మా. భయ్యాజీ జోషి

 

శ్రీరామనవమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా మనం ఒక భిన్నమైన వాతావరణంలో నిర్వహించుకున్నాం. శ్రీరాముడు భగవంతుని అవతారం. ఆయన అసురులను సంహరిస్తూ, జీవన విలువలను, సర్వమానవులను రక్షించారు. నేడు మానవాళి ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజలంతా దీనివల్ల భయకంపితులవుతున్నారు. ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి. ఈ సంక్రమణను నివారించడమే ఏకైక పరిష్కారం. ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నట్లు నడుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కుతాం. భారతీయులైన మనం ఇటువంటి ఎన్ని సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొని ఒక ఆదర్శవంతమైన స్థితిని నిర్మాణం చేసి శ్రీరాముని స్ఫూర్తితో మనం ఈ ప్రపంచానికి చాటిచెబుదాం.

నేడు దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్న మయ్యారు. సమాజాన్ని మేల్కొల్పే దిశగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఏ అవసరం వచ్చినా ముందుండి స్వయంసేవకులు సమాజ హితంకోసం పని చేస్తున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. పదివేలకు పైగా స్థలాల్లో లక్షలాది స్వయం సేవకులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యోజన ప్రకారం సుమారు పది లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. భోజన పదార్థాలు, శానిటైజర్‌ ‌తదితర నిత్యవసర వస్తువులు అందచేస్తున్నారు. ఆస్పత్రుల్లోకి వెళ్లి సేవలందిస్తున్నారు. మహారాష్ట్రలో చాలా చ్లో సంచార జాతులవాళ్లు నివసిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ల జీవనం దుర్భరంగా మారింది. స్వయంసేవకులు ఆయా ప్రదేశాలకు వెళ్లి భోజనం, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేయిమంది స్వయంసేవకులు రక్తదానం చేసి ఒక ఆస్పత్రికి అవసరమైన సహకారం అందించారు. అనేక చ్లో పోలీసులు, వైద్యులు ఇతర సిబ్బంది ఆహో రాత్రులు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అమలు పరిచేందుకు కృషి చేస్తున్నారు. అలాంటి వారికి కూడా భోజనం, అల్పాహారం అందచేసే కార్యక్రమాలు స్వయంసేవకులు నిర్వహిస్తు న్నారు. వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీ  జరుగుతోంది. ఉపాధి కోసం ఒక ప్రదేశం నుండి మరో చోటుకు వెళ్లే వలస కూలీలు చాలామంది ఉన్నారు. వారు ప్రస్తుతం తమ జీవితం అసురక్షితంగా భావిస్తూ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తు న్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో వీళ్లు పెద్ద సంఖ్యలో తమ ప్రాంతాలకు తరలివెళ్లడం ప్రమాదం. కనుక వీరు ఉన్న చోట నుండి కదలకుండా ఉండడం ఎంతో శ్రేయస్కరం. మా బాగోగులు సమాజం చూసుకొంటుంది. మేము ఇక్కడే సురక్షి తంగా ఉన్నామనే భావన వారికి కల్పించాలి. వారి కనీస అవసరాలు తీర్చాలి. దీని కోసం మనం ఇంకా శ్రమించాలి.

అట్లాగే చాలామంది నగరాలను విడిచి పల్లెలకు పయనమవుతున్నారు. అయితే చాలా గ్రామాల్లో వీరికి లోనికి వెళ్లేందుకు అనుమతి లభించడం లేదు. దీన్ని తప్పుగా భావించలేక పోయినప్పటికి వారంతా నేడు తాత్కాలికంగా గ్రామ శివారులోనే నివసిస్తున్నారు. వీరికి కూడా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి గ్రామంలోకి అనుమతి ఇప్పిస్తే బావుంటుంది. సురక్ష, చికిత్స ఇవి రెండు ప్రస్తుత పరిస్థితులలో అత్యంత అవసరమైనవి. ఈ రెండు పనులు చేస్తున్న సిబ్బందికి ఏ రకంగా సహాయ, సహకా రాలు అందించగలమో ఆలోచిస్తే మంచిది. ఈ దిశగా కార్యకర్తలు పనిచేస్తారని ఆశిస్తున్నాను.

మనమంతా సమాజాన్ని ఐక్యతా మార్గంలో తీసుకొని వెళ్లేవారం. మన కార్యం సంఘటన. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కనుక మన లక్ష్యాన్ని స్మరించేందుకు నిత్యం సంఘ ప్రార్థన ఇంట్లోనే చేయాలి. అట్లాగే ఇంట్లో సంస్కారయుత వాతావరణం నిర్మించడానికి ఇది మనకు లభించిన అవకాశంగా భావించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. కుటుంబంతో కలిసి చేసే కార్యక్రమాలు రూపకల్పన చేయాలి. దీని వలన కుటుంబ సభ్యులకు మరింత మనోధైర్యం లభిస్తుంది. ఇంకా రెండు వారాల సమయం ఉంది. మున్ముందు కూడా ఇదే స్ఫూరితో పని చేసినట్లయితే ఆ తర్వాత మనమంతా సాధారణ స్థితిలో జీవించేందుకు వందశాతం సఫలీకృతం అవుతామనడంలో సందేహమే లేదు. ప్రభుత్వం సూచిస్తున్న నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సమాజహితం కోసం కలిసి పనిచేద్దాం!

ప్రస్తుతం మనం చేస్తున్న సేవా కార్యక్రమాలను పరిమితం చేయడం సబబు కాదు. స్థానికంగా ఉండే అవసరాలు, అవకాశాలను బట్టి మన కార్యక్రమాలు విస్తరించాలి. అందుకు తగ్గట్లు యోజన చేయాలి. ఈ సమయంలో అనేకమంది మనకు ఆర్థికంగా, హర్థికంగా సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. సలహాలు సూచనలు అందిస్తున్నారు. నేడు సంఘంతో కలిసి పని చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందాం. మన శక్తియుక్తులన్నింటిని ఏకంచేసి పనిచేద్దాం. ఈ సేవలో పాలుపంచు కుంటున్న కార్యకర్తలందరూ అభినందనీయులు. ఈ విపత్కర పరిస్థితుల్లో కలిసికట్టుగా ధైర్య, సాహసాలతో పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. శ్రీరామచంద్ర ప్రభువును మరోసారి స్మరిస్తూ ఈ సంకటస్థితి నుండి బయటపడతామని భావిస్తున్నాను.

ఈ మహమ్మారి విజృంభిస్తున్న వేళ సమాజంలో అన్ని వర్గాలకు అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్దాం. అదేవిధంగా అందరూ మనతో కలిసి పనిచేసే విధంగా ప్రోత్సహిద్దాం. శ్రీరామనవమి ఉత్సవం లోక రక్షణ, సేవా, జాగరణ సందేశాన్ని మనకు అందిస్తున్నది. అదే స్ఫూర్తితో సమాజకార్యంలో నిమగ్నమవుదాం.

వ్యాసకర్త: ఆర్‌ఎస్‌ఎస్‌, ‌సర్‌ ‌కార్యవాహ

About Author

By ganesh

Twitter
Instagram