అక్షయ్‌ ‌కృషి పరివార్‌ ‌సామజిక ధార్మిక సంస్థలతో కలసి  భూమి సుపోషణ ఉద్యమం నిర్వహించడం ముదావహం.

ఇదెంతో ఉపయోగకరం. మన దేశం ప్రధానంగా గ్రామీణ దేశం.

కరోనా సమయంలో 130 కోట్ల మందిని కాపాడింది- గ్రామీణ వ్యవసాయమే కదా! 250 ఏళ్ల క్రితం వరకు కూడా మన పల్లెలు వ్యవసాయం, కుటీర పరిశ్రమల ద్వారా ఆర్థిక స్వావలంబనను కలిగి ఉండేవి.

మళ్లీ ఇప్పుడు అందరి దృష్టి గ్రామీణ జీవితం మీదకు మళ్లింది.

అందుకే వ్యవసాయం రూపు మార్చుకుని, ఆరోగ్యవంతమైన ఆహారం ఇవ్వాలి. రైతు, ఆయన కుటుంబం, రైతుకూలీలు, చేతివృత్తులవారు అంతా సుఖసంతోషాలతో, స్వాభిమానంతో జీవించాలి. కడచిన 20 ఏళ్లుగా ఎందరో మహానుభావులు ఆ దిశలో ప్రయోగం చేసి విజయాన్ని సాధించారు.

కాలపరీక్షకు నెగ్గే సత్యాలు ఎప్పటికైనా వెలుగు చూస్తాయి. మన దేశీయ ఆవు కేంద్రబిందువుగా జరిగే ప్రకృతి సేంద్రియ వ్యవసాయం లాభసాటి మాత్రమే కాదు, ఆరోగ్యదాయక•మైనదని కూడా శాస్త్రవేత్తలు అంగీకరించడం అలాంటిదే.

వ్యవసాయంలో పంట ఉత్పత్తి, పండిన తర్వాత పరిశుభ్రత, ప్రాసెసింగ్‌, ‌ప్యాకింగ్‌ అం‌తా ప్రధానమే.

అంతకు మించి కీలకమైనది- రసాయనిక ఎరువులతో, క్రిమిసంహారకాల వినియోగంతో బంజరులైపోయిన మన పంటభూముల సంగతి.

నేడు కావలసింది మనం తల్లిగా భావించుకునే భూమి సుపోషణ.

భూమిలో కర్బనాల శాతం పెరగాలి. అందుకే ఈ ఉద్యమం, ఈ తపస్సు.

గాయత్రీ పరివార్‌, ‌పతంజలి, రామకృష్ణ మిషన్‌, ‌రామచంద్ర మిషన్‌, ‌సిద్ధేశ్వర స్వామిజీ మఠం (కొల్హాపూర్‌, ‌మహారాష్ట్ర), ఇస్కాన్‌, ‌భారత్‌ ‌సేవాశ్రమ్‌ ‌సంఘం, ఈశా ఫౌండేషన్‌, ‌భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌, (‌గోసేవా విభాగం) స్వదేశీ జాగరణ మంచ్‌, ‌విశ్వహిందూ పరిషత్‌, ‌సహకార భారతి, రాష్ట్రీయ సేవాభారతి, పర్యావరణ విభాగం, లోక భారతి (ఉత్తరప్రదేశ్‌), ‌గో ఆధారిత ఉత్పత్తి సంఘం ఆంధప్రదేశ్‌, ‌గ్రామభారతి – తెలంగాణ, ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ‌ఫౌండేషన్‌, ఏకలవ్య ఫౌండేషన్‌, ‌కృషి పరివార్‌(‌కర్ణాటక) అందరు కలసి ఈ ఉద్యమం నిర్వహిస్తూ, బలోపేతం చేస్తున్నారు. మన దేశ భవిష్యత్తులో,  గ్రామీణ వికాసంలో ఇదొక మైలురాయి కాగలదు.

ఇదొక సామాజికోద్యమం. నేతృత్వం కర్షకులది.

ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్‌లోని రామచంద్రమిషన్‌ ‌ప్రాంగణంలో 30 సంస్థల ప్రతినిధులు కలసి చర్చించారు.

దేశ హితంలో, ప్రకృతి రక్షణలో ఇదెంతో మేలు చేకూర్చేదే.

ఉగాది అంటే భూమి జన్మదినం. ఈ సంవత్సరం ఉగాది (ఏప్రిల్‌ 13) ‌రోజున భూమి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దేశమంతటా ఆ రోజు అన్ని రాష్ట్రాలలో ఉదయం గం.10 గం. 11 వరకు భూమిపూజ జరుగుతుంది. ఏప్రిల్‌ 13 ‌నుండి గురుపౌర్ణిమ వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది.

రైతులు తమ పొలాల నుండి మట్టిని తెచ్చి గ్రామ దేవాలయం వద్ద పోసి పసుపు కుంకుమతో పూజిస్తారు.

అప్పుడే, అక్కడే గోపూజ కూడా నిర్వహిస్తారు.

మనకు జీవించి ఉండగానే కాదు, శరీరం చాలించిన తర్వాత కూడా ఆ మట్టి, ఆ గోవే మనకు ఆధారం.

ఇదొక భావ జాగరణ. ఆచరణాత్మక జాగరణ.

నెల రోజులపాటు గ్రామగ్రామానికి వెళ్లి కార్యకర్తలైన కర్షకులు, సోదర రైతాంగంతో సమావేశమవుతారు. భూమి సుపోషణ గురించి, అందులో విజేతలైన వారి గురించి  వీడియో ఫిల్మ్ ‌ద్వారా ప్రదర్శిస్తారు. కొంత శిక్షణ కూడా ఇస్తారు.  ఒక కరపత్రం కూడా ప్రతి రైతు కుటుంబానికి అందచేస్తారు.

దేశమంతా ప్రముఖ కార్యకర్తలు రాష్ట్రాల వారీగా పర్యటిస్తున్నారు. నెల, రెండు నెలలు పూర్తి సమయం ఇందుకు సమర్పించిన వారు కూడా వారిలో ఉన్నారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞానకేంద్రాల సభ్యులు కూడా పాల్గొంటున్నారు. శాస్త్రవేత్తలు సేంద్రియ, ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయం గురించి శాస్త్ర పద్ధతిలో వివరిస్తారు.

గ్రామ వికాస్‌, ‌గోసేవ, భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు ఈ ఉద్యమాన్ని ఎంతో శ్రమకోర్చి  సమన్వయం చేస్తున్నారు.

దేశ చరిత్రలో విశ్వమంగళ గో గ్రామయాత్ర తర్వాత ఈ కార్యక్రమం రెండవ మైలురాయి  కాబోతోంది.

రాబోయే మూడేళ్లలో 30 సంస్థలు కలసి పనిచేస్తాయి. మరెందరో అడుగులో అడుగు కలపబోతున్నారు. ఇది ఒక మహా యజ్ఞం, జాతీయ యజ్ఞం, భాగస్వాములం కావడం మన అదృష్టం.

భూమి గో రక్షణ, భూమి సుపోషణ గురించి దేశమంతటా ఉద్యమం ప్రారంభమవుతున్న సమయంలోనే జాగృతి వారపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించడం హర్షణీయం.

కార్యకర్తలకు, పెద్దలకు హృదయపూర్వక నమస్సులు.

– వి. భాగయ్య

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత కార్యకారిణి సభ్యులు

About Author

By editor

Twitter
Instagram