ప్రతి మోప్లా కేంద్రంలో ఒక ఖిలాఫత్‌ ‌సంఘాన్ని నెలకొల్పారు. దానికి అధ్యక్ష, కార్యదర్శులుగా మోప్లాలే వ్యవహరించారు. ఎర్నాడ్‌, ‌పొన్నాని తాలుకాలో అటువంటి సంఘాలు ఎన్ని ప్రారంభిం చారో కచ్చితంగా తెలియనప్పటికి, 100కు పైగా సంఘాలు ఉన్నట్లు అంచనా. ప్రతి మోప్లా గ్రామానికి ఖిలాఫత్‌ ఉద్యమ కారుల నుండి సమాచారం అందే ఏర్పాటును కూడా చేసుకున్నారు. ఏ క్షణమయినా మోప్లాలను వందలలో సమీకరించ టానికి వీలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి తోడు మసీదులలో ప్రార్థనలకు హాజరయిన సందర్భంలో వారు తరచుగా కలుస్తూ ఉండేవారు. మసీదులో ప్రార్థనల అనంతరం చేసే ప్రసంగాలన్నీ ఉద్రేకాన్ని రెచ్చగొట్టి, ఖిలాఫత్‌ ఉద్యమానికి సమీకరించేలా మానసికంగా సిద్ధం చేశాయి. హింసోన్మాదానికి మత అంగీకారం ఉంది కనుక, వారిలో హింసోన్మాదాన్ని రెచ్చగ్టొగలిగారు (Hardgrave, ibid, p. 72).

ఆ జిల్లా పోలీసు అధికారిగా హిచ్‌కాక్‌ ‌పని చేశాడు. ఆయన ఆనాటి పరిస్థితులను వివరిస్తూ ఇలా రాశాడు, ‘ఖిలాఫత్‌ ఉద్యమకారులు నెలకొల్పిన నెట్‌వర్క్ ‌కంటె ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. మోప్లాల మధ్య సంప్రదాయ పద్ధతులలో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకొనే పద్ధతి ఉంది. వేగంగా వారు సమాచారాన్ని తీసుకొని వెళ్లేవారు. గ్రామగ్రామాకి సమాచారాన్ని చేరవేయగలిగేవారు. హిందువులకు, ముస్లింలకు ఇదే ముఖ్యమైన తేడా. ప్రతి శుక్రవారం ప్రార్థనల కోసం గుమిగ•డేవారు. మిగిలిన రోజులలో మసీదులలో ప్రార్థనలకు హాజరయ్యేవారు. కనుక వారు చాలా త్వరగా వారిదైన ఒక ఏకా భిప్రాయం ఏర్పరచుకోవటానికి వీలయ్యేది. మత ప్రార్థనల ముసుగులో ఇదంతా జరిగేది. కనుక హిందువులకు, పాశ్చాత్యులకు వారి ఏర్పాట్లు, అభిప్రాయాలు, సంసిద్ధత గురించి తెలుసుకొనే అవకాశం లేకుండా పోయింది. అప్పుడప్పుడు వచ్చే హిందువుల పండుగల సందర్భంగా తప్ప హిందువులు వారిలాగా నిర్ణీతకాలంలో నిర్ణీత సమయంలో తరుచుగా కలుసుకొనే వారు కారు.’ ( A History of Malabar Rebellion, R.H. Hitchcock, Governmet Press, Madaras, 1921, p.3).

మోప్లాలు ఆయుధాలను పెద్దపెట్టున సమీక రించారు. ఖిలాఫత్‌ ఉద్యమకారులు శాంతియుతంగా సాగాలని గాంధీజీ పెట్టిన షరతులను వారు ఏనాడో గాలికి వదిలివేశారు. రకరకాల పదునైన కత్తులు చిన్నవి, పెద్దవి, రెండువైపుల పదునున్న విచ్చు కత్తులను సమీకరించారు. ఈటెలు, బల్లేలు, గొడ్డళ్లును పెద్దపెట్టున తయారు చేసుకున్నారు. లాఠీలు, కర్రలు, చైనులును పదునైన రాళ్ళనూ కూడా సమీకరించారు. అంటే ఒక చిన్న యుద్ధం చేయటానికి కావలసిన రకరకాల ఆయుధసామాగ్రిని పెద్దపెట్టున సమీకరించుకొని సంసిద్ధులయ్యారు (The Mappilla Rebellion, 1921-22, G.R.F. Tottenhan, Government Press, Madras, p.36).

మబార్‌ ‌జిల్లా నైసర్గిక స్వరూపం కూడా మోప్లాల జిహాద్‌కు కలసి వచ్చింది. కొండలు, గుట్టలతో గెరిల్లా దాడులకు అనుకూలం. జట్లు కింద విడిపోయి, గెరిల్లా యుద్ధతంత్రాన్ని అమలు చేయటంతో వారిని అదుపు చేయటం, అణచివేయటం కష్టసాధ్యమయింది. సైనిక చర్య కూడా అంత తేలిక కాలేదు (G.R.F. Tottenhan, ibid, p.38). స్థానిక పోలీసు యంత్రాంగం వారిని అదుపు చెయ్యగలస్థితిలో లేదు. మోప్లాలు పోలీసు స్టేషనులపై దాడులు చేసి, ఆయుధాలన్నిటినీ ఎత్తుకొని వెళుతున్నా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. అన్ని పోలీసుస్టేషనులలోని ఆయుధాలు మోప్లాల వశమయ్యాయి (Nair, ibid, p. 71; Tottenhan, ibid, p.7).

హిందువులు గుడ్డిగా గాంధీజీ హిందూ-ముస్లిం ఐక్యతా నినాదాన్ని నమ్మారు. అహింసను ఆరాధించటం మొదలెట్టారు. ‘మహాత్ముని అహింసా సిద్ధాంతం ముసుగులో రక్తం మరిగిన ఇస్లాం కత్తికి సానపెట్టారు మోప్లాలు (జిహాద్‌కు సంసిద్ధు లయ్యేందుకు). ఇంటికి వెళ్లి తమ నాగళ్లను పదునైన కత్తులుగా, రంపాలను సమర కరవాలాలుగా తయారు చేయటం ఎట్లా అని ఆలోచించి, అందుకు అనుగుణంగా పనిచేశారు. అహింస అనేది ఒక ముసుగు. సంసిద్ధులయ్యాక ఆ ముసుగును తొలగించుకొని కార్యాచరణకు పూనుకొనేందుకు ఉపయోగించిన ముసుగు అది. కార్యాచరణకు పిలుపు రాగానే ఆ ముసుగు తొలగించటానికి సిద్ధంగా ఉన్నారు. మోప్లాల మనస్తత్వం తెలియని యువ హిందూనాయకులు అహింస, సహాయనిరాకరణ గురించి ఉత్తేజభరితమైన ప్రసంగాలు చేస్తూ ఊరూరు తిరిగారు’ (Tottenhan, ibid, p.3).

జిహాద్‌ ‌మృత్యుహేల

 ఆగస్ట్ 20, 1921‌న జిహాద్‌ ‌మొదలయింది. ఆ నెల 26న సైనికపాలన విధించారు. ఫిబ్రవరి 25, 1922 వరకు సైనికపాలన (Martial law) మలబార్‌ ‌తీరంలో కొనసాగింది. జూన్‌ 30, 1922 ‌నాటికి జిహాద్‌ ‌ముగిసిందని చెప్పవచ్చు. మోప్లాల చిట్టచివరి నాయకుడు అబూబకర్‌ ‌ముసలియార్‌ను ఆరోజు అరెస్ట్ ‌చేశారు. 1921 సెప్టెంబర్‌ ‌నుండి డిసెంబర్‌ ‌వరకు, అంటే నాలుగు నెలలు జిహాద్‌ ‌పరాకష్ట దశ అని చెప్పవచ్చు.  జనవరి 16, 1922న కేంద్ర శాసనసభలో ఒక ప్రశ్నకు బదులుయిస్తూ ఆనాటి హోంసెక్రటరీ సర్‌విలియమ్‌ ‌విన్సెంట్‌ ఇలా చెప్పాడు, ‘మద్రాసు ప్రభుత్వ నివేదిక ప్రకారం బలవంతపు మత మార్పిళ్లు వేల సంఖ్యలో జరిగాయి. కచ్చితంగా ఎంతమందిని బలవంతంగా మతమార్పిడి చేశారన్నది లెక్క తేల్చటం సాధ్యమయ్యే పనికాదు’ (Pakistan or The Partition of India, B.R. Ambedkar, p.148).

మోప్లాల జిహాద్‌లో 20,800 మంది హిందువు లను చంపారు. నాలుగు వేలకు పైచిలుకు హిందు వులను భయపెట్టి ముస్లింలుగా మార్చారు.లక్షలాది హిందువులు నిరాశ్రయులయ్యారు. వెయ్యికి పైగా దేవాలయాలను ధ్వంసం చేశారు. 2,339 మంది మోప్లాలు చనిపోగా, 1652 మంది మోప్లాలు గాయపడ్డారు. 39,338 మంది జిహాదీలపై కేసులు పెట్టారు. 24,167 మందిపై విచారణ జరిపారు. 43 మంది మలబార్‌ ‌పోలీసులు చనిపోగా, 126 మంది క్షతగాత్రులయ్యారు. మరో 24 మంది జిల్లా పోలీసులు చనిపోగా, 29 మంది గాయాలు పాలయ్యారు (Tottenhan, ibid, p.48, 53, 414, 425; Nair, ibid, p. 39, 88).

మోప్లాల జిహాద్‌కు, విదేశీ ముస్లింలు భారత్‌ ‌పై చేసిన జిహాద్‌కు ఎందులోనూ తేడాలేదు. ఆనాడు అరబ్బులు, తురుష్కులు దేశంపై దాడిచేసినప్పుడు ఎంత అమానుషంగా, క్రూరంగా హిందువుల పట్ల వ్యవహరించారో, అంతే క్రూరత్వాన్ని, అమానుష త్వాన్ని మలబార్‌ ‌మోప్లాలు తమసాటి హిందూ గ్రామీణుల పట్ల కూడా చూపారు. దారుణ మారణకాండకు పేరైన జిహాద్‌లో అనుసరించే కొన్ని క్రూరమైన పద్ధతులు:

–              మహిళలను ఘోరంగా అవమానపర్చటం, మానభంగం చేయటం.

–              ప్రత్యుర్థులను సజీవ దహనం చేయటం

–              పెద్దలను, పిన్నలను, స్త్రీలను టోకుగా నరికి వేయటం

–              కుటుంబాలకు కుటుంబాలనే అగ్నికీలలకు ఆహుతి చేయటం

–              బలవంతపు మతమార్పిళ్లు, అంగీకరించని వారి పీకలు కత్తిరించటం.

–              సగం చచ్చినవారిని నూతులలో పడవేయటం.

–              ఇళ్లను దోచుకోవటం, చచ్చినవారి దుస్తులను, ఆభరణాలను వలుచుకోవటం

–              దేవాలయాలను పడగొట్టటం, అపవిత్రం వేయటం.

–              ఆవులను దేవాలయాలలోనే చంపి, వాటి రక్త మాంసాలు వెదజల్లి, కళేబరాలను వేలాడ దీయటం, దేవాలయ గోడల మీద, కప్పుల మీద, ద్వారాల మీద మృతజీవుల ఎముకలు, పుర్రెలు హారాలుగా వేయటం.

మధ్యయుగంలో మనదేశంపై దాడి చేసిన విదేశీ ముస్లింలు జిహాద్‌లో భాగంగా ఇలాంటి అకృత్యాలకు ఒడిగట్టారు. ఆధునిక యుగంలో మోప్లాలు వారిని తు.చ అనుసరించారు. మానవులు తమ తోటి మానవుల పట్ల చెయ్యలేని అకృత్యాలన్నీ నేటికి 100 ఏళ్ల క్రిందట మలబారు తీరంలో మోప్లాలు చేసి చూపించారు.

అనేకమంది ముస్లిం నాయకులు తమకు తాము ఖిలాఫత్‌ ‌రాజులమని ప్రకటించుకొని, మృత్యుహేలను పర్యవేక్షించారు. అలీ ముసిలీయార్‌, ‌వరియాకున్నాథ్‌ అహమ్మద్‌ ‌హాజీరాజా, కోయాతంగల్‌ ‌వంటి వారు అందుకు ఉదాహరణగా నిలుస్తారు. కోయాతంగల్‌ ఒక కొండ శిఖరాన తన దర్బారును నెలకొల్పాడు. ఆయనకు 4 వేలమంది మోప్లా అనుచరులు ఉండేవారు. 40మంది హిందువులను  చేతులను వెనుకకు విరిచికట్టి ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. వారందరూ ఆయనకు తెలిసిన తోటి గ్రామస్తులే. అందులో 38 మందికి మరణ దండన ఆయన విధించాడు. ఎత్తుగా ఒక బండ మీద కూర్చొని ఆ మరణ దండనను పర్యవేక్షించాడు కూడా.

హిందువులను ఒక్కొక్కరిగా తీసుకొనివచ్చి, గొంతు కోసి బావిలోకి తోసివేశారు (Nair, ibid, pp.76-80). 627వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో బందీలుగా పట్టుబడిన బాను కురియాజ్‌ ‌తెగ (Banu Qurayza) యూదులను మహమ్మద్‌ ‌ప్రవక్త అనుచరులు ఇలాగే చంపారు. ఆ సామూహిక హత్యాకాండను ప్రవక్త పర్యవేక్షించాడు. కోయాతంగల్‌ ‌తన ప్రవక్తనే అనుసరించాడు.

కుహనా లౌకికవాదుల బూటకపు ప్రచారం

మనదేశంలో వామపక్షీయులు, కుహనా లౌకికవాదులు ఆ జిహాద్‌ను మోప్లాల తిరుగుబాటుగా పేర్కొంటూ, ఆ తిరుగుబాటుకు మతం కారణం కాదని బూటకపు ప్రచారం చేస్తున్నారు. టి.ఎల్‌.‌స్ట్రేంజ్‌ ‌మలబార్‌ ‌స్పెషల్‌ ‌కమిషనర్‌గా పనిచేశాడు. మోప్లాలు ఒడిగట్టిన దారుణ మారణకాండకు కారణాలు అన్వేషించమని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది. 1852లో తన నివేదికలో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిద్దాం, ‘హిందూ భూస్వాములు తమ కౌలుదారులను వారు హిందువులైనా, మోప్లాలైనా సమానంగానే చూశారు. భరించలేనంత అణచివేత లేదు. దక్షిణ మలబార్‌ ‌తాలుకాలలో ఘర్షణలు తరచుగా జరుగుతూనే ఉండేవి. ఆ ప్రాంతంలో మోప్లా కౌలుదార్లు ఒప్పందాలను అకారణంగానే ఉల్లంఘించేవారు. ఏదో వంకతో కౌలు మొత్తం సాఫీగా చెల్లించేవారు కాదు. తరచు న్యాయస్థానాలకు వెళ్లి వ్యాజ్యాలు వేస్తూ ఉండేవారు. ఎక్కడైతే తరచుగా ఘర్షణలు జరిగేవో, ఆ ప్రాంతం లోని హిందువులు మోప్లాలకు భయపడేవారు. మోప్లాలకు వ్యతిరేకంగా వారికి న్యాయబద్ధంగా ఉన్న హక్కులను సైతం వాడుకొనలేకపోయేవారు. అనేకమంది మోప్లా కౌలురైతులు అంగీకరించిన కౌలు చెల్లించేవారు కాదు. అందువల్ల భూస్వాములు తమ భూముల నుండి కౌలుదార్లను తొలగిస్తారనే భయం వారికి ఉండేది’ (Nair, ibid, p.6)

మోప్లాల జిహాద్‌ ‌వలసపాలనకు వ్యతిరేకంగా జరిగి ఉంటే లేదా అది కౌలు రైతుల తిరుగుబాటు అయి ఉంటే, హిందువులను, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు ఎందుకు చేశారు? బలవంతంగా మత మార్పిళ్లకు ఎందుకు పాల్పడ్డారు? గోవులను ఎందుకు వధించారు? హిందూ స్త్రీలను ఎందుకు చెరపట్టి, మానభంగాలకు పాల్పడ్డారు? ఇస్లామిక్‌ ‌వాదులు తాము చేసిన మారణకాండకు, ఒడిగట్టిన అకృత్యాలకు లౌకికవాద రంగు పులమటానికి ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు. వారి లక్ష్యాలను వారు బహిరంగంగా నిస్సంకోచంగానే ప్రకటించారు. కేవలం వామపక్ష మేధావులు, కాంగ్రెస్‌ ‌నాయకులే వారి జిహాద్‌కు సెక్యులర్‌ ‌రంగు పులిమే ప్రయత్నం చేసి, వారి ఉద్యమానికి లేని ఉద్దేశాలను ఎందుకు అంటకడ్తున్నారు? ఇద్దరు గొప్ప నేతలు వారిదైన పద్ధతిలో మోప్లాల దౌర్జన్యాలకు ఇస్లామిక్‌ ‌లక్ష్యాలే కారణమని పేర్కొన్నారు. ఆ ఇరువురిలో ఒకరు గాంధీ అయితే, మరొకరు అంబేడ్కర్‌. ‘‌దేవుడంటే భయపడే మోప్లాలు, వారి మతం అని అనుకొన్న దాని గురించి పోరాటం చేశారు. వారు నమ్మిన మతమార్గాన్ని అనుసరించే పోరాటం చేశారు’ (గాంధీ). ‘ఆంగ్ల ప్రభుత్వాన్ని గద్దెదించి ఇస్లామిక్‌ ‌రాజ్యాన్ని ఏర్పాటు చేయటమే వారి లక్ష్యం’ డా।। అంబేడ్కర్‌ (Ambedkar, ibid, pp.148,153).

భావజాలపు నియంతృత్వం వలన మొట్ట మొదటిగా మరుగున పడేది వాస్తవాలే. తిరుగుబాటు కాదు. విప్లవం కాదు. మోప్లాలది ముమ్మాటికీ జిహాదే. అణుమాత్రమూ సంశయం లేని జిహాద్‌.

 ‌చౌరీచౌరా ఉదంతం

 ఫిబ్రవరి 4, 1922న చౌరీచౌరాలో పోలీసు స్టేషను మీద ఖిలాఫత్‌ ‌మూకలు దాడిచేశాయి. మోప్లాలు ఒడిగట్టిన దారుణ మారణకాండ గాంధీజీని కదిలించలేకపోయింది. కానీ చౌరీచౌరా హింసాకాండ కదిలించింది. గాంధీజీ ఖిలాఫత్‌కు మద్దతుగా మొదలెట్టిన సహాయ నిరాకరణను అర్ధాంతరంగా ఉపసంహరించుకొన్నారు. సహాయ నిరాకరణ ముసుగు లేకపోయినా ఖిలాఫత్‌ ఉద్యమం కొనసాగింది. ఖిలాఫత్‌ ఉద్యమ లక్ష్యాలు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు టర్కీ ఐక్యత, సమగ్రతను కాపాడటం, ఇస్లామిక్‌ ‌సామ్రాజ్యంగా ఒట్టొమన్‌ల ఆధిపత్యం కొనసాగించటం చుట్టూ అల్లుకొన్నాయి. టర్కీ సామ్రాజ్యానికి పూర్తి స్వాతంత్య్రం, ఆగ్నేయ ఐరోపాలోని త్రేస్‌, ‌ప్రస్తుత ఇజ్మిర్‌ను, ఆసియా మైనర్‌ ‌తీరప్రాంతాన్ని అంటే ఆసియాలోని టర్కీ ప్రాంతాన్ని టర్కీకి తిరిగి అప్పచెప్పటం, అరేబియాలోని ఇస్లామిక్‌ ‌పవిత్ర స్థలాలకు స్వేచ్ఛను, భద్రతను కల్పించి, అరేబియా ద్వీపంపై టర్కీ పెత్తనాన్ని కొనసాగనివ్వటం ఖిలాఫత్‌ ఉద్యమ లక్ష్యాలు.

ఈ ఉద్యమం భారతదేశంలో జరిగింది. భారతదేశానికి సంబంధించి ఒక్క లక్ష్యం కూడా లేదు. టర్కీ పట్ల తమకున్న సీమాంతర విధేయతను బహిరంగంగానే ఉద్యమకారులు వెలిబుచ్చారు. అందుకోసం ఆ ఉద్యమ లక్ష్యాలకు ఏమాత్రమూ సంబంధంలేని భారతదేశంలో రక్తపుటేరులు పారించారు. ఆ ఉద్యమానికి కాంగ్రెస్‌ ‌పక్షం గుడ్డిగా తన మద్ధతును ప్రకటించటం డా।। అనిబీసెంటు పేర్కొన్నట్లుగా ఆత్మహత్యా సదృశ్యం. ముస్లిం వర్గాల సీమాంతర విధేయతను మరింతగా పెంచి, పోషించిన నేరం నుండి కాంగ్రెస్‌ ‌నాయకత్వం ఎప్పటికీ తప్పుకోలేదు.

ఖిలాఫత్‌ ఉద్యమ ముగింపు

టర్కీకి, ఇంగ్లండ్‌, ‌ఫ్రాన్స్, ‌రష్యా కూటమికి మధ్య జులై 24, 1925న కుదిరిన ఒప్పందం ప్రకారం (Lausane Treaty) కానిస్టాంట్‌నోపిల్‌, ‌త్రీస్‌ ‌ప్రాంతాన్ని తిరిగి టర్కీకే ఇచ్చివేశారు. తన సామ్రాజ్యంలో అనేక భూభాగాలను శాశ్వతంగా కోల్పోయినా, ఈ ఒప్పందం వలన టర్కీ తిరిగి తలెత్తు కొని నిలబడటానికి మాత్రమే కాక ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగటానికి కూడా అవకాశం లభించింది. ఖిలాఫత్‌ ‌నాలుగు లక్ష్యాలలో మూడు లక్ష్యాలు నెరవేరాయి. అరేబియాలోని పవిత్రస్థలాల పరిరక్షణకు సంబంధించిన నాలుగవ లక్ష్యం నెరవేర లేదు. అరేబియాపై పెత్తనాన్ని టర్కీ శాశ్వతంగా కోల్పోయింది. ముస్లిం ఛాందసవాదుల ఉద్దేశంలో ఈ నాలుగవ లక్ష్యం అన్నిటికంటే ప్రధానమైంది. కనుక ముస్లిం పవిత్ర స్థలాలను తిరగి టర్కీకే దఖలు అయ్యేవరకు ఉద్యమం కొనసాగించాలని వారు అనుకొన్నారు.

ఒట్టొమాన్‌ ‌సామ్రాజ్య శిథిలాల నుండి ఏర్పడిన టర్కీ రిపబ్లిక్‌కు ముస్తాఫా కెమల్‌ ‌పాషా మొదటి అధ్యక్షుడు. 1923 నుండి 1938 వరకు  పరిపాలిం చాడు. టర్కీని ఒక ఆధునిక, సెక్యులర్‌, ‌పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చేశాడు. కొత్తగా ఏర్పాటు చేసిన టర్కీ రిపబ్లిక్‌కు ఖిలాఫత్‌ ఒక అక్రమ, అరాచక వ్యవస్థ (anomalous and anachronistic institution) అవుతుందని, దానిని కొనసాగించటం వలన నిరంతరం తలనొప్పి తప్పదని, టర్కీష్‌ ‌రిపబ్లిక్‌ ‌మనుగడకు అది శాశ్వత ప్రమాదకారి అవుతుందని కెమల్‌ ‌భావించాడు. ఇతర ఇస్లామిక్‌ ‌దేశాలను పరిరక్షించటానికి, సైనిక పరంగా జోక్యం చేసుకొనే స్థితిలో టర్కీ లేదన్న వాస్తవాన్ని గ్రహించటమే కాక ఆ విషయాన్నే బలంగా చెప్పాడు. దానితో మార్చి 3, 1924న ఖిలాఫత్‌ ‌వ్యవస్థను రద్దుచేసి, ఖలీఫాను పదవీచ్యుతుడిని చేశాడు.

టర్కీ జాతీయవాదులు ఖలీఫాను అవహేళన చేసి దేశం నుండి పారిపోయే స్థితికి తీసుకొనివచ్చారు. ఆ వ్యవస్థను రద్దుచేసిన కొన్ని గంటలలోనే ఒట్టొమాన్‌ ‌రాజరిక కుటుంబానికి దేశం విడిచి వెళ్లమని ఆదేశాలిచ్చారు. మిగిన పౌరులకిచ్చే విధంగానే అప్పటివరకు ఖలీఫాగా వ్యవహరించిన అబ్దుల్‌ అజీజ్‌కు పాస్‌పోర్టు ఇచ్చారు. అంతకుముందు దాకా శుక్రవారం ప్రార్థనలు ఆయన పేరిట  జరిగేవి. ఆ పద్ధతికి ముగింపు పలికి, టర్కీష్‌ ‌రిపబ్లిక్‌ ‌పేరుతో ప్రార్థనలు జరపమని ఆదేశించారు. ఇంకా విడ్డూరం ఏమిటంటే పదవీచ్యుతుడయిన ఖలీఫా ఆయన కుటుంబాన్ని ఆదుకున్నది మనదేశపు ముస్లింలే. హైద్రాబాద్‌ ‌నిజాం ఇచ్చిన పరిమిత వేతనం (స్టైపండ్‌) ‌తోనూ, మనదేశపు నవాబుల విరాళాల తోనూ వారు కాలం గడపవలసి వచ్చింది.

(వచ్చేవారం: చరమాంకం-పాఠాలు)

ఆంగ్లమూలం: శ్రీరంగ గాడ్బొలే

డా।। బి. సారంగపాణ

About Author

By editor

Twitter
Instagram