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ‌జార్ఖండ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌బిహార్‌, ‌ఢిల్లీ, రాజస్తాన్‌, ‌హరియాణా, మణిపూర్‌లలో చురుకుగా పని చేస్తోంది. ఎస్‌డీపీఐ భారతదేశంలో ఐఎస్‌ఐఎస్‌ ‌వంటిదని కేరళ సీపీఎం అధ్యక్షుడు కొడియేరి బాలకృష్ణన్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. సీపీఎం విద్యార్థి విభాగం ఎస్‌ఎఫ్‌ఐ ‌నాయకుడు ఒకరు ఎస్‌డీపీఐ కార్యకర్తల చేతిలో మరణించిన తరువాత కొడియేరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది భారతీయ ముస్లింలకు వ్యతిరేక సంస్థ అని కూడా అన్నారు.

 కేరళలోని కరికోడ్‌ అనేచోట 2014లో ఒక ప్రైవేటు పాఠశాలలో వందేమాతరం పాడకుండానే స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. జాతీయ గీతం పాడితే మొత్తం కార్యక్రమాన్నే చెడగొడతామని ఎస్‌డీపీఐ కార్యకర్తలు వచ్చి బెదిరించడంతో ఆ పాఠశాల అలాంటి నిర్ణయం తీసుకుంది. చేతులు జోడించి పాట పాడడం తమ మతానికి విరుద్ధం కాబట్టి కొందరు పిల్లల తల్లిదండ్రులు తమను సంప్రతించడంతో రంగంలోకి దిగామని ఆ పార్టీ చెప్పుకుంది. 1992లో కూల్చిన బాబ్రీ మసీదును తిరిగి అక్కడే నిర్మించాలని కోరుతూ ఎస్‌డీపీఐ 2016 డిసెంబర్‌లో తమిళనాడు, కర్ణాటక, న్యూఢిల్లీలలో ఆందోళనలు నిర్వహించింది. ఆ సందర్భంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు దక్షిణ కన్నడ జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా కూడా ఎస్‌డీపీఐ దేశంలో చాలా చోట్ల ఆందోళనలు జరిపింది. సీఏఏను ఆసరా చేసుకుని ఎస్‌డీపీఐ ప్రజలలో విభజన తీసుకువస్తున్నదని ఆ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ‌వ్యాఖ్యానించడం విశేషం. ఆ సమయంలోనే మంగళూరులో జరిగిన సీఏఏ వ్యతిరేక అల్లర్ల వెనుక ఎస్‌డీపీఐ ఉందని తేలింది. 2020లో మరొక చిత్రమైన కేసుతో మద్రాస్‌ ‌హైకోర్టుకు వెళ్లి ఈ సంస్థ విజయం సాధించింది. తమిళనాడుకు చెందిన కొందరు తబ్లిగి జమాతే సభ్యులు ఢిల్లీలో చిక్కుబడిపోయారు కాబట్టి, వారిని సురక్షితంగా రాష్ట్రానికి తెచ్చేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఎస్‌డీపీఐ వ్యాజ్యం దాఖలు చేసి గెలిచింది. కేంద్రం తెచ్చిన సాగు సంస్కరణ చట్టాలను ఎస్‌డీపీఐ బాహాటంగానే వ్యతిరేకించింది. ఢిల్లీలో ధర్ణా చేస్తున్న రైతులకు అనుకూలంగా తమిళనాడు, కేరళలలో ఈ సంస్థ సభ్యులు ధర్ణాలు నిర్వహించారు.

2020 ఆగస్టులో బెంగళూరులో జరిగిన విధ్వంసానికి కారణం కూడా ఎస్‌డీపీఐ. మహమ్మద్‌ ‌గురించి తప్పుగా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారన్న కారణంగా ఆ విధ్వంసం జరిగింది. ముగ్గురు మరణించారు. ఆ తరువాత పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ అం‌టూ నినాదాలు చేశారన్న కారణంగా కర్ణాటకకు చెందిన ఎస్‌డీపీఐ సభ్యులు కొందరిని అరెస్టు  చేశారు.


నెత్తి కెక్కిన మతోన్మాదం

ఆత్మకూరులో పద్మావతి పాఠశాల సమీపంలో ఈ మసీదు నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం ఆపాలని స్థానిక పోలీస్‌ ‌స్టేషన్‌లో హిందూ సోదరులు ఫిర్యాదు చేయడంతో నిర్మాణం కొద్దిరోజుల క్రితం నిలిపి వేశారు. జనవరి 5న మళ్లీ మసీదు నిర్మాణపనులు జరుగుతున్నాయని శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం అందింది. కొంతమంది అనుచరులతో మసీదు నిర్మాణ స్థలానికి చేరుకొని అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించిన శ్రీకాంత్‌రెడ్డి మీద సుమారు 200 మంది ముస్లిం యువకులు దాడికి దిగారు. పోలీసులు వచ్చి అతి కష్టం మీద ఆయనను రక్షించారు. ఆయన వాహనాన్ని ముస్లిం యువకులు వెంబడించారు. ప్రాణరక్షణ కోసం పోలీస్‌స్టేషన్‌కి వెళ్లిన బీజేపి నాయకుడిని చంపేందుకూ ప్రయత్నం చేశారు. వందల మంది ముస్లిం యువకులు పోలీసు స్టేషన్‌కు చేరుకొని రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ నాయకుడి తలకు, పోలీస్‌లకు కూడా గాయాలయ్యాయి. కొంత మంది ముస్లిం నాయకులు రెచ్చగొట్టేటట్టు ప్రసంగించడంతో ఆ వర్గం యువకులు మరింతగా రెచ్చిపోయి పోలీసు స్టేషన్‌ ‌మీద దాడి చేశారు. రాళ్ల దాడిలో స్టేషన్‌లోని కంప్యూటర్‌లు పూర్తిగా పగిలిపోయాయి. పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లోపలికి యువకులు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నంచిగా, పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి సీఐ సుబ్రహ్మణ్యం గాల్లోకి కాల్పులు జరిపారు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి అదనపు బలాగాలను పంపి అల్లరి మూకలను చెదరగొట్టారు. డీఐజీ వెంకటరామిరెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆత్మకూరులోనే ఉండి దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసే ప్రయత్నంలో ఉన్నారు.

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram